Saturday, January 3, 2015

Pillow dust is cause for Asthma?, తలగడ దుమ్ము వలన ఆస్తమా వస్తుందా?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
  •  
  •  

 ప్ర : తలగడ దుమ్ము వలన ఆస్తమా వస్తుందా?

జ : వస్తుంది. మెత్తటి తలగడ వుంటే సుఖముగా , హాయిగా నిద్ర పడుతుంది. తలగడ లేనిదే సౌకర్యము స్వంతము కాదు . మంచినిద్రకు ఇదెంత అవసరమో ... దానిపట్ల జాగ్రత్తలు తీసుకోవస్లసిన అవసరమూ అంతే ఉంటుంది. 6 నెలలు వాడేశాక తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ... మొటిమలు , ఎలర్జీలకు  సదరు దిండే కారణమవుతుంది . బాగా పాతదిండ్లపై తల  పెట్టి పడుకోవడము వల్ల వాటిలోని దుమ్ము , జిడ్డు , మృతకణాలు వంటివన్నీ వెలికి వచ్చి మొటిమలకు కారణమవుతాయి .

డస్ట్ మైట్స్ కూడా  వీటిలో నివాసము ఏర్పరచుకుంటాయి. వీటివల్ల ఆస్త్మా , ఎలర్జీ , ఇతర రియాక్షన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎలర్జీలల్తో 20 శాతముమంది బాధపడుతున్నారంటే వారిలో మూడింట రెండు వంతులు మందికి బెడ్స్ లోనివసంచు డస్ట్ మైట్సే కారణమవుతుంటాయి. ప్రతి వారము ఎండలో ఆరబెడుతూ ఉండాలి.
  • *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -