Showing posts with label జామ తింటే జలుబు చేస్తుందా?. Show all posts
Showing posts with label జామ తింటే జలుబు చేస్తుందా?. Show all posts

Saturday, August 6, 2011

జామ తింటే జలుబు చేస్తుందా?,Eating Gauva fruit produce cold?




ప్ర : జామపండ్లు బాగా లభించే కాలమిది. మా పిల్లలకు ఈ పండ్లంటే చాలా ఇష్టం. కానీ అవి తింటే జలుబు చేస్తుందని తీసుకోనివ్వట్లేదు. ఇందులో వాస్తవముందా?

జ : జామపండు తింటే జలుబు చేస్తుందనడంలో వాస్తవం లేదు. ఎవరైనా తినొచ్చు. అయితే జలుబు కొద్దిగా ఉన్నప్పుడు తీసుకుంటే అది ఇంకా తీవ్రమవుతుంది. ఒక్కోసారి అలర్జీతో బాధపడే వారికి జామపంటకు వాడే మందుల వల్ల త్వరగా జలుబు చేసే అవకాశం ఉంటుంది. వాస్తవానికి ఈ పండులో పోషకాలు అమోఘం. విటమిన్‌ 'సి- 212 గ్రా, ఇనుము- 0.27మి.గ్రా, కెరోటిన్లు- 510మి.గ్రా, శక్తి- 51కి.కెలొరీ, తేమ- 81.7 గ్రా, కొవ్వు- 0.3గ్రా, పీచు- 5.2మి.గ్రా;.

* బాగా పండిన పండులోని పీచు పదార్థం మలబద్ధకం తగ్గిస్తుంది. దోరగా ఉన్నవి ఆరోగ్యానికి మేలు. వీటిలోని ఖనిజాలు, విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఎముక పుష్ఠికీ తోడ్పడతాయి.

* గర్భిణికి వచ్చే సహజ మల బద్ధకానికి ఇది ఔషధం. కడుపులోని ఎంజైములను చురుగ్గా చేసే శక్తి వీటి సొంతం. కాబట్టి చంటిపిల్లలకు గింజలను వడకట్టి ముద్దగా చేసి ఇస్తే విరేచనం సాఫీగా అవుతుంది.

* చక్కెర, కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు, రోజుకి ఒకటి నుంచి రెండు పండ్లు తింటే మంచి ఫలితం ఉంటుంది.
  • =================================================
visit my website - > Dr.Seshagirirao-MBBS