Sunday, March 30, 2014

What is functional food?give examples?,ఫంక్షనల్ ఫుడ్ అంటే ఏమిటి? ఉదాహరణాలివ్వండి?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర : ఫంక్షనల్ ఫుడ్ అంటే ఏమిటి? ఉదాహరణాలివ్వండి?
జ : ఫంక్షనల పదార్ధాలంటే సాధారణం గా వ్యాధుల రిస్కును తగ్గించుకోడానికో లేదా ఆశావహ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోడానికో ఉపయుక్తమైనవి. ఆధునిక కాలములోముందస్తు జాగ్రత్తకోసము , దీర్ఘకాలిక వ్యాధుల చికిత్స , సరియైన ని్ర్వహణకోసం ... ఈ పదార్ధములు ప్రధానమైన ఆహారము .

ఉదాహరణములు : 
వీట్ గ్రాస్ జ్యూస్ : హైపర్ టెన్సన్‌ గలవారికి  ఇది అద్భుతపదార్ధము . మెగ్నీషియం , పొటాషియం లకు మంచి ఆదారము .ఈ రండు ఖనిజాలు రక్తపోటును తగ్గిస్తాయి. ఇవి తగ్గితే రక్తపోటు పెరుగుతుంది. చాలినంత మెగ్నీషియం , పొటాసియం తీసుకోవడము వల్ల వాడుతున్న మందులకు సపోర్టింగ్  గా ఉంటుంది .
----------------------------------------------------------

వెళ్ళుల్లి : రక్తాన్ని పల్చపరచడములో సహకరించే గుణాలు దీనిలో ఉంటాయి. కొలెస్టిరాల్ ను, హోమోసిస్టిన్‌ స్థాయిలను తగ్గించడములో సహకరిస్తుంది. రక్తనాళాలలో ప్లేక్స్ ఏర్పడడాన్ని తగ్గించడమే కాకుండా క్లాటింగ్ ను అరికడుతుంది.
--------------------------------------------------------------

-
ఓట్స్ :  దీనిలోని బెట-గ్లుకన్‌(సోల్యుబుల్ ఫైబర్) కొలెస్టిరాల్ స్థాయిలను సహకరిస్తుంది. ప్రతి రోజూ అరకప్పు నుండి కప్పు దాకా ఓట్స్ తింటే అనేక ప్రయోజనాలు ఉంటాయి.

---------------------------------------------------------

టమాటో : free radicals damage నుండి  పరిరక్షిస్తుంది , రక్తపోటు నియంత్రణలోనూ , ప్రోస్ట్రేట్  ఆరోగ్య విసయములో సహకరిస్తుంది. చర్మము పై  సూర్యకిరణాలు ప్రభావాన్ని కూడా తగ్గించగల గుణాలున్నాయి. 

  • *=========================== 

visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.