Wednesday, April 27, 2011

బరువు తగ్గించుకునే ప్రయత్నాలు , DOs to reduce weight




ప్ర :
బరువు తగ్గించుకునే ప్రయత్నం లో ఎటువంటి చర్యలు తీసుకోవడం అవసరం ?

జ : వ్యాయామం చేస్తున్నా, ఆహార నియమాలు పాటిస్తున్నా బరువు తగ్గటం లేదని చాలామంది వాపోతుంటారు. కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అంతగా దృష్టిపెట్టరు. బరువు తగ్గటానికి వ్యాయామం, ఆహార నియమాల వంటి వాటిని సరైన క్రమంలో చేయటం ఎంతో ముఖ్యం.

బరువును నియంత్రించే కొన్ని చర్యలు :

  • ఆహారపు అలవాట్లు ,
  • వ్యాయామము ,
  • తీసుకునే కేలరీల సంఖ్య ,
  • ఖర్చు చేస్తున్న కేలరీల సంఖ్య ,
  • నిద్ర ,
  • ఒత్తిడి ,
వ్యాయామ పద్ధతి*

వారానికి కనీసం 5-6 రోజులు వ్యాయామం చేయటం తప్పనిసరి. అదీ 30-45 నిమిషాల పాటు వేగంగానూ చేయాలి. ముందు నెమ్మదిగా మొదలుపెట్టి క్రమంగా వేగం పెంచుకుంటూ వెళ్లాలి. మధ్యలో విశ్రాంతి తీసుకోవటమూ ముఖ్యమే. దీనివల్ల వ్యాయామం ఆపేసిన తర్వాత కూడా కేలరీలు ఖర్చు అవుతాయి.

నిద్రలేమీ కారణమే*

నిద్రలేమి కూడా బరువు పెరగటానికి దోహదం చేస్తుంది. తగినంత నిద్రలేకపోతే జీవక్రియలు మార్పు చెందుతాయి. ఇది అతిగా తినటానికి, స్థూలకాయానికి దారి తీస్తుంది. నిద్రలేమితో శరీరంపై పడే ఒత్తిడీ బరువు పెరగటానికి కారణమవుతుంది.

ఆరోగ్య సమస్యలతో*

కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు.. ముఖ్యంగా థైరాయిడ్‌ హార్మోన్‌ లోపం వల్ల జీవక్రియలు మందగిస్తాయి. ఇది బరువు పెరగటానికి బీజం వేస్తుంది. అధిక బరువు గలవారు నిపుణులతో థైరాయిడ్‌ పరీక్ష చేయించుకోవాలి. అవసరమైతే తగు చికిత్స తీసుకోవాలి.

మితాహారం మేలు*

బరువు తగ్గకపోవటానికి ఎక్కువగా తినటమూ ఒక కారణమే. అందువల్ల మితంగా ఆహారం తీసుకోవాలి. నిపుణుల సలహా మేరకు చేసే పనిని బట్టి శరీరానికి రోజుకు అవసరమైన పోషకాలు, కేలరీల ప్రకారం ఆహారాన్ని తీసుకోవాలి.

ఒత్తిడి ముప్పు*

అధిక బరువు, ఒత్తిడి ఒకదాంతో మరోటి ముడిపడి ఉన్నాయని మరవరాదు. నిరంతరం ఒత్తిడితో బాధపడేవారిలో కార్టిజోల్‌ అనే హార్మోన్‌ ఉత్పత్తి ఎక్కువవుతుంది. ఇది ఆకలి పెరగటానికే కాదు కడుపు చుట్టూ కొవ్వు పేరుకుపోవటానికీ దోహదం చేస్తుంది. రోజులో కొద్దిసేపు విశ్రాంతి పొందేలా చూసుకుంటూ ఒత్తిడికి దూరంగా ఉండొచ్చు.

క్రమం తప్పరాదు*

వ్యాయామం నుంచి చేసే పని వరకూ ఏదైనా క్రమం తప్పకుండా చూసుకోవాలి. చాలాసార్లు వ్యాయామం చేయటం మానుకుంటే తిరిగి పరిస్థితి మొదటికి చేరుకుంటుంది. కాబట్టి అలాంటి సమయాల్లో కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లటం, ఆటలు ఆడుతూ హాయిగా గడపటం అలవాటు చేసుకోవాలి.

మద్యానికి దూరం

ఏ రకం మద్యంలో నైనా కొవ్వు ఉండదు కానీ కేలరీలు మాత్రం ఉంటాయి. కాబట్టి మద్యం తాగినవెంటనే కేలరీలు ఖర్చయ్యేలా చూసుకోవటం మంచిది. లేకపోతే అవి బరువు పెరిగేలా చేస్తాయి. కూల్‌డ్రింకులు, సోడాలనూ అతిగా తాగరాదు. ఇవి రక్తంలోని చక్కెర మోతాదును కూడా పెంచుతాయి. వీటికి బదులుగా నీళ్లను తాగటం మేలు.

తిండి మానేస్తే చేటు
బరువు తగ్గటానికి చాలామంది మధ్యమధ్యలో తిండి తినటం మానేస్తుంటారు. దీనివల్ల కీడే ఎక్కువ. ఈ సమయంలో శరీరంలో అమైనో ఆమ్లం మోతాదును నియంత్రించుకోవటానికి కండరాలు క్షీణించటం ఆరంభిస్తాయి. దీంతో జీవక్రియలు మందగిస్తాయి. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవటం, తక్కువ మోతాదులో రోజుకి 5-6 సార్లు తినటం మంచిది. మంచి ప్రోటీన్లు గల అల్పాహారంతో రోజుని ప్రారంభించటం మేలు.

======================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

Tuesday, April 26, 2011

Sweat is more during Pregnancy , గర్భము ధరించాక స్వేదము ఎక్కువగా పట్టడం సహజమేనా?



ప్ర : గర్భము ధరించాక స్వేదము ఎక్కువగా పట్టడం సహజమేనా?

జ : గర్భవతిగా ఉన్నప్పుడు ఎక్కువ స్వేదము అలుము కోవడం అనేది సహజము . ఈస్ట్రోజన్‌ స్థాయిలు తగ్గి , ఉష్ణోగ్రత మార్పులకు సెన్సిటివిటీ పెరగడం వల్ల ఇలా జరుగుతుంది .

ఆహారము లో చక్కని మార్పులు చేసుకోండి . ప్రోటీన్లు , పీచు పదార్దాలు , ఖనిజాలు , విటమిన్లు అధికం గా తీసుకోండి . రోజుకు ఎనిమిది గ్లాసుల నీరు త్రాగండి . కొబ్బరి నీరు , నిమ్మరసము , తాజాపండ్ల రసాలు ఎక్కుమగా తీసుకోండి . ధైరాయిడ్ ఫంక్షన్‌ పరీక్షలు చేయించుకోండి ... థైరాయిడ్ పనిలో ఎచ్చు తగ్గులు వలన చెమటలు పట్టె ఆస్కారము ఉన్నది .
  • ===========================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

Saturday, April 23, 2011

పంచదారకు ప్రత్యామ్నాయం ఉందా?, Sugar Substitutes



ప్ర : పంచదారకు ప్రత్యామ్నాయం ఉందా? పాలు , కాఫీలలో బెల్లం , తేనె కలుపుకోవచ్చా?

జ : మన ఆహారం లో ఉప్పు , కొవ్వులతో పాటు పంచదార అత్యంత సంతృప్తికరమైన పదార్ధము . శక్తికి ఆదారము అయిన దీనిలో పోషకాలేమీ ఉండవు . పంచదారను పూర్తిగా మానేయడం సరికాదు . పంచదారను వాడకం తగ్గించాలనుకోవడం మంచిదే ఐతే కనీసము రోజుకో స్పూన్‌ తీసుకోవడం మంచిది . పంచదారను మెడికల్ లో " సూక్రోజ్ " అని వ్యవహరిస్తారు . సుగర్ కేన్‌(చెరకు ) నుండి తయారవుతుంది . మధుమేహ రోగుల కు మంచిది కారు . అసలు వాడకూడదు . శరీరము లో దీని వినియోగానికి " ఇన్సులిన్‌ " అవసరము తప్పనిసరి .

కుత్రిమ స్వీటనర్లు వాడడం ఆరోగ్యానికి మంచిది కాదు . అవి పంచదారకంటే 200-400 రెట్లు ఎక్కువ తీపిని కలిగి ఉంటాయి . బెల్లము , తేనె లను పాలు , కాఫీలలో కలుపుకోవచ్చును . వీటికి పంచదారకు కేలరీలలో పెద్దగా తేడా ఉండదు .
కృత్రిమ సుగర్స్ కోసము ఇక్కడ క్లిక్ చేయంది ->
http://food-health-disease.blogspot.com/2011/04/sugar-substitutes-artificial-sugrs.html
========================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

Thursday, April 21, 2011

మేకప్ సమస్యలు, Makeup problems



ప్ర : నాకు నలభైమూడేళ్లు. మేకప్‌ వేసుకోవాలంటే చాలా ఇష్టం. కానీ వేసుకున్న తరవాత చూస్తే ఇంకా పెద్దదానిలా కనిపిస్తున్నాను. నాకు మేకప్‌ అస్సలు నప్పడంలేదు. దీనికి ప్రత్యామ్నాయం ఉందంటారా?(ఓ సోదరి)

: సహజ చర్మతత్వం ఉన్నవాళ్లు ఎట్టి పరిస్థితుల్లో మరీ మందంగా మేకప్‌ వేసుకోకూడదు. ముఖ్యంగా ఫౌండేషన్‌. దీన్ని ఎక్కువగా వేయడం వల్ల ముడతలు ఇంకా స్పష్టంగా కనిపిస్తాయి. క్రీం ఆధారిత ఫౌండేషన్‌ను చాలా తక్కువగా రాసుకోవాలి. మెరిసే పౌడర్‌ కాకుండా కాంపాక్ట్‌ లేదా లూస్‌పౌడర్‌ను రాయండి. అలాగే బ్రౌను రంగు లిప్‌స్టిక్‌కు ప్రాధాన్యం ఇవ్వండి. మెటాలిక్‌, పెర్ల్‌ లిప్‌స్టిక్‌లు ఎంచుకోకపోవడమే మంచిది. చాలా తక్కువగా నలుపు లేదా బ్రౌను రంగు ఐలైనర్‌, మస్కారా వేసుకోండి. అంతేకానీ ఫ్యాన్సీ కలర్ల జోలికి వెళ్లకూడదు. పొద్దుటిపూట ఐషాడో వాడకపోవడమే మేలు. సాయంత్రాలు తప్పనిసరనుకుంటే.. బ్రౌన్‌, బూడిదరంగులు ఎంచుకోవచ్చు. ముదురు రంగు లిప్‌స్టిక్‌, ఐషాడోలను రాసుకుంటే ఇంకా పెద్దగా కనిపిస్తారు. కాబట్టి ఎన్నో జాగ్రత్తలు తీసుకుని మేకప్‌ సామగ్రిని ఎంచుకోవాలి.

==కె.లలిత--న్యూట్రిషనిస్ట్‌ అండ్‌ బ్యూటీకాస్మెటాలజిస్టు
  • ===========================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

శిరోజాలు అందంగా ఉండాలంటే?, For Beautiful hair-Style



ప్ర : శిరోజాలు అందంగా ఉండాలనే ఉద్దేశంతో నాలుగు నెలలుగా హెయిర్‌స్త్టెలింగ్‌ జెల్‌ రాస్తున్నాను. రోజూ డ్రయర్‌ కూడా వాడుతున్నా. ఈ మధ్య గమనిస్తే నా జుట్టు చాలా పొడిబారింది. నిర్జీవంగా కనిపిస్తోంది. దీన్ని నివారించేందుకు ఏం చేయమంటారు?(సంతోషి, కరీంనగర్‌)

జ : కురులు అందంగా కనిపించాలని హెయిర్‌ స్త్టెలింగ్‌ జెల్స్‌ రాసుకోవడం వల్ల పెద్దగా నష్టం ఉండదు కానీ.. ప్రతిరోజు డ్రయర్‌మాత్రం వాడకూడదు. దీనివల్ల జుట్టు పొడిగా కనిపిస్తుంది. అలాగే కురులకు జెల్‌ రాసిన తరవాత ఎక్కువ సార్లు దువ్వితే.. జుట్టు పాడవుతుంది. తప్పనిసరనిపిస్తే.. వెడల్పాటి దంతాలున్న దువ్వెనను వాడాలి. మీ సమస్యను నివారించాలంటే.. వారానికి మూడుసార్లు కొబ్బరినూనె రాసి గంటాగి తలస్నానం చేయండి. కొబ్బరినూనెకు బదులుగా ఆముదం కూడా వారానికి రెండుసార్లు రాసుకోవచ్చు. అలాగే ఈ ప్యాక్‌ ప్రయత్నించండి. కప్పు అరటిపండు గుజ్జు, కలబంద గుజ్జు, మందారపువ్వుల గుజ్జు అరకప్పు చొప్పున తీసుకుని బాగా కలిపి తలకు పట్టించాలి. జుట్టు పట్టుకుచ్చులా మారుతుంది. ఈ పూతను వారానికి రెండుసార్లు వేసుకోవాలి.
  • ===============================
visit my website - > Dr.Seshagirirao-MBBS

Monday, April 11, 2011

స్త్రీలలో మెనోపాజ్ సమయము లో సెక్స్ కోర్కెలు,Sex desires in Menopause




ప్ర : స్త్రీలలో మెనోపాజ్ సమయము లో సెక్స్ కోర్కెలు బాగా పెరగడం లేదా తగ్గడం జరుగుతుందంటారు . మరి పురుషులలో మెనోపాజ్ వయసులో మార్పులు ఎలా ఉంటాయి?
-- శ్రీనివాస్ , నెల్లూరు .
జ : పురుషులకు మెనోపాజ్ వుంటుందా వుండదా అనేది చర్చనీయాంశం . వుంటుందని నమ్మేవారు ఆ వయసును " అండ్రోపాజ్ " అని పిలవడం మొదలు పెట్టేరు . సాదారణముగా ఆ వయసు వచ్చేసరికి సెక్స్ హార్మోనుల ఉత్పత్తి తగ్గిపోతుంది . శారీరక , ఆరోగ్య మార్పులు వస్తాయి. కోర్కెలు తగ్గుముఖం పడతాయి . అంగస్థంభనకు సమయం పడుతుంది . భావప్రాప్తికి చేరలేరు . కొంతమందికి శీఘ్రస్కలనం సమస్య ఏర్పడుతుంది . స్త్రీ .. పురుషులిద్దరికీ వయసుతో సెక్స్ కోర్కెల తేడాలు వస్తాయి.

  • ==============================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

Sunday, April 10, 2011

Breast cance fear?, రొమ్ము క్యాన్సర్ భయము



ప్ర : నేను 40 సం.లకు దగ్గర్లో ఉన్నాను . మాకుటుంబములో బ్రెస్ట్ క్యాన్సర్ చరిత్ర ఉంది . నేను మమోగ్రఫీ ఎప్పుడు చేయించుకోవాలి ? ఇంకేమైనా టెస్ట్ లు చేయించుకోవాలా?.

జ : మీ ఆరోగ్య అవగాహన మంచిదే. . . ఏడాది కోమారు వైద్యపరీక్షలు చేయించుకోండి . నెలకొక మారు స్థనాలను స్వయముగా పరీక్షించుకోండి . మునుపటికంటే ఏదైనా తేడా అనిపిస్తే డాక్టర్ ని సంప్రదించండి . నలభై సంవత్సరాలకొకసారి ... ఇంకో రెండేళ్ల తర్వాత మమోగ్రఫీ చేయించుకోండి . ఏడాది కొకసారి పాప్ స్మియర్ , పెల్విక్ ఆల్ట్రా సౌండ్ పరీక్షలు చేయించుకోండి . ఏమైన తేడాలు ఉంటే ఆది లోనే చికిత్స చేయించుకోవచ్చును .


  • ======================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

ఎడతెరపి లేని పనుల ఒత్తిడి నడుమ ఉదయాన్నే తాజాగా కనిపించాలంటే ఏం చేయాలి ?,What to do for freshness in Morning?




ఫ్ర : ఎడతెరపి లేని పనుల ఒత్తిడి నడుమ ఉదయాన్నే తాజాగా కనిపించాలంటే ఏం చేయాలి ?.
జ : నేటి రోజుల్లో ఇల్లాలికి లేచింది మొదలు అర్ధరాత్రి దాకా ఏవో పనులు వెంటాడుతునే ఉంటాయి . వాటి నడుమ తాతాగా ఊండాలంటే కొన్ని జాగ్రత్తలు అనివార్యము .

మనస్సును ప్రశాంతం గా ఉంచుకోవాలి .,
రాత్రి పడుకునే ముందు కళ్ళపై చల్లని బ్లాక్ టీ బ్యాగ్స్ ను ఓ ఐదు నిముషాల పాటు ఉంచుకోవాలి ,
ఉదయాన్నే నిద్ర లేస్తూనే రెండు గ్లాసులు (200 మి.లీ*2)నీటిని త్రాగాలి . ,
మేకప్ పట్ల కనీస స్థాయిలో శ్రద్ధ వహించాలి - సహజ సిద్ధంగా ఉండే మేకప్ లు ఉపయోగించాలి ,
ఫిట్నెస్ కోసము ప్రతిరోజూ వ్యాయామము / యోగా చేస్తూ ఉండాలి .
  • ============================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

Saturday, April 9, 2011

Calories burning as per work doing, ఏ పనికి ఎన్ని కేలరీలు ఖర్చు ?



ప్ర : ఏయే పనులు చేయడం వల్ల ఏవిధంగా కేలరీలు ఖర్చవుతాయో వివరించండి?

జ : శారీరమం గా ఏ కొద్దిగా శ్రమ చేసినా కేలరీలు ఖర్చవుతాయి.
  • 25 నిముషాలు తోట పనిచేస్తే -----------------------------------100 కేలరీలు ఖర్చవుతాయి ,
  • 20 నిముషాలు పాటు వాకింగ్ చేస్తే-------------------------------103 కేలరీలు ఖర్చవుతాయి,
  • 22 నిముషాల పాటు భర్తకు మసేజ్ చేస్తే--------------------------103 కేలరీలు ఖర్చవుతాయి ,
  • 60 నిముషాలు టివి ముందు కూర్చోని ఏ కుట్లో, అల్లికనో పనిపెడితే--102 కేలరీలు ఖర్చవుతాయి ,
  • 40 నిముషాలు పాటు షాపింగ్ మాల్ లో గ్రాసరీ కార్డ్ తిప్పితే --------103 కేలరీలు ఖర్చవుతాయి ,
  • 30 నిముషాలు పాటు పెంపుడు కుక్కతో పచార్లు కొడితే ------------100 కేలరీలు ఖర్చవుతాయి ,
  • 30 నిముషాలు పాటు ఇంటిపనులు చేస్తే --------------------------107 కేలరీలు ఖర్చవుతాయి ,
  • 30 నిముషాలు పాతు వేగంగా డాన్స్‌ చేశారంటే -------------------200-400 కేలరీలు ఖర్చవుతాయి ,


  • =====================================
visit my website - > Dr.Seshagirirao-MBBS