Monday, February 25, 2013

నీరసం వస్తుంది కారణం ఏమిటి? నివారణమార్గాలు తెలియజేయండి, What is the cause for Feeling weakness ?




ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము . 



ప్ర : కాసేపు ఇంటి పని చేసే సరికి ఎక్కడలేని నీరసం వస్తుంది కారణం ఏమిటి? నివారణమార్గాలు తెలియజేయండి.

 ఓ గృహిణి సమస్య.

జవాబు : ఏ జబ్బూ లేనప్పుడు ... రక్తహీనత వల్ల తలెత్తిన సమస్యా అన్నది పరిశీలించుకోవాలి. మనదేశంలో ఆడపిల్లలూ, మహిళల్లో ఇది ప్రధాన సమస్యనీ, అవగాహనతో దీనిని అధిగమించవచ్చును.  ఇది వ్యాధి కాదు...ముఖం పాలిపోయినా, తరచూ నీరసంతో కూలబడుతున్నా 'ఒంట్లో శక్తి లేదు, రక్తం లేదు' అనుకోవడం మామూలే! ఒంట్లో తగినంత రక్తం లేకపోవడమే రక్తహీనత అని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతం తగ్గడం లేదా ఎర్ర రక్త కణాలు తక్కువగా ఉండటాన్ని రక్తహీనతగా పరిగణించొచ్చు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ లెక్కల ప్రకారం రక్తంలో హిమోగ్లోబిన్‌ 12.5 గ్రామ్స్‌/డి.ఎల్‌ ఉండాలి. అది తగ్గుతోంది అంటే రక్తహీనత ఏర్పడుతోందని అర్థం. ఇది ఎలా ఏర్పడుతుంది? ప్రశ్న చిన్నదే. కానీ కారణాలు చాలానే ఉన్నాయి. కొన్నిసార్లు ఇది పుట్టుకతోనే వచ్చే అవకాశముంది. అవే థలసీమియా, సికిల్‌సెల్‌. అయితే మహిళల్ని ప్రధానంగా వేధించేది అంటే ఇనుము లోపం కారణంగా ఏర్పడే ఎనీమియానే. ఆహారంలో ఇనుమూ, ఇతరత్రా విటమిన్లు లోపించడం వల్ల ఈ రకమైన రక్తహీనత బారిన పడతారు. ఎనీమియా అనేది వ్యాధి కాదు. అదొక ఆరోగ్య పరిస్థితి మాత్రమే. మందులు వాడటం కన్నా చక్కటి ఆహార నియమాలు పాటించడంపైన శ్రద్ధ పెడితే సరిపోతుంది.

గర్భిణులు లలో పుట్టే బిడ్డపైనా ప్రభావం

రక్తహీనత వ్యాధి కాదు. కానీ చెప్పులోని రాయిలా చికాకు పెడుతుంది. తరచూ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు గురిచేస్తుంది. రక్తహీనత ఉన్నప్పుడు తరచూ బాగా నీరసంగా అనిపిస్తుంది. ముఖం పాలిపోతుంది. కళ్లు తిరగడం, చేతులూ కాళ్ల వేళ్లు మొద్డుబారడం, పని చేస్తున్నప్పుడు త్వరగా ఆయాసపడిపోతారు. రక్తహీనత మానసికంగానూ ఇబ్బందులకు గురిచేస్తుంది. ఏకాగ్రత కుదరకపోవడం, చిన్న విషయాలకే ఒత్తిడీ, గందరగోళానికి గురవడం
జరుగుతుంది. బి12 లోపం కారణంగా రక్తహీనత ఏర్పడితే మలబద్ధకం, ఆకలి దగించడం, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

గర్భిణులు రక్తహీనత బారిన పడకుండా చూసుకోవడం చాలా అవసరం. లేదంటే సాధారణ ప్రసవం కాకుండా శస్త్ర చికిత్సకు దారితీసే అవకాశాలు పెరుగుతాయి. పోషకాహారం లోపం, ఎనిమిక్‌గా ఉండటం వల్ల ప్రసవ సమయంలో రక్తస్రావం ఎక్కువ అవడానికీ ఆస్కారముంది. పుట్టే పిల్లలూ త్వరగా ఇన్‌ఫెక్షన్లకు గురవుతారు. దీనివల్ల వాళ్లు ఎదిగే క్రమంలో వివిధ ఆరోగ్య సమస్యలతో సతమతమవుతారు.

సమస్య ఒక్కటే... కారణాలెన్నో!---

మనదేశంలో చిన్నారులూ, మహిళల్లో రక్తహీనత సమస్య చాలా ఎక్కువ. మూడు నుంచి ఆరేళ్ల వయసున్న పిల్లల్లో 79 శాతం, పెళ్త్లె పదహారు నుంచి యాభై ఏళ్ల మధ్య వయస్కుల్లో 60 శాతం దీనితో బాధపడుతున్నారు. గర్భిణుల్లో 70 శాతం దీనివల్ల ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఎందుకీ పరిస్థితి అంటే, పనుల్లో పడి వేళకు తినకపోవడం, తిన్నా శరీరావసరాలకు తగిన పోషకాహారం తీసుకోకపోవడాన్ని ప్రధానంగా చెప్పుకోవాలి.

నెలసరులప్పుడు జరిగే అధిక రక్తస్రావమూ ఇందుకు కారణమే. ఎక్కువ మంది సంతానం, మాంసాహారం తినకపోవడం, కాఫీ, టీలు ఎక్కువగా తాగడం వంటివీ రక్తహీనతకు దోహదం చేస్తాయి. 'మూడు పూటలా భోంచేస్తున్నాం, ఏవో ఒక స్నాక్స్‌ తింటూనే ఉన్నాం' నుకుంటూ వూర్కుంటే ఈ సమస్య రాకుండా మానదు. తినాల్సినవి ఎక్కువగా తినాలి. తినకూడనివి మానేయాలి. అప్పుడే దాన్ని ఆమడదూరంలో ఉంచగలం. ఐరన్‌ పోషకాలు ఎక్కువగా ఉండే ఆకుకూరలూ, కాయగూరలూ బాగా తినాలి. ఉప్పూ, కారం ఎక్కువగా ఉండే జంక్‌ఫుడ్‌ తగ్గించాలి. చాలామంది గర్భిణులు కూరలు సహించడం లేదని, పచ్చళ్లు తింటుంటారు. దానివల్ల రక్తహీనత ఏర్పడే అవకాశముంది.

రక్తహీనతను తగ్గించే ఆహారం ---
ఈ మూడూ ముఖ్యం: రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతం పెరిగి, రక్తహీనత రాకుండా ఉండాలంటే తినే ఆహారంలో ఇనుము, బి12, ఫొలేట్‌ పోషకాలు ఉండేట్టుచూసుకోవాలి. తినే ఆహారం నుంచి ఇనుముని సంపూర్ణంగా పొందాలంటే, ఆ పదార్థాలతో పాటూ విటమిన్‌ 'సి'ని కూడా తీసుకోవాలి. ఆకుకూరలూ... ఉసిరి: చికెన్‌ వండుకున్నా, సలాడ్‌ తినాలనుకున్నా వాటిపై నిమ్మ రసం చల్లుకుంటే మంచిది. విటమిన్‌ 'సి' అందించే టొమాటో, నిమ్మ, నారింజ రసాలు ఎక్కువగా తాగాలి. తక్కిన వాటితో పోలిస్తే ఉసిరిలో విటమిన్‌ 'సి' పోషకాలు అధికం. రక్తహీనతతో బాధపడే వారు ఉసిరితో చేసిన పదార్థాలను ఎక్కువగా తినాలి. ఆమ్లా మురబ్బా తింటే ఇంకా మంచిది. అంజీర్‌, మునగాకూ, తోటకూర, పుదీనా, కొత్తిమీర, మొలకలూ బాగా తినాలి.

బి12 లోపిస్తే: ఆహార నియమాలు పాటిస్తూ, పోషకాహారం తింటున్నా కొంతమంది రక్తహీనతకు గురవుతారు. అందుకూ కారణముంది! కాయగూరలు తింటూ, మాంసాహారం అస్సలు తినని వాళ్లు బి12 వల్ల ఎనీమియాకు లోనయినప్పుడు ఈ పరిస్థితి తలెత్తుతుంది. కాయగూరలు బి12ని అస్సలు  అందివ్వకపోవడమే సమస్యకు కారణం. ఇటువంటి వారు, ముఖ్యంగా గర్భిణులు వైద్యుల సలహా మేరకు మాత్రలు తీసుకోవచ్చు. లివర్‌, చేపలూ, గుడ్లూ ఇనుముని పుష్కలంగా అందిస్తాయి.

మాంసకృత్తులు అందేలా: భోజనానికి ముందూ, తరవాత టీ, కాఫీలు తాగకూడదు. వాటిలోని టానిన్లు ఐరన్‌ పోషకాలను శరీరానికి చేరకుండా  అడ్డుకొంటాయి. కొన్నిసార్లు టాబ్లెట్లు వేసుకున్నా ఫలితం కనిపించదు. అలాంటప్పుడు తినే ఆహారంలో పనీర్‌, చీజ్‌, మటన్‌, చికెన్‌, ఫిష్‌, మిల్‌మేకర్‌ వంటి మాంసకృత్తులు అందేలా చూసుకోవాలి. విటమిన్‌ బి6 శరీరంలో జరిగే ఎంజైమ్‌ల చర్యలకు మంచిది. ఈ విటమిన్‌ లోపించిప్పుడు కూడా ఎనీమియా ఏర్పడుతుంది. గర్భిణుల్లో ఏర్పడే ఎనీమియాకి ఐరన్‌ టాబ్లెట్లతో పాటూ బి6ని ఇవ్వడం వల్ల అధిక ప్రయోజనాలు ఉంటాయని తాజా అధ్యయనాలు  చెబుతున్నాయి. విటమిన్‌ బి6 పొందాలంటే ఆహారంలో కాబూలీ సెనగలూ, బంగాళాదుంపలూ, దంపుడుబియ్యం ఉండాలి. పాలూ, పెరుగుతో పాటూ పెసలూ, అలసందలూ బాగా తినాలి. పదార్థాలని ఇనుప మూకిట్లో వండుకొంటే మంచిది.


  • =========================== 

visit my website - > Dr.Seshagirirao-MBBS - 

Sunday, February 3, 2013

How to prevent backbone pain in Long drive?, ఎప్పుడు లాంగ్ డ్రైవ్ చేసినా వెన్నునొప్పి వస్తుంది . ఏం చేఅయాలి ?

  •  
  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : ఎప్పుడు లాంగ్ డ్రైవ్ చేసినా వెన్నునొప్పి వస్తుంది . ఏం చేఅయాలి ?

జ : రోడ్ పై మలుపు తిప్పాల్సినప్పు్డల్లా వెన్నెముక  కర్వ్  పై దృష్టి నిలపండి . నిలబడినపుడు లోయర్  బ్యాక్  సహజమైన ఒంపు కలిగిఉంటుంది . కూర్చున్నపుడు  దాన్ని మెయిన్‌టెయిన్‌ చేయాల్సిఉంటుంది .  సమస్యల్లా చాలాభాగం ఆటోమొబైల్స్ సీట్లు స్వల్పకాలిక సౌకర్యం తో అమర్చుతారే తప్ప దీర్ఘకాలిక సపోర్ట్ ను దృష్టిలో ఉంచుకోరు. ప్లష్ సీట్  వెన్నెముక  స్లంప్ కు కారణమై , అది డిస్కులపై ఒత్తిడి పెడుతుంది . సీటు సరిగా ఎడ్జెస్ట్ చేసుకోండి .

ఇడియల్  పొజిషన్‌ అనేది అందరికీ ఒకే మాదిరి ఉండదు . వ్యక్తికీ వ్యక్తికీ మారుతుంది . యాంగిల్ సరిగా కుదుర్చుకొని  రిలాక్సింగ్ గా కూర్చోండి . మధ్య మధ్యలో ఆగి స్ట్రెచ్ చేస్తుండండి . రెండు చేతులూ పైకెత్తి సుదీర్ఘంగా  గాలిపీల్చి వదులుతుండాలి . ప్రతి బ్రేక్ లో  ఇలా మూడు నుంచి ఐదు సార్లు చేయండి . సీట్ కు  బిల్ట్-ఇన్‌  లుంబార్(Lumbar) ఎడ్జెస్ట్ మెంట్  ఉంటే అనువుగా సెట్ చేసుకోండి .
  • ===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

Alzimers disease, forgetfulness, తరచుగా విషయాలు మర్చిపోతున్నాను కారణము ఏమైఉంటుంది?,అల్నీమర్ వ్యాది



ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : తరచుగా విషయాలు మర్చిపోతున్నాను . మాటల్లో ఒక్కోసారి పదాలు కుడా గుర్తుకు రావడము లేదు . కారణము ఏమైఉంటుంది?, ఇది అల్జీమర్స్ తొలిదశ అనుకోవాలా?.

జ : ఇలా జ్ఞాపకశక్తి పోవడానికి ఎన్నో కారణాలుంటాయి.
  • ఒత్తిడి , 
  • డిప్రెషన్‌ , 
  • యాంగ్జైటీ , 
  • పోషకాహారలోపాలు , 
  • స్ట్రోక్ , 
  • ఎక్కువ ఆల్కహాల్ అలవాటు , 
  • అల్నీమర్ వ్యాది , 
  • డిమెన్సియా ,   లాంటి ఎన్నో కారణాలు . జ్ఞాపకశక్తి పోవడానికి దారితీస్తాయి. 
అల్జీమర్ వ్యాధి ఒక రకం దెమిన్షియా లాంటిది . తొలిదశలో జ్ఞాపకశక్తి తగ్గడము ... లేదా ఏకాగ్రత లోపించడం వంటి ఇతర కారణాల మాదిరే కనిపిస్తాయి  . ఒక సారి మంచి వైద్యుని కవండి . తగిన పరిష్కారము సూచిస్తారు. 
వయసు తో వచ్చే వ్యాధుల్లో " అల్జీమర్స్ " ఒకటి . ఇది మెదడుకు సంబంధినది . మెదడు కణాలలో ఏర్పడిన లోపం జ్ఞాపకశక్తిని హరిస్తుంది. గతములో చూసినది ... అవసరము అనుకున్నప్పుడు గుర్తుకురాదు.

మనుషులనైనా ,వస్తువులనైనా జ్ఞాపకము పెట్టుకోవడములో ఇబ్బంది ఉంటుంది. అల్జీమర్స్ రాకుండా ఉండాలంటే పండ్లు , పండ్లరసాలు , కాయకూరలు , సూప్ లు ఆహారము లో భాగము గా చేసుకోవాలి. ఇలా పండ్లు , కాయకూరలు తినేవారిలో అల్జీమర్స్ వచ్చే అవకాశము 76%తక్కువగా ఉంటుందని తేలింది.  మెదడు కణాలలో " బీటా ఎమైలాయిడ్ " ప్రోటీన్‌ చేరడము వల్ల అల్జీమర్స్ వస్తుంది. అలా చేరే ప్రోటీన్‌ ని నిరోధించే శక్తి కలగిన పాలీఫీనాల్ రసాయనాలు పండ్ల రసాలలో ఉంటాయి.

చికిత్స :

వృద్ధాప్యంలో తీవ్ర మతిమరుపును, తికమకను తెచ్చిపెట్టే అల్జీమర్స్‌ రోజువారీ పనులను బాగా దెబ్బతీస్తుంది. ముందు నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని నివారించుకునే వీలుంది.

    * ఒమేగా-3, ఒమేగా-6, విటమిన్‌ ఈ, బీ12 దండిగా లభించే అవిసెలు, అక్రోటుపప్పు, పిస్తా, బాదం, జీడిపప్పు, పెరుగు, పాలు, మాంసం, చేపల వంటివి తరచుగా తీసుకోవాలి.
    * వ్యాయామం వల్ల అల్జీమర్స్‌ ముప్పూ తగ్గుతుంది. మెదడుకు రక్తసరఫరా బాగా జరుగుతుంది. దీంతో కొత్త మెదడు కణాలు అభివృద్ధి చెందే ప్రక్రియ కూడా ప్రేరేపితమవుతుంది.
    * మెదడుకు మేత పెట్టే చిక్కు సమస్యలను పరిష్కరించటం, పదకేళీలు పూరించటం, చదరంగం ఆడటం వంటివి చేయాలి. మెదడులోని కణాలు చురుకుగా ఉండేలా చేస్తున్నకొద్దీ ఆరోగ్యకరమైన కణాలు సజీవంగా ఉంటాయి. రోజూ ధ్యానం మెదడు ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
    * వారానికి కనీసం మూడు సార్లయినా తాజా పండ్లు తినాలి. వీటిల్లోని ఫాలీఫెనాల్స్‌కు అల్జీమర్స్‌ను నివారించే సామర్థ్యముంది.
    * తగినంత నిద్రపోవాలి. ఇది మెదడును తాజాగా ఉంచుతుంది. శరీరానికి, మనసుకు విశ్రాంతి కలిగిస్తుంది. వయసు మీద పడకుండా చేసే హార్మోన్లను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్లు మెదడునూ చురుకుగా ఉంచుతాయి.
    * మద్యం, పొగ అలవాట్లకు దూరంగా ఉండాలి.

  • =========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

What is the cause for Heel pain?,మడమనొప్పికి కారణము ఏమిటి?

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : నాకు కొన్నిసార్లు వ్యాయామము చేస్తున్నప్పుడు మడమనొప్పి వస్తుంది . దాని కదేవచ్చి పోతుంది . వాపులాంటిదేమీ ఉండదు . నొప్పికి కారణము ఏమిటి?

జ : జవాబు కొరకు వైద్యరత్నాకరం లో చూడండి - మడమ నొప్పి
  • ===========================
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Friday, February 1, 2013

What is Carpal tunnel syndrome?, కార్పల్ టనల్ సిండ్రోం అంటే ఏమిటి?

  •  
  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

  What is Carpal tunnel syndrome?, కార్పల్ టనల్ సిండ్రోం అంటే ఏమిటి?

చేతులు, మణికట్టు దగ్గర వచ్చే జబ్బు కార్పల్ టనల్ సిండ్రోం. చేతి వేళ్లు మంటలు, పోటుతో ఉక్కిరిబిక్కిరవుతారు. చేతులు, అరచేతులు మూయలేరు. గుప్పిట విప్పలేరు. రాత్రిపూట బొటనవేలు, మధ్యవేలు, చూపుడు వేలు నొప్పి పెడతాయి. ఈ జబ్బుని సింపుల్‌గా సిటిఎస్(CTS) అని అంటారు. కంప్యూటర్‌పై పని చేసేవారు, కూలీలు, కేషియర్లు ఎక్కువగా ఈ జబ్బుకి గురవుతారు. ఈ రోగానికి ఇంకో పేరుంది ''నెంబర్ వన్ ఆక్యుపేషనల్ హెజార్డ్'' . గర్భవతులు, పిల్లలు పుట్టకుండా ఉండటానికై మందులు వాడే స్ర్తిలు, బహిష్టు ఆగిపోయిన స్ర్తిలు, ఆర్థరైటిస్‌తో బాధపడేవారు, హార్మోన్లు బాగా పెరిగి శరీరం అసామాన్యంగా ఊబకాయంగా మారిన వారు, తెగ కుట్లు, అల్లికలు, చేతి పనులు చేసేవారు, గంటల తరబడి డ్రైవింగ్ చేసేవారు కూడా ఈ జబ్బుకి గురి కావచ్చు.

ఇదేదో భూతం లాంటిదనుకుంటూ సర్జన్‌ దగ్గరకు పేఇగెత్తనక్కలేదు . కంప్యూటర్ కు అనుక్షణం అంటిపెట్టుకోవడాన్ని తగ్గిస్తే చాలు . . లేదా ప్రతి 30 నిముషాలికు కంప్యూటర్ వినియోగాన్నీ 5 నిముషాలు బ్రేక్ తీసుకుంటే సరిపోతుంది ఈ వ్యాధి నివారించడానికి . ప్రతి పనిలోనూ కొంత విరామము తీసుకోవాలి .
  • ========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -