Saturday, October 26, 2013

Is there any special food to cure pimples?,మొటిమలు తగ్గడానికి ప్రత్యేకమైన ఆహారము ఉందా?

  •  

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము . *

ప్ర : మా అమ్మాయికి 12 సం.లు .మొటిమలు బాగా వస్తున్నాయి. ఆమె డైట్ నుంచి నూనెపదార్ధాలు తొలగించాలా? .మొటిమలు తగ్గడానికి ప్రత్యేకమైన ఆహారము ఏమైనా ఉందా?.

జ : టీనేజ్  లో మొటిమలు రావడమనేది సాధారణ సమస్య. . . అంతే తప్ప ఆహారముతో నేరుగా కనెక్షన్‌ ఉండదు . ఐతే బాగా ఆయిలీ పదార్ధాలు , వేపుడు పదార్ధాలు తగ్గించడము వలన కొంత ఫలితముంటుంది. మొటిమలు తగ్గించగల పదార్ధాలు ఏవీలేవు.  సమతులాహారము , తాజాపండ్లు , కూరగాయలు  తినడమువలన చర్మము ఆరోగ్యవంతం గా ఉండి మొటిమలు రావడము తగ్గుతుంది .
  • ===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

Lampblack or collyrium effets the eyes?,కాటుక పెట్టుకోవడము వలన కళ్ళకు హాని జరుగుతుందా?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము . *

Q : కళ్ళకు ఎలాంటి కాటుక పెట్టుకోవాలి? కాటుక పెట్టుకోవడము వలన కళ్ళకు హాని జరుగుతుందా?

A : కాటుక అంటే ఆముదము మొదలైన దీపపు మసిని అదే నూనెతో రంగరించి పచ్చకర్పూరము లాంటి సుఘంధ ద్రవ్యాలను చేర్చి తయారు చేసిన కంటి క్రింది భాగంలో అలంకరణకు,ఆరోగ్యానికి ఉపకరించే సౌందర్య సాధనము.
కనులకు అందాన్ని, హాయిని ఇస్తుంది కాటుక. ఎంత చిన్న కనులైనప్పటికీ వాటికి కాటుక సింగారించినపుడు అవి అందంగా, పెద్దగా కనిపిస్తాయి. కాటుక వలన కళ్ళకు చలవే చేయడమే కాకుండా కళ్ళు మిలమిల మెరుస్తుం టాయి. కాటుకవల్ల కళ్ళు మరింత అందంగా ఉంటాయికదాని కాటుక సుద్దలు సుద్దలుగా లావు గా పెట్టుకుంటే ఉన్న అందం కూడా పోతుంది.

ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల కాటుకలు దొరుకు తున్నాయి. అయితే వాటిల్లో ఏది మంచి కంపెనీయో, ఏది కాదో తెలీక సందేహంలో పడతాం. కనుక ముందుగా వాటి వివరాలు తెలుసుకుని ఆనక వాడటం మంచిది. లేకుంటే వాటి వలన కంటికి హాని కలుగవచ్చు. కొన్ని కాటుకలు వాడటం వలన కళ్ళకు మంటలు, దురదలు వస్తుంటాయి. అవి ఫలానా కాటుక ఉపయోగించినందు వలన వచ్చాయని గమనించినట్లయితే వేంటనే ఆ కాటుకను వాడటం మానేయాలి. కొన్నిరకాల కాటుకలను ఉపయోగించినందువల్ల క్రమంగా చూపు మందగించే ప్రమాదం కూడా వుంది. ఇలాంటి ఇబ్బందులకు దూరంగా వుండాలంటే మనం ఇంట్లోనే కాటుక తయారు చేసుకోవచ్చు. మనం చేసుకున్న కాటుక పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా, ఉపయోగకరంగా వుంటుంది. డబ్బు కూడా ఆదా చేసినట్లవుతుంది.

ఇంతకీ కాటుక ఎలా తయారుచేయాలంటే...

శుభ్రమయిన ప్రమిదలో మంచి ఆముదం పోసి, దానిలో దూదితో చేసిన వత్తిని ముంచి వెలిగించాలి. ఒక రాగి పాత్రను వెలుగుతున్న వత్తికి సుమారు రెండు మూడు అంగుళాల పైన ఉండేట్లు బోర్లించాలి. రాగి పాత్ర లోపలి భాగంలో అంటే మసి అంటుకునే వైపు మంచి గంధం పూత పూయలి. మధ్య మధ్యలో ఆముదాన్ని పోస్తూ బాగా మసి పట్టేలా చేసి, తర్వాత ఆ మసినంతటినీ జాగ్రత్తగా గీకి ఆముదంతో తడిచేసి, ఇందులో కొంచెం కర్పూరాన్ని కలిపి శుభ్రమయిన భరిణెలో నిలువ చేసుకోవచ్చు. ఇలా తయారుచేసుకున్న కాటుక కళ్ళకు మంచిది. కళ్ళను చల్లగా ఆరోగ్యవంతంగా వుంచుతుంది. కాటుక పెట్టుకున్న కళ్ళు కలువల్లా భాసిస్తాయనటంతో అతియోక్తి లేదు. కనుబొమలకు మంచి ఆకృతినిచ్చి, అందంగా ట్రిమ్‌ చేసినట్లయితే కాటుక కళ్ళు మరింత అందాలు చిందిస్తాయి.. గర్భవతులు క్రమం తప్పకుండ కాటుక పెట్టుకుంటే బిడ్డకి, తల్లికి మంచిది.

  • =========================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

No increase in weight with vegeterian food?,శాకాహారము తింటే బరువు ఎక్కువ అవదా?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము . *

 ప్ర : శాకాహారము తింటే బరువు ఎక్కువ అవదా? ఒక్క శాకారమే తింటున్నవారు బరువు తగ్గుతారా?

జ : చాలామంది బరువు తగ్గడం వెనుక రహస్యము శాకాహారమని భావిస్తుంటారు. బరువు తగ్గడానికి , బరువెక్కకుండా ఉండడానికి కారణము శాకాహారము కాదు . . . సరిగా ఆహారము ఎంచుకోవడము , మితముగా ఉండడము . శాకాహారములోనూ అత్యంత ఎక్కువ కేలరీలు , అనారోగ్యకరమైనవి ఉన్నాయి. ముఖ్యమైనది ఏమిటంటే .... తాజాగా ఉన్నపండ్లు  , ఉడికించిన కూరగాయలు , కొవ్వు ఎక్కువలేని ఆహారపదార్ధాలు ఆహారములో భాగముగా చేసుకోవడము .  ఎక్కువ ఫైబర్ ఉన్న ఆహారము తీసుకోవడము , నీరు ఎక్కువగా త్రాగడము  , తక్కువ కేలరీల ఆహారము వేలకు భోజనము చేయడము మంచిది. బరువు పెరగరు .. తగ్గుతారు కుడా.
  • ===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

Day-time sleep , after-noon sleep,పగటి నిద్ర , మధ్యాహ్నం నిద్ర

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము . *

 ప్ర : మధ్యాహ్నం భోజనం అయిన తరువాత నిద్రపోవడము ఆరోగ్యానికి మంచిదేనా?.

జ : లాభాలు : వీలుపడితే మద్యాహ్నము ఒక గంటకు మించకుండా నిద్రపోతే చాలా ప్రయోజనాలు కలుగుతాయి. జ్ఞాపకశక్తి పెరుగుతుంది, శరీరానికి చురుకుతనము కలుగుతుంది. రక్తపోటు తగ్గించడములోనూ సహకరిస్తుంది. గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశము తగ్గుతాయి . రోజంతా హాయిగా ,ప్రశాంతముగా ఉంటుంది. పగటిపూట నిద్ర ఆరోగ్యానికి భంగం చేస్తుందని, అందుచేత పగలు నిద్రపోరాదని పండితులు చెబుతున్నారు. రాత్రినిద్రబట్టనివారు, అనారోగ్యంతో బాధపడేవారు పగలు నిద్రపోవచ్చు. వేసవి కాలంలో పగలు నిద్రపోవచ్చు.

నష్టాలు : పగటి పూట నిద్ర పోవడము మన దైనందిన పనులకు ఆటంకము కలుగుతుంది.తగిన వ్యాయామము లేకపోతే బరువు పెరిగే అవకాశము ఉంటుంది. పగలు ఎక్కువగా నిద్రపొతే ,రాత్రులు నిద్రపట్టకపోవచ్చు ... స్లీప్ క్లాక్ డిస్టర్బ్ అయి , నిద్ర సమస్యలు తలెత్తవచును. కావున అవసరమున్నంతవరకే పగటి నిద్రను ఉపయోగించుకోవాలి. భారీ కాయమున్నవాళ్ళు పగటినిద్ర పోకూడదు. పగలు నిద్ర పోయే అలవాటుందా? అయితే అది రెండో రకం మధుమేహానికి నాంది అని అంటున్నారు పరిశోధకులు. చైనాలో 20 వేల మందిపై జరిపిన అధ్యయనం ఈ విషయానే్న చెబుతోంది. వాళ్లంతా కూడా 50 ఏళ్ల పైబడిన వారే. వారంలో కనీసం నాలుగైదు రోజులు పగలు నిద్రపోయేవారిలో నూటికి 36 శాతం మందిలో ఈ మధుమేహ లక్షణాలు కనిపించాయట. మన శరీరంలోని వివిధ రకాల హార్మోన్ల నైసర్గిక సమ తౌల్యతపైన ఈ పగటి నిద్ర ప్రభావం చూపిస్తుంది. ఇది శరీరంలోని రక్తంలో చక్కెర శాతం పెరుగుదలపైన కూడా ప్రభావం చూపిస్తుంది. అంతేకాక చిన్న చిన్న జబ్బులతో బాధపడే వారు తరచూ పగటి నిద్రకు అలవాటు పడడాన్ని సైతం పరిశోధకులు కనుగొన్నారు. శారీరక శ్రమ కలిగించే పనుల్లో నిమగ్నం కావడం, ధూమపానం, మద్యపానం లాంటి అలవాట్లు మానుకోవడం ఈ పగటి నిద్రపోయే వారు మంచిదని వారు హెచ్చరిస్తున్నారు.
  • ===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

Thursday, October 24, 2013

Impotent,ఇంపోటెంట్,అసమర్ధుడు

  •  

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

Q : నాకు 28 ఏళ్లు. మూడు నెలల క్రితం పెళ్లయింది. మొదట్లో శృంగారంలో కొద్దిగా వెనుకంజ వేసినప్పటికీ ఇప్పుడు బాగానే ఉంటున్నాను. కానీ ఇప్పుడు నా భార్య నేను ఇంపోటెంట్ అనీ, అందుకే నేనంటే తనకు ఇష్టం లేదనీ, కుటుంబసభ్యులతో చెప్పి నానా అల్లరీ చేస్తోంది. నేను పోటెంట్ అని నిరూపించే పరీక్షలు చేయించి చూపమని ఆమె తరపువాళ్లు అడుగుతున్నారు. నాకు ఎటూ తోచడం లేదు. ఈ విషయంలో మీ సలహా ఏమిటి?

A : ఇలాంటి పరిస్థితిలో ఎవరైనా ఆత్మన్యూనతా భావానికి గురవడం సహజం. కానీ మీరు భయపడాల్సిన పనిలేదు. మీరు నార్మల్‌గానే ఉన్నారని చెప్పడానికి దశలవారీగా అనేక పరీక్షలున్నాయి. పరీక్షల్లో భాగంగా ముందుగా బాహ్యజననాంగాలు సక్రమంగా ఉన్నాయో లేదో చూస్తారు. ఆ తరువాత మెదడు, జననాంగాల నుంచి విడుదలయ్యే హార్మోన్ల ఉత్పత్తి నార్మల్‌గా ఉందో లేదో తెలుసుకోవడానికి టెస్టులుంటాయి. ప్రతి పురుషుడికీ నిద్రలో అతనికి తెలియకుండానే ఎరెక్షన్స్ వస్తుంటాయి. అవి రికార్డ్ చేయడానికి రిజీస్కాన్ పరీక్ష అవసరం అవుతుంది. ఆ తరువాత అవసరాన్ని బట్టి జననాంగంలోకి ప్రోస్టాగ్లాండిన్ ఇంజెక్షన్ ఇచ్చి ఎంత ఎరెక్షన్ వస్తుందో తెలుసుకోవాలి. వీటిని బట్టి పొటెన్సీ నిర్ధారణ చేయవచ్చు. మీరు మంచి ఆండ్రాలజిస్టును కలవండి.
  • *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Hernia , హెర్నియా,గిలక

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 Q : మా అబ్బాయి వయసు 17 సం. లు పుట్టినప్పటి నుంచి బాగానే ఉన్నాడు. 3 నెలల క్రితం వృషణాలలో మార్పు వచ్చింది. ఎడమ వైపు వృషణం ఒక్కసారిగా లావుగా వాస్తుందట. కానీ నొప్పి ఉండదు. ఒక్కోసారి మామూలుగానే ఉంటుంది. దానివల్ల అతనికి ఎరెక్షన్స్ మటుమాయమైనాయని అంటాడు. ఈ సమస్యతో బాబు చదువులో కూడా వెనకపడ్డాడు. చాలా డిప్రెషన్‌కి గురవుతున్నాడు. ఇలా జరగడానికి సుఖవ్యాధులు కారణమా? దీని ప్రభావం ముందు ముందు ఏమైనా ఉంటుందా? ఆపరేషన్ అవసరమా? ఏ వయసులో చేయించాలి? ఆ తర్వాత ఎరెక్షన్స్ మెరుగుపడతాయా?

A : మీరు భయపడుతున్నట్లుగా మీ అబ్బాయికి సుఖవ్యాధులుండే అవకాశం లేదు. చిన్న ఆపరేషన్‌తో సమస్య పరిష్కారం అవుతుంది. మీరు రాసిన లక్షణాలను బట్టి అతనికి ఎడమ వైపు ఇంగ్వయినల్ హెర్నియా ఉందనిపిస్తోంది. గజ్జలలో ఉండే ఇంగ్వయినల్ నాళం పొట్టలో ఉండే పేగులు కిందకు జారతాయి. అలా జారుతూ వృషణం పక్కన చేరి వృషణం పెద్దదయిందనే భ్రమ కలిగిస్తాయి. కానీ హెర్నియాకు, వృషణానికి సంబంధం లేదు.

అది తెలియక మానసిక ఆందోళనకు గురయ్యి ఎరెక్షన్స్ తగ్గి ఉండవచ్చు. హెర్నియా ఆపరేషన్ ఏ వయస్సులోనైనా చేయవచ్చు. లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా మీ అబ్బాయి సమస్య పరిష్కారం అవుతుంది. ఈ ఆధునిక ఆపరేషన్ తరువాత రెండు రోజులలో డిశ్చార్జ్ కావచ్చు.
  • *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Hydrocoel , వరిబీజం లేక హైడ్రోసీల్

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము . *
  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 Q : నావయస్సు 69 సం.లు గత పది సంవత్సరాలుగా నా వృషణాల సంచి క్రమేపీ పెరుగుతూ ప్రస్తుతం ఒక రబ్బరు బెలూన్‌లా తయారైంది. దీని చుట్టుకొలత 18 ఇంచులు ఉంది. మూత్ర విసర్జనలో ఎలాంటి బాధ, నొప్పిలేవు. నేను శృంగారంలో పాల్గొనేటప్పుడు అది అవరోధంగా అనిపిస్తుంది. తర్వాత కొన్ని గంటల వరకు స్క్రోటం నొప్పిగా ఉంటుంది. అందువల్ల అంగం పొట్టిగా అయ్యింది. ఇరెక్షన్స్ గట్టిగా ఉండటం లేదు. శృంగారంలో పాల్గొనేటప్పుడు అది పగులుతుందేమోనని భయంగా ఉంది. ఇక్కడి డాక్టరుకు చూపిస్తే అంక్ష వాయువు లేదా బుడ్డ కావచ్చని చెప్పారు. దీనికి సర్జరీ అవసరమని చెప్పారు. నాకు సర్జరీ అంటే భయం. ఒక వేళ ఆపరేషన్ చేయించుకోక పోతే వచ్చే నష్టాలేంటి?

A : మీలో ఉన్న సమస్యను వరిబీజం లేక హైడ్రోసీల్ అంటారు. వృషణం చుట్టూ ఉండే ట్యునికా వ్జైలిస్ అనే పొరల మధ్య నీరు చేరడాన్నే హైడ్రోసీల్ అంటారు. దీనికి నిర్దుష్టమైన కారణాలేమీ ఉండవు. కొద్దిమందిలో వృషణానికి దెబ్బ తగిలినా, చీము పట్టినా, లేక వృషణం క్యాన్సర్ కణితి కణజాలం ఈ పొరల మధ్య ఉండవచ్చు. కాబట్టి వృషణము సైజు, సంచి పరిమాణం పెరిగితే .... తప్ప కుండా మంచి సర్జెన్‌ కి  చూపించాలి.
ఆ భాగాన్ని స్కానింగ్‌చేయడం వలన లోపల ఉన్న జబ్బు తెలుస్తుంది. కేవలం నీరు ఉంటే దానికి లార్డ్స్ ప్లిలైకేషన్ కానీ ‘జాబొలే ఎవర్షన్’ అనే ఆపరేషన్ గానీ చేయాలి. సర్జరీ చేయకపోతే నొప్పితో పాటు ఇన్‌ఫెక్షనలకు దారితీయవచ్చు. అది పగిలిపోవడం గానీ కాల్షియం పేరుకుపోవడం, వృషణం చిన్నదవటం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.
  •  *===========================
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Tuesday, October 15, 2013

Vegetables Nutrisional value donot chage per soure?,కూరగాయల సోర్స్ బట్టి పోషకాలవిలువల మార్పులుంటాయా?

  •  

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 Q :కూరగాయల సోర్స్ బట్టి పోషకాలవిలువల మార్పులుంటాయా?

జ : కూరగాయల సోర్స్  వాటిలోని పోషక విలువల్లో వ్య త్యాసము  చూపుతాయా అన్న విషయములో చాలా మందికి మీమాంస ఉంటుంది . ఇంట్లో పండించిన కూరగాయల్లో కంటే  ఆర్గానిక్ కూరగాయల్లో ఎక్కువ పోషకాలుంటాయని సాధారణముగా భావిస్తుంటారు. కాని నిజానికి కూరగాయల సోర్స్ బట్టి పోషకవిలువలకు సంబంధించి పెద్ద వ్యత్యాసము చూపవు . కూరగాయలన్నింటిలో ఒకేవిధమైన పోషకాలు ఉంటాయి. అయితే వాటిని నిల్వచేసే పద్దతులు , పండించే విధానాలు , వాడే రసాయనిక మందులు , ఎరువులు బట్టి తేడా చూపుతాయి. ఎక్కువరోజులు స్టోరేజీ వల్ల పోషకాలు నశిస్తాయి. స్థానికము గా పెంచినవైతే కోసిన రోజో , మరునాడో అమ్మేస్తారు కనుక తజాగా ఉండి పోషక విలువలు ఎక్కువగా కలిగు ఉంటాయి. ఆర్గానిక్ కూరగాయల విషయానికి వస్తే వాటికి  ఎటువంటి  కీటకనాశన మందులు , ఇతర రసాయనము వాడరు ... ఆ రీత్యా అవి మంచివి గా పేర్కొనవచ్చును
  • *=========================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

Do microwave oven cooking good for health?, మైక్రోవేవ్ ఒవెన్‌ లో వండే పదార్ధాలు ఆరోగ్యానికి మంచిదేనా?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
 ప్ర : మైక్రోవేవ్ ఒవెన్‌ లో వండే పదార్ధాలు ఆరోగ్యానికి మంచిదేనా?

జ : ఈ సందేహము చాలామందిలొ అంతర్లీనముగా ఉంటుంది. పదార్ధాలను వేదిచేసుకోవడానికైనా , పాప్ కార్నస్ తయారీ ,పూర్తి బోజనము తయారీలో మక్రోవేవ్ ఒవెన్లు వరం లాంటివి. ముఖ్యముగా సమయం తక్కువగా ఉండే ఉధోగినులకు మరింత ఉపయోగముగా ఉంటాయి. చాలామంది ఆహారనిపుణులు సైతము మైక్రొవేవ్ కుకింగ్ కు మొగ్గుచూపుతారు. పదార్ధాలను తయారీకి చాలా తక్కువ నూనె పట్టడమే ఇందుకు కారణము .
అయితే మైక్రోవేవ్ ఓవెన్‌ లో వంట చేయడము వల్ల కొన్ని పోషలాలు కోర్పోతామన్నది చాలామంది అభిప్రాయం ... ఇది నిజము కాదు .మైక్రొవేవ్ ఓవెన్‌ లో పదార్ధాలు ఉండికించినా , తిరిగి వేడిచేసినా కొన్ని పోషకాలు నశిస్తాయి. ఐతే  సంప్రదాయ పద్దతుల్లో వంట చేయడము , వేపుళ్ళ విషయం లోనూ ఈ పోషకాలు కొల్పోవడము అన్నది జరుగుతుంది. బయట స్టీమింగ్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే మాత్రము ... దీంతో పోల్చితే మైక్రోవేవ్ ఓవెన్‌ ఎక్కువ పోషకాలు కోల్పోవాల్సి వస్తుంది.

మైక్రోవేవ్  పదార్ధాలలోని తేమను పూర్తిగా గ్రహించి డ్రై చేస్తాయి కాబట్టి స్టీమింగ్ తో పోల్చినప్పుడు పోషకాల నష్టము ఎక్కువే . మైక్రోవేవ్స్ ఎలక్ట్రో మాగ్నెటిక్ రేడియేషన్లు లీక్ చేస్తాయన్నది మరో అభప్రాయము అయితే ఒవెన్‌ సరిగా మెయిన్‌టెయిన్‌ చేసినప్పుడు దీనిగురించి ఆందోళన చెందనవసరములేదు. మైక్రోవేవ్ డోర్స్  లేదా సీల్స్ డ్యామేజీ కాకుండా ఒవెన్‌ సక్రమముగా పనిచేయాలి. వేవ్స లోపలే ఉండిపోవాలి. వాడనప్పుడు మైక్రొవేవ్ ను షటింగ్  ఆఫ్ చేయడము మంచి అలవాటు . ఎందుకంటే అప్లియన్స్ స్విచ్చాఫ్ లొ ఉన్నప్పుడు రేడియేషన్‌ ఉండదు.
స్టీమింగ్ కు ప్రాధన్యం ఇస్తూ ప్రెజర్ కుక్కర్ వాడడం మంచిది . మైక్రొవేవ్ ను సైకర్యాన్ని బట్టి అప్పుడప్పుడు వాడుకోవాలి. దీనిలో ఎప్పుడూ కూడా మైక్రోవేవ్ గ్లాస్ మాత్రమే ఉపయోగించాలి. ప్లాస్టిక్ పాత్రలయితే ఆహారపదార్ధాల్లోకి ప్లాస్టిక్ లీకయ్యే ప్రమాధము ఉంటుంది.
  • *=========================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

Thursday, October 10, 2013

Hints to prevent Stroke?, స్ట్రోక్ రిష్క్ రాకుండా జాగ్రత్తలు ఏమి పాటించాలి ?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము . *

 ప్ర : స్ట్రోక్ రిష్క్ రాకుండా జాగ్రత్తలు ఏమి పాటించాలి ? ఇక్కడ స్తోక్ అంటే గుండకు సంబంధించి.

జ :హార్ట్‌ఎటాక్‌కు, స్ట్రోక్‌కు మధ్య గల సున్నితమైన తేడాను తెలుసుకోవటం అవసరం. హార్ట్‌ ఎటాక్‌ను గుండె పోటు అంటాం. గుండెపోటును కూడా ఒక్కొక్కసారి హార్ట్‌ స్ట్రోక్‌ అంటూ వుంటాం. సాధారణ పరిభాషలో రెండు పదాలకు పెద్దగా తేడాలేక పర్యాయ పదాలుగా ఉపయోగించబడుతున్నా, వైద్యపరిభాషలో రెండూ ఒకటికాదు. వైద్య పరిభాషలో స్ట్రోక్‌ అనేదానికి మెదడులో రక్తప్రసరణకు హార్ట్‌ ఎటాక్‌ అనేదానిని గుండెకు రక్తప్రసరణకు ఉపయోగిస్తుంటారు. రెండూ రక్తనాళాలకు సంబంధించినవే అయినా గుండె, మెదడు విష యంలో ఈ తేడా గమనార్హం.
కదల కుండా ఎంచక్కా టెలివిజన్‌ ముందో , కంప్యూటర్ ముందో సెటిలయితే బాగానే ఉండొచ్చు కాని శారీరక చురుకుదనము లేక గుండెకు హాని జరుగుతుంది. శారీరక వ్యాయామము చేసేవారు ఆరోగ్యము గా , మంచి ఫిట్ నెస్ తో ఉండడమే కాదు వారి గుండె గట్టితనము బేషుగ్గా ఉంటుంది.
వారానికి నాలుగు సార్లు ఓ మాదిరి వ్యాయామము చేసేవారిలో  స్ట్రొక్ అవకాశాలు మిగతావారికంటే చలా తక్కువగా ఉంటాయి . ఇలా వ్యాయామము చేసే వారితో పోల్చితే చెయ్యని వారిలో 20 శాతము స్ట్రోక్ అవకాశాలు ఎక్కువ . ఏమిటి లింక్ అని ప్రశ్నించుకుంటే  ఎక్షరసైజ్ లు రక్టనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి , రక్త సరఫరా లో బ్లాకేజీలను పూర్తిగా తగ్గిస్తాయి. స్ట్రోక్ కు  కారణమయ్యే చిన్న చిన్న బ్లడ్ క్లాట్స్ ను కరిగిస్తాయి.ఏ రకము వ్యాయామము చేసినా ఒబెసిటీ , డయాబిటీస్ , రక్తపోటు తగ్గడమే కాదు - స్ట్రోక్ ముప్పూ ఉండదు. మరి ఏ ఇతర మినహాయింపులూ ఇచ్చుకోకుండా రోజుకో అరగంట అయినా వ్యాయామము చేస్తే మనస్సూ , శరీరము ఉల్లాసము గా ఉంటాయి.
  • ===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

Saturday, October 5, 2013

Can we get fitness with routine house work?,ఇంటిపనులతోనే సరియన ఫిట్నెస్ లేదా సరియైన షేప్ లో ఉండగలమా?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము . *

ప్ర : ఎటువంటి వ్యాయామము చేయకుండా ఇంటిపనులతోనే సరియన ఫిట్నెస్ లేదా సరియైన షేప్ లో ఉండగలమా?

జ : అధనపు ఎక్షరసైజులు చేయకుండా '' ఫిట్ నెస్''  సాధ్యపడదు. దుస్తులు ఉతకడము , బట్టలు ఇస్త్రీ చేయడము , ఇల్లు తుడవడము , బాత్ రూం కడగడము , వంటపాత్రలు తోమి శుభ్రపరచడము , గార్డెనింగ్ , మెట్లు ఎక్కి దిగడము  వంటి ఇంటిపనులు వల్ల కొద్దిపాటి కేలరీలు ఖర్చు అవుతుంది. . . కాని పూర్తి ష్థాయి వ్యాయామము కాదు . కొద్ది రోజులు ఫిట్ గా అనిపించినా బరువు తగ్గడము , లేదా ఫిట్నెస్ ప్రయోజనాలు మాత్రము ఇవ్వవు. రోజువారి ఒక నిర్ధిస్టమైన సమయాన్ని కేటాయించి .__ నడక , ఆటలు , జిమ్‌ ఎక్షరసైజులు  , యోగా లాంటి ఏదో ఒక వ్యాయామము చేయాలి. వీటికి తోడు గా ఇంటిపనులు చేస్తే మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చును . శరీరము మంచి ' shape and fitness ' గా దీర్ఘకాలము నిలబడుతుంది. 
  • =========================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

Stress produce gastric ulcers?,కడుపులో అల్సర్లు ఒత్తిడివలన వస్తాయా?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము . *
 ప్ర : కడుపులో అల్సర్లు ఒత్తిడివలన వస్తాయా?

జ : ఇది కేవలం అపోహ మాత్రమే . మానసిక వత్తిడి అల్సర్ల కు దారితీస్తుందనడము లో నిజం లేదు. ఒత్తిడి అల్సర్ చికిత్సని  అడ్డుకుంటుంది. అల్సర్లకు కారణాల్ని గుర్తించని కాలము లో మానసిక వత్తిడే వీటికి కారణమని భావించేవారు.           
గత 20 సంవత్సరాల కాలములో ఉదరము లో ఉండే బ్యాక్టీరియా పట్ల అవేర్నెస్  పెరిగింది. ఉదరములో కుండే " హెలికోబ్యాక్టర్ పైలోరి" అనే బ్యాక్టీరియా అల్సర్లము కారణమని గుర్తించడము జరిగినది. కొన్ని రకాల మందులు ముఖ్యముగా ఆర్థ రైటిస్ కు వాడే NSAIDS మాత్రలు , స్పైసీ ఫుడ్స్ , కారము ,మసాలా ఆహారపదార్ధములు గాస్ట్రైటిస్ ని కలుగజేసి ... ఉల్సర్ల యేర్పడడానికి దోహదము చేస్తాయి.

  • =========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Friday, October 4, 2013

Abdominal fat and sex problems?,పొట్టపైన కొవ్వు సెక్ష్ సంస్యలు

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : నా పొట్త పై కొవ్వు బాగా పెరగడము వలన సెక్ష్ సామర్ధ్యము తగ్గిపోయినది. పరిష్కారము ఏమిటి?

జ : స్త్రీలు బరువు పెరుగుతున్నాప్పుడు మొట్టమొదటగా కొవ్వు వారి శరీరము కింది భాగములో ఎక్కువగా జమ అవుతుంది . ఆ తర్వాతే    మిగగా భాగాలలో కొవ్వు జమ అవుతుంది. అందువల్లే ఎంత లావుగా ఉన్న  స్త్రీని గమనించినా ఆమె ఒక సిలిండర్ లా కనపడుతుందే తప్ప బాన పొట్టతో కనబడదు. .... అదే మగవారు బరువు పెరుగుతున్నప్పుడు  కొవ్వు మదటగా వారి ఉదరభాగము లో జమ అవుతుంది. అందువల్లే నిత్య జీవితములో కాళ్ళు , చేతులు సన్నగా ఉండి పొట్ట ఎత్తుగా ఉండే గమవారెందరో కనబడుతూ ఉంటారు.

మగవారు బరువు పెరిగినపుడు స్తీలాగే హై బి.పి , డయబిటీస్ , పక్షవాతము , కీళ్ళనొప్పులు తోబాటు నడిస్తే ఆయాసము , సెక్ష్ సమస్యలు వంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు.  అయితే స్తీలతో పోలిస్తే కేవలము మగవారు మాత్రమే ఎదుర్కొనే  సమస్య  సెక్ష్  సమస్యలు .పొట్టభాగము లో కొవ్వు పేరుకుపోయినపుడు శరీరము లో ఏర్పడే హార్మోస్ అసమానతల వలన అంగ స్తంభం సమస్యలు ఎదురవుతాయి.ఎప్పుడో ఒకసారి ఈ అంగస్థంభన సమస్య ను అధిగమించినా పొట్ట ఎత్తుగా ఉండడము వల్ల పొజిషనల్ ప్రాబ్లమ్‌స్  లేదా త్వరగా అలసిపోవడము వలన పార్టనర్ ను సంతృప్తి పరచలేక పోతారు.  కావున కొవ్వు వలన వచ్చే బరువును ... దానివలన ఏర్పడిన బాన పొట్టను తగ్గించుకునే ప్రయతాలు చేయాలి.
  •  *=========================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

Thursday, October 3, 2013

Is there permanent solution for pimples(Acne)?,మొటిమలకు శాశ్విత పరిష్కారముంటుందా?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము . *
  •  
  •  

 ప్ర : మొటిమలకు శాశ్విత పరిష్కారముంటుందా?

జ : ఉంటుంది. మొటిమలకు కారణాలెన్నోఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ---
  • 13 నుండి 23 సం.ల వరకు యువతీ ,యువకులలో ఏర్పడే హార్మోనులలో మార్పులు. 
  • చాక్లెట్లు , ఫాస్ట్ ఫుడ్స్ మరియు  ఆయిలీఫుడ్స్ ఎక్కువగా తీసుకునే వారిలోను , 
  • చర్మము పట్ల  సరియైన జాగ్రత్త తీసుకోనివారిలోనూ, 
  • తలపైన చుండ్రు ఎక్కువగా ఉన్నవారిలోనూ ,
  • జిడ్డు , ఆయిలీ చర్మ తత్వము కలవారిలోనూ , 
  • స్త్రీలలో పి.సి.ఒ.డి వ్యాది ఉన్నవారిలోనూ, 
  • కొన్నిరకాల మందులు , సన్‌బ్లాక్ క్రీములు వాడిన వారిలోనూ .......... మొటిమలు ఎక్కువవగా వస్తూఉంటాయి. . 
 పింపుల్స్ ట్రీట్ చేసే ముందు , ఏకారణము వలన ఇవి వస్తున్నాయి అని నిర్ధారించి సరియైన చికిత్స తీసుకుంటే మొటిమలు తగ్గిపోతాయి. అలా చేయనిచో మొటిమలు తగ్గినట్లే తగ్గి మళ్ళి వస్తుంటాయి. మీరు గుర్తుంచుకోవలసిన విషము మరొకటేమిటంటే  పింపుల్స్ చికిత్స సాధారణముగా కొన్ని వారాలు లేదా కొన్ని నెలలు ఉంటుంది . . . కాబట్టి ఓపిక  అవసరము.  మొటిమలు తక్కువ మోతాదులో ఉన్న కేసుల్లో ఆయింట్ మెంట్స్ , టాబ్లెట్స్ తో కంట్రోల్ అయ్యే అవకాశము ఉన్నది. ఒకవేళ పింపుల్స్ ' మీడియం ' లేదా ' ఎక్కువ ' మోతాదులో ఉన్న పక్షములో " సూపర్ ఫీల్ " ట్రీట్ మెంట్  అవసరమవుతుంది. ఈ సూపర్ ఫీల్ ......... ఇంపోర్టెడ్ ఫీల్ చాల ఎఫెక్టివ్ గా పింపుల్స్ ను తగ్గిస్తుంది .దీని ద్వారా పింపుల్స్ తగ్గిపోవడమే కాకుండా మీ స్కిన్‌ టోన్‌ & టెక్షర్  ఇంప్రూవ్ అవుతుంది. పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు కూడా తగ్గిపోతాయి. ఏ రకమైన సైడు ఎఫెక్ట్స్ ఉండవు .  పింపుల్స్ వలన ముఖము పై ఏర్పడ్డ గుంటలు E-PLUS లేజర్ చికిత్స తో తగ్గించవచ్చును

-- డా.వి. రవీంద్ర నాధ్ రెడ్డి @ స్వాతి వారపత్రిక .
  • =========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

జిమ్‌ యోగా చేసిన తరువాత కొన్ని సార్లు కండరాలు జాయింట్లు నొప్పులు గా ఉంటాయెందుకు?

  •  

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము . *

 ప్ర : జిమ్‌ , యోగా చేసిన తరువాత కొన్ని సార్లు కండరాలు , జాయింట్లు నొప్పులు గా ఉంటాయి ఎందుకు?,నొప్పులు ఏవిధముగా తగ్గించుకోవాలి?.
జ : ఏ వ్యాయామము , క్రీడల తర్వాత అయినా ఓ మాదిరి కండలాలనొప్పులు మామూలే. వ్యాయామము తరువాత సాఫ్ట్ టిస్స్యూలలో అసౌకర్యము ఉంటుంది. బుజాలు , చాతీ , బైసెప్స్ దగ్గర సధారణముగా ఇటువంటి నొప్పులు కేంద్రీకరించి ఉంటాయి. ఇవి సాధారణము గా 24 గంటలలో తగ్గిపోతాయి. నొప్పిఉన్నచోట ఐస్ పెడితే ఫలితము ఉంటుంది. 72 గంటలలో నొప్పితగ్గక పోతే వైద్యుడిని సంప్రదించాలి. తిరిగి అదే మజిల్స పై లోడ్ చేయడానికి మందు రెస్ట్ , రికవరీ అవసరము . సోర్నెస్  తగ్గడానికి స్ట్రెచ్ చేయాలి. మనము అనుకున్న లక్ష్యసాధన  కోసము ఒక్కసారి బాగా హడావిడి పడిపోకూడదు. హడావిడి వల్ల ఒక్కోసారి శక్తికి మించి వ్యాయామము చేసేస్తుంటారు . ఇది సరికాదు . ఆసనాలు చేస్తున్నప్పుడు పోశ్చర్ సరిగా లేకపోవడము వల్ల జాయింట్లలో దీర్ఘకాలిక నొప్పులు ఉంటాయి.

నొప్పిగా ఫీలవడానికి క్రాంప్స్ మరో కారణము . పోషకాహారలేమి లేకుండా చూసుకోవాలి. ప్రోటీన్లు , విటమిన్లు , ఖనిజ లవణాలు అధికముగా ఉన్న ఆహారము తీసుకోవాలి. నొప్పులు గా ఉన్నప్పుడు బలవంతం గా వ్యాయామాలు చేయకూడదు.
  • ===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -