Sunday, February 19, 2012

నిద్ర పట్టడము లేదు -వైద్యము చెప్పండి .




ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర : నా వయసు 52 సంవత్సరాలు . రాత్రిపూట సరిగా నిద్యపట్టడములేదు . రెండు మూదు సార్లు మెలకువ వస్తుంది. సరియైన చికిత్స చెప్పండి? .(రమణి -కొంక్యాం)

జ : వయసు పెరిగే కొద్దీ నిద్ర కావలసిన సమయము తగ్గుతుంది. . . సరిగా పట్టదు .
ఏ కారణము చేతనైనా నిద్ర పట్టకపోవడం , సరిగా నిద్రపట్టకపోవడం ను నిద్రలేమి అంటాము . దీనివలన ఆరోగ్యము చెడిపోతుంది .
నిర్వచనము : నిద్ర రావడం లేదని చెప్పే వారిలో కనిపించే ప్రధాన సమస్య నిద్రలేమి (ఇన్‌సోమ్నియా). దాదాపు 15 నుంచి 30 శాతం మందిలో ఈ సమస్య ఉంటుంది. 'వారానికి కనీసం మూడు రోజులు, కనీసం ఒక నెలపాటు నిద్రపట్టడానికి ఎక్కువ సమయం తీసుకోవడం, మధ్యలో మెలకువ రావడం, రోజూ నిద్రలేవడానికంటే ముందుగా మెలకువరావడం' జరిగితే వాళ్లు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లు. పడుకున్న తర్వాత 20 నిమిషాల్లో నిద్రపోవడం సాధారణం. కానీ 30 నిమిషాలు గడిచినా నిద్ర రాకుంటే సమస్య ఉన్నట్లు గమనించాలి.
కారణాలు :

* దైనందిన జీవితం లో పని వత్తిడి ,
* మానషిక వత్తిడి ,
* టీవీ చూడడం ,
* కంప్యుటర్ పై పనిచేయడం ,
* కుటుంబ సమస్యలు ,
* ఆర్ధిక సమస్యలు ,
* ఆహార నియమాలు ,
* చెడ్డ అలవాట్లు ,
* కోరికలు తీరకపోవడము వలన నిద్ర పట్టకపోవచ్చును,
* సెక్ష్ కోరికల పాంటసీ లో విహరించే వారికి నిద్ర రాదు . . ,


నిద్రలేమి నుండి బయటపడడానికి కొన్ని చిట్కాలు :

* రాత్రి 9 గంటలు దాటిన తరువాత ఆల్కహాలు తీసుకోడదు . ఆల్కహాలు మధ్యలో నిద్రను చెడగొడుతుంది .
* రాత్రి 7 గంటలు తరువాత తీ , కాఫీ , కెఫీన్ ఉన్న పానీయాలు తీసుకోకూడదు ,
* రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత ఆహారం కూడదు.
* రాత్రులు ఎక్కువగా ఆహారము (full meal) తినకూడదు ,డిన్నర్‌లో తేలిగ్గా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలి.
* పడుకునే ముందు వ్యాయామము చేయకూడదు ,
* పడక గదిని ... పనిచేసే ఆఫీస్ గది గా మార్చకూడదు ,
* పడుకునే ముందు వేడిపాలు తాగితే మంచి నిద్ర వస్తుంది .
* నిద్ర రానపుడు ఏదైనా మంచి పుస్తమును చదవాలి ,
* నిద్రపోయేముందు వేడినీళ్ళ స్నానము చేస్తే మంచి నిద్ర పడుతుంది ,

* సుఖ నిద్ర పోవటానికి ఆహారం, పానీయాలు తోడ్పడతాయి . మంచి ఆహారం, సుఖనిద్ర ఆరోగ్యానికి చాలా అవసరం.

o * శరీరంలో షుగర్‌ సమస్థితిలో ఉండేలా చూసుకోవాలి. బ్లడ్‌షుగర్‌ తక్కువగా ఉన్నట్లయితే నిద్రపట్టదు. కలత నిద్ర కలుగుతుంది.
o * ఆహారం తీసుకున్న వెంటనే మత్తుగా అనిపించి కునుకు పట్టొచ్చు. ఆహారం తీసుకున్న వెంటనే నిద్రపోవటం ఆరోగ్యకరం కాదు కొంతసేపటికి నిద్రా భంగం కలిగి, తర్వాత నిద్ర పట్టకపోవచ్చు. ఆహారం తీసుకున్నాక కొంత సమయం తర్వాతనే పడకచేరాలి.

o * పడక చేరబోయేముందు ఎక్కువ నీరు తాగకూడదు.

o * మూత్ర విసర్జన చేసి పడకచేరాలి.


ట్రీట్మెంట్ :

* అవసరమైతే డాక్టర్ సలహాపై నిద్రమాత్రలు తీసుకోవాలి .

నిద్రలేమి ... కంటికింద నల్లటి వలయాలు -- ముఖసౌన్దర్యం :

నిద్రలేమి, దిగులు, ఆందోళన... ఇలా కారణమేదైనా కావొచ్చు, దీర్ఘకాలంలో అవి కంటికింద నల్లటి వలయాలను ఏర్పరచడం ద్వారా ముఖసౌందర్యం మీద ప్రభావం చూపిస్తాయి. వాటిని తొలగించుకోవడానికి బోలెడన్ని చిట్కాలు ఉన్నాయి. ఉదాహరణకు బంగాళా దుంపలిో చర్మాన్ని తేటపరిచే(స్కిన్‌ లైటెనింగ్‌) తత్వం ఉంది. అది ఈ సమస్యకు చక్కటి విరుగుడు. బంగాళాదుంప రసాన్ని కంటి కింద రాసి పదినిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే నలుపు క్రమంగా విరుగుతుంది. ఇలాంటి సౌందర్య చిట్కాలతోనే కాదు, ఆహారంలో మార్పులతోనూ ఇదే ఫలితాన్ని పొందొచ్చు. ఉదాహరణకు విటమిన్లలో కె విటమిన్‌కు కూడా ఇదే తత్వం(స్కిన్‌ లైటెనింగ్‌) ఉంది. కంటికింద మచ్చలతో బాధపడేవారు సౌందర్య చిట్కాలను పాటించడంతో పాటు కె విటమిన్‌ అధికంగా లభ్యమయ్యే ఆహారం తీసుకుంటే మెరుగైన ఫలితాలు త్వరగా కనిపిస్తాయి. ఇంతకీ కె విటమిన్‌ి పుష్కలంగా దొరికే ఆహారం ఏంటంటారా, ఇదుగో ఆ జాబితా... క్యాలీఫ్లవర్‌, క్యాబేజీ, బ్రాకోలి, క్యారెట్‌, బీన్స్‌, దోసకాయ, సోయాబీన్స్‌, పచ్చిబఠాణీలు, కాలేయం(బీఫ్‌, పోర్క్‌), చేపనూనె, పెరుగు, పాలు, అన్నిరకాల ఆకుకూరలు(పాలకూరలో అత్యధికం).

నిద్ర వయస్సు ను తెలియనివ్వదు :

వయసుకు తగినట్టుగా శరీరము మారుతుంది . అది సహజము . ఐతే కొందరి ముఖాలు వయసును తెలియనివ్వవు . వారి అసలు వయసుకన్నా ఐదారేళ్ళు చిన్నగా కనిపిస్తారు . వారి యవ్వన రహస్యము వారు క్రమము తప్పక తీసే నిద్రలో ఉంటుంది. నిద్ర వల్ల వచ్చే లాభాలు ఒకటి రెండు కాదు . సుఖనిద్రపోవడం ఒక వరము .
నిద్రలో శరీర లోపాలు సరిదిద్దబడాతాఇ. ఆరోగ్యము కుదుటపడుతుంది . తగినంత నిద్ర , విశ్రాంతి కలవారిలో రక్తపోటు , మధుమేహము అదుపులో ఉంటుంది . రక్తపోటుతో పాటే మిగిలిన అంతర్గత అవయవాల పనితీరు సక్రమముగా ఉంటుంది . సరిగా నిద్రలేనివారి కళ్ళలో వెలుగు ఉండదు . . చర్మము ఆరోగ్యముగా కనిపించదు . ముఖము మీద ముడతలు వస్తాయి. అసలు వయసు కన్నా పదేళ్ళు అదనపు వయసు కనిపిస్తుంది . నిద్ర ఉన్నప్పుడే వయసు ముదిరు నట్లు కనపడకుండా ఉంటుందన్నది తాజా నిర్ధారణ అయిన విషయము .

నిద్ర పట్టేదెట్లా?
పురుషుల కన్నా స్త్రీలకు సగటున 20 నిమిషాల నిద్ర ఎక్కువ అవసరమని బ్రిటన్‌ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. మరీ ముఖ్యంగా... తెలివితేటలు, భాషా నైపుణ్యం, జ్ఞాపకశక్తి వంటి కీలకమైన విధులను నిర్వర్తించే సెరిబ్రల్‌ కార్టెక్స్‌ బాగా పనిచేయాలంటే తగినంత నిద్ర తప్పనిసరి అని వారు చెబుతున్నారు. అలా చక్కగా నిద్రపట్టడానికి కొన్ని చిట్కాలు కూడా చెబుతున్నారు వారు...

* రోజూ ఒకే సమయానికి పడుకోవడానికి ప్రయత్నించండి. కొన్నాళ్లకు అది అలవాటైపోయి ఆ సమయానికి నిద్ర వస్తుంది.
* పడుకోవడానికి అరగంట ముందు... పుస్తకం చదువుకోవడం, మంద్రమైన సంగీతం వినడం, గోరువెచ్చటి పాలు తాగడం లాంటి ఏదో ఒక అలవాటు చేసుకోండి. ఆ పని చేయగానే నిద్రపోవాలని మెదడు సంకేతాలు పంపుతుంది.
* పడుకునేటప్పుడు బిగుతు దుస్తులు కాకుండా శరీరానికి సౌకర్యంగా వదులుగా ఉండే కాటన్‌ దుస్తుల్ని ధరిస్తే మంచిది.
* కాఫీ, టీలలో ఉండే కొన్ని పదార్థాలు మెదడును ఉత్తేజితం చేసి నిద్రపట్టనివ్వవు. అంచేత రాత్రి ఎనిమిది దాటాక వాటి జోలికి పోవద్దు.

  • ===================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయి? , Whydo we get hiccoughs?




ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
ప్ర : మా అబ్బాయికి భోజనము చేస్తున్నపుడు తరచుగా ఎక్కిళ్లు వస్తుంటాయి. ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయి? తగ్గాలంటే ఏమి చేయాలి?

జ : -ఎక్కిళ్లను నిత్యజీవితం లో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఎదుర్కొం టారు. ఎక్కిళ్లు డయాఫ్రం కదలిక వల్ల వస్తాయి. ఛాతీ కిందుగా కడుపు పై భాగాన ఉండే వర్తులాకార పొరను డయాఫ్రం అంటారు. ఇది శ్వాసక్రియను నిర్వర్తించే సమయంలోనూ, ఆహారం తీసుకునేటప్పుడు అటూ, ఇటూ కదలి శరీరంలోని ఒత్తిడిని సమతూకంగా ఉండేట్లు చేస్తుంది. దీన్ని నియంత్రించడానికి మెదడులో ప్రత్యేక కేంద్రం ఉంటుంది. దీని నుండి బయలు దేరిన 'ఫ్రెనిక్‌ నాడి డయాఫ్రం వరకు ఉంటుంది. డయాఫ్రం ఊపిరి పీల్చినప్పుడు ముడుచుకుని ఉంటుంది. ఊపిరి వదలగానే మళ్లీ మామూలుగా ఉంటుంది. ఈ ప్రక్రియ ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. దీనితో శ్వాసక్రియ కూడా సక్రమంగా జరుగుతుంది. ఏ కారణం చేతనైనా ఫ్రెనిక్‌ నాడి గానీ, డయాఫ్రం గానీ ఒక క్రమ పద్ధతిలో అన్వయించుకోకపోవడం వల్ల చర్యాక్రమం తప్పుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో డయాప్రం ఒక్కసారిగా సంకోచించడము వలన ... గాలి పీల్చుకుంటే స్వరపేటిక హఠాత్తుగా మూసుకుంటుంది. దీనితో 'హిక్‌ అనే చప్పుడు వస్తుంది. డయాఫ్రం సక్రమంగా పనిచేసేదాకా ఈ విధంగా శబ్దం వస్తూనే ఉంటుంది. దీనినే ఎక్కిళ్లు అంటారు.

కారణాలు :
  • గాబరా గా ఆహారము తినడము వలన సాధారణము గా ఎక్కిళ్ళు వస్తాయి. నీరు తాగితే తగ్గిపోతాయి ,
  • ఒక్కొక్కసారి కొన్ని ప్రత్యేక పరిస్థితులు అంటే మూత్రపిండాలు, గుండె, కాలేయం వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధుల వల్ల కూడా ఎక్కిళ్లు వస్తాయి.
  • కొన్ని సందర్భాల్లో మెదడు సంబంధమైన వ్యాధుల వల్ల,
  • విష పదార్థాల సేవనం వల్ల,
  • శరీరానికి సరిపడని ఆహార పదార్థాల వల్ల,
  • కడుపు ఉబ్బరం, గ్యాస్‌ వంటి వాటి వల్ల కూడా ఎక్కిళ్లు వస్తాయి.
  • ఆదుర్థా, భయం, దు:ఖం వంటి మానసిక కారణాల వల్ల కూడా ఎక్కిళ్లు రావచ్చు.
  • ఎక్కువ మసాలా పదార్ధాలు ఉన్న ఆహారము తినడం వల్ల ,
  • కారము ఎక్కువగా ఉన్న ఆహారము భుజించడం వలన ,
  • సుగరు వ్యాధి ముదినపుడు ,
  • ఎక్కువగా మందు (సారా) త్రాగడం వల్న ,
  • ఎక్కువగ పొగ త్రాగడం వలన ,
  • నోటి పూత తో బాధపదుతున్నా,
  • ఉదరకోశ క్యాన్సర్ ఉన్నపుడు ,
  • కామెర్ల జబ్బు తో బాదపడుతున్నపుడు ,
  • తీవ్రమైన ఎలర్జీ వ్యాధులు లతో బాధపడుతున్నపుడు ,
  • తీవ్రమైన అజీర్ణవ్యాదులతో బాదపడుతున్నపుడు ,
  • అంటే నిజానికి ఎక్కిళ్లు అనేవి జబ్బు కాదు. ఎక్కిళ్లు దీర్ఘకాలంగా ఉన్నా ప్రమాదం లేదు. అయితే ఇబ్బందిగా, విసుగ్గా ఉంటుంది.


ఆయుర్వేధిక చిట్కాలు :
  • పంచదారను లేదా ఏదైనా స్వీట్‌ను తింటే ఎక్కిళ్లు తగ్గుతాయి.
  • క్కోసారి మంచినీళ్లు తాగినా ఎక్కిళ్లు తగ్గిపోతాయి.
  • పచ్చి తాటాకు నమిలి ఊటను మింగుతే ఎక్కిళ్లు పోతాయి.దయం,
  • సాయంత్రం రెండు పూటలా పల్లేరు కాయలు లేక చెట్టు కాడ రసాన్ని కొద్దిగా తేనెను కలిపి తీసుకుంటే ఎక్కిళ్లు తగ్గిపోతాయి.
  • నేల ఉసిరి ఆకుల్ని నమిలి మింగటం వల్ల కూడా ఎక్కిళ్లు తగ్గుతాయి.
  • మామిడి ఆకుల్ని ఎండబెట్టి వాటిని కాల్చి వచ్చే పొగను పీల్చినా ఎక్కిల్లు ఆగుతాయి.
  • తాటికాయను చిన్నగాటు పెట్టగా వచ్చిన నీరు లాంటి ద్రవాన్ని అరకప్పు తాగినా వెక్కిళ్లు తగ్గుతాయి.
  • రాతి ఉసిరికాయలు తింటుంటే ఎక్కిళ్లు తగ్గుతాయి.ప్రతిరోజూ వీటి రసం తాగినా ఎక్కిళ్లు పోతాయి.
  • కొబ్బరి బోండాం నీళ్లు తాగితే ఎక్కిళ్లు తగ్గుతాయి.
  • బఠాణీ గింజంత ఇంగువను గోరువెచ్చని నీళ్లలో వేసుకుని మింగితే ఎక్కిళ్లు తగ్గుతాయి.
  • కొబ్బరిని చితక్కొట్టి ఆ పిప్పిని బాగా పిండితే పాల వంటి పదార్థం వస్తుంది. దీనిని తాగినా, నిమ్మరసం తాగినా ఎక్కిళ్లు తగ్గుతాయి.
  • నాలుకకు తరుచుగా తేనె రాస్తున్నా ఎక్కిళ్లు తగ్గుతాయి.
  • జామకాయను తిన్నా ఎక్కిళ్లు తగ్గుతాయి.
  • శొంఠి లేదా కరక్కార పైపెచ్చు చూర్ణం అరచెంచాడు తీసుకున చెంచాడు తేనెను కలిపి చప్పరిస్తే ఎక్కిళ్లు తగ్గుతాయి.
  • శొంఠి, ఉసిరిక పలుకు, పిప్పళ్లు వీటన్నింటిని సమభాగాలుగా తీసుకుని కలిపి చూర్ణం చేసి పూటకు పావు చెంచాడు వంతున రోజూ రెండు పూటలా తింటే ఎక్కిళ్లు పోతాయి.
  • విటమిన్‌ ఉన్న పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినడం వల్ల కూడా ఎక్కిళ్లను నియంత్రించవచ్చు.
  • వేపాకు పొడి, ఉసిరిక పొడిని సమాన మెతాదులో తీసుకుంటే ఎక్కిళ్లు తగ్గుతాయి.
  • ఎక్కిళ్లు వస్తున్న వ్యక్తి దృష్టి మళ్లించడానికి ఏదైనా ఆశ్చర్యకమైన వార్తను చెప్పాలి. దీంతో వెంటనే ఎక్కిళ్లు ఆగిపోతాయి.
  • ఆవాలను పొంగబెట్టి తాగిస్తే వెంటనే ఎక్కిళ్లు తగ్గుతాయి.
అల్లోపతిక్ చికిత్స :
Tab . backfen (antispasmodic) 1 tab 3 times /day for 3-4 days ,
Tab . Aceloc Rd (anti acidic) 1 tab 3 times /day for 3-4 days

=================================================


visit my website - > Dr.Seshagirirao-MBBS

Friday, February 17, 2012

హెపటైటిస్ బి జబ్బు తగ్గదా?



ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ఫ్ర : మా అబ్బాయికి హెపటైటిస్ -బి . సోకింది . డాక్టర్ల దగ్గర సుమారు 6 నెలలు ట్రీట్మెంట్ తీసుకున్నాము . చికిత్స అవసరం లేదంటే మానివేసాము . రక్తపరీక్ష చేయిస్తే పొజిటివ్ వచ్చింది . ఈ జబ్బు తగ్గదా?

జ : తగ్గుతుంది . హెపటైటిస్ (Hepatitis) అనగా కాలేయానికి చెందిన వ్యాధి. ఇవి వైరస్, బాక్టీరియా, ప్రోటోజోవా, కొన్ని మందులు మొదలైన వివిధ కారణాల వలన కలుగుతుంది. వీనిలో వైరస్ వలక కలిగే హెపటైటిస్ ను వైరల్ హెపటైటిస్ (Viral Hepatitis) అంటారు. వైరస్ అనగా జీవజాలంపై దాడి చేసే అతి సూక్ష్మమైన కణాలని అర్థం.
హెపటైటిస్ వైరస్లు (Hepatitis virus) ఒక వ్యాధికారక వైరస్ ల సమూహం. ఇవి అన్నీ వైరల్ హెపటైటిస్ (Viral Hepatitis) వ్యాధిని కలుగజేస్తాయి. ఈకాలేయ సంబంధితవ్యాధికి చెందిన వైరస్‌ ఎ,బి,సి,డి, ఇ,ఎఫ్‌ ఇలా ఆరురకాలుగా విభజించారు. వీటిలో హెపటైటిస్‌-ఏ, హెపటైటిస్‌-బి, హెపటైటిస్‌-సిలు మానవ శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపడమే కాకుండా ప్రాణాంతకాలుగా పరిణమిస్తాయి.

చికిత్స తరువాత ఈ వైరస్ శరీరములో లేకపోయినా సంబంధిత యాంటీబాడీస్ కొ్న్నాళ్ళు పాటు రక్తములో ఉంటూనే ఉంటాయి. ఆ కారణముగా ఎలీసా పరీక్ష పొజిటివ్ గా మనకు రి్పోర్టు వస్తుంది . దీనిని దృష్టిలో పెట్టుకొని మనకి ఆ వ్యాది వైరస్ ఇంకా ఉందనే అనుకుంటాము . భయపడవలసిన పనిలేదు.

మంచి డాక్టర్ ని సంప్రదించి తగిన సలహా పొందండి .

ట్రీట్మెంట్ :
  • 1.pegylated interferon ఈ ఇంజక్షన్లు సుమారు ఒక సంవత్సరకాలము వాడాలి .
  • 2.Nucleoside / nucleotide analogues.. ఉదా: Lamivudine
  • 3.tab Livfit/Live-52ఈ మాత్రలు / సిరఫ్ సుమారు 4-6 మాసాలు వాడితే ఈ వ్యాధి పూర్తిగా తగ్గిపోతుంది.
  • 4. బి.కాంప్లెక్ష్ మాత్రలు
  • 5.vaccination : ఒక కోర్సు చికిత్స ఇచ్చిన తరువాత హెపటైటిస్ వ్యాధిగ్రస్తులకు టీకాలను నెలకి ఒకటి చొప్పున్న వరుసగా 3 డోసులు తీసుకోవాలి.


  • ========================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

Sunday, February 12, 2012

Where do Spermatozoas produce in human?,వీర్యములోని శుక్రకణాలు ఎక్కడ నుండి జనిస్తాయి?





ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

Q : పురుషుల వీర్యములోని శుక్రకణాలు ఎక్కడ నుండి జనిస్తాయి? వాటిని స్ఖలించడము వలన శక్తి తగ్గుతుందా?.

A : శుక్రకణాలు వృషణాలలోని ముష్కము (cortex of testicle) లో ఉత్పత్తి అవుతాయి. ఒక శుక్రకణము కంటికి కనిపంచనంత సూక్ష్మమైనది. పురుషుడి లో శుక్రకణాలు నిరంతరం ఏర్పడుతుంటాయి. శుక్రనాళికల్లో ఒక శుక్రకణము ఏర్పడడానికి 74 రోజులు వరకూ పడుతుంది.

ప్రతి నిముషము 20 వేల శుక్రకణాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఒక శుక్రకణము 25 -40 రోజులు జీవిస్తుంది. పురుషులలో 12-14 ఏళ్ళ మధ్యలో శుక్రకణ ఉత్పత్తి మొదలై దాదాపు 70 ఏళ్ళ వరకూ ... ఆ పైనకూడా జరుగుతుంటుంది . వీర్యము అనేది మూడు గ్రంధుల ఉత్పత్తి మిశ్రమము .
  • శుక్రనాళాలు ఉత్పత్తి చేసే రసాలు ,
  • ప్రోస్ట్రేట్ గ్రంధి ఉత్పత్తి చేసే రసాలు ,
  • వృషణాలు ఉత్పత్తి చేసే శుక్రకణాలు , కలిసి వీర్యము అవుతుంది .
ఒక ఘనపు మి.లీ. వీర్యములో 20 నుండి 120 మిలియన్‌ ల శుక్రకణాలు ఉంటాయి . ప్రతిసారి స్ఖలించినపుడు పురుషుడు 60 నుండి 360 మిలియన్‌ శుక్రకణాలు ను వదులుతాడు . ఇవి ఒకవేళ స్ఖలించకపోయినా వాటి జీవిత కాలము తరువాత శరీరములో నశించి పోతాయి. కాబట్టి స్ఖలిస్తే శక్తి తగ్గుతుందని అనికోవడము లో అర్ధము లేదు .


  • ====================================


visit my website - > Dr.Seshagirirao-MBBS

Saturday, February 11, 2012

Forgetfulness-మతిమరుపు.




ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .


Q : నా వయస్సు 45 సంవత్సరాలు. గృహిణిగా వున్నాను. నా భర్త మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. నెలలో 20 రోజులు బయట తిరుగుతుంటారు. మా బాబు బిటెక్, పాప ఇంటర్ చదువుతున్నారు. గత రెండు సంవత్సరాల నుంచి నన్ను మతిమరుపు బాధిస్తోంది. చిన్న చిన్న విషయాలు కూడా మరచిపోతున్నాను. స్టౌ మీద పెట్టిన పాలు మరిగి పొంగేవరకు గుర్తుకురాదు. వస్తువులు ఎక్కడో పెట్టి మరచిపోతుంటాను. ఒక్కోసారి బోరు మోటారు ఆపడం మరచి మార్కెట్‌కు వెళ్తుంటాను. పనిమనిషికి ఇవ్వాలనుకున్న జీతం లెక్కపెట్టి ఎక్కడో పెట్టి మరిచిపోతుంటాను. ఇలా ప్రతి విషయం మరచిపోవడంవల్ల ఒక్కోసారి సమస్యలు ఎదురవుతుంటాయి. మనసును గతి తప్పించే ఈ మతిమరుపును తగ్గించుకునే మందులేమైనా ఉన్నాయా?

A : మీ సమస్యకు మందులేవీ లేవు, అవసరం కూడా లేదు. మీ వయసులో వచ్చే మతిమరుపు జబ్బు కాదు. అలాగే మెదడులో లోపం వుండదు. మానసిక ఒత్తిడి, భయం, ఆందోళన, నిద్రలేమి, టెన్షన్‌లాంటి సమస్యలు తాత్కాలిక మతిమరుపునకు కారణమవుతుంటాయి. మీరు బాగా ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నారని నా భావన. భర్త ఎక్కువ రోజులు బయట వుండటం, పిల్లలు రోజంతా కాలేజీలో గడపడంవల్ల మీలో ఒంటరితనం చోటుచేసుకుని వుంటుంది. అలాగే బయట తిరిగే భర్తపట్ల అనుమానం, భయం చోటుచేసుకునే అవకాశాలున్నాయి. భర్త సాన్నిహిత్యం కొరతవల్ల అసహనం, కోపం, చిరాకు పెరగవచ్చు. పిల్లల చదువు, ఇతర విషయాల పట్ల టెన్షన్ తలెత్తే అవకాశాలుంటాయి. అలాగే హార్మోన్ల సమస్య వుండవచ్చు. ఇవన్నీ కలిసి మీలో తీవ్రమైన వత్తిడి కలిగిస్తు వుండవచ్చు. కాబట్టి మీరు ఒత్తిళ్ళనుంచి బయటపడేందుకు ప్రయత్నించండి. మీ మనసుపై ఒత్తిడి కలిగించే అంశాలను గుర్తించి ప్రత్యామ్నాయాలు ఆలోచించండి. మంచి అభిరుచులు, శారీరక వ్యాయామం, స్నేహ సంబంధాలు, యోగ, ధ్యానమార్గాల ద్వారా స్వస్తత పొందేందుకు ప్రయత్నించండి.
  • ========================

visit my website - > Dr.Seshagirirao-MBBS

More Sleeping , మితిమీరిన నిద్ర


  • image : courtesy with Andhra bhoomi news paper.

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .


Q : బాబు పదవ తరగతి చదువుతున్నాడు. గత ఆరు నెలల నుంచి ఎక్కువసేపు నిద్రపోతున్నాడు. రోజుకు 12, 13 గంటలసేపు నిద్రపోయినా సరిపోనట్టు కనిపిస్తాడు. ఆదివారాలు, సెలవుదినాలలో మరింత ఎక్కువ సమయం నిద్రలో వుంటాడు. అతిగా నిద్రపోవటంవల్ల బరువు పెరుగుతున్నాడు. గతంలో వున్న చురుకుదనం, చలాకీతనం ఇప్పుడు కనిపించడంలేదు. తొమ్మిదవ తరగతి వరకు ఒక ప్రైవేటు కానె్వంటులో చదివించాము. పదవ తరగతి కీలకం కాబట్టి ఒక కార్పొరేట్ సంస్థ నిర్వహించే టెక్నోస్కూల్లో చేర్పించాము. ఇప్పుడు మార్కులు కూడా బాగా తగ్గాయి. ఏమైనా అంటే నాకు ఏకాగ్రత కుదరడం లేదు. చదివింది మరచిపోతున్నానంటాడు. మందలిస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నాడు. అతన్ని మామూలు మానసిక స్థితికి తెచ్చే మార్గం సూచించండి.


A : మీ బాబు లక్షణాలను బట్టి అతను మానసిక, లేదా థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నట్టు అర్థమవుతున్నది. సాధారణంగా ఆ వయస్సు పిల్లలకు 7 నుంచి 9 గంటల నిద్ర సరిపోతుంది. నిద్ర మరీ ఎక్కువైనా, తక్కువగా ఉన్నా మానసిక, శారీరక సమస్యలున్నట్లు గుర్తించాలి. అంటే 10గంటలకంటే ఎక్కువ, 4 గంటలకంటే తక్కువ నిద్రపోతుంటే ఏవో సమస్యలున్నట్టు భావించాలి. మీ బాబు లక్షణాలను బట్టి, మానసిక స్థితి డిప్రెషన్‌తో బాధపడుతున్నట్టు భావించాల్సి వస్తుంది. 10వ తరగతికి రాగానే మరొక మంచి స్కూల్‌కు మార్పించారు. ఇక్కడి స్టాండర్ట్‌తో అతను సర్దుకోలేకపోవచ్చు. గతంలో కంటే భారం పెరిగి ఉండవచ్చు. ఇతర పిల్లలతో పోల్చుకొని కృంగిపోతుండవచ్చు. భయం, ఆందోళన పెంచుకొని బాధపడుతుండవచ్చు. ఇలా చదువుల ఒత్తిడికి గురై డిప్రెషన్‌కి లోనయ్యే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. అలాగే థైరాయిడ్ సమస్య తలెత్తినా ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. మీ బాబు బాగా బరువు పెరుగుతున్నందున థైరాయిడ్ సమస్య వుండే అవకాశాలు వున్నాయి. కాబట్టి ఆ అబ్బాయి సమస్యను అనునయంతో అడిగి తెలుసుకోండి. మనసు విప్పి మాట్లాడితే అసలు సమస్యలు తెలుస్తాయి. అలాగే డాక్టర్ సలహాతో థైరాయిడ్ టెస్టులు చేయించడం మంచిది. అతిగా ఒత్తిడికి గురైనవారిలో థైరాయిడ్ సమస్య వచ్చే అవకాశం వుంది. అలాగే థైరాయిడ్ సమస్యవల్ల మానసికంగా కృంగిపోవడం జరుగుతుంది. మానసిక సమస్యలైతే సైకాలజిస్టుల ద్వారా కౌనె్సలింగ్ చేయించండి. థైరాయిడ్ సమస్య వుంటే డాక్టర్ సలహా మేరకు మందులు వాడండి.

  • ================================
visit my website - > Dr.Seshagirirao-MBBS