Friday, May 16, 2014

Do pregnent woman apply color-dye to grayhair?, నేను 6 వారాల గర్భవతిని . తెల్లజుట్టు చాలా ఉంది తలకి కరల్ వేయవచ్చా?

  •  
  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

Q : నేను 6 వారాల గర్భవతిని . తెల్లజుట్టు  చాలా ఉంది ---తలకి కరల్ వేయవచ్చా?

Ans : ఇటీవల పరిశోధనలలో గర్భవతి చుట్టూ కాలుష్యము లోపల బిడ్దపై ప్రబావాన్ని చూపుతుంది అని  గుర్తించారు . ముఖ్యము గా 12 వారాల లోపు కడుపులోని బిడ్డకు ,
జుట్టుకు కలరింగ్ అనేది రసాయన ట్రీట్ మెంట్...  కాబట్టి వీలయినంత వరకు తెల్ల జుట్టుకు కలర్ వేయకపోవడము (మూడు - నాలుగు నెలలు నిండే దాక ) మంచిది . మార్కెట్ లో లబించే హెన్నాలో రసాయనాలు కలుపుతారు . ఇంట్లో తయారు చేసుకునే స్వచ్చమైన గోరింట పొడి సురక్షితమైనది . ఇదైనా తొలి మూడు నెలలు తరువాత వాడండి  .

*===========================
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Which is good for health out of available OliveOils?,అందుబాటులోగల అనేక ఆలివ్ ఆయిల్స్ లో ఏది నాణ్యమైనదో తెలుసు కోవడం ఏలా?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 Q : Which is good for health out of available OliveOils?,అందుబాటులోగల అనేక ఆలివ్ ఆయిల్స్ లో ఏది నాణ్యమైనదో తెలుసు కోవడం ఏలా? 


*జవాబు :
 ప్రస్తుతం ప్రపంచమంతటా ఆరోగ్య పరిరక్షణకు , దీర్ఘకాలము ఆనందముగా జీవించడానికి ఏది మంచో , ఏది చెడో అన్న ఆలోచనలతో మానవ మేధస్సు ఎక్కువ ఆలోచిస్తోంది . నూనెలలో మంచిది ఆలివ్ ఆయిల్ . ఒకవిధమైన సీమచెట్టు, దాని యొక్క పండు , దానివిత్తులలోనుంచి నూనె తీస్తారు, నేతికి సమానమైనది. ఆలివ్ విత్తనాల నుండి ఆలివ్ నూనె తీస్తారు. ఇతర నూనెలకన్నా ఖరీదు ఎక్కువే అయినా ఆలివ్ నూనె లో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి . దీనిలో మోనో అన్క్ష్ సాచ్యురేటెడ్ కొవ్వు ఆమ్లాలు అత్యధికము.

ఆలివ్ నూనె లో Extra-Virgin , virgin , pure , Extra Light అని నాలుగు రకాలుగా దొరుకుతుంది . అందులో మొదటిది ( ఎక్స్ ట్రా వర్జిన్‌ ఆలివ్ ఆయిల్ ) మంచిది .  లేబుల్ పై వీటిని ఎక్ష్ ట్రా వర్జిన్‌ గా ముద్రుస్తారు. వీటిని కోల్డ్ ప్రెస్ట్  గా కూడా పేర్కొంటారు . . . ఈ  ఆయిల్ సీడ్స్ ను వేడిచెయ్యరు . మామూలుగా నూనెలజీవితకాలాన్ని పెంచడానికికి విగతా రిఫైండ్ ఆయిల్స్ అన్నింటినీ వేడిచేసతారు . వేడి చేయని ఈ ఆలివ్ ఆయిల్ ను కెమికల్ గా ట్రీట్ చెయ్యరు .

రిఫైండ్ రకాన్ని సింపుల్ గా ఆలివ్ ఆయిల్  అంటారు . దీనిని ఎక్ష్ట్రా వర్జిన్‌ తో కలుపుతారు " పామాస్ " అనేది తుది వెలికితీత . దీనికి హైస్మోక్ పాయింట్ వున్నప్పటికీ ఎక్కువగా హీట్ చెయ్యవద్దు . వేడి చెయ్యడము వల్ల దానిలో యాంటీ ఆక్షిడెంట్స్ నశిస్తాయి . మోనో అన్సాచురేటెడ్ ప్యాటీయాసిడ్స్ గల ఆలివ్ ఆయిల్ ఏ రూపము లోనిదైనా గుండెకు మంచిది .

  • ===========================
visit my website - > Dr.Seshagirirao-MBBS -