Tuesday, December 28, 2010

Thyroid problem conception, థైరాయిడ్ సమస్య పిల్లలు పుట్టడం

Q : నా వయసు 26. పెళ్లై నాలుగేళ్లు అవుతోంది. పిల్లలు కలగడం లేదని టెస్టులు చేయించుకుంటే థైరాయిడ్ సమస్య ఉన్నట్టు పోయిన ఏడాది తెలిసింది. అప్పటి నుంచి మందులు వాడుతున్నాను. దాంతో సమస్య అదుపులోనే ఉంది. కాని ఇప్పటి వరకు ప్రెగ్నెన్సీ రాలేదు. అయితే నాలుగు నెలల నుంచి పీరియడ్స్ రాకపోవడంతో డాక్టర్ని సంప్రదించాను. థైరాయిడ్ సమస్య ఉన్నవారిలో ఈ సమస్య సాధారణమే అన్నారు. పిల్లలు పుట్టేందుకు థైరాయిడ్ సమస్య అవుతుందా? నాకు పిల్లలు కలిగే యోగం ఉందా? దయచేసి చెప్పగలరు.



A : థైరాయిడ్ హార్మోన్ మన శరీరంలో చాలా భాగాల పెరుగుదలపై, వాటి పనితీరుపై ప్రభావాన్ని చూపుతుంది. వీటిలో ఫెర్టిలిటీ, రీ-ప్రొడక్షన్ ముఖ్యమైనవి. థైరాయిడ్ హార్మోన్ లెవల్స్ వయసును బట్టి, శారీరక స్థితిని బట్టి మారతాయి. టాబ్లెట్లు వాడుతున్నప్పుడు నెలసరి సరిగ్గా ఉందన్నారు కాబట్టి థైరాయిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించండి. అది మామూలుగా ఉన్నట్లయితే పీరియడ్స్ నాలుగు నెలల పాటు రాకపోవడానికి ఇతర కారణాలు వెతకవలసి ఉంటుంది. ఒకవేళ థైరాయిడ్ హార్మోన్ లెవల్స్ మామూలుగా లేకపోతే, వాటి స్థాయులను బట్టి మందులు వాడాలి. దీంతో పీరియడ్స్ సక్రమంగా వచ్చేందుకు అవకాశం ఉంది. థైరాయిడ్ లెవల్ మామూలుగా ఉండి, పీరియడ్స్ సాధారణంగా ఉన్నట్లయితే పిల్లలు పుట్టడంలో ఎలాంటి ఆటంకాలు ఉండవు. కాని ప్రెగ్నెన్సీ సమయంలో కూడా ఈ హార్మోన్ టాబ్లెట్లు వాడాలి. తరచుగా థైరాయిడ్ లెవల్స్‌ని టెస్ట్ చేయించుకోవాలి. బిడ్డకి కూడా పుట్టిన కొద్ది రోజులకే థైరాయిడ్ టెస్ట్ చేయించాల్సి ఉంటుంది.


  • =======================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

పాలిసిస్ట్‌క్ ఒవేరియన్ డిసీజ్ లేదా పి.సి.ఓ.డి,Poly cystic Overian Disease(PCOD)




Q : నా వయసు 22. పెళ్లయి రెండేళ్లవుతోంది. మెచ్యూర్ అయిన నాటి నుంచి పీరియడ్స్ రెండు, మూడు నెలలకు ఒకసారి వస్తున్నాయి. డాక్టర్ని సంప్రదిస్తే స్కానింగ్ చేసి పి.సి.ఓ.డి వల్ల ఇబ్బంది పడుతున్నానని చెప్పారు. ఐదు నెలలుగా హార్మోనల్ ఇంజక్షన్స్ ఓవులేషన్... ఇస్తున్నారు. నా ఫ్రెండ్స్, చుట్టుపక్కల వాళ్లు ఈ ఇంజెక్షన్ల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని భయపెడుతున్నారు, ఇది నిజమేనా? ఐదు నెలల తర్వాత నా శరీరంలో చాలా మార్పులు వచ్చాయి. బరువు 75 కేజీలు ఉన్నాను. తలనొప్పి, చెవి నొప్పి విపరీతంగా బాధిస్తోంది. నా సమస్యకు తగిన పరిష్కారం సూచించగలరు. - సుగుణ,



A : ఇంతకు ముందు ఎన్నోసార్లు పాలిసిస్ట్‌క్ ఓవరీస్ గురించి మనం తెలుసుకున్నాం. పీరియడ్స్ సక్రమంగా వచ్చే స్ర్తీలలో అండాశయాలలో ప్రతినెలా కొన్ని అండాలు వృద్ధిచెందడం మొదలవుతుంది. వీటిలో అన్నింటికన్నా ఆరోగ్యంగా ఉన్న అండం పరిమాణంలో వేగంగా పెరిగి 12 నుంచి 18 రోజుల మధ్య విడుదల అవుతుంది. మిగిలిన అండాలన్నీ వృధా అయిపోతాయి. కొన్ని సందర్భాలలో ఇలా జరగక మిగిలిన అండాలన్నీ ఎంతో కొంత ఎదిగి అలాగే ఉండిపోతాయి. అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేసిన ప్పుడు ఇవి చిన్న చిన్న నీటి బుడగలుగా లేదా సిస్టుల్లాగ కనపడతాయి. వీటినే పాలిసిస్టిక్ ఓవరీస్ అంటారు. ఓవరీస్‌లో సిస్టులు ఉండటంతో పాటు అధిక బరువు, ఇరెగ్యులర్ పీరియడ్స్, అవాంఛిత రోమాలు... వంటి సమస్యలు కూడా తోడైనప్పుడు దీనినే పాలిసిస్ట్‌క్ ఒవేరియన్ డిసీజ్ లేదా పి.సి.ఓ.డి. అంటాం. ఇది ఉన్న స్ర్తీలలో ట్యాబెట్లు, ఇంజెక్షన్లు ఇచ్చి ప్రెగ్నెన్సీ కోసం అండం విడుదలను నియంత్రిస్తారు.

ఈ ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లు హార్మోన్లకు సంబంధించినవి అయి ఉండటం వల్ల ఇవి డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాలి. ఒక నెలకి మందులు రాయించుకొని డాక్టర్ పర్యవేక్షణ లేకుండా మళ్లీ అదే ట్రీట్‌మెంట్ కొనసాగించిన వారిలో సమస్యలు ఎదుర్కొనక తప్పదు. ఈ ట్రీట్‌మెంట్ వల్ల తలనొప్పి లేదా చెవి నొప్పి వంటి సమస్యలు కలగవు. చెవి ఇన్ఫెక్షన్‌కు సంబంధించిన సమస్యలు లేదా సైనసైటిస్ వంటి కారణాల వల్ల కూడా తల, చెవి నొప్పి కలగవచ్చు. కాబట్టి మీరు ఇ.ఎన్.టి డాక్టర్ చేత పరీక్ష చేయించుకొని తగిన సూచనలు పొందండి. ఇక పాలిసిస్ట్‌క్ ఓవరీకీ ఎన్నో రకాల ట్రీట్‌మెంట్‌లు ఉన్నాయి.

మొదటిది: ఈస్ట్రోజెన్+ప్రొజెస్టరాన్ కలిపిన ట్యాబ్లెట్లు వాడటం

రెండవది: ప్రొజెస్టరాన్ మాత్రమే కలిగిన ట్యాబ్లెట్లు వాడటం

మూడవది: ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నట్లయితే అండం ఎదుగుదలకు, విడుదలకు ట్రీట్‌మెంట్ తీసుకోవడం

నాలుగవది: పేషెంట్‌కు జీవనశైలిలో మార్పుల గురించిన అవగాహన కలిగించడం

ఐదవది: ట్యాబ్లెట్ల వల్ల ఫలితం లేనట్లయితే ల్యాపరోస్కోపీ ద్వారా ఈ సిస్టులను పంక్చర్ చేయడం

{పతి పేషెంట్‌కు వారి వారి సమస్య తీవ్రతను బట్టి పై చెప్పిన ట్రీట్‌మెంట్లలో ఏది సరియైనదో డాక్టర్ నిర్ణయిస్తారు. పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న అందరిలో ట్రీట్‌మెంట్ ఒకేలా ఉండకపోవచ్చు. అందుచేత మీరు మీ స్నేహాతులు, చుట్టుపక్కల వారు చెప్పిన విధంగా లేదా పుస్తకాలు, పేపర్లలో ఎవరి సమస్యలో ఉన్న విధంగా మీ సమస్యను పోల్చుకోకండి. మీకు అనువైన ట్రీట్‌మెంట్‌ను డాక్టర్ సలహా మేరకు వాడి తగిన ఫలితాన్ని పొందండి.

  • ==========================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

Sunday, December 19, 2010

టిటానస్ టీకా ఇచ్చే విధానము , Tetanus vaccination schedule

ప్ర : మా పాపకు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి టెటానస్ వ్యాక్షిన్‌ను ఏ గాయము కాకపొయినా ఇస్తుండాలి అని డాక్టర్ చెప్పారు . ఇది అవసరమా?

  • https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgKKaqtagJdRM_7tFgpOp2-Rdi0KKcDK6NbzpxrUazq_c1bVvc_PPwVJd1KyjA15U39Jv5kotmvnuS0ALiCTq-OF6r-_Pi08358HIO3hPqORXF00atWG8pGwgZTABKT8oNB3RZmSBx_Hqk/s1600/Vaccination+injecting.jpg

జ : శారీరక కండరాల్ని , నరాల్ని ప్రభావితం చేయగల టెటానస్ సీరియస్ వ్యాధి అయినా నయము చేయగలదే . దుమ్ము , ధూళి , ముల్లు , పాత లోహాలు పైన టేటానస్ స్పోర్స్ స్థావరాలు ఏర్పరచుకుంటాయి. చర్మము పైన , శరీరము పైన గాయాలు అయినపుడు ఈ టెటానస్ స్ఫోర్స్ మన శరీరము లో ప్రవేశించి దనుర్వాతము అనే జబ్బును కలుగుజేస్తాయి .

అలాగే నియోనాటల్ టెటానస్ మరో రకము . అది అపరిశుభ్ర వాతావరణములో ప్రసవించిన నూతన శిశువులకు సోకుతుంది . గర్భవతులు రొటీన్‌ ఇమ్యునైజేషన్‌ వల్ల తల్లి ద్వారా గర్భము లో ఉన్న శిశువులకు యాంటిబాడీస్ అందుతాయి . గర్భినీలు 6, 7, 8 నెలల గర్భినీ కాలములో 3 లెదా 2 టెటనస్ టాక్షాయిడ్ ఇంజెక్షన్‌ తీసుకోవాలి .

చిన్నపిల్లకు : 2, 4, 6 , 18 నెలల వయసు లో టెటానస్ టీకాలు ఇప్పించాలి . తరువాత ప్రతి 5 సంవత్సరాలకు ఒక సారి గాయాలు అయిన ... అవకపోయినా... బూస్టర్ డోసు ఇస్తూ ఉండాలి .


  • ==============================
visit my website - > Dr.Seshagirirao-MBBS