Sunday, March 30, 2014

What is functional food?give examples?,ఫంక్షనల్ ఫుడ్ అంటే ఏమిటి? ఉదాహరణాలివ్వండి?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర : ఫంక్షనల్ ఫుడ్ అంటే ఏమిటి? ఉదాహరణాలివ్వండి?
జ : ఫంక్షనల పదార్ధాలంటే సాధారణం గా వ్యాధుల రిస్కును తగ్గించుకోడానికో లేదా ఆశావహ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోడానికో ఉపయుక్తమైనవి. ఆధునిక కాలములోముందస్తు జాగ్రత్తకోసము , దీర్ఘకాలిక వ్యాధుల చికిత్స , సరియైన ని్ర్వహణకోసం ... ఈ పదార్ధములు ప్రధానమైన ఆహారము .

ఉదాహరణములు : 
వీట్ గ్రాస్ జ్యూస్ : హైపర్ టెన్సన్‌ గలవారికి  ఇది అద్భుతపదార్ధము . మెగ్నీషియం , పొటాషియం లకు మంచి ఆదారము .ఈ రండు ఖనిజాలు రక్తపోటును తగ్గిస్తాయి. ఇవి తగ్గితే రక్తపోటు పెరుగుతుంది. చాలినంత మెగ్నీషియం , పొటాసియం తీసుకోవడము వల్ల వాడుతున్న మందులకు సపోర్టింగ్  గా ఉంటుంది .
----------------------------------------------------------

వెళ్ళుల్లి : రక్తాన్ని పల్చపరచడములో సహకరించే గుణాలు దీనిలో ఉంటాయి. కొలెస్టిరాల్ ను, హోమోసిస్టిన్‌ స్థాయిలను తగ్గించడములో సహకరిస్తుంది. రక్తనాళాలలో ప్లేక్స్ ఏర్పడడాన్ని తగ్గించడమే కాకుండా క్లాటింగ్ ను అరికడుతుంది.
--------------------------------------------------------------

-
ఓట్స్ :  దీనిలోని బెట-గ్లుకన్‌(సోల్యుబుల్ ఫైబర్) కొలెస్టిరాల్ స్థాయిలను సహకరిస్తుంది. ప్రతి రోజూ అరకప్పు నుండి కప్పు దాకా ఓట్స్ తింటే అనేక ప్రయోజనాలు ఉంటాయి.

---------------------------------------------------------

టమాటో : free radicals damage నుండి  పరిరక్షిస్తుంది , రక్తపోటు నియంత్రణలోనూ , ప్రోస్ట్రేట్  ఆరోగ్య విసయములో సహకరిస్తుంది. చర్మము పై  సూర్యకిరణాలు ప్రభావాన్ని కూడా తగ్గించగల గుణాలున్నాయి. 

  • *=========================== 

visit my website - > Dr.Seshagirirao-MBBS -

Is mother milk increase baby memory?,తల్లిపాలు బిడ్డ జ్ఞాపకశక్తిని పెంచుతుందా?

  •  


  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
ప్ర : తల్లిపాలు బిడ్డ జ్ఞాపకశక్తిని పెంచుతుందా?
జ : తల్లిపాలు బిడ్డకు సంపూర్ణాహారము . స్తన్యము ఇవ్వడము తల్లీబిడ్డలకు ఎంత ప్రయోజనమైనదో ప్రత్యేకముగా చెప్పనవరములేదు. ఈ ప్రయోజనాలతో ... 6 నెలలకు పైబడి పిల్లలకు పాలిస్తే ,వారిలో జ్ఞాపకశక్తికి సంబంధించిన అంశాలు , భాష , నైపుణ్యాలు బాగా పెరుగుతాయి. 9 మాసాలు వచ్చేవరకు తల్లిపాలు తాగేవారిలో ఎక్కువ చురుకుదనము ఉంటుంది. మాటలు త్వరగా స్పస్టం గా వస్తాయి.  వీరిలో శీఘ్రం గా గ్రహించేశక్తి , కమ్యూంకేషన్‌ ను చటుక్కున అందుకోవడము వంటి గుణాలు అధికము గా కనిపిస్తాయి.

తల్లిపాలు గురించి ఇంకా కొంచము తలుసుకోండి :
స్ర్తీకి సంపూర్ణత్వం సిద్ధించేది మాతృత్వంతోనే అని అంటారు. అలాంటి మాతృత్వం పరిపూర్ణమయ్యేది బిడ్డకు తల్లి పాలను ఇచ్చినప్పుడే. అందం తగ్గిపోతుందనే అపోహతో చాలామంది పసిపిల్లలకు పాలు ఇవ్వడం లేదు. చంటిపిల్లలకు తల్లిపాలను మించిన ఆహారం లేదు. ఒక్కముక్కలో చెప్పాలంటే పసిబిడ్డకు అమృతం తల్లిపాలు. భవిష్యత్తులో వారు ఎలాంటి రోగాలకు గురి కాకుండా ఉండేందుకు అవసరమైన రోగనిరోధక శక్తిని తల్లిపాలే అందిస్తాయి.

తల్లిపాలను మించిన ప్రత్యామ్నాయం లేదు. అందుకే తల్లికి పాలు పడనప్పుడు మరో తల్లి పాలను సైతం పట్టిస్తుంటారు. అలా పాలు ఇచ్చే తల్లి ఆ బిడ్డ ప్రాణాలు కాపాడినట్లే లెక్క. నిలువెత్తు ధనమిచ్చినా ఆ రుణం తీర్చుకోలేనిది. దీన్ని దృష్టిలో ఉంచుకునే నేడు తల్లిపాలు కరవైన పిల్లలను తల్లిపాలు అందించే తల్లిపాల బ్యాంకులు కూడా రూపుదిద్దుకున్నాయి. ఇంతటి విలువైన తల్లిపాలను అపహాస్యం చేసే రీతిలో తల్లిపాలతో ఐస్‌క్రీమ్‌లు తయారు చేసి విక్రయించే అనైతిక సంస్థలూ వచ్చాయి. తల్లిపాలు బిడ్డకు ఎంత కాలం ఎక్కువగా ఇస్తే అంత మంచిదే.

బిడ్డను ప్రసవించిన 3-4 రోజుల నుంచి తల్లిపాలు స్రవిస్తాయి. కాన్పు అయినప్పటి నుంచీ మూడో రోజు వరకూ కొలొస్ట్రమ్‌ అనే ద్రవం స్రవిస్తుంది. ఈ పదార్థంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ బాడీలు కూడా ఈ ద్రవంలో అధికంగానే ఉంటాయి. పాపాయి ఆరోగ్యానికి అవసరమైన దీన్ని తప్పకుండా పాపాయిచేత తాగించాలి.

తల్లిపాలు పోషక విలువలు:
పాపాయికి అవసరమైన అన్ని పోషక పదార్థాలూ తల్లిపాలలో ఉంటాయి. అంతకంటే ప్రధానమైన అంశం ఏమిటంటే, ఈ పోషక పదార్థాలన్నీ పాపాయి జీర్ణించుకోగల స్థితిలో, తగు పరిమాణంలో ఉంటాయి.తల్లిపాలలో ప్రొటీన్లు తక్కువ శాతంలో ఉంటాయి. అయితే ఇతర రకాలైన పాలలోలా కా, తల్లిపాలలో ప్రొటీన్లు పూర్తిగా జీర్ణం అయి, శక్తిగా మారే స్థితిలో ఉంటాయి. చంటి పాపాయి జీర్ణమండలానికి ఎక్కువ ప్రొటీన్లు జీర్ణించుకోగల శక్తి ఉండదు. ఎక్కువ ప్రొటీన్లు ఉన్న పాలవలన పసిపిల్లల్లో ఎలర్జీ సమస్యలు వస్తాయి. పాపాయికి అవసరమైనంత కాల్షియం కూడా తల్లిపాల ద్వారా అందుతుంది.

రోగనిరోధక శక్తి
అనేక రకాలైన వ్యాధులు రాకుండా నిరోధించగల పదార్థాలు తల్లిపాల ద్వారా పాపాయికి అందుతాయి.
- విరేచనాలు (డయేరియా) కావడానికి కారణమైన సూక్ష్మజీవుల్ని నాశనం చెయ్యగల రక్షక కణాలు తల్లిపాలలో ఉంటాయి. అందువల్లనే తల్లిపాలు తాగే పిల్లల్లో ఈ సమస్య అరుదు.
- మలేరియా రాకుండా కాపాడే - పారా ఎమినో బెంజాయిక్‌ ఆమ్లం తల్లిపాల ద్వారా అందుతుంది.
- మధ్యవయస్సులో వచ్చే ఎథిరోస్ల్కీరోసిస్‌ వ్యాధి రాకుండా రక్షణ ఇస్తాయి తల్లిపాలు.
- రకరకాలైన వ్యాధులకు కారణమైన బాక్టీరియా, వైరస్‌ల నుంచి తల్లిపాలు రక్షణ ఇస్తాయి.

ఇతర ప్రయోజనాలు
- తల్లిపాలు చాలా పరిశుభ్రంగా ఉంటాయి. ఏ విధమైన వ్యాధికారక క్రిములు తల్లిపాలలోకి ప్రవేశించవు.
- పాపాయికి ఎప్పుడు కావలసి వస్తే అప్పుడు సిద్ధంగా ఉంటాయి.
- పాపకి ఏదైనా అనారోగ్యం కలిగినా తల్లిపాలయితే మాన్పించవలసిన అవసరం లేదు.
- తల్లిపాలు పాప మానసిక ఆరోగ్యానికి అవసరమే. బిడ్డ తల్లిపాలు తాగే సమయంలో ఇద్దరి మధ్యా అనుబంధం ఏర్పడుతుంది. తల్లి ఒడిలో ఉన్న పాపాయికి రక్షణ భావం ఏర్పడుతుంది. ఈ భావం బిడ్డ మానసిక ఎదుగుదలకి ఎంతో అవసరం.

 పాలిచ్చే తల్లులు బరువు పెరగరు.
- పిల్లలకి పాలిచ్చిన స్ర్తీలలో కంటే, ఎప్పుడూ పాలివ్వని స్ర్తీలలో రొమ్ముక్యాన్సర్‌ ఎక్కువగా కనబడుతోందంటున్నారు పలువురు శాస్తవ్రేత్తలు.
అంటే ఈ క్యాన్సర్‌ నుంచి కాపాడుకోగల శక్తి బిడ్డకి పాలివ్వడం ద్వారా స్ర్తీ పొందుతోందన్న మాట.

పాలు ఇవ్వకూడని పరిస్థితులు
- తల్లి కొన్ని అనారోగ్యాలతో బాధపడుతున్నప్పుడు బిడ్డకు పాలివ్వకూడదు.
- క్షయ, కొన్ని రకాల హృద్రోగాలు, అంటు వ్యాధులు ఇటువంటివి ఉన్న తల్లి, బిడ్డకు పాలు ఇవ్వకూడదు.
 చనుమొనల్లో పగుళ్ళు, రొమ్ముల్లో గడ్డలు ఏర్పడినప్పుడు పాలివ్వకూడదు.

తల్లిపాలు తక్కువగా స్రవిస్తుంటే...
సాధారణంగా తల్లిపాలు సరిపోయినంతగా స్రవించాలంటే
- తల్లి మనస్సు పాపాయి మీద మమకారంతో నిండి ఉండాలి
- పాపాయిని దగ్గరగా ఎత్తుకోవాలి.
- తల్లి మనస్సు ఆనందంగా ఉండాలి. బాధలు, చికాకులతో ఉంటే ఆ ప్రభావం వల్ల పాలు సరిగా స్రవించవు.
- సరిపోయినంత విశ్రాంతి తీసుకోవాలి.
- సంపూర్ణ పోషకాహారం తీసుకోవాలి.
- ప్రసవించిన తరువాత వీలైనంత త్వరగా పాపాయి చేత పాలు తాగించే ప్రయత్నం చేయాలి. ఇది పాలు స్రవించేందుకు అత్యవసరమైన ప్రేరణ.

తల్లి సౌందర్యం చెడదు
శారీరక సౌందర్యానికి ప్రాధాన్యం ఇచ్చే కొందరు స్ర్తీలు, పిల్లలకు పాలు ఇస్తే, తమ సౌందర్యం దెబ్బ తింటుందని భ్రమపడుతుంటారు. పిల్లలకి పాలిస్తే సౌందర్యం ఏమీ పాడవదు. ఏదయినా మార్పంటూ వస్తే అది ‘గర్భం ధరించడం’ వల్లనే వస్తుంది తప్ప, పాలివ్వడం వలన ఏ మాత్రం కాదు. కన్నబిడ్డ కోసం ప్రకృతి ప్రసాదించిన పాలు ఇవ్వడం వలన పాపాయికే కాదు, తల్లికీ ఆరోగ్యమే. గర్భవతి అయిన నాటి నుంచీ పెరిగిన గర్భాశయం, కాన్పు అయిన వెంటనే యథాస్థితికి రాదు. సామాన్యస్థితికి రావడానికి దాదాపుగా 6-10 వారాల సమయం పడుతుంది. అయితే పిల్లకి పాలిచ్చే తల్లుల్లో గర్భాశయం త్వరగా మామూలు స్థితికి వస్తుంది.

--- Courtesy with : డాక్టర్‌ గాయత్రీ దేవి-మోతీనగర్‌,-హైదరాబాద్‌
  • *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Wednesday, March 19, 2014

Joggers nipples,జాగర్స్ నిపుల్స్

  •  
  •  

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : నేను జాగింగ్ చేసిన ప్రతిసారీ నా చాతీ పై దురదలు ఉంటున్నాయి. కారణమేమిటి?.
జ : ఎక్సర్ సైజ్  లు చేస్తున్నప్పుడు చర్మము పై దురదలు చచ్చే పరిస్థితిని " జాగర్స్ నిపుల్స్ " అంటారు. రాపిడి వల్ల , స్వేదం వలన  స్కిన్‌ ఇర్రిటేషన్‌ కలిగి దురదలు వస్తాయి. మంచి మాయిశ్చరైజర్ ఆప్లై చేయండి . దీనిలో జింక్ ఉండాలి.

*===========================
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Health-checkups needed for a normal person?ఆరోగ్య సమస్యలూ లేవు-హెల్త్ చెకప్స్ కోసం డాక్టర్ దగ్గరకు వెళ్ళాల్సిన అవసరము

  •  
  •  

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర : నాకు ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేవు అయినా హెల్త్ చెకప్స్ కోసం డాక్టర్ దగ్గరకు వెళ్ళాల్సిన అవసరము ఉందా?.
జ : తప్పకుండా వెళ్ళాలి . హెల్త్ చెకప్స్ కు వెళ్ళడము వలన ఎటువంటి రుగ్మతల్ని  అయినా తొలి దశలో గుర్తించే వీలు ఉంటుంది. ఫ్యామిలీ ఫిజీషియన్‌ వద్దకు వెళ్తుండాలి. ఆయనకు మీ కుటుంబ చరిత్ర , వ్యక్తిగత సమస్యలు తెలుస్తాయి.. . . కాబట్టి అవసరాన్ని బట్తి టెస్ట్ లు సూచిస్తారు. వయసును దృష్టిలో ఉంచుకొని అవసరమైన పరీక్షలు చేస్తారు. హైటు , వెయిట్ ఎప్పటికప్పుడు మెజర్ చేస్తారు. కొలెస్టరాల్ ప్రొఫైల్ , చెక్కెర స్థాయిలు , హిమోగ్లోబిన్‌ , కిడ్నీ ఫంక్షన్‌ పరీక్షలు వంటివన్నీ పరిశీలిస్తారు.  ఆడవారైతే గైనకాలజిస్ట్ ను సంప్రదించడమూ అవసరము .
  •  *===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

Is sex good for health?,సంసారసుఖం ఆరోగ్యానికి మంచిదా?

  •  
  •  

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర ; Is sex good for health?,సంసారసుఖం ఆరోగ్యానికి మంచిదా?
జ : ఆరోగ్యము గా జీవించడానికి పోషక పదార్ధాలు , పరిశుభ్రమైన గాలి , స్వచ్చమైన నీరు , తగినంత నిద్ర అవసరము . . . అయితె వీటికి తోడుగా వ్యాయామముకూడా ఆరోగ్యము కాపాడుకోవడములో కీలకపాత్ర పోషిస్తుంది. వీటన్నింటికి తోడుగా మనిషికి తగినంత సెక్స్ సుఖము కూడా ఉండాలి ... అప్పుడే సంపూర్ణ ఆరోగ్యముగా ఉండగలుగుతాడు .
జీవితములో కీలకమైన వయసులో ్ప్రతి ఒక్కరికీ సెక్స్ సుఖము అవసరము .సెక్స్ సుఖానికి నోచుకోని వారిలో మానసిక సమస్యలు తలెత్తుతాయి. శారీరక ఇబ్బందులు సంబవిస్తాయి . అందుకె ఏ వయసుకు ఆ ముచ్చట్ అంటూ వయసు రాగానే పెళ్ళి చేస్తారు మన పెద్దలు . ఇప్పుడే పెళ్ళి వద్దని మొండిలేసినా పెద్దలు నచ్చజెప్పి ఒప్పించే ప్రయత్నం చేస్తారు. ప్రతి ఒక్కరూ నియమబద్ధం గా సెక్స్ లో పాల్గొనాలి. ఎంత విరివిగాపాల్గొంటే అన్నిరకాలుగా లాభాలను పోదగలుగుతారు . సక్స్ వలన కనిల్గే లభాలు అనేకము . జిమ్‌ కి వెళ్ళి ఎన్నిరకాల లాభాలను పొందాలని ప్రయత్నిస్తున్నారో అటువంటి లాభాలనేకము సెక్స్ లో పాల్గొనడము ద్వారా పొందవచ్చును . కండరాలు కరిగించడము , రక్తప్రవాహము మెరుగుపరచడము , గాయాలను త్వరగా్మానే ప్రక్రియవేగమవడము , చేసేపనిమీద దృష్టి కేంద్రీకరించడము పెరుగుతుంది . " Sex is the best exercise " అంటారు.
సెక్స్ వలన అనేక అంటువ్యాదులు  వచ్చే ప్రమాదము ఉంటుంది గనుక ... సురక్షిత సెక్స్ కే ప్రాధాన్యత ఇవ్వాలి.

Risk per unprotected sexual act with an infected person ---

Bacterial

    Chancroid (Haemophilus ducreyi)
    Chlamydia (Chlamydia trachomatis)
    Gonorrhea (Neisseria gonorrhoeae), colloquially known as "the clap"
    Granuloma inguinale or (Klebsiella granulomatis)
    Syphilis (Treponema pallidum)

Fungal

    Candidiasis (yeast infection)

Viral
    herpes
    Viral hepatitis
    Herpes simplex (Herpes simplex virus 1, 2)
    HIV (Human Immunodeficiency Virus)—
    HPV (Human Papillomavirus)—

Parasites

    Crab louse, colloquially known as "crabs" or "pubic lice" (Pthirus pubis)
    Scabies (Sarcoptes scabiei)

Protozoal

    Trichomoniasis (Trichomonas vaginalis),

  • *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Tuesday, March 18, 2014

How to prevent Tension in daily life?,దైనందిన జీవితములో వత్తిడికి చెక్ ఎలా పెట్టాలి?

  •  
  •  

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : How to check Tension in daily life?,దైనందిన జీవితములో వత్తిడికి చెక్ ఎలా పెట్టాలి?
జ : ప్రతి రోజూ చేయాల్సిన అనేకానేక పనుల వల్ల ఎదో ఒక విధము గా ఒత్తిడి వేధిస్తుంది . చిన్నచిన్న చర్యలతో వత్తిడిని ఇట్టే తగ్గించుకోవచ్చును .
  • కామెడీ కార్యక్రమాలు చూసినా , 
  • సరదా గా గడిపినా , 
  • కామిక్ పుస్తకాలు చదివినా , 
  • మనస్పూర్తిగా నవ్వినా , ..................... స్ట్రెస్ హార్మోనులు స్థాయిలు తగ్గిపోతాయి. ఒత్తిడి బాగా తగ్గిపోతుంది .
 ఇష్టపడే వారితో కొంత సమయము గడపడము వలన చాలా ఫలితాలుంటాయి . కుటుంబ సభ్యులైనా , మిత్రులైనా సరే .. వారిని లంచ్ కో , డిన్నర్ కో ఆహ్వానించడమో లేదా వారింటికి వెళ్ళడమో చేస్తూ ఉంటే బాగా రిలాక్ష్ అవుతారు. ఒత్తిడి తగ్గే అవకాశాలు ఉంటాయి.  అనవసరమైన ఆందోళనలు నుంచి బుర్రను పరిరక్షించుకున్నవారవుతారు.

  • ఫేవరెట్ పాటలు వినడము వలన ఒత్తిడి వేదించదు . 
  • పార్కు లో ఓ పదినిముషాలు నడక ఎంటో ప్రశాంతతనుస్తుంది. 
  • ఆఫీసులో ఓ 5 నిముషాలు అటు , ఇటు పచార్లు కొట్టడము  , మెట్లు ఎక్కి .. దిగడము 
  • ఇంట్లో ప్రాణాయామం చేయడము ,
  • ఎక్షరసైజు చేయడము , 
  • స్నేహితులతో మార్నింగ్ వాక్ కి వెళ్ళడము , 
  • నరుగురి తో పిచ్చాపాటి హస్క్ వేసుకోవడము ,  ..............వలన కొంతవరకు మెంటల్ టెన్షన్‌ తగ్గుతుంది.

  • *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

If mothers eat no Food allery to babies , అమ్మలు తింటే పిల్లలకు నో ఎలర్జీ

  •  
  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : గర్భిణి ఏదైనా పదార్ధము తినకపోతే ... పుట్టిన బిడ్డకు ఆ పదార్ధము ఎలర్జీ కలుగజేస్తుందా?

జ : సాధారణము గా చాలామంది పిల్లలలో నట్స్ ఎలర్జీ కనబడుతుంది. ముఖ్యము గా వేరుశనగపప్పు ఎలర్జీ ఎక్కువ--- అయితే అమ్మలు గర్భవతులుగా ఉన్నప్పుడు పీనట్స్ , ట్రీనట్స్ తినాలి . . . అలా తినడము వలన పుట్టిన పిల్లలలో ఆయా ఆహారపదార్ధాల ఎలర్జీలు ఉండవు .
అమ్మలకు వీటి తాలూకు ఎలర్జీలు లేకుండా ఉండి  వారములో కనీసము అయిదారు సార్లైనా నట్స్ తింటుంటే పిల్లలకు తదుపరి ఇబ్బందులే ఉండవు . నెలకు ఒకసారి కూడా వీటిని తినని అమ్మలతో పోల్చినట్లైతే , తినేవారి పిల్లలలో ఆహార పదార్ధాల ఎలర్జీలు చాలా తక్కువగా ఉంటాయని పరిశోధనాత్మకముగా ఋజువైనది. అంటే గర్భిణీలు బిడ్డకోసము , బిడ్డకు ఎలర్జీ బారినుండి తప్పించడము కోసము అన్నిరకాల పదార్ధములు తినాలి. అదే మనపెద్దలు కడుపుతో ఉన్నవారికి వంటా-వార్పు , ఉండా-పండూ తెచ్చి పెట్టే ఆనవాయితీని ఆచారముగా పెట్టేరు.

  • *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Friday, March 14, 2014

Is necssary to test B.P for both hands?,రక్తపోటు పరీక్ష రెండు చేతులకూ చేయాలా?

  •  
  •  

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .


Q : Is it necssary to test B.P for both hands?,రక్తపోటు పరీక్ష రెండు చేతులకూ చేయాలా?

A : సాధారణము గా నార్మల్ రక్తపోటు 110/70 గా నిర్ణయించడము జరిగింది . ముందు 120/80 ని నార్మల్ గా తీసుకునేవారు. మనం ఏ సమస్యతో వెళ్లినా డాక్టర్లు రక్తపోటు పరీక్ష కూడా చేస్తుంటారు. దీంతో రక్తపోటు ఎక్కువగా ఉంటే బయటపడుతుంది. ఇక అప్పటికే హైబీపీతో బాధపడుతుంటే రక్తపోటు అదుపులో ఉందో లేదో తెలుస్తుంది. అయితే రక్తపోటు పరీక్షను ఒక చేయికి కాకుండా.. రెండు చేతులకూ చేయటం మంచిదని బ్రిటన్‌ పరిశోధకులు సూచిస్తున్నారు. ఎందుకంటే కుడి చేయి, ఎడమ చేయిలో రక్తపోటు కొలతల మధ్య తేడా ఎక్కువగా ఉండటమనేది పక్షవాతం, గుండె రక్తనాళాల జబ్బు, గుండెకు దూరంగా ఉండే అవయవాల్లో రక్తనాళాల సమస్యలకు (పెరిఫెరల్‌ ఆర్టరీ డిసీజ్‌) సూచిక కావొచ్చు. రెండు కొలతల మధ్య 15, అంతకన్నా ఎక్కువ పాయింట్ల తేడా గలవారికి పెరిఫెరల్‌ ఆర్టరీ డిసీజ్‌ ముప్పు రెండు రెట్లు అధికంగా ఉంటున్నట్టు తేలటమే దీనికి నిదర్శనం. ఈ కొలతల్లో 10-15 పాయింట్ల వ్యత్యాసం గలవారికి పక్షవాతం లేదా గుండె జబ్బు మూలంగా మరణించే ముప్పూ పెరుగుతున్నట్టు బయటపడింది.

ఎందుకీ తేడా?
నిజానికి రెండు చేతుల్లోనూ రక్తపోటు కొలతల్లో కొంత తేడా ఉండటం సహజమే. దీనికి పెద్దగా భయపడాల్సిన పనిలేదు. కానీ ఈ తేడా 10 పాయింట్ల కంటే ఎక్కువ ఉంటే మాత్రం జాగ్రత్త పడాల్సిందేనని పరిశోధకులు సూచిస్తున్నారు. ఇంతకీ రెండు చేతుల్లో రక్తపోటు కొలతల్లో వ్యత్యాసం ఎందుకు కనబడుతుంది? యువకుల్లోనైతే.. చేతికి రక్తసరఫరా చేసే ధమనిని కండరం గానీ మరేదైనా గానీ నొక్కినపుడు లేదా రక్తసరఫరా సరిగా జరగకుండా నిరోధించే నిర్మాణలోపం వంటివి దీనికి కారణమవుతాయి. మధ్యవయసువారిలో, వృద్ధుల్లోనైతే.. రక్తనాళాల్లో పూడిక ఏర్పడటం వల్ల ఇలా రెండు చేతుల్లో రక్తపోటు కొలతల్లో వ్యత్యాసం కనబడుతుంది. అరుదుగా మరికొందరిలో బృహద్ధమని కవాటంలో చీలిక తలెత్తినా కొలతల్లో తేడాలు వస్తాయి. అందువల్ల ఈసారి రక్తపోటు పరీక్ష చేయించుకునే సమయంలో రెండు చేతులకూ చేయించుకోవటం మరచిపోకండి. అలాగే రక్తపోటు పరీక్ష చేయించుకోవటానికి 30 నిమిషాల ముందుగా కెఫీన్‌, మద్యం, నికోటిన్‌ వంటివి తీసుకోవద్దనీ గుర్తుంచుకోండి. కొద్ది నిమిషాల సేపు ప్రశాంతంగా కూచోవాలి కూడా. ఇక పరీక్ష కోసం చేతిని ముందుకు చాచినపుడు మోచేయి గుండెకు సమానమైన ఎత్తులో ఉండేలానూ చూసుకోవాలి.

  • *===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

Do we clean Ear wax regularly?,చెవిలో గులిమి తీయాలా?వద్దా?

  •  
  •  

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .


ప్ర : చెవిలో గులిమి తీయాలా?వద్దా?
జ : ప్రస్తుత సమాజంలో మనకు తరచుగా కనబడే దృశ్యం చెవిలో ఏదో ఒకటి పెట్టి తిప్పుకుంటూ తాదాత్మ్యం పొందుతున్న అనుభూతి చెందడం! కొంతమందికి రోజుకు ఒకసారైనా చెవిలో ఏదో ఒకటి పెట్టి కాసేపు అటూ ఇటూ తిప్పకపోతే ఏమీ తోచదు. మరి కొంతమంది కనీసం వారానికో సారైనా చెవిని శుభ్రం చేసుకోక పోతే ఎలా అనుకుంటూ గులిమి తీసుకునే పనిలో నిమగమైపో తుంటారు. ఇదంతా చెవి ఆరోగ్యం పట్ల తమకున్న శ్రద్ధేననుకుంటూ సంబరపడి పోతుంటారు. అసలు చెవిని శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉందా అన్న ప్రశ్నకు... అస్సలు లేదన్న జవాబే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే చెవులు తమలోని భాగాలను వాటంతట అవే శుభ్రం చేసుకుంటాయి కాబట్టి.మానవ శరీరం అనేక అవయవాల సమ్మిళితం. దాదాపు అన్ని అవయవాలను మనం శుభ్రం చేసుకోవాల్సిందే. కానీ - చెవులను మాత్రం మనం ప్రత్యేకించి శుభ్రం చేయనక్కర్లేదు.  అయితే చెవిలో కొద్దిపాటి ఉండే గులిమి, నులివెంట్రుకలు చెవిలోనికి చీమలు, చిన్న చిన్న పురుగులు, ఇసుక రేణువులు వెళ్ళకుండా అడ్డుకోవడానికి ఉపయోగపడతాయి. మరి అటువంటప్పుడు గులిమిని పూర్తిగా తొలగించాలనుకోవడం ఎంత వరకు సమంజసం? అందుకే చెవిని శుభ్రం చేసుకునే బృహత్తర కార్యక్రమాన్ని విరమిస్తే ఎంతో మంచిది.

ఇకపోతే - చెవిలో ఏదో ఒకటి పెట్టి తిప్పాలనుకోవడానికి మరో ముఖ్యకారణం దురద! చెవిలో దురదగా ఉందన్న భావన కలగడంతోటే అందుబాటులో ఉన్న పెన్నునో, పెన్సిల్‌నో ఆడపిల్లల యితే తలపిన్నునో అలవోకగా చేతుల్లోకి తీసుకోవడం చెవుల్లో పెట్టి అటూ ఇటూ తిప్పడం సహజం! ఇందువల్ల దురదయితే తాత్కాలికంగా తగ్గుతుంది. కాసేపు ఎంతో హాయిగా ఉంటుంది. కొద్దిసేపు గడచిన తర్వాత మొదలవుతుంది అసలు బాధ... అదే భరించలేని చెవినొప్పి! చెవి డాక్టర్‌ను సంప్రదించడమే ఇక తక్షణ కర్తవ్యం.

  • గులిమి చెవులకు రక్ష.
  • గులిమి చెవి లోపలికి నీళ్లు, ఇన్‌ఫెక్షన్ల వంటివి జొరబడకుండా కాపాడుతుంది.
  • చెవిలో దుమ్మూధూళీ పోగుపడటం వల్లనే గులిమి ఏర్పడుతుందని చాలామంది భావిస్తుంటారు. కానీ ఇది నిజం కాదు. మన చెవి మార్గం గోడల చర్మంలో సిరుమెన్‌ అనే ప్రత్యేకమైన గ్రంథులుంటాయి. వీటి నుంచే గులిమి పుట్టుకొస్తుంది. కాస్త జిగురుగా ఉండే ఈ గులిమి చెవి లోపలికి ఇన్‌ఫెక్షన్‌ కారకాలు, నీళ్ల వంటివి వెళ్లకుండా అడ్డుపడుతుంది. సాధారణంగా ఇది కొంతకాలానికి ఎండిపోయి.. పోగుపడిన దుమ్ము, రాలిపోయిన చర్మ కణాలతో పాటు బయటికి వూడి వచ్చేస్తుంది. అందువల్ల ప్రత్యేకించి గులిమిని తీయాల్సిన అవసరమేమీ ఉండదు. కానీ దురద, ఏదైనా అసౌకర్యం వంటివి ఉంటే.. ఇన్‌ఫెక్షన్లకు దారితీసే అవకాశముంటుంది కాబట్టి గులిమిని తీయాల్సి రావొచ్చు. కానీ అది కూడా నిపుణులైన డాక్టర్‌తోనే తీయించుకోవాలి. ముందు చుక్కల మందు వేసి, మెత్తబడ్డాకే గులిమిని తీస్తారు. ఎందుకంటే చెవి మార్గంలోని గోడల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. చిన్నపాటి గాయమైనా దెబ్బతింటుంది. అంతేకాదు సరిగా శుభ్రం చేయకపోతే చెవి మార్గం చివరన ఉండే కర్ణభేరికి రంధ్రం పడొచ్చు. దీంతో వినికిడి దెబ్బతింటుంది, లోపలి చెవికి ఇన్‌ఫెక్షన్లు సోకే ప్రమాదమూ పెరుగుతుంది. దూది చుట్టిన పుల్లలతో (ఇయర్‌ బడ్స్‌) తిప్పటం వల్ల గులిమి మరింత లోపలికి పోవచ్చు కూడా. అందువల్ల చెవిలో పుల్లలు, పిన్నులతో కెలకడటం ఎంత మాత్రమూ మంచిది కాదని గుర్తుంచుకోవాలి. అలాగే గులిమి తీసేవారితో చెవులను శుభ్రం చేయించుకోవటమూ పనికిరాదు.`
  • *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Thursday, March 6, 2014

వై-ఫై (Wi-Fi) కనెక్షన్‌ ఉండడము వలన ఆరోగ్యవిషం లో అందోళనపడాల్సిన అంశాలేమైనా ఉన్నాయా?.




ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : ఇంట్లో 24 గంటలూ వై-ఫై (Wi-Fi) కనెక్షన్‌ ఉండడము వలన ఆరోగ్యవిషం లో అందోళనపడాల్సిన అంశాలేమైనా ఉన్నాయా?.

జ : మఒబైల్ ఫోన్లు లేదా వై-ఫై రోటర్లు విడుదల చేసే తక్కువ స్థాయి ఎలక్ట్రో మేగ్నెటిక్ రేడియేషన్‌ (ఇఎమ్‌ఆర్)వల్ల ఆరోగ్యము పై హానికర ప్రభావాలుటాయన్న దానికి శాస్త్రీయ బద్ధమైన ఆధారాలేవీ లేవు . ఇ.ఎమ్‌.ఆర్ కు దీర్ఘకాలము ఎక్ష్పోజ్ కావడము వలన దీర్ఘకాలిక ప్రభావాలకు సంబంధించిన డేటా అయితే లేదుగాని .... తలనొప్పి , చెవుల్లోమోగుతున్నట్లుండడం , నిద్రలేమి , మూడ్ స్వింగ్స్ కు గంటలతరబడి మొబైల్ వాడడం కారణమన్న ఆధారాలున్నాయి . ఏది ఏమైనా కనీసమాత్రము గా ఎక్ష్పోజ్ కావాలని , ముఖ్యముగా పిల్లల విషయములో పాటించాలని నిపుణులు సూచిస్తూ ఉన్నారు. రాత్రివేళలలో వై-ఫై స్విచ్చాఫ్ చేస్తే మంచిది. మొబైల్ కబులు కూడా తగ్గిస్తే ఆరోగ్యానికి మంచిది.

  • *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

నొప్పినివారణ మాత్రలు వినికిడి ని తగ్గిస్తాయా?

  •  



ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
 ప్ర : నొప్పినివారణ మాత్రలు వినికిడి ని తగ్గిస్తాయా?

జ : సరిగ్గా వినబడకపోవడానికి సవాలక్ష కారణాలు ఉండవచ్చు .. పెయిన్‌కిల్లర్స్ కూడా ఇందుకు ఓ కారణము . తరచు గా ఇబ్రూఫెన్‌ , పారాసెటమాల్ లాంటి (NSAIDs)మాత్రలు వాడుతుంటే వినికిడి శక్తి తగ్గుతుంది. ముఖ్యముగా వారములో కనీషము రెండుసార్లయినా ఫెయిన్‌ రిలీవర్స్ వాడే వారిలో హియరింగ్ లాస్ 24 శాతము వున్నట్లు గుర్తించారు. ఆస్ప్రిన్‌ కూడా ఉందుకు కారణము .

అంతర్గత చెవిలో " కాక్లియా " అనే నత్తమాదిరి గా ఉండే చిన్న వినికిడి మెకానిజానిజం నకు రక్తప్రసరణ తగ్గించం ద్వారా డామేజీని కలిగిస్తాయి. పారాసిటమాల్ కూడా కాక్లియా డ్యామేజీ పరిరక్షించే యాంటీఆక్షిడెంట్ ''గ్లుటాథియోన్‌'' ను తగ్గిస్తుంది. శరీరములో ఎక్కడైనా నొప్పి అనిపించీ అనిపించగానే గటుక్కున మాత్రలు మింగివేయకుండా వీలైనంతవరకు ప్రత్యామ్నాయ మార్గాలద్వారా నివారణపొందేందుకు ప్రయత్నించాలి. ఇక తప్పదు అనుకున్నప్పుడే తప్ప నివారణ మాత్రలు వాడాలి.

  • *=========================== 

visit my website - > Dr.Seshagirirao-MBBS -

Sunday, March 2, 2014

Akhillis Tendinitis,పాదము లేదా కాలు వెనక బాగము నొప్పి ,అఖిల్లిస్ టెండినైటిస్

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
  •  
  •  

 ప్ర : మా అబ్బాయికి 14 సం.లు. ఉదయము లేస్తూనే కుడిపాదం నొప్పి అని చెప్తుంటాడు .నిద్రలేచి కాలు కిందపెట్టగానే భారముగా ఫీల్ అవుతాడు .కొద్దిసేపు నడిచాక తగ్గిపోతుంది. ఇదిఏమైనా ప్రమాదమా?

జ : మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీవాడికి " అఖిల్లిస్ టెండినైటిస్ (Akhillis Tendinitis)" అనే దానితో బాధపడుతున్నాడినిపిస్తుంది. కాలు వెనక లేదా పాదం వద్ద నొప్పిగా ఉంటుంది. ముఖ్యముగా పడుకొని లేదా ఎక్కువ సేపు కూర్చొని లేచాక ఈ నొప్పి వస్తుంటుంది. ఇందుకు ట్రీట్మెంటు  అవసరము ఉంటుంది . ఎముకల నిపుణులకు సంప్రదించి తగిని చికిత్స తీసుకోవాలి. ఎంత ముందుగా అయితే అంత సులువుగా నయమయ్యే అవకాశాలు ఉంటాయి.

  • *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Saturday, March 1, 2014

My testicle became smaller why?,వృషణం చిన్నదైపోయింది...ఎందుకిలా?

  •  
  •  

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 వృషణం చిన్నదైపోయింది...ఎందుకిలా?

Q : నాకు 25 ఏళ్లు. ఐదేళ్ల కిందట కుడి వృషణంలో అకస్మాత్తుగా నొప్పి వచ్చి, ఆ తరవాత వాచింది. అప్పుడు యాంటీబయాటిక్స్ వాడాను. ఆ తర్వాత ఆర్నెల్లకు కుడివైపు వృషణం బఠాణీ గింజంత అయిపోయింది. ఎడమవైపు వృషణం మాత్రం మామూలుగానే ఉంది. పెళ్లయిన తర్వాత ఇది దాంపత్య జీవితానికి ఏమైనా అడ్డంకా?

A :మీరు మొదటిసారి నొప్పి వచ్చినప్పుడు మంచి డాక్టర్ ని సంప్రందించి .. డాప్లర్ అల్ట్రా సౌండ్ స్క్రోటమ్ పరీక్ష చేయించి ఉంటే అది వృషణంలో ఇన్ఫెక్షనా (ఎపిడైడమో ఆర్కయిటిస్) లేకపోతే వృషణం మడతపడటమా (టెస్టిక్యులార్ టార్షన్) అనే విషయం తెలిసి ఉండేది. ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే... మడత పడినప్పుడు ఆరుగంటల్లోపు ఆపరేషన్ చేసి వృషణాన్ని నార్మల్ పొజిషన్‌కి ఉంచితే అది సక్రమంగా పనిచేసేది. అలా చేయకపోతే వృషణానికి రక్తప్రసరణ పూర్తిగా ఆగిపోయి తర్వాత చిన్నదైపోతుంది. అప్పుడు వీర్యకణాలను ఉత్పత్తి చేయలేదు. కేవలం సెక్స్ హార్మోన్లను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. ఇలాంటివారిలో నొప్పి ఉన్నా, లేకపోయినా రెండో వైపు వృషణాన్ని ఫిక్స్ చేసుకోవడం (ఆర్కిడోపెక్సీ) మంచిది. అప్పుడు రెండోవైపు మడత పడే సమస్య రాదు. మీరు వెంటనే యూరాలజిస్ట్‌ను కలిసి ఆర్కిడోపెక్సీ గురించి వివరాలను తెలుసుకోండి.

 *===========================

 visit my website - > Dr.Seshagirirao-MBBS -

Is morning sickness of pregnancy Hereditary?,వేవిళ్లు వంశపారంపర్యం?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : వేవిళ్లు వంశపారంపర్యం?
జ : గర్భం దాల్చినప్పుడు సహజంగా మహిళల్లో వేవిళ్లు రావడం జరుగుతుంది. కొందరు ఈ వేవిళ్లతో చాలా ఇబ్బంది పడతారు. మరికొందరికి మొదటి నాలుగు, ఐదునెలల వరకే ఈ ఇబ్బంది ఉంటుంది. వీటితో అంత ప్రమాదం లేకపోయినా.. వాంతులు కావడంతోబాటు కొన్ని వాసనలకు కడుపులో తిప్పినట్లు ఉంటుంది. ఇవి మరీ తీవ్రమైతే శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. అంతేకాదు బరువు కూడా కోల్పోతారు. ఈ సమస్య తక్కువమందిలో కనిపించినా, కొందరిలో దీనివల్ల నెలలు నిండకుండానే కాన్పు కావటం వంటి తీవ్ర పరిణామాలకూ దారి తీస్తుంది. ఈ తీవ్ర వేవిళ్ల సమస్య వంశపారంపర్యంగా వస్తున్నట్లు తాజా అధ్యయనాలు వెల్లడిం చాయి. తీవ్రమైన వేవిళ్లతో బాధపడిన తల్లులకు పుట్టిన ఆడపిల్లలకు ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటున్నట్లు నార్వే పరిశోధకులు గుర్తించారు. తీవ్రమైన వేవిళ్లతో బాధపడిన తల్లులకు పుట్టిన 5,44,037 మంది మహిళల వివరాలను U.S.A సేకరించి, అధ్యయనం చేశారు. గర్భం ధరించిన సమయంలో ఒకసారి వేవిళ్లతో ఇబ్బందిపడినా అది వారికి పుట్టిన అమ్మాయిల్లోనూ కనిపిస్తున్నట్టు గుర్తించారు. వేవిళ్లు- వంశపారం పర్య సంబంధాన్ని బాగా అర్థంచేసుకో గలిగితే.. స్త్రీలకు ముందు నుంచే చికిత్స చేయటంలో వైద్యులకు ఉపయోగ పడుతుంది.

 *===========================

visit my website - > Dr.Seshagirirao-MBBS -

Tension is more in Teenage how to prevent?,టీనేజర్లలో వత్తిడి ఎక్కువగా ఎందుకుంటుంది?ఎలా తగ్గించుకోవాలి?

  •  


  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
ప్ర :  టీనేజర్లలో వత్తిడి ఎక్కువగా ఎందుకుంటుంది?ఎలా తగ్గించుకోవాలి?
జ : బాల్యదశ పన్నెండు సంవత్సరాల దాకా, ఆ తర్వాత కౌమారదశ, ఈ కౌమారదశనే టీనేజ్‌ అంటారు. ఆంగ్లభాషలో చెప్పుకుంటే థర్టీన్‌(Thirteen) నుంచీ నైన్టీన్‌(Nineteen) వరకూ టీనేజ్‌ వయస్సు. ఆ నెంబర్ల చివర 'టీన్‌' అనే మాట టీనేజ్‌నే స్ఫురింప చేస్తుంది. టీనేజ్‌ వయస్సును యుక్త వయస్సుగా పరిగణిస్తారు పెద్దలు. ఆ వయస్సులో మానసికంగా, శారీరకంగా కూడా పిల్లల్లో, ముఖ్యంగా ఆడపిల్లల్లో కొన్ని మార్పులు స్పష్టమవుతాయి. కౌమారదశలో ఎంతో ఉత్సాహంగా ఉండటమే కాక, వారిలో స్వతంత్రగా ప్రవర్తించాలన్న మనస్తత్వమూ ఏర్పడుతుంది.

తమకుగల అభిరుచుల్ని అభివృద్ధి పరుచుకునే విషయములో , తమ ఐడెంటిటీని ప్రదర్శించే ప్రయోగాలకు సంబంధించి ఈ వయసు అత్యంత కీలకమైనది. అలాగే కెరీర్ చాయిస్ లకు సంబంధించిన మూలం కూడా ఈ వయసులోనే మఒదలవుతుంది. తమ స్వంత అంచనాలను అందుకోలేకపోయినప్పుడు వారిలో ఆందోళన మొదలౌవుతుంది ... అది వత్తిడికి దారితీస్తుంది. ర్యాంకుల హడావిడిని అందుకునే క్రమములో టార్గెట్లు వారిని భయపెడుతూ ఉంటాయి.

కార్పొరేట్ కాలేజీల వాతావరనములో సర్దుబాట్లు ఒక్కోసారి వారికి కష్టము అవుతాయి. ఒక్క సారిగా జీవన శైలి మారిపోతుంది. తమ తల్లిదండ్రులు చాలా డబ్బు ఖర్చుపెడుతున్నారన్న భావం వల్ల గిల్టీగా ఫీలవుతారు. తల్లిదండ్రుల్ని ఎవాయిడ్ చేయడము , డిప్రెషన్‌ కి లోనుకావడము , కోపాన్ని ప్రదర్శించడము , బాగా తక్కువ లేదా ఎక్కువ తినడం , నిద్రకు సంబంధిన లోపాలు , కుటుంబసభ్యులు , స్నేహితులు లతో కలవకపోవడము వంటివి ఒత్తిడి లక్షణాలు,

టీనేజర్స్ ని వత్తిడినుండి కాపాడడము లో తల్లిదండ్రులదే కీలకపాత్ర .
  • ఓర్పుగా , సహనము గా వ్యవహరిస్తేనే ఫలితము ఉంటుంది. 
  • వారి శక్తికి మించి కాకుండా వాస్తవిక లక్ష్యాలు నిర్ణయించాలి.
  • తల్లిదండ్రులు నిరంతము  టచ్‌ లో ఉండాలి ,
  • కొంత ఫ్రీ టైమ్‌ ఇస్తే టీనేజలు రిలాక్ష్ అవుతారు, 
  • వారు చెప్పేది జాగ్రత్తగా వినాలి ... సలహాలు .. సూచనలు ఇవ్వాలి . వీలయినంత ఎక్కువగా ఎఫెక్షన్‌ అందించాలి. 
  • ప్రతిసారి వారికి సాయపడే ధోరణి కాకుండా వారి వారి ప్రతిభ , నైపుణ్యాల్ని ఉపయోగించుకోనివ్వాలి. గైడెన్స్ ఇస్తే చాలు.

  •  *=========================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS