Monday, August 29, 2011

ఏ రకమైన డయాలసిస్‌ మంచిది? , Which type of dialysis is good ?



  • https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEie7BdJdScxP3XGGeKaUUHi7woIS-U5KLbQlktVFEdQSEcA5CrvX3yrlTev3m0ilInWrM2NUTIT5VtuwKFo5NShJkzGQKvqyrbO5FsJvMVopAf68yK0RLwRGlJb8ctp6-p4hTrCnfIVydU/s1600/Kidney+Dialysis.jpg

Q : మా నాన్నగారి వయసు 58 సంవత్సరాలు. పది సంవత్సరాలుగా బిపి, మధుమేహం ఉంది. ఈ మధ్య ఆకలి లేకపోవడం, నీరసంగా ఉండటం, కాళ్లు, ముఖం వాపులొచ్చాయి. నడిస్తే ఆయాసం వస్తుంది. రక్తపరీక్ష చేయించాం. 2డి ఎకోటెస్ట్‌ చేస్తే గుండె పనితీరు శాతం తక్కువగా ఉందని చెప్పారు. డయాలసిస్‌ చేయించుకోవాలన్నారు. గుండె పదిశాతం పనిచేయడం వల్ల ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ చేయడం వీలుకాదన్నారు. నాకు ఏ రకమైన డయాలసిస్‌ మంచిది?

పెద్దిరెడ్డి, ఒంగోలు

A : మీకు ఇంట్లో చేసుకునే డయాలసిస్‌ (సిఎపిడి) చాలా మంచిది. ఇది కొన్ని రోజులు చేసుకుంటే మీ గుండె పనిశాతం పెరిగే అవకాశముంది. హాస్పిటల్‌లో చేసుకునే హీమోడయాలసిస్‌ వల్ల మీకు ఇబ్బందులు రావొచ్చు. మళ్లీ మళ్లీ ఆయాసం రావడంగాని, బిపి తగ్గిపోవడం జరగొచ్చు. గుండె తక్కువగా పనిచేసే రోగిలో వాపు, ఆయాసం ఎక్కువుంటాయి. ఇంట్లో చేసుకునే డయాలసిస్‌ (సిఎపిడి) వల్ల వాపుగాని, ఆయాసం రాకుండా మేయింటేన్‌ చేయొచ్చు. ఇది హాస్పిటల్‌ డయాలసిస్‌ కంటే చాలా మంచిది.


--డాక్టర్‌ శ్రీధర్‌ కన్సల్టెంట్‌ నెఫ్రాలజిస్ట్‌అవేర్‌గ్లోబల్‌హాస్పిటల్‌,హైదరాబాద్‌.


  • ========================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

డయాలసిస్ , Dialysis




Q :
నా వయసు 38 సంవత్సరాలు. దీర్ఘకాల మూత్రపిండాల వ్యాధి (సికెడి) నాలుగోదశతో బాధడుతున్నాను. వారానికి మూడుసార్లు డయాలసిస్‌ చేయించుకోవాలన్నారు. కచ్చితంగా వారానికి మూడుసార్లు చేయించుకోవాలా? ఒక సారిగాని, రెండు సార్లు గాని చేయించుకుంటే సరిపోతుందా? సలహా ఇవ్వగలరు.

ఆంజనేయులు, హుజూరాబాద్‌

A : కిడ్నీ (మూత్రపిండాలు) పని శాతం 15 కంటే తక్కువ ఉన్నప్పుడు దీర్ఘకాల మూత్రపిండాల వ్యాధి నాలుగోదశ అంటారు. ఈ దశలో డయాలసిస్‌ అవసరం ఏర్పడుతుంది. ఒకసారి ఈ దశకు చేరుకున్న తర్వాత కచ్చితంగా వారినికి మూడుసార్లు డయాలసిస్‌ చేయించుకోవడం మంచిది. కొంత మంది ఒక సారి లేదా రెండుసార్లు డయాలసిస్‌ చేయించుకున్నప్పటికీ ఏ ఇబ్బందులు ఉండవు. కానీ క్రమం తప్పితే డయాలసిస్‌ చేయించుకోవడం వల్ల ఇతర అవయవాల మీద దీని దుష్ఫలితాలు ఉంటాయి. ఇలా క్రమరహితంగా డయాలసిస్‌ చేయించుకోవడం వల్ల గుండె పనిచేయడం తగ్గుతుంది. జీవన ప్రమాణాం తగ్గే అవకాశముంది.


--డాక్టర్‌ శ్రీధర్‌ కన్సల్టెంట్‌ నెఫ్రాలజిస్ట్‌అవేర్‌గ్లోబల్‌హాస్పిటల్‌,హైదరాబాద్‌.

  • ==================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

నెఫ్రోటీక్‌ సిండ్రోం , Nephrotic Syndrome



Q : మా బాబు వయసు 8 సంవత్సరాలు. ఆరేళ్ల వయసులో ముఖం, కాళ్ల వాపులొచ్చాయి. మూత్రంలో ప్రోటీన్‌పోతోంది. నెఫ్రోటిక్‌ సిండ్రోం అని చెప్పి చికిత్స చేశారు. నెల రోజులు మందులు వాడిన తర్వాత ప్రోటీన్‌ పోవడం తగ్గింది. మందులు కూడా మానేశాం. 15 రోజుల తర్వాత మూత్రంలో ప్రోటీన్‌ వెళ్లడం మొదలైంది. మళ్లీ 15 రోజులు మందులు వాడిన తర్వాత ప్రోటీన్‌ పోవడం తగ్గింది. ఇలా మందులు వాడిన తర్వాత తగ్గుతుంది. మందులు మానగానే మళ్లీ యురిన్‌లో ప్రోటీన్‌ పోతుంది. ఇలా ఎక్కువ కాలం మందులు వాడితే సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చే అవకాశముందా? దీని వల్ల భవిష్యత్తులో కిడ్నీలు దెబ్బతినే ప్రమాదముందా?

శంకర్‌రెడ్డి, కదిరి.

A : నెఫ్రోటీక్‌ సిండ్రోం ఉన్నప్పుడు మొదటిసారిగా పూర్తిగా మూడు నెలలపాటు డాక్టర్‌ పర్యవేక్షణలో మందులు వాడాలి. కొంత మంది పిల్లల్లో మందులు మానగానే మళ్లీ ప్రోటీన్‌ పోవడం మొదలవుతుంది. ఇలాంటి పిల్లల్లో తక్కువ మోతాదులో మందులు 6 నుంచి 9 నెలల వరకు వాడాల్సి ఉంటుంది. కొంత మందిలో మందుల వల్ల దుష్ఫలితాలు వచ్చే అవకాశముంది. దుష్ఫలితాలు వచ్చినప్పుడు వేరే మందులు వాడాల్సి ఉంటుంది. చాలా మంది పిల్లల్లో ఈ వ్యాధి 12 నుండి 14 సంవత్సరాల వయసులో పూర్తిగా నయం అవుతుంది. భవిష్యత్తులో కిడ్నీ దెబ్బతినే అవకాశం చాలా తక్కువ.

--డాక్టర్‌ శ్రీధర్‌ కన్సల్టెంట్‌ నెఫ్రాలజిస్ట్‌అవేర్‌గ్లోబల్‌హాస్పిటల్‌,హైదరాబాద్‌.
  • ======================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

Thursday, August 25, 2011

జుట్టు రాలుతోంది,Hair falling







Q : నా వయసు ఇరవైనాలుగు. కొంతకాలం క్రితం మొక్కుపేరుతో జుట్టును పూర్తిగా తీయించుకున్నా. ఆ తరవాత నెలకోసారి హెర్బల్‌ హెన్నా పెట్టుకుంటున్నా. ఇప్పుడు జుట్టు మెడ దగ్గరకు ఉన్నా.. నల్లగా కనిపిస్తోన్నా.. విపరీతంగా రాలుతోంది. వీపు, మెడభాగం చర్మం కూడా బాగా నల్లగా మారింది. తలకట్టు పలుచగా కనిపిస్తోంది. ఏం చేయాలి.

A : హెర్బల్‌ హెన్నా వాడుతున్నారని రాశారు. కానీ అలాంటి రకాలు బజార్లో తక్కువగా లభిస్తాయి. మీరు వాడే హెన్నాలో రసాయనాలు కలిపితేనే కురులు నల్లబడతాయి. కేవలం ఆ ఉత్పత్తులు జుట్టును నల్లబరచలేవు. ఇక, తలకు వేసుకునే రంగుల్లో రసాయనాలు ఉండటం వల్ల ఎలర్జీ వచ్చే ఆస్కారం ఎక్కువ. అందుకే మీ మెడ, వీపు భాగం నల్లగా తయారైంది. క్రమంగా ఆ ప్రభావం ముఖంపైనా పడుతుంది. జుట్టు కూడా అందుకే రాలుతుండవచ్చు. ఏం చేస్తారంటే.. ఏదైనా నూనెతో వారానికి రెండుసార్లు తలకు మర్దన చేసుకుని గంటాగి తలస్నానం చేయండి. బజార్లో దొరికేవి వాడకుండా.. ఇంట్లోనే సొంతంగా తయారుచేసుకోండి. కప్పు హెన్నా తీసుకుని టీ డికాక్షన్‌తో కలిపి, కాయ నిమ్మరసం, నాలుగుచెంచాల ఉసిరిపొడి చేర్చండి. రెండుగంటలు తరవాత తలకు పెట్టుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
  • ========================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

కళ్ల కింద చారలు కట్టడి ఎలా?,Black color under eyes-prevention

Q : నా వయసు ముప్ఫైనాలుగు. కళ్లకింద చారలు వచ్చేశాయి. దాంతో వయసులో మరీ పెద్దదానిలా కనిపిస్తున్నాను. వాటిని తగ్గించుకునే మార్గాలేమైనా ఉన్నాయంటారా?

A : కళ్లకింద నల్లటి చారలు రావడానికి నిద్రలేమి, అదేపనిగా టీవీ కంప్యూటరు ముందు కూర్చోవడం.. అధిక ఒత్తిడి, ఎప్పుడూ దిగులుగా ఉండటం.. ముఖ్యంగా ఆహారంలో ఇనుము పోషకం లోపించడం... వంశ పారంపర్యము ...వంటివి ప్రధాన కారణాలు. రక్తంలో హీమోగ్లోబిన్‌ శాతాన్నీ గమనించుకోండి. ప్రతిరోజు కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోయేలా చూసుకోవాలి. అలాగే బంగాళాదుంప తురుమును కళ్లపై పెట్టుకుని ఐదునిమిషాలయ్యాక తీసేయాలి. ఇలా పదిహేను రోజుల పాటు చేసి చూడండి. కాచిన పాలను ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా అయ్యాక దూదిని ముంచి కళ్లపై పెట్టుకుని పదినిమిషాలు విశ్రాంతి తీసుకోండి.

రోజుమార్చి రోజు కాచిన పాల మీగడతోగాని.. విటమిన్‌ ఈ క్రీంతోగానీ రెండు నిమిషాలు మర్దన చేసి పదినిమిషాలయ్యాక కడిగేయండి. కళ్లు మిలమిలలాడతాయి. వీటివల్ల ఎంతో మార్పు ఉంటుంది. మీరు తీసుకునే ఆహారంలో.. రోజూ నాలుగు నుంచి ఆరు ఖర్జూరాలు, పది ఎండుద్రాక్ష, ఒక టమాటా తప్పనిసరిగా ఉండాలి. వారానికి ఐదురోజులు ఆకుకూరలు తినండి. అది కుదరనప్పుడు ప్రతిరోజూ ఒకటిన్నర చెంచా వీట్‌గ్రాస్‌ పొడిని తీసుకోండి. మాంసాహారులైతే... వారానికోసారి కాలేయం కూరను తినండి. ఎంతో మార్పు ఉంటుంది.


for more details - click here -- black color under eyes
  • ==================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

పరీక్ష హాలులోకి వెళ్లినప్పుడు ఏమీ గుర్తుకు రాదు , Can not remember in exam hall




ప్ర : మా బాబు బాగా కష్టపడి చదువుతాడు. కానీ పరీక్ష హాలులోకి వెళ్లినప్పుడు ఏమీ గుర్తుకు రాదు. టెన్షన్‌పడతాడు. ఎందుకిలా అవుతాడో అర్థం కాదు. సమస్యకు పరిష్కారం చెప్పగలరు ?


జ : టెన్షన్‌ అన్నది పిల్లలో ఉండే తత్వం. ఇది ఇంట్లో పెంపకాన్ని బట్టి ఉంటుంది. చిన్నప్పుడు ముందు జాగ్రత్తలు ఎక్కువచెప్పడం దీనికి ఒక కారణం. భయం వల్ల టెన్షన్‌ పెరుగుతుంది. ఐదేళ్ల తర్వాత యాంగ్జైటీ మొదలవుతుంది. రోజూ ప్రణాళికా బద్దంగా చదవడం అలవాటు చేసుకోవాలి. పరీక్షలకు రెండు నెలల ముందు సిలబస్‌ను పూర్తి చేసుకుని, పునరుచ్ఛరణ చేసుకోవాలి. పరీక్షలకు పది రోజుల రోజూ పది నిమిషాలు హాలులో ఎలా పరీక్ష రాస్తామో ఊహించుకోవాలి. దీని వల్ల పరీక్ష హాలులోకి వెళ్లినప్పుడు టెన్షన్‌ తగ్గుతుంది.
  • -----------------------------------------------------------------------------
Source : రక్ష డెస్క్ Mon, 15 Aug 2011.....డాక్టర్‌ కళ్యాణ చక్రవర్తి--మానసిక వైద్యనిపుణులు--రేయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌--బంజారాహిల్స్‌, హైదరాబాద్‌.



  • ======================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

సామాజిక ఎదుగుదల , Social maturity




ప్ర : మా అమ్మాయి బి.ఫార్మసీ చదువుతోంది. వయసు 20 ఏళ్లు. ఆమెకు ఆడవాళ్ల కన్నా పురుషులతోనే ఎక్కువ స్నేహం చేస్తుంది. వాళ్లతో క్లోజ్‌గా ఉంటోంది. దీన్ని వారు అపార్దం ప్రేమగా భావిస్తున్నారు. చివరికి మనస్పర్దలు వస్తున్నాయి. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి?



జ : ఈ అమ్మాయికి సోషల్‌ మెచ్యురిటీ.. సామాజిక ఎదుగుదల తక్కువుందని అర్థమవుతోంది. అంటే మాట్లాడే విధానం, ప్రవర్తనలో తేడాలుంటాయి. వీరికి సమాజం గురించి అవగాహన కలిగించాలి. ఏ సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలనే విషయాలు నేర్పించాలి. చిన్నప్పటి నుంచి సమాజం పట్ల అవగాహన తల్లిదండ్రులు కలిగించలేదు. ఆమె ప్రవర్తన, మాటతీరును గమనించి సలహాలు, సూచనలు ఇవ్వలేదు. అందుకే ఈ సమస్య. పెంపకంలో లోపాలు, మానసిక ఎదుగుదల లేకపోవడం ఈ సమస్యకు కారణం. సినిమాలు, వినోదం కాలేజి అమ్మాయిలో ఎక్కువుంటుంది. ఇందులోనే ప్రపంచం ఉందనే ప్రభమలో ఉంటారు. ఒకరికి ఎక్కువ మంది బారుఫ్రెండ్స్‌ ఉంటే తమకు కూడా అలాగే ఉండాలని భావిస్తారు. కౌన్సిలింగ్‌ వల్ల వీరిని మంచి ఫలితం ఉంటుంది.

Source : రక్ష డెస్క్ Mon, 15 Aug 2011.
  • ==================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

ఒక చోట కుదురుగా ఉండదు,can not stay at one place





ప్ర : మా పాప వయసు ఏడేళ్లు. క్లాసులో ఒక చోట కుదుటగా ఉండదు. తరచూ అటూ ఇటూ తిరుగుతుంటుంది. ఎంతసే పైనా చదువుతుంది. కాని రాయడమే సమస్యగా మారింది. మిగతా అన్ని విషయాల్లో తెలివితేటలు బాగానే ఉన్నాయి. ఏమిటీ సమస్య? చికిత్స ఉందా? తెలపగలరు.



జ : ఇలాంటి సమస్యను అటెన్షన్‌ డెఫిసిట్‌ డిసార్డర్‌ (ఎడిహెచ్‌డి) అంటారు. వీరికి తెలివితేటల్లో సమస్య ఉండదు. ఒకే విషయంపై ఎక్కువసేపు దృష్టిసారించలేరు. ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందనేది విశ్లేషించాలి. సమస్య నుండి బయటపడడానికి కొన్ని టెక్నిక్‌లు ఉన్నాయి. కంటిన్యుగా చదివించకుండా మధ్యలో కాస్త విరామం ఇవ్వాలి. ఒక సారి చదివిన తర్వాత దాన్ని రెండుసార్లు రాయించాలి. వీరు ఏడ్చి బయటికి వెళ్లి చదువు నుంచి తప్పించుకుంటారు. అందుకని కాస్త కఠినంగా ఉండాలి. వీరు పొగడ్తలకు బాగా రెక్టిఫై అవుతారు.

source : రక్ష డెస్క్ Mon, 15 Aug 2011.
=============================
visit my website - > Dr.Seshagirirao-MBBS

Wednesday, August 24, 2011

ఎపెండమోమా గ్రేడ్‌-2,Ependimoma-2




ప్ర : మా బాబు వయసు 16 సంవత్సరాలు. పది నెలల క్రితం తలనొప్పి వచ్చింది. కంటి డాక్టర్‌కు చూపించాం. మందులు వాడితే తగ్గింది. పది నెల తరువాత మళ్లీ వచ్చింది. రెండు సార్లు మెదడు ఆపరేషన్‌ చేశారు. ఎపెండమోమా గ్రేడ్‌-2 అని చెప్పారు. ఆరు వారాలు రేడియేషన్‌ చేయించాను. రేడియేషన్‌ వల్ల రోజు రోజుక బలహానంగా తయారవుతున్నాడు. సరిగా నడవడం రావడం లేదు. తూలుతూ నడుస్తున్నాడు. అన్నం కూడా తక్కువ తింటున్నాడు. డాక్టర్లు మాత్రం ఏం చెప్పడం లేదు. ఎపెండమోమా గ్రేడ్‌-2 అనేది జబ్బు పేరా? దీనికి ఎపిడమిక్‌ బ్రేయిన్‌ అటాక్‌కు సంబంధం ఉందా? చికిత్స ఉందా? సలహా ఇవ్వగలరు.



జ : పెండమోమా గ్రేడ్‌-2 అంటే లోగ్రేడ్‌ క్యాన్సర్‌. దీని చికిత్సలో రేడియేషన్‌, కీమోథెరపీ పద్ధతులను ఉపయోగిస్తారు. కరెంట్‌ ప్రసారం చేసినప్పుడు మెదడులో వాపు వల్ల రియాక్షన్‌ జరుగుతుంది. దీని వల్ల నీరసం, బలహీనంగా అవ్వడం, తలతిరగడం వంటివి జరుగుతాయి. ఇలా కొన్ని నెలల తరువాత సాధారణ పరిస్థితి నెలకొంటుంది. డాక్టర్‌ సలహా ప్రకారం ఆహారం తీసుకోవాలి.

  • ====================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

Back ach after siting longtime,ఎక్కువ సేపు కూర్చొని పనిచేయడం వల్ల నడుము నొప్పి

ప్ర : నా వయస్సు 50 సంవత్సరాలు. టేబుల్‌ వద్ద కూర్చునే ఉద్యోగం చేస్తున్నాను. రెండేళ్ల నుంచి విపరీతమైన నడుం నొప్పితో బాధపడుతున్నాను. ఎంతో మంది ఆర్థోపిడీషియన్లు, న్యూరాలజిస్టులను కలిశాను. ఎంఆర్‌ఐ కూడా చేయించుకున్నాను. అందరూ విశ్రాంతి తీసుకుంటే తగ్గుతుందని సలహా ఇచ్చారు. పెయిన్‌ కిల్లర్స్‌ వాడాలని చెప్పారు. కాని శాశ్వతంగా తగ్గే మార్గం చెప్పలేదు. అప్పుడప్పుడు మెడనొప్పి కూడా వస్తోంది. కాళ్లు తిమ్మిరెక్కడం, మొద్దుబారడం, విపరీతమైన నొప్పులతో ఎక్కువసేపు కూర్చోలేకపోవడం, నిలబడలేకపోవడం, ఒక పక్క పడుకోలేకపోవడం వంటి సమస్యలున్నాయి. ఫిజియోథెరపీ కూడా చేయించుకున్నా. నా సమస్యకు శాశ్వత పరిష్కారం తెలుపగలరు.



జ : ఎక్కువ సేపు కూర్చొని పనిచేయడం వల్ల నడుం నొప్పి, మెడనొప్పి రావడం సాధారణం. ఎంఆర్‌ఐ రిపోర్టును బట్టి చికిత్స చేయవచ్చు. కానీ మీరు ఎంఆర్‌ఐ రిపోర్టులో ఏం రాశారో తెలుపలేదు. నడుం నొప్పికి ప్రధాన కారణం సరిగా కూర్చోకపోవడమే. కూర్చునే విధానం తెలియాలి. గంటల కొద్దీ కూర్చోకుండా గంటకోసారి రిలాక్స్‌ కావాలి. డెస్కు పనిచేసేవాళ్లు నడుం ఎక్సర్‌సైజులు రెగ్యులర్‌గా చేయాలి. సరిగా కూర్చోవడం, నడవడం, నిల్చోవడం, బరువులెత్తడం అలవాటు చేసుకుంటే 90 శాతం నడుం నొప్పిని దూరంగా ఉంచవచ్చు. మీకు డిస్క్‌ జారడం వల్ల నడుం నొప్పి వచ్చిందని అనుమానం. దీని వల్లే కాళ్లలో తిమ్మిర్లు వస్తాయి. మీరు దగ్గర్లోని స్పైన్‌ లేదా ఆర్థోపెడిక్‌ సర్జన్‌ను కలవండి.

Source : రక్ష డెస్క్ Mon, 15 Aug 2011.
  • ===========================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

Fits , మూర్చ



ప్ర : నాకు 15 ఏళ్ల నుంచి ఫిట్స్‌ వస్తున్నాయి. మందులు వాడినా తగ్గలేదు. మెదడు సిటి-స్కాన్‌ చేశారు. నార్మల్‌ అని తేలింది. డాక్టర్‌ సూచన ప్రకారం మూడేళ్లు మందులు వాడాను. ఇదే కాక ఆయూర్వేదం, హోమియో మందుల కూడా వాడినా ప్రయోజనం కనిపించలేదు. ఫిట్స్‌ వస్తూనే ఉన్నాయి. ఈ మందులు వాడటం వల్ల జ్ఞాపక శక్తి తగ్గింది. కొన్ని విషయాలు గుర్తుండడం లేదు. మందులు సరిగా పనిచేయలేదని అనుమానం కలిగింది. ఫిట్స్‌ రావడంతో స్వీట్లు తినడం మానేశాను. ఫిట్స్‌ ఎందుకొస్తాయి? దీనికి ప్రత్యేక చికిత్స ఉందా? మందులతో తగ్గుతుందా?



జ : మెదడులో కరెంట్‌ ఎక్కువ అవడం వల్ల ఫిట్స్‌ వస్తుంటాయి. మెదడులో గడ్డ ఏర్పడడం, మెదడుకు దెబ్బతగలడం వల్ల కూడా కరెంట్‌ పెరుగుతుంది. ఇది ఫిట్స్‌ రూపంలో బయటపడుతుంది. దీన్ని ఇడోపతిక్‌ ఎపిలెప్సీ (అంటే ఏ కారణం లేకుండా వస్తుందని అర్థం) అంటారు. దీన్ని నిర్ధారించడానికి ప్రత్యేకంగా స్కానింగ్‌, ఎంఆర్‌ఐ స్కానింగ్‌, ఇఇజి పరీక్షలు చేయించాలి. వీటి రిపోర్టుల ఆధారంగా మందులు వాడితే తొంబై శాతం వరకు ఫిట్స్‌ను పూర్తిగా తగ్గడానికి అవకాశం ఉంది. వందలో ఐదు శాతం మందికి ఆపరేషన్‌ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అత్యాధునికమైన మందులు, శస్త్రచికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయి. దగ్గర్లోని న్యూరోసర్జన్‌ను కలవండి.

Source : రక్ష డెస్క్ Mon, 15 Aug 2011.
  • ==================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

Sunday, August 21, 2011

న్యూట్రాస్యూటికల్ అంటే ఏమిటో తెలియజేయాలి ? , What is Nutraceutical ?






ప్ర : న్యూట్రాస్యూటికల్ అంటే ఏమిటో తెలియజేయాలి ?

రామారావు ధర్మాన - విశాఖ కోలనీ , శ్రీకాకుళం టౌన్‌.

జ : వ్యాధి నివారణ మరియు చికిత్సతోపాటు, ఆరోగ్య మరియు వైద్యపరమైన ప్రయోజనాలు అందించే ఒక ఆహారం లేదా ఆహార ఉత్పత్తిని న్యూట్రాస్యూటికల్ (పోషక ఔషధం) అంటారు, దీనిలో "న్యూట్రిషన్" (పోషణ) మరియు "ఫార్మాస్యూటికల్" (ఔషధీయ) అనే పదాలు కలిసి ఉన్నాయి. వియుక్త పోషకాలు, పథ్యసంబంధమైన ఔషధాలు మరియు నిర్దిష్టమైన పోషకాహారాల నుంచి జన్యుపరంగా సంవిధానపరిచిన ఆహారాలు, మూలికా ఉత్పత్తులు మరియు తృణధాన్యాలు, పులుసులు మరియు పానీయాలు వంటి ప్రాసెస్ చేసిన ఆహారాల వరకు ఈ న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తులను చూడవచ్చు. కణ-స్థాయి న్యూట్రాస్యూటికల్స్ కారకాల్లో ఇటీవలి సాధనలతో, పరిశోధకులు మరియు వైద్య నిపుణులు పరిపూరక మరియు ప్రత్యామ్నాయ చికిత్సలను బాధ్యతాయుతమైన వైద్య పద్ధతిగా మార్చడం కోసం ఉద్దేశించిన రోగ అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారాన్ని సమగ్రపరచడం మరియు అంచనా వేసేందుకు నమూనాలు అభివృద్ధి చేస్తున్నారు. న్యూజెర్సీలోని క్రాఫోర్డ్‌లో ఉన్న ఫౌండేషన్ ఆఫ్ ఇన్నోవేషన్ మెడిసిన్ (FIM) వ్యవస్థాపకుడు మరియు ఛైర్మన్ డాక్టర్ స్టీఫెన్ L. డిఫెలిస్ మొట్టమొదట న్యూట్రాస్యూటికల్ అనే పదాన్ని నిర్వచించారు. డాక్టర్ డిఫెలిస్ ఈ పదాన్ని వాడుకలోకి తీసుకొచ్చిన తరువాత, దీని యొక్క అర్థంలో హెల్త్ కెనడా మార్పులు చేసింది, ఇది న్యూట్రాస్యూటికల్‌ను: ఆహారాల నుంచి వియుక్తపరిచిన లేదా శుద్ధి చేసిన ఒక ఉత్పత్తిగా నిర్వచిస్తుంది, దీర్ఘకాల వ్యాధి నుంచి రక్షణ కల్పించే లేదా మానసిక ప్రయోజనాన్ని అందించే, ఆహారంతో సంబంధం లేకుండా, సాధారణంగా ఔషధ రూపాల్లో విక్రయించే వాటిని న్యూట్రాస్యూటికల్స్‌గా సూచిస్తుంది. ఉదాహరణలు: బేటా-కారోటిన్, లైకోపిన్ , మెర్రియమ్-వెబ్‌స్టెర్ డిక్షనరీ తాజా సంచికలో న్యూట్రాస్యూటికల్‌కు కొత్త నిర్వచనం కనిపిస్తుంది: ఈ నిర్వచనం న్యూట్రాస్యూటికల్‌ను ఆరోగ్య ప్రయోజనాలు అందించే ఒక ఆహార పదార్థంగా (పోషకశక్తిని వృద్ధి చేసే ఆహారం లేదా ఒక పథ్యసంబంధ ఔషధం) సూచిస్తుంది. ఔషధీయ మందులకు ఉపయోగించే పరీక్షలు మరియు నియంత్రణలను న్యూట్రాస్యూటికల్ ఆహారాలకు ఉపయోగించరు. వినియోగదారు అవగాహనకు, ఉత్పత్తులకు మరియు తయారీదారుల కోసం పరిశ్రమ మరియు శాస్త్రీయ ప్రమాణాలకు అభివృద్ధి చేసేందుకు మరియు ఇతర వినియోగదారు భద్రతలకు సంబంధించిన పాత్రల కోసం ఫుడ్ & డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌తో అమెరికన్ న్యూట్రాస్యూటికల్ అసోసియేషన్ కలిసి పనిచేస్తుంది. ఉత్పత్తులకు సంబంధించి హెచ్చరిక లేఖలు అందుకున్న పథ్యసంబంధ మందుల తయారీ కంపెనీల జాబితాను FDA అందజేస్తుంది.

ఉదాహరణలు :
వైద్య విలువ కలిగిన ఆహార పదార్థాల యొక్క అసంపూర్ణ జాబితా ఇక్కడ ఇవ్వబడింది:

* యాంటీఆక్సిడాంట్‌లు: ఎరుపు ద్రాక్ష (Red grapes)ఉత్పత్తుల నుంచి సేకరించే రెస్వెట్రాల్; నిమ్మ, టీ, వైను మరియు డార్క్ చాకోలేట్ ఆహార పదార్థాల నుంచి ఫ్లావోనోయిడ్‌లు; బెర్రీల్లో సేకరించే ఆంతోసైనిన్‌లు.
* హైపెర్‌కొలెస్టెరోలెమియా తగ్గించడం: సైలియం విత్తనం ఊక వంటి కరిగే డయేటరీ ఫైబర్ ఉత్పత్తులు.
* broccoli--క్యాన్సర్‌ను నివారించడంలో బ్రోకలీ(సల్ఫోరాఫాన్) (ఒకరకమైన ఆకుకూర) సాయపడుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
* ధమని ఆరోగ్యం మెరుగుపరిచే: సోయ్ లేదా క్లోవెర్ (ఐసోఫ్లావోనాయిడ్స్)
* గుండెరక్తనాళాల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడం: ఫ్లాక్స్ లేదా చియా విత్తనాల నుంచి సేకరించే ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్

అంతేకాకుండా, జిన్సెంగ్(Ginseng), వెల్లుల్లి (Garlic)చమురు తదితరాల వంటి అనేక వృక్షసంబంధ మరియు మూలికా సేకరణలు న్యూట్రాస్యూటికల్స్‌గా అభివృద్ధి చేయబడ్డాయి. ఆహారం మరియు ఔషధ తయారీ పరిశ్రమల్లో పోషక మిశ్రమాలు లేదా పోషక వ్యవస్థల్లో న్యూట్రాస్యూటికల్స్‌ను తరచుగా ఉపయోగిస్తున్నారు.

  • ===================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

ఎత్తు పెరగడానికి , To increase height



ప్ర : నా వయసు 18 సంవత్సరాలు . 5' (ఐదు అడుగులు) ఎత్తు , 43 కేజీల బరువు ఉన్నాను . మానాన్న ఎత్తుగా 5'6'' , అమ్మ 5'2'' ఉన్నారు . ఎత్తు పెరగడానికి ఆహారము , సూచన్లు ఇవ్వండి ?

మాతల - శ్రీకాకుళం జుల్లా.

జ : మీ తల్లీదండృలిద్దరూ సగటు (సాధారణ) ఎత్తు కంటే ఎత్తుగానే ఉన్నారు . కాబట్టి మంచి ఎత్తుకు సంబంధించిన జీన్స్ మీకు ఉన్నాయి . మీకు సమతుల్యమైన ఆహారము , వ్యాయామము , మంచి నిద్ర అవసరము . సాదారణముగా 21 సంవత్సరాలవరకూ ఎత్తు పెరిగే అవకాశము ఉన్నది . ఎత్తు పెరగడానికి మీకింకా మూడేళ్ళు మిగిలి ఉన్నాయి. మామూలుగా 13-15 సంవత్సరాల వయసులో ఎత్తు ప్రక్రియ శీఘ్రగతిన ఉంటుంది . తరువాత నెమ్మదిగా పెరుగుతుంది . ఎత్తు పెరగడానికి మందులు , హార్మోనులు వాడవచ్చును కాని సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి.

కొన్నిరకాల ప్రత్యేకమైన వ్యాయామాలు , సరియైన అహారము - కాల్సియం , మిటమిన్‌ "డి" , గ్లూకోజమైన్‌ , మల్టీ విటమిన్లు తీసుకుంటుండాలి . ఫులఫ్స్ , స్పిన్‌ , నీస్ , తాయ్ చి ... వంటి వ్యాయామాలు చేయండి . మంచి ఫలితాలు ఉంటాయి . రోజూకో అరగంట వ్యాయామము చేస్తూ ఉండాలి . రోజుకు 8-9 గంటల నిద్ర అవసరము .

  • ==================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

Saturday, August 6, 2011

జామ తింటే జలుబు చేస్తుందా?,Eating Gauva fruit produce cold?




ప్ర : జామపండ్లు బాగా లభించే కాలమిది. మా పిల్లలకు ఈ పండ్లంటే చాలా ఇష్టం. కానీ అవి తింటే జలుబు చేస్తుందని తీసుకోనివ్వట్లేదు. ఇందులో వాస్తవముందా?

జ : జామపండు తింటే జలుబు చేస్తుందనడంలో వాస్తవం లేదు. ఎవరైనా తినొచ్చు. అయితే జలుబు కొద్దిగా ఉన్నప్పుడు తీసుకుంటే అది ఇంకా తీవ్రమవుతుంది. ఒక్కోసారి అలర్జీతో బాధపడే వారికి జామపంటకు వాడే మందుల వల్ల త్వరగా జలుబు చేసే అవకాశం ఉంటుంది. వాస్తవానికి ఈ పండులో పోషకాలు అమోఘం. విటమిన్‌ 'సి- 212 గ్రా, ఇనుము- 0.27మి.గ్రా, కెరోటిన్లు- 510మి.గ్రా, శక్తి- 51కి.కెలొరీ, తేమ- 81.7 గ్రా, కొవ్వు- 0.3గ్రా, పీచు- 5.2మి.గ్రా;.

* బాగా పండిన పండులోని పీచు పదార్థం మలబద్ధకం తగ్గిస్తుంది. దోరగా ఉన్నవి ఆరోగ్యానికి మేలు. వీటిలోని ఖనిజాలు, విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఎముక పుష్ఠికీ తోడ్పడతాయి.

* గర్భిణికి వచ్చే సహజ మల బద్ధకానికి ఇది ఔషధం. కడుపులోని ఎంజైములను చురుగ్గా చేసే శక్తి వీటి సొంతం. కాబట్టి చంటిపిల్లలకు గింజలను వడకట్టి ముద్దగా చేసి ఇస్తే విరేచనం సాఫీగా అవుతుంది.

* చక్కెర, కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు, రోజుకి ఒకటి నుంచి రెండు పండ్లు తింటే మంచి ఫలితం ఉంటుంది.
  • =================================================
visit my website - > Dr.Seshagirirao-MBBS