Thursday, September 18, 2014

When do we eat last meal of the day-రోజులో చివరి ఆహారము ఎప్పుడు తీసుకోవాలి?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర :  రోజులో చివరి ఆహారము ఎప్పుడు తీసుకోవాలి?.

జ : ఆకలి వేసినప్పుడే అన్నం తినాలి అంటారు మన పెద్దేలు . ..కాని ఆరోగ్యానికి అందానికి ఆహారం చాలా ముఖ్యం. అదే ఆహారం వేళ కాని వేళల్లో తింటే అధిక బరువుకు కారణం అవుతుంది అంటున్నారు నిపుణులు. రోజులో చివరి ఆహారం అంటే... రాత్రి భోజనం నిద్రపోవడానికి రెండు మూడు గంటల ముందే తింటే మంచిది. అందులోనూ రాత్రి ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర మధ్య భోంచేస్తే ఇంకా మేలు. రాత్రిపూట ఎక్కువగా తినేసి వెంటనే నిద్రపోతే శరీరంలో కొవ్వు చేరిపోవడమే కాదు, నిద్ర కూడా అరకొరగానే పడుతుంది. సాధారణంగా ఎవరికైనా సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల మధ్య బాగా ఆకలేస్తుంది. ఆ సమయంలో ఏవో చిరుతిళ్లు తినేయడం వల్ల రాత్రి ఆహారం ఎనిమిదికల్లా తినం. కనుక సాయంత్రం వేళల్లో మిర్చీలూ, బజ్జీలూ, పకోడీల్లాంటివి ఎక్కువగా తినేయకుండా చాలా తేలికపాటి అల్పాహారాన్ని తీసుకోవాలి. ఒక యాపిల్‌ పండు లేదా గుప్పెడు నట్స్‌ తింటే మంచిది. పని ఒత్తిడితో నిద్రపోవడానికి కాస్త ముందే భోంచేయాల్సి వస్తే మితంగా తినే ప్రయత్నం చేయాలి. లేదంటే నిద్రపోయాక జీర్ణక్రియ చాలా మందకొడిగా సాగుతుంది. అజీర్తి సమస్యలు ఎదురవుతాయి.

  •  *===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.