Monday, September 1, 2014

Is it good to climbing staircase daily?,రోజూ మెట్లెక్కుతున్నాను.ఆరోగ్యానికి మంచిదేనా?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ఫ్ర : రోజూ మెట్లెక్కుతున్నాను.ఆరోగ్యానికి మంచిదేనా?

జ : దినచర్యలో భాగంగా తరచూ మెట్లెక్కుతుంటాం.. అయితే అది కూడా వ్యాయామ మార్గాల్లో ఒకటని చెబుతున్నారు అధ్యయనకర్తలు. ఇది అత్యంత సులువైన వ్యాయామం. రోజూ కాసేపు మెట్లెక్కి దిగితే సరిపోతుంది. నడుము కిందిభాగంలోని కండరాలకు శక్తి అందుతుంది. వాటి పనితీరు బాగుంటుంది. శరీరం తీరుగా మారుతుంది. గుండెకు సంబంధించిన సమస్యలూ తగ్గుతాయి. సులువుగా కెలొరీలు కరుగుతాయి. దాంతో సన్నబడటం తేలికవుతుంది. ముఖ్యంగా బరువున్న వారు ఏడాది పొడవునా రోజుకోసారి మెట్లెక్కి దిగడం చాలా అవసరం. దానివల్ల శరీరానికి సరైన వ్యాయామం అందుతుంది. సులువుగా బరువు తగ్గుతారని చెబుతున్నారు నిపుణులు. అయితే హార్ట్ ఎటాక్ (IHD)లేదా గుండె పోటు ఉన్నవారు ఈ వ్యాయామము చేయకూడదు. . . గుండెపోటు ఎక్కువయ్యే ప్రమాదముంది.
  • *===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.