Tuesday, March 18, 2014

If mothers eat no Food allery to babies , అమ్మలు తింటే పిల్లలకు నో ఎలర్జీ

  •  
  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : గర్భిణి ఏదైనా పదార్ధము తినకపోతే ... పుట్టిన బిడ్డకు ఆ పదార్ధము ఎలర్జీ కలుగజేస్తుందా?

జ : సాధారణము గా చాలామంది పిల్లలలో నట్స్ ఎలర్జీ కనబడుతుంది. ముఖ్యము గా వేరుశనగపప్పు ఎలర్జీ ఎక్కువ--- అయితే అమ్మలు గర్భవతులుగా ఉన్నప్పుడు పీనట్స్ , ట్రీనట్స్ తినాలి . . . అలా తినడము వలన పుట్టిన పిల్లలలో ఆయా ఆహారపదార్ధాల ఎలర్జీలు ఉండవు .
అమ్మలకు వీటి తాలూకు ఎలర్జీలు లేకుండా ఉండి  వారములో కనీసము అయిదారు సార్లైనా నట్స్ తింటుంటే పిల్లలకు తదుపరి ఇబ్బందులే ఉండవు . నెలకు ఒకసారి కూడా వీటిని తినని అమ్మలతో పోల్చినట్లైతే , తినేవారి పిల్లలలో ఆహార పదార్ధాల ఎలర్జీలు చాలా తక్కువగా ఉంటాయని పరిశోధనాత్మకముగా ఋజువైనది. అంటే గర్భిణీలు బిడ్డకోసము , బిడ్డకు ఎలర్జీ బారినుండి తప్పించడము కోసము అన్నిరకాల పదార్ధములు తినాలి. అదే మనపెద్దలు కడుపుతో ఉన్నవారికి వంటా-వార్పు , ఉండా-పండూ తెచ్చి పెట్టే ఆనవాయితీని ఆచారముగా పెట్టేరు.

  • *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.