Friday, April 17, 2015

He likes but keeping away?-ఇష్టమంటూనే... దూరంగా ఉంటుంటే?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .



ప్ర: మాకు రెండేళ్ల క్రితం పెళ్లయింది. మా వారికి నేనంటే చాలా ఇష్టమని ఆయనే చాలా సందర్భాల్లో చెప్పారు. కానీ నాతో సన్నిహితంగా ఉండరు. కలయిక అంటే ఇష్టమంటారు కానీ చొరవ చూపించరు. దాంతో మేమిద్దరం కలయికలో పాల్గొంది చాలా తక్కువ సందర్భాల్లోనే. కారణం తెలుసుకునేందుకు చాలాసార్లు ప్రయత్నించా. కానీ సమాధానం లేదు. ఎందుకిలా ప్రవర్తిస్తున్నారో తెలియడం లేదు!
- ఓ సోదరి
జ. మీకూ, మీ భర్తకూ మధ్య గతంలో ఏవయినా సమస్యలు ఎదురై.. వాటిని పరిష్కరించుకోకుండా వదిలేశారా.. ఒకసారి ఆలోచించుకోండి. లైంగికచర్యకూ, లైంగికంగా సన్నిహితంగా ఉండటానికీ చాలా తేడా ఉంటుంది. ముఖ్యంగా ఇద్దరిమధ్యా స్పష్టమైన భావవ్యక్తీకరణ, ఉద్వేగాల పరంగా ఒకరినొకరు పూర్తిగా అర్థంచేసుకోవడం, అభిప్రాయాలు.. వీటిల్లో ఏదో ఒకటి సమస్యకు మూల కారణం అవుతుంది. మీ విషయంలోనూ అదే జరుగుతోంది. మీరు మీ భర్తతో చాలాసార్లు మాట్లాడానన్నారు. కానీ లైంగికజీవితం గురించి సూటిగా, నిజాయతీగా చర్చించారా అన్నది గుర్తుచేసుకోండి. ఇప్పుడు మరోసారి మాట్లాడండి. ఆయన ఏదయినా విషయానికి సంబంధించి బాధపడుతున్నారా లేదా గతంలో జరిగిన సంఘటనలకు సంబంధించి అపరాధభావనకు లోనవుతున్నారా అన్నది తెలుసుకునే ప్రయత్నం చేయండి. మరికొన్నిసార్లు అసలు లైంగికచర్యనే వద్దనుకోవచ్చు.. ఆ అనుబంధం లేకుండా కూడా ఆనందంగా జీవించొచ్చు అని మీకు తెలియజేయాలనుకుంటున్నారేమో...ఈ కారణాలు ఉన్నా లేకపోయినా కూడా మీవారిపై కలయికపరంగా ఒత్తిడి తేవడం, పదేపదే ఆ విషయాన్ని చర్చించకుండా, ముందు మీ మధ్య సాన్నిహిత్యం పెరిగేలా చేసుకోండి. అప్పుడే నిజాయతీగా సమస్యను వివరిస్తారు.

--డా .షర్మిళా మజుందార్

  •  *=========================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS -