Saturday, September 12, 2015

చాడీలు చెప్పడం అనారోగ్యమా?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
  •  

  •  
ప్ర : చాడీలు చెప్పడం అనారోగ్యమా?

జ : అవును చాడీలు చెప్పడం ఒక చెడు అలవాటు . దానివలన మానసికము గా ఒత్తిడికి గురు అయ్యే ప్రమాదము ఉన్నది. వయసు ఎంతపెరిగినా మూడోవ్యక్తి గురించి చాడీలు మాట్లాడుకుంటారు. ఇలా చాడీలు చెప్పుకోవడానికి కారణాలు చాలానే ఉంటాయి.

  • కొందరు ఉబుసుపోక చాడీలు చెప్పుకుంటారు.
  • కొందరు అలా చెప్పుకో్వడము లో ఎనలేని ఆనందాన్ని పొందుతారు. 
  • కొందరు అసూయతో చాడీలు చెప్తూ ఉంటారు.  
తమకంటే వాళ్ళు ముందున్నరనో , తమకు ఆ అవకాశము లాలేదనో మూడోవ్యక్తి గురించిన అనవసర సంభాషణకు దిగుతుంటారు. ఇది ఎంతమాత్రము సమంజసము కాదని గ్రహించాలి. అసూయ అనేక అనర్ధాలకు దారితీస్తుంది. ఎదుటి వ్యక్తిని కించపరుస్తూ మాట్లాడడం , అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటూ చాడీలు చెప్పుకుంటూ మాట్లాడడము చేస్తూఉంటారు. అసూయతో లేనిపోని ఒత్తిడికి లోనై  ఆరోగ్యము పాడుచేసుకుంటారు. 


No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.