Sunday, May 29, 2011

మోచేతులు , మోకాళ్ళు నల్లగా తయారయ్యాయి, Black color of arms and legs




ప్ర : నా మోచేతులు , మోకాళ్ళు ఈ మధ్యన నల్లగా తయారయ్యాయి . ఏదైనా ఇంటి చిట్కా వైద్యము తెలియజేయండి?

కళావతి ,. మంగువారితోట , శ్రీకాకుళం టౌన్‌

జ : మోచేతులు నల్లగా మారి మృదుత్వాన్ని కోల్పోతే చెంచా చొప్పున నిమ్మరసం, గ్లిజరిన్‌, నాలుగుచెంచాల పాలు, కొద్దిగా వంటనూనె.. తీసుకొని అన్నీ బాగా కలిపి డీప్‌ ఫ్రిజ్‌లో పెట్టాలి. పావుగంటయ్యాక తీసి మోచేతులు, మోకాళ్లకు మర్దన చేసి కొద్దిసేపటికి గోరువెచ్చటి నీళ్లతో కడిగేస్తే చక్కటి ఫలితం ఉంటుంది.

మూడుచెంచాల సెనగపిండిలో చెంచా పెరుగు కలిపి మోచేతులు, మోకాళ్లకు పూతవేయాలి. తేమ పూర్తిగా ఆరాక కడిగితే మోచేతులు, మోకాళ్ల మీద నలుపు తగ్గుతుంది.

  • ====================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

Sunday, May 22, 2011

దంపతులు అన్యోన్యత కి సెక్క్ష్ అవసరమా? ,Is sex necessary for good family life?



ప్ర : దంపతులు అన్యోన్యత కి సెక్క్ష్ అవసరమా?

రమ . ఎ.యన్‌.ఎం ---- శ్రీకాకుళం టౌన్‌.

జ : దాంపత్యజీవితంలో సెక్స్ ఉత్ప్రేరకంగా పని చేస్తుంది.. భార్యాభర్తల సంబంధాన్ని మరింత పటిష్టం చేయడంలో సెక్స్ పాత్ర అత్యంత ప్రధానమైంది. సెక్స్ జీవితం ఎంత బాగుంటే ఆ దంపతుల మధ్య అనుబంధం సైతం అంతే బాగుంటుంది. అందుకే దంపతులు తమ శృంగార జీవితానికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకుని దాంపత్య జీవితాన్ని నిత్య వసంతంగా మార్చుకోవడం మంచిది. అందుకు కొన్ని విషయాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. దంపతుల సెక్స్ జీవితానికి పడకగది వేదిక కాబట్టి దాని అలంకరణ విషయంలో కాస్త శ్రద్ధ వహించండి. శృంగారం విషయంలో దంపతుల మధ్య చక్కని ఉత్సాహం కలగడానికి పడకగదిలో ఏదైనా మంచి శృంగార భంగిమ ఉన్న ఫోటోను తగిలించండి. పడకగదిని మరే ఇతర కార్యక్రమాల కోసం ఉపయోగించకండి. అప్పుడే పడకగది మీ శృంగార జీవితానికి సౌకర్యవంతంగా ఉంటుంది.

పడకగదిలోని మంచం విశాలంగా ఉండేలా చూచుకోండి. బెడ్‌రూం గోడలకు రంగులు వేసే సమయంలో లేత రంగులను, ఆహ్లాదంగా ఉండే రంగులను ఎంచుకోండి. అలాగే పడుకునే ముందు పడకగదిలో మంచి సువాసనలు వెదజల్లే రూమ్ స్ప్రేలను ఉపయోగించండి, దీనివల్ల పడకగదిలోకి రాగానే శరీరం బడలిక మరచి మీలో శృంగార వాంఛలు రేకెత్తుతాయి. పడకగదిలో టీవీ కన్నా సంగీతం వినిపించే మ్యూజిక్ ప్లేయర్‌ను వాడండి. దీని ద్వారా చక్కని మంద్రమైన సంగీతం వినడం వల్ల మనసు తేలికపడి మీరు శృంగారం గురించి ఆలోచించగల్గుతారు. అలాగే బెడ్‌రూంకు అటాచ్‌డ్ బాత్‌రూం ఏర్పాటు చేసుకోండి. దీనివల్ల మీకు కావల్సిన ఏకాంతం లభిస్తుంది. పడకగదిలో దృష్టంతా జీవిత భాగస్వామిపైనే కేంద్రీకరించడం మంచిది.

  • =================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

Saturday, May 14, 2011

Does singing improve health?, పాటలు పాడడము వల్ల ఆరోగ్యము మెరుగవుతుందా?



ప్ర : పాటలు పాడడము వలన మనిషి ఆరోగ్యముగా ఉంటారని విన్నాను . ఎంతవరకు నిజము ?.

అన్నమాచార్య -- అమలాపురం .

జ : పాటలు పాడడానికి గానకోకిలలే కానక్కర్లేదు . ఏదో ఒక కూనిరాగం తీసినా దాని తాలూకు ఫలితాలు ఎంచక్కా కనిపిస్తాయి . పనులు చేసుకుంటూ నోటికొచ్చిన పాటలు పాడుకున్నా , బాత్రూమ్‌ హమ్‌ చేసినా ఒత్తిడిని సులువుగా ఎదుర్కోవచ్చు. ఒక గంటకాలం పాటు పాడాక , పాడక ముందు రక్త నమూనాలు పరిశీలించగా పాటలు ప్రాక్టీస్ చేసే వారి రక్తం లొ యాంటిబాడీస్ స్థాయిలెక్కువగా కనిపించాయి. ఒత్తిడిని తగ్గించే హైడ్రోకార్టిసోన్‌ హార్మోన్‌లో గుర్తించదగ్గ పెరుగుదల ఉందని నిపుణులు అంటున్నారు . ఆల్జీమర్ వ్యాధి గలవారికి కూడా ఇలా పాటలు పాడడం ఎంతగానో ఉపకరిస్తుందంటారు . జ్ఞాపక శక్తి కోల్పోవడం ఉండదని , మెదడు పనితీరు చురుగ్గా ఉంటుందని పరిశోధనలలో తేలింది .

  • ======================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

Wednesday, May 11, 2011

చెప్పులు లేకుండా నడిస్తే ఆరోగ్యానికి మంచిదా?,Is is true? walking without footware is good for health?.

ప్ర : చెప్పులు లేకుండా నడిస్తే ఆరోగ్యానికి మంచిదా?(Is is true walking without footware is good for health?.

జ : పాదరక్షలు లేకుండా బయట నడవకూడదు . అలా నడిస్తే ఏదైనా గుచ్చుకొని సెప్టిక్(చీము పట్టడడం) అవవచ్చును , టెటనస్ (ధనుర్వాతము ) అనే జబ్బు రావచ్చును . మంచిది కాదు . ఎంత నాణ్యమైన చక్కని పాదరక్షలు ఎంచుకుంటే అంత మంచిదన్నది ఎవరిలోనైనా మామూలుగా ఉండే సహజ అభిప్రాయము . అయితే ఆరోగ్యవంతమైన పాదాల రహస్యం చెప్పులులేకుండా రోజులో కొంతసేపైనా తిరగడమే.

షూ ధరించే సగటు వ్యక్తులు కంటే ధరించని సగతు వ్యక్తుల పాదాలు చాలా ధృడం గా ఆరోగ్యం గా ఉంటాయి. ప్రతిరోజూ కొంత సమయమైనా చెప్పులు లేకుండా నడవాలి . షూ ధరించే వారి పాదాల పై ప్రతి అడుగుకూ మెకానికల్ స్ట్రెస్ పడుతుంది . సెన్సిటివిటీ కోల్పోవడం , కండరాల శక్తి తగ్గడం జరుగుతుంది . కావున ఇంటిలోను , బయట క్షణమైనా చెప్పులు విడవకుండా నడిచేవారు సైతం రోజులో కొద్దిసేపైనా వాటిని విప్పేసి నడవడం ఉత్తమం .
  • =============================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

Tuesday, May 10, 2011

పరిసర పచ్చదనం స్థూలకాయం తగ్గిస్తుందా?, Do green surroundings reduce obesity?




ప్ర : పరిసర పచ్చదనం స్థూలకాయం తగ్గిస్తుందా?.
-- స్వాతి , అంబలవలస

జ : చుట్టూ పచ్చదనం ఉంటే కంటికి ఇంపుగా , హాయిగా , ఆహ్లాదం గా ఉంటుంది . . అంతేకాదు ఈ పచ్చదనం , పచ్చని పరిసరాలు ఎదిగే పిల్లల్ని అనుకూలంగా ప్రభావితం చేస్తాయి . పిల్లలు గడిపే పరిసరాల చుట్టూ ఆకుపచ్చని వాతావరణం ఉంటే వారిలో స్థూలకాయం దాదాపు ఉండక , ఉంటే తగ్గి ఆరోగ్యం గా ఉంటారు . మిగతా రంగులతో పోల్చితే ఆకుపచ్చరంగు వల్ల ఫ్యాట్ మెటబాలిజం ఎక్కువగా ప్రబావితం అవుతుంది . అలాగే అనుకూల ఆరోగ్యప్రభావము ఉంటుంది . పార్కులు , తోటలు , మరే ఇతర శరీరక వ్యాయామాలకు దోహదపడే పచ్చని పరిసరాలైనా పిల్లలో ఈ ప్రయోజనాలు ఇస్తాయి.
హైపర్ యాక్టివిటీ లోపాలు , ఏకాక్రత లోపాలు , మానసీక రుగ్మతలు నయమవుతాయి. కాబట్టి టెలివిజన్స్ , కంప్యూటర్ల ముందు సెటిలయ్యే పిల్లలు పచ్చని వాతావరణం లోకి వెళ్ళి ఆడుకునేందుకు పెద్దలు ప్రోత్సహించాలి .
  • ============================================
visit my website - > Dr.Seshagirirao-MBBS