Tuesday, October 28, 2014

Antacids in pregnency , గర్భిణి స్త్రీలు యాంటాసిడ్స్ వాడవచ్చా?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : నేను 5 నెలల గర్భవతిని. తరచూ ఆకలి వేస్తుంది. ఎక్కువగా తింటున్నాను . దీనివలన గుండెలో మంటగా ఉంటూంది. యాంటాసిడ్స్ తీసుకోవచ్చా?.ఏవైనా పదార్ధాలు మానేయాలా?

జ : గర్భం దాల్చాక తొలినెలలో వేవుళ్లు (వికారము , వాంతి) ఉంటాయి. దీనివలన కడుపులో ఎసిడిటీ ఎక్కువగా ఉండే అవకాశము ఉంటుంది. ఆహారము జీర్ణము అవడానికి ఎక్కువ సమయము పడుతుంది. కావున తక్కువ తక్కువ గా ఎక్కువసార్లు తినాలి. మనుషులలో ఈసోఫేగస్ ('oesophagas) చివర వాల్వ్ సాధారణము గా మూసికొని ఉంటుంది. గర్భము దాల్చిన  తరువాత హార్మోనుల ప్రభావము వలన ఓపెన్‌ అయి ఉంటుంది. దీంతో జీర్ణాశము లోని యాసిడ్ పదార్ధములు ఈసోఫేగస్ లోనికి రిగర్జిటేట్('Regurgitate) అవుతూఉంటాయి. అందువలన గుండెలో మంటగా ఉంటుంది.

తినగానే పడుకో వద్దు .. కనీసము 20 నిముషాలు తిన్నగా కూర్చోంది. లేదా 10 నిముషాలు చిన్నగా అటూ ఇటూ నడవండి. . కారము , మసాలా పదార్ధాలు ఎక్కువగా తినవద్దు . యాంటాసిడ్స్ తీసుకోవచ్చును . కాని ఐరన్‌ మాత్రలు... యాంటాసిడ్స్ వెంట వెంటనే గాని , కలిపి గాని తీసుకోకూడదు. ఈ రెండూ ఒకదానితో ఒకటి చిలేట్ ('chelate) అయిపోవడము వలన ఉపయోగముండదు.

  • *=========================== 

Friday, October 24, 2014

Good oils for skin in wnter,చలికాలములో చర్మానికి తగిన నూనెలు తెలపండి?

  •  

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : శీతాకాలము లో నా చర్మము పొడిగా ఉండి పగిలి పోతుంది . చలికాలములో చర్మానికి తగిన నూనెలు తెలపండి?

జ : చలికాలములో పడిపోతే ఉష్ణోగ్రత , వీచే చలిగాలులు  చర్మాన్ని  చాలా ఇబ్బంది పెడతాయి ... కాబట్టి చర్మానికి ఈ ఋతువులో అధనపు రక్షణ అవసరము . ఆ రక్షణ అందించేవి తైలాలు. వీటిని చర్మము పైన మర్ధన చేసినప్పుడు అవి చర్మాన్ని నునుపుగా చేస్తాయి. అందుకు వాడతగిన తైలాలలో ముఖ్యమైనవి ......

కొబ్బరినూనె : దీనిలో లవణాలు అధికము . దీనిని శరీరానికి రాసుకుంటే ముడుతలు  రాకుండా కాపాడుకోవచ్చును. చర్మము ఏ తరహా కి చెందినదైనా కొబ్బరినూనె వాడకము సరైనదే. పలురకాల చర్మరొగాలు సోకకుండా కాపాడే శక్తి కొబ్బరినూనెకు ఉన్నది.

ఆలివ్ నూనె : చర్మ సౌందర్యానికి చక్కని సాధనము ఆలివ్ నూనె . దీనిలోని విటమిన్‌ 'E' యాంటి ఆక్సిడెంట్ గా చర్మము వయసుతో వచ్చే మార్పులకు గురికానివ్వదు . ఆలివ్ నూనె మర్ధన చేస్తే చర్మము ఎంతో చక్కని వెలుగును సంతరించుకుంటుంది.

ఆల్మండ్ ఆయిల్ : చర్మాన్ని ఎండిపోనివ్వదు ... ఈ నూనె రాసుకుంటే చర్మము తేమను గ్రహిస్తుంది. మీ చర్మము ఏ తరహాది అయినా ఈ ఆయిల్ ని రాసుకోవచ్చు . దురద , మంట వంటి సమస్యలను చర్మానికి రానివ్వదు . చర్మము పగలు కుండా కాపాడుతుంది.

నువ్వుల నూనె : ఇందులోని విటమిన్‌ 'B' , 'E' లు ఆరోగ్యానికి ఎంతోమేలు చేస్తాయి. దీనిలోని కాల్సియం , మెగ్నీషియం ల ద్వారా చర్మము లబ్దిపొందుతుంది . సూర్య కాంతి ప్రభావము చర్మము మీద పడకుండా రక్షిస్తుంది. నువ్వుల నూనె తో శరీరము మర్ధన చేయించుకుంటే అలసట ఇట్టేపోతుంది. చర్మానికి తాజాదనము సమకూరి ఉత్సాహాన్ని తెచ్చిపెడుతుంది.

జజోబా నూనె : దీనిలోని సూక్ష్మజీవ్-సంహార గుణము వల్ల చర్మానికి చక్కటి రక్షణ ఇస్తుంది. చర్మములో సహజము గా ఉత్పత్తి అయ్యే తైలాలకు జజోబా ఆయిల్ లో ఉన్న రసాయనాలకు దగ్గరి పోలిక కనిపిస్తుంది అందువల్ల జజోబా నూనెను చర్మము ఎటువంటి ప్రతిచర్య చూపకుండానే గ్రహిస్తుంది. ఇది రాసుకుంటే చర్మానికి ఎలర్జీ ఉండదు. 

  • *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Thursday, October 23, 2014

Bed wetting in children, పిల్లలలో పక్క తడుపు అలవాటు

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : మా అబ్బాయి వయస్సు 7 సం.లు. ఇప్పటికీ రాత్రివేళల్లో పక్క తడుపు తుంటాడు . చలికాలములో అయితే మరీ ఎక్కువ . ఈ పరిస్థితిని ఏవిధం గా అధిగమించాలి?.

జ : పిల్లల పక్క తడుపు అలవాటుకు అనేక కారణాలు ఉంటాయి.
శారీరక కారణాలు ,
మానసిక కారణాలు ,
సామాజిక కారణాలు .
-------ఎన్నో అంశాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి.   పలానా కారణము అని స్పస్టముగా చెప్పలేము. ఇలా పక్క తడుపు అలవాటున్న పిల్లలు ... అభద్రతా భావముతోనూ, ఆత్మన్యూనత తో ఒంటరిగా ఫీలవుతుంటారు కూడా. కాబట్టి వీరికి === బరోషా ఇవ్వాలి . సంపూర్ణ మద్దతు ఇస్తూ దగ్గరకు తీస్తుండాలి. పదే పదే  అతనిలోని లోపాన్ని అతని ముందే చర్చించకూడదు.  ఓర్పుగా వ్యవహరించాలి. పడుకునే ముందు బాత్ రూం కి వెళ్ళే అలవాటు చేయాలి. మధ్యలో  ఒకటి రెండు సార్లు దగ్గరుండి తీసుకువెళ్తుండాలి . పిల్లల వైద్య నిపుణుల్ని ఓ సారి సంప్రదించండి.

  • *=========================== 

Wednesday, October 22, 2014

Pain in Lower abdome of pregnancy why?,గర్భవతి పొత్తికడుపులో నొప్పి ఎందువల్ల?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : నేను 16 వారాల గర్భవతిని . పొత్తికడుపులో రెండువైపులా నిరంతరం నొప్పి ఉంటుంది. ఎందువల్ల?.

 జ : గర్భము దాల్చాక ... గర్భసంచి లిగమెంట్లు సాగడము జరుగుతుండడము వల్ల ప్రతివారికీ ఎంతోకొంత ఉదరము కిందిభాగము నొప్పి వస్తూ ఉంటుంది.  ఇది సాధారణము గా గుర్తించబడినంతగా ఉండదు. అయితే మిగతా కారాణాలు ఏమైనా ఉన్నాయేమో కూడా చూసుకోవడము మంచిది.
ఒక్కొక్క సారి యూరినరీ ఇన్‌ఫెక్షన్‌  లేదా కడుపులోని పేగుల ఇన్‌ఫెక్షన్‌ లు కారణము కావచ్చు. స్కానింగ్ చేయించుకొని సరియైన కారణము గుర్తించాలి ... దానికి తగిన చికిత్స తీసుకోవాలి.

  • *=========================== 

Saturday, October 18, 2014

Skinfolds and black lines arround eye, కళ్ళ వెంబడి ముడతలు.ఫైన్‌లైన్స్(చారలు) తగ్గించుకునే మార్గము

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర : నా కళ్ళ వెంబడి ముడతలు , ఫైన్‌లైన్స్(చారలు) వచ్చాయి. వీటిని సహజముగా ఏవిధముగానైనా తగ్గించుకునే మార్గము ఉందా?

జ : కళ్ళ చుట్టూ గల ముడతల్ని , ఫైన్‌లైన్స్ ను " క్రోస్ ఫీట్(crows feet) "  అంటారు .సుమారు 30 సం.లు వరకూ ఇవి కనిపించవు . ఆ పైన కొంతమందికి త్వరగా ను కొంతమందికి ఆలస్యము గాను కనిపిస్తాయి. ఇవి ముఖ అందాన్ని తగ్గిస్తూ ముసలితనమును ఎత్తిచూపుతాయి. తాజాగా అందుబాటులోకి వచ్చిన నాన్‌-ఇనారసిన్‌ చికిత్సలు , కీమ్స్ తో క్రమము తప్పని మసాజ్ లు ఉపయోగపడతాయి. రెటినాల్ , విటమిన్‌ 'A' గల క్రీములు వాడితే క్రమముగా మార్పు వస్తుంది.

పాలు , అలోవెరా , బాదం నూనె , బొప్పాయిగుజ్జు  రాయడము వల్ల చర్మము బగుతుగా మారుతుంది. వీటితో పాటు కొంతమంది బొటాక్ష్ , ఫిల్లర్స్ , త్రెడ్ లిస్ట్ , రేడియోఫ్రీక్వెన్సీ  వంటి ఇన్వాసివ్ - నాన్‌సర్జికల్ పద్దతులను అనుసరించవచ్చు.

  • *=========================== 

Do Low-fat diet cause for infertility?,లోఫ్యాట్ డైట్ ఇన్‌ఫెర్టిలిటీకి కారణమవుతుందా?

  •  
  •  

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : లోఫాట్ డైట్ ఇన్‌ఫెర్టిలిటీకి కారణమవుతుందా?

జ : ఎప్పుడూ కూడా లోఫ్యాట్ డైట్ తింటూ , కొవ్వు పదార్ధాలు పూర్తిగా మానేసే మహిలలో సంతాన అవకాశాలు తక్కువని ఇటీవలి కొన్ని వైద్య అధ్యయనాలు పేర్కొటున్నాయి.ఇటువంటి వారిలో మిగరా వారితో పోల్చితే 27 శాతము సంతాన అవకాశాలు తక్కువన్నది ఈ పరిశోధనల సారాంశము . సాధారణము గా కొవ్వు ఏమాత్రము లేని పదార్ధాలు తినేవారి శారీరక బరువు బాగా తక్కువగా ఉంటుంది.  సరియైన ఓవులేటరీ ప్రక్రియ కోసము కనీసమాత్రపు శారీరక బరువు , ఫ్యాట్ అవసరము . అలాగే శరీరములో కొన్ని స్టెరాయిడ్స్ ఉత్పత్తికి కొలెస్టిరాల్ (cholesterol) అవసరము  . లోఫ్యాట్  పదార్ధాలలోని కొన్ని ఆర్టిఫీషియల్ పదార్ధాలు ఉండడము వలన సంతాన రాహిత్యానికి దారితీస్తాయన్నది సాధారణముగా పరిగణించే విషయాలు. ఈ విషయాలనీ రూడి చేయడానికి ఇంకా కొంతకాలము వేచిఉండాలి. ఏది ఏమైనా ఆహారములో మితముగా ఆరోగ్యవంతమైన కొవ్వు తప్పనిసరిగా ఉండాలి.

  • *===========================

Saturday, October 11, 2014

ఆరోగ్యం విషయములో మంచినీటి ఉపయోగాలేమిటి ?

  •  

  •  
 
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : ఆరోగ్యం విషయములో మంచినీటి ఉపయోగాలేమిటి ?

జ : చాలారకాల అనారోగ్యాలు అవసరయినంత నీటిని తాగక పోవడము వల్ల కలిగేవే . చాలామంది దాహము వేస్తేనో , వాతారణము వేడిగా ఉంటేనో నీరు తాగుతారు . . . తప్ప మామూలు పరిస్థితులలో అంతగా తాగరు. కాఫీ, టీ , శీతల పానీయాలు గాగేసి ద్రవ పదార్ధాలు తీసుమునాం కదా అని భావిస్తారు. కాని ఇవి మంచి నీటికి ప్రత్యామ్నాయాలు ఎంతమాత్రము కావు . మంచినీటిని చాలినంతగా గాగడానికి పదిరకాల కారణాలు చెప్పుకోవచ్చును .
  1. నీరు శరీరములోని ప్రతికణానికీ పోషకాలను అందేందుకు సహకరిస్తుంది.
  2. డిహడ్రేషన్‌ రాకుండా కాపాడుతుంది,
  3. కిడ్నీలను ఆరోగ్యము గా ఉంచి , మరింత సమర్ధవంగముగా పనిచేసేందుకు సహక్రరిస్తుంది. 
  4. కిడ్నీలో రాళ్ళు , ఇన్‌ఫెక్షన్‌ వంటి సమస్యలను బాగా తగ్గిస్తుంది. 
  5. తక్కువ రక్తపోటు వారికి సాధారణ రక్తపోటు స్థాయిలు రావడానికి ఉపయోగపడుతుంది, 
  6. వ్యామామము వలన కోల్పోయిన ద్రవాలను బేలన్స్ చేస్తుంది. 
  7. శరీరము అధిక వేడికి గురికాకుండా పరిరక్షిస్తుంది. ,
  8. శరీరానికి శక్తినిస్తుంది , 
  9. అలసటను తగ్గిస్తుంది .
  10. శరీరములో జీవక్రియను ఉత్తేజపరుస్తుంది. హార్మోనుల సమతుల్యతను కాపాడుతుంది.
*
  • =========================== 

Sunday, October 5, 2014

బుగ్గలు-ముక్కు పక్కల్లో ఎర్రని చిన్ని చిన్ని వెయిన్స్ కనబడుతుంటాయెందుకు?

  •  

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
  •  
  •  

 ప్ర : నా బుగ్గలు , ముక్కు పక్కల్లో అసహజమైన ఎర్రని చిన్ని చిన్ని వెయిన్స్ కనబడుతుంటాయి. ఎందువల్ల?

: దీర్ఘకాలికంగా ఉండే , తరచూ ప్రొగ్రెసివ్ అయ్యే " రొజాసియా (Rosacea)" అనే చర్మవ్యాధి కావచ్చు . సాధారణముగా ఇది ముఖము పై వస్తుంటుంది. . . తరచూ ఫ్లషింగ్ గా వస్తూ చర్మము ఎర్రబారిపోతుంటుంది. కొన్ని సార్లు సూర్యకిరణాలు సోకి , చర్మము మందముగా మారి బ్రేక్ అవుట్స్ రావచ్చు . ఎమోషన్‌ స్ట్రెస్ , వేది లేదా చల్లని వాతావరణ్ము , గాలులు , హెవీ ఎక్సరసైజులు , హాట్ బాత్స్ , వేడి పానీయాలు , కొన్ని స్కిన్‌కేర్ ఉత్పత్తులు , స్పైసీ పాదార్దాలు ఈ సమస్యకు కారణాలు కావచ్చు . . . లేదా ఎక్కువచేయవచ్చు , మంది డెర్మటాలజిస్ట్ ని సంప్రదించండి .

  • *===========================

Thursday, October 2, 2014

eggs - fish- mutton- ప్రొటీన్లు అధికంగా ఉండే మాంసం.గుడ్లూ.చేపలూ తినడం వల్ల బరువు పెరగమా?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 Q :  ప్రొటీన్లు అధికంగా ఉండే మాంసం.గుడ్లూ.చేపలూ తినడం వల్ల బరువు పెరగమా?

Ans : మాంసం, గుడ్లూ, చేపలూ... ఇవి వరస పెట్టి తింటే ఏమవుతుంది? కెలొరీలు పెరుగుతాయి.. అమ్మో బరువు పెరిగిపోమూ అనిపిస్తుంది కదా! కానీ కాదు.. ప్రొటీన్లను ఎంతగా తింటే అంతగా బరువు తగ్గి నాజూగ్గా మారతారని అధ్యయనాలు చెబుతున్నాయి. గత అరవై ఏళ్లలో ప్రొటీన్ల వాడకం గణనీయంగా తగ్గిపోయిందనీ, దాని కారణంగానే ప్రపంచవ్యాప్తంగా వూబకాయం సమస్య పెరిగిపోయిందని ఈ అధ్యయనంలో తేలింది. ఆహారంలో తగినంత ప్రొటీన్ల శాతం లేనప్పుడు ఎంత తిన్నా ఆకలి అదుపులో ఉండదు. ముఖ్యంగా ప్రొటీన్లూ, కార్బోహైడ్రేట్ల సమతుల్యత పాటించడం చాలా అవసరం. అందులోనూ చాలామంది ఇష్టం లేకపోయినా కొత్త కొత్త ఆహార నియంత్రణల పేరుతో కొన్ని పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ఆ క్రమంలో తెలియకుండానే బరువుని పెంచే కార్బోహైడ్రేట్లకు దగ్గర అవుతున్నారు. కానీ ప్రొటీన్లు అధికంగా ఉండే మాంసం, గుడ్లూ, చేపలూ తినడం వల్ల కూడా మెరుగైన ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. చేపలని వారానికి మూడు సార్లూ, గుడ్డు రోజూ, కొవ్వులేని మాంసం వారానికోసారి తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.

  •  *===========================