Monday, December 26, 2011

గర్భము దాల్చిన మొదటి రోజుల్లో కడుపు నొప్పి , Lower abdominal pain of early pregnancy?



ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము

Q : నేను రెండునెలల గర్భవతిని , ఎప్పుడూ పొత్తికడుపులో మెంస్ట్రువల్ క్రాంప్స్ లా నొప్పి ఉంటుంది ? ఇది ఏమైనా ఇబ్బంది పరిస్థితా? ఈ నొప్పి తగ్గించుకోవడానికి ఏమిచెయ్యాలి ?

జ : గర్భము దాల్చిన తొలినాళ్ళలో కొందరు మహిళలకు పిత్తికడుపులో క్రాంప్స్ సహజముగా ఉంటాయి . ఇది సాదారణము . నొప్పితో పాటు ఏధైనా స్పాటింగ్ లేదా బ్లీడింగ ఉంటే మాత్రము డాక్టర్ ని సంప్రదించంది . పెయిన్‌ కిల్లర్స్ వాడవద్దు . దీనికి ప్రొజెస్ట్రోన్‌ హార్మోను తక్కువ స్థాయిలో ఉండడము , పెల్విక్ ఇన్‌ఫెక్షన్‌ కారణము కావచ్చును.
  • .===================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

Saturday, December 24, 2011

కాపర్-టి వల్ల చాలా హెల్త్‌ప్రాబ్లమ్స్ వస్తాయంటారు నిజమేనా? ,Any health problems with copper T?



ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .


Q : నా వయసు 24. పెళ్లై నాలుగు నెలలు అవుతోంది. పెళ్లైన రెండు నెలలకే ప్రెగ్నెన్సీ రావడంతో చదువుకు ఇబ్బందిగా ఉంటుందని అబార్షన్ చేయించుకున్నాను. మరో రెండేళ్ల వరకు పిల్లలు వద్దనుకుంటున్నాం. మా అత్తగారు వాళ్లు కాపర్-టి వాడమంటున్నారు. మా ఫ్రెండ్ కాపర్-టి వల్ల చాలా హెల్త్‌ప్రాబ్లమ్స్ వస్తాయని, అది అందరి శరీరతత్వానికి సరిపడదని, భవిష్యత్తులో పిల్లలు పుట్టకపోవడానికి అవకాశం కూడా ఉందని చెప్పింది. నిజమేనా? పిల్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా? పిల్స్ ఎన్నాళ్లు వాడవచ్చు? దయచేసి చెప్పగలరు.

A : ఫ్యామిలీ ప్లానింగ్ లేదా పిల్లల మధ్య ఎడానికి అందుబాటులో ఉన్న కొన్ని పద్ధతులు వివరిస్తున్నాను.

మొదటిది: సేఫ్ పీరియడ్
రెగ్యులర్‌గా పీరియడ్స్ వచ్చే స్ర్తీలలో అండం 11 రోజుల నుంచి 18 రోజుల మధ్య విడుదల అవుతుంది. అందుచేత ఆ రోజుల్లో భార్యభర్తల మధ్య ఎడం ఉన్నట్లయితే ప్రెగ్నెన్సీ రాకుండా జాగ్రత్తపడవచ్చు. కొత్తగా పెళ్లయిన జంటలలో, పీరియడ్స్ రెగ్యులర్‌గా రానివారిలో ఈ పద్ధతి అనువైనది కాదు.

రెండవది: బారియర్‌మెథడ్
పురుషులు వాడే కండోమ్స్ బారియర్‌లా పనిచేసి ఫ్యామిలీ ప్లానింగ్‌కి సహాయపడతాయి. దీనిలో ఉండే ఒక రకమైన రసాయనం వల్ల వీర్యకణాలు నిర్వీర్యం కావించబడి ప్రెగ్నెన్సీ రాకుండా చేస్తాయి. స్ర్తీలకు కూడా అనువుగా ఉండే కండోమ్ అందుబాటులో ఉన్నా అవి అంతగా ప్రాచుర్యం పొందలేదు. వీటి వల్ల ప్రెగ్నెన్సీ రాకుండా జాగ్రత్తపడగలిగినా ఫెయిల్యూర్ రేట్ కొంచెం ఎక్కువే.

మూడవది: గర్భనిరోధక మాత్రలు
ఈస్ట్రోజెన్, ప్రొజెస్టరాన్ మాత్రలు క్రమబద్ధంగా ఇవ్వడం వల్ల అండం ఫర్టిలైజేషన్ కాకుండా తద్వారా ప్రెగ్నెన్సీ రాకుండా ఆపగలుగుతాం. కొద్దికాలం క్రితం ఇవి హై డోసులో ఇవ్వబడేవి. దాని వల్ల ఎన్నో ఇతర సమస్యలు స్ర్తీలు ఎదుర్కొనవలసి వచ్చేది. కాని ఈ కాలంలో చాలా లో డోస్ ట్యాబ్లెట్లు అందుబాటులో ఉన్నాయి. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా దాదాపు లేనట్టే. వీటిని రోజూ ఒకటి చొప్పున 21 రోజుల పాటు వేసుకోవలసి ఉంటుంది. క్రమం తప్పకుండా వాడినట్లయితే ప్రెగ్నెన్సీ వచ్చేందుకు ఎటువంటి అవకాశమూ ఉండదు. రెండేళ్ల దాకా ఏ సమస్యలు లేకుండా నిరాఘాటంగా వాడుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ కాలం వాడాలనుకున్నప్పుడు కొద్ది నెలలు గ్యాప్ ఇచ్చి మళ్లీ మొదలుపెట్టవచ్చు. ఈ పద్ధతి వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడమే గాక పీరియడ్స్ రెగ్యులర్‌గా రావడం, పీరియడ్స్‌లో నొప్పి తగ్గడం, అధిక రక్తస్రావం కాకపోవడం.. వంటి ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

నాలుగవది: కాపర్-టి
సన్నటి కాపర్ తీగలను ’ఖీ’ ఆకారంలో ఉన్న ప్లాస్టిక్ పరికరంపై చుట్టి గర్భసంచిలో అమర్చుతాం. దీని నుంచి కాపర్ చాలా తక్కువ మోతాదులో నిరాఘాటంగా విడుదల అవుతూ ఉంటుంది. ఆ ప్రభావం చేత గర్భసంచిలో ప్రెగ్నెన్సీ నిలిచేందుకు అనువైన పరిస్థితి ఉండదు. ఇది మూడు నుంచి ఐదేళ్ల వరకు ప్రభావం చూపుతుంది. వద్దనుకున్నప్పుడు ఎప్పుడైనా తీయించుకోగల వీలు ఉంటుంది. ఇది కనీసం ఒక్క బిడ్డ అయినా ఉన్న స్ర్తీలలో బిడ్డకు బిడ్డకు మధ్య ఎడం ఉండేలా చేసేందుకు మాత్రమే వాడతాం. ఇంకా పిల్లలే కలగని స్త్రీలలో ఈ పద్ధతిని సాధారణంగా వాడం.

ఐదవది: గర్భనిరోధక ఇంజెక్షన్లు
మూడు నెలలకు ఒకసారి ఈ ఇంజక్షన్ చేయించుకోవలసి ఉంటుంది. ఎంతకాలం గర్భం వద్దనుకుంటే అంతకాలం వీటిని వాడవచ్చు. అయితే వీటి వల్ల పీరియడ్స్ క్రమంగా రాకపోవడం, బ్లీడింగ్ ఇరెగ్యులర్‌గా అవడం, మానేసిన తర్వాత కూడా పీరియడ్స్ క్రమంగా రాకపోవడం... ఈ పద్దతిలో ఉన్న లోపంగా చెప్పుకోవచ్చు.

అందుచేత మీ విషయంలో కండోమ్స్ గాని లేదా గర్భనిరోధక మాత్రలు కాని సరైన పద్ధతులుగా సూచించగలుగుతాం.

  • =============================


visit my website - > Dr.Seshagirirao-MBBS

Wednesday, December 21, 2011

bleeding after Hysterectomy,గర్భసంచిని తొలగించారు అయినా రక్తస్రావం కనిపిస్తోంది

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము


Q : నాకు యాభైఅయిదేళ్లు. కొన్ని కారణాల వల్ల ఏడాది క్రితం గర్భసంచిని తొలగించారు. అయితే నాలుగు నెలలుగా అప్పుడప్పుడు రక్తస్రావం కనిపిస్తోంది. జననేంద్రియాల దగ్గర విపరీతమైన నొప్పి, మంట కూడా బాధిస్తున్నాయి. ఇదేమైనా ప్రమాద సంకేతమా. ఇతర సమస్యలేమైనా వస్తాయని భయంగా ఉంది.

A : గర్భాశయాన్ని తొలగించాక నెలసరి ఆగిపోతుంది. దాంతో రక్తస్రావం కాకూడదు. మీకు అప్పుడప్పుడు అవుతోందంటే.. హార్మోన్ల లేమి, కొన్నిరకాల ఇన్‌ఫెక్షన్లు, శస్త్రచికిత్స తరవాత కుట్లు సరిగ్గా అతుక్కోకపోవడం వల్ల కూడా ఇలాంటి సమస్య ఎదురుకావచ్చు. చాలా అరుదుగా మాత్రం క్యాన్సర్‌ కావచ్చు. కాబట్టి ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి. చిన్నచిన్న ఇన్‌ఫెక్షన్లే అయితే.. మందులు వాడితే సరిపోతుంది. కాబట్టి భయపడాల్సిన అవసరంలేదు.
  • .==========================
visit my website - > Dr.Seshagirirao-MBBS

నెలసరిని వాయిదా వేసే మాత్రలు , Menses postponement tablets

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము


Q : నా వయసు ముప్ఫై. ఈ మధ్యే పెళ్లయ్యింది. పండగలు, ప్రత్యేక సందర్భాల్లాంటివి ఉన్నప్పుడు నెలసరి వాయిదా వేసేందుకు అప్పుడప్పుడు మాత్రలు వేసుకోవడం పెళ్లికి ముందు నుంచీ నాకలవాటు. అయితే దానివల్ల నెలసరి సక్రమంగా రావడంలేదు. మాత్రలు వేసుకోవడమే దీనికి కారణమా. అసలు అలాంటి మాత్రలు వేసుకోవచ్చా?


A : నెలసరిని వాయిదా వేసే మాత్రల్ని సాధ్యమైనంతవరకు వాడకపోవడం అన్నివిధాలా మంచిది. మరీ తప్పనిసరైతే.. ఓ పద్ధతి ప్రకారం, వైద్యుల సలహాతో వాడాల్సి ఉంటుంది. నెలసరి రావాల్సిన తేదీకి ఐదురోజుల ముందు నుంచీ ఈ మాత్రల్ని రెండు పూటలా ఒకే సమయానికి వేసుకోవాల్సి ఉంటుంది. ప్రతినెలా నెలసరి సక్రమంగా వచ్చేవాళ్లకి వర్తిస్తుందిది. అప్పుడే శరీరంలోని హార్మోన్లు సమతుల్యతను కోల్పోకుండా ఉంటాయి. వైద్యుల సలహా లేకపోయినా, మరీ ఎక్కువ లేదా తక్కువ మోతాదులో, రుతుక్రమానికి మరీ ముందు లేదా ఆలస్యంగా తీసుకున్నా.. హార్మోన్ల అసమతుల్యత ఎదురయ్యే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడే ఇతర సమస్యలు ఎదురవుతాయి. హార్మోన్లలో తేడా చోటుచేసుకున్నప్పుడు కలిగే ఒత్తిడి.. నెలసరి ఆలస్యంగా వచ్చేందుకు కారణమవుతుంది. మీ సమస్య కూడా అదే. కాబట్టి ఏ మాత్రను ఎంత మోతాదులో అన్నది వైద్యుల సలహాతో వాడండి. వైద్యులు చెప్పినట్లు వాడితే.. ఎలాంటి సమస్యలు ఉండవు.


==================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

హెర్పిస్‌ జెనిటాలిస్ , Herpes Genitalis

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము




Q : నా వయసు ఇరవైఎనిమిది. ఆర్నెల్లక్రితం పెళ్లయ్యింది. నా భర్తకు లైంగిక ఇన్‌ఫెక్షన్‌ ఉండటంతో అది నాకూ సంక్రమించింది. వైద్యులు పరీక్షలు చేసి హెర్పిస్‌ అన్నారు. మందులూ సూచించారు. ఇప్పుడు గర్భం దాల్చాలనుకుంటున్నా. ఈ సమస్య ప్రభావం పుట్టబోయే బిడ్డపై ఉంటుందా?.

A : మీ సమస్యను హెర్పిస్‌ టాలిస్‌ అంటారు. భార్యాభర్తల్లో ఒకరిలో లైంగిక ఇన్‌ఫెక్షన్‌ ఉన్నా.. ఇద్దరూ మందులు వాడటం తప్పనిసరి. ఇది ఒక్కసారి వస్తే.. రోగనిరోధక శక్తి తగ్గినప్పుడల్లా దాని లక్షణాలు మళ్లీ కనిపిస్తాయి. అలాంటప్పుడు మళ్లీ మందులు వాడాల్సి ఉంటుంది. ఆ ఇన్‌ఫెక్షన్‌ ఉన్నప్పుడు గర్భం ధరించకపోవడమే మంచిది. ఎందుకంటే.. గర్భధారణ సమయంలో ఆ లక్షణాలు మళ్లీ మొదలై.. గర్భస్రావం కావచ్చు. పుట్టబోయే బిడ్డలోనూ అవకరాలు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ వ్యాధి లక్షణాలు తగ్గాయని నిర్థారించుకున్నాకే గర్భం ధరించడం అన్నివిధాలా మేలు. అంతేకాదు.. కలయిక సమయంలోనూ కండోమ్‌ వాడటం వల్ల లక్షణాల తీవ్రతను తగ్గించవచ్చు.
వైద్య రంగము లో ఈ వ్యాది వ్యాప్తి అరికట్టేందుకు గాని , నివారించేదుకు గాని సరియైన మందులు లేవు . ముందు జాగ్రతా(prevention) , సురక్షిత సంపర్కమే (safe sex) ముఖ్యమైనవి .

ఈ క్రింది మందులు కొంతవరకు వ్యాధి తీవ్రతను , వ్యాప్తిని , నివారణకు తోడ్పడును :->
Acyclovir (herpex, acivir)-- 200 to 400 mg tablet four times/day,+Omintmet
val acyclovir(Valtres, Zelitres), same dose.
famiciclovir .
  • ====================================

visit my website - > Dr.Seshagirirao-MBBS

Tuesday, December 20, 2011

హైడ్రామ్నియాస్ ,ఆలిగో ఆమ్నియాస్,Hydromnios , oligoamnios

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .


Q : నా వయసు 22. పెళ్లై 8 నెలలు అవుతోంది. పెళ్లైన 2 నెలలకు కన్సీవ్ అయ్యాను. స్కానింగ్ చేస్తే బేబీ బాగానే ఉందని, ఏ ప్రాబ్లమ్ లేదని చెప్పారు. 6వ నెలలో వెళ్లినప్పుడు స్కానింగ్ తీసి, లిక్విడ్ చాలా తక్కువగా ఉందని, బేబీ పెరగడం కష్టమని, అబార్షన్ చేయించడం మంచిదని చెప్పారు. దాంతో కిందటి నెల 30న అబార్షన్ చేయించుకున్నాను. బెంగుళూర్ వెళితే CHRONOSOMAL ANALYSISచేయాలన్నారు. ఇది ఎందుకు చేస్తారు? ముందు అంతా బాగుంది. తర్వాత లిక్విడ్ ఎందుకు తగ్గింది? తర్వాత ప్రెగ్నెన్సీ ఇలా జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? టెన్షన్స్ ఎక్కువగా ఉంటే ఇలా జరుగుతుందా? నా సందేహాలకు సరైన సమాధానం తెలియజేయగలరు.


A : బిడ్డ చుట్టూ ఉండే ఉమ్మనీరు బిడ్డకు ఎన్నో రకాలుగా సహాయపడుతుంది. బయట నుంచి తల్లి పొట్టపై కలిగే ఒత్తిడి నుండి బిడ్డను కాపాడటమే గాక బిడ్డ కదలికలకు అనువుగా ఉండేందుకు, బిడ్డ ఊపిరితిత్తులు క్రమంగా అభివృద్ధి చెందేందుకు, అలాగే బిడ్డ ఎదగడానికి కావల్సిన చోటును ఉమ్మనీరు సమకూరుస్తుంది. స్కానింగ్ ద్వారా 5వ నెల నుంచి దీనిని కొలవడం జరుగుతుంది. తక్కువగా ఉన్నప్పుడు ఆలిగో ఆమ్నియాస్ అని, చాలా ఎక్కువగా ఉన్నప్పుడు హైడ్రామ్నియాస్ అని పిలుస్తాం. మీ విషయంలో ఉమ్మనీరు 6వ నెలలో చాలా తక్కువగా ఉందని చెప్పారన్నారు. దానికి గల కొన్ని ముఖ్యమైన కారణాలు:

ఉమ్మనీరు కారిపోవడం: కొన్ని సందర్భాలలో నెలలు నిండకముందే, నొప్పులు రాకముందే, ఉమ్మనీరు పడిపోవచ్చు. మొదటిసారి గర్భిణిగా ఉన్న స్ర్తీలు దీనిని ఉమ్మనీరుగా గుర్తించక తెల్లబట్ట ఎక్కువగా అవుతోందనుకొని పొరపాటు పడటం సర్వసాధారణంగా జరుగుతుంది.

తొమ్మిది నెలలు దాటిపోవడం: నెలలు నిండిపోయి ఎక్కువ రోజులు అయినా ఉమ్మనీరు తగ్గిపోవడం గమనిస్తాం. ఈ కారణం మీ విషయంలో వర్తించదు.

బిడ్డ కిడ్నీకి సంబంధించిన లోపాలు ఉండటం: ఇటువంటి సందర్భాలలో బిడ్డ మూత్రాన్ని చాలా తక్కువగా విసర్జించడం జరుగుతుంది. అందుచేత ఉమ్మనీరు కూడా తక్కువగా ఉంటుంది.

బిడ్డకు జన్యుపరమైన జబ్బులు ఉండటం.

యామ్నియో సెంటిసిస్ లేదా సివిఎస్ వంటి పరీక్షలు చేసినప్పుడు ఉమ్మనీరు తాత్కాలికంగా తగ్గిపోవడాన్ని గమనించవచ్చు.

నాలుగు నుండి ఆరు నెలలలో ఉమ్మనీరు తక్కువగా ఉండటాన్ని గమనించినప్పుడు బిడ్డ ఆరోగ్యంగా ఎదగడానికి అవకాశం తక్కువనే చెప్పవచ్చు. అటువంటి సందర్భాలలో అబార్షన్ చేయించుకోమని డాక్టర్లు సలహా ఇస్తారు. కొన్ని సందర్భాలలో ప్రెగ్నెన్సీలో వచ్చే హై బి.పి వల్ల బిడ్డకు రక్తప్రసరణ సరిగ్గా అందక ఉమ్మనీరు తగ్గి బిడ్డ ఎదుగుదల తక్కువగా ఉండవచ్చు. ఇలా అబార్షన్ అయిన వారికి క్రోమోజోమ్ ఎనాలసిస్ చేయడం వల్ల తర్వాత పుట్టబోయే బిడ్డకు జన్యుపరమైన లోపాలు కనిపెట్టడం సాధ్యం అవుతుంది. పైన వివరించిన కారణాలలో హై.బి.పి వంటి కారణాలు తప్ప మిగిలినవన్నీ నెక్ట్స్ ప్రెగ్నెన్సీలో వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అందుచేత మీరు ఆరు నెలల గ్యాప్ ఇచ్చిన తర్వాత నెక్ట్స్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి. ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లను ముందు నుంచి వాడండి.

ప్రెగ్నెన్సీ సమయంలో మంచి ఆహారం 3-4 లీటర్ల ద్రవపదార్థాలు 8-10 గంటల రోజు నిద్ర తప్పక తీసుకోండి. డాక్టర్ సూచనల మేరకు ఫోలిక్ యాసిడ్, ఐరన్, క్యాల్షియం, బి-కాంప్లెక్స్ వంటి సప్లిమెంట్స్ తప్పక వేసుకోండి. సీరియల్ గ్రోత్ స్కానింగ్ చేయించుకుంటూ ఉమ్మనీరు, బిడ్డ ఎదుగుదల సరిగ్గా ఉన్నదీ లేనిదీ పర్యవేక్షించండి. కొబ్బరినీళ్లు, బార్లీ నీళ్లు, మజ్జిగ వంటి ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోండి. ఐదవ నెల దాటాక వెల్లకిలా కాకుండా ఒక పక్కగా తిరిగి పడుకోండి. రెగ్యులర్‌గా బి.పి చెకప్ చేయించుకోండి. అనవసరమైన టెన్షన్లు ఏవీ పెట్టుకోక డాక్టర్ సూచనలన్నీ క్రమం తప్పకుండా పాటించి నెక్ట్స్ ప్రెగ్నెన్సీలో ఆరోగ్యకరమైన బిడ్డను పొందండి.

  • =========================
visit my website - > Dr.Seshagirirao-MBBS

Sunday, December 4, 2011

Non-veg and Veg.Which is good for health,మాంసాహారం మంచిదా? శాకాహారమా?



  • ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర: మేము ఎస్‌ఎస్‌వై క్లాసుకు వెళ్లినప్పుడు మాంసాహారం మానేయమని చెప్పారు. మేము మాంసాహారులం. ఇంట్లో పెరిగే పిల్లలున్నారు. ఒకేసారి మాంసాహారాన్ని మానేస్తే నీరసం రావటం వంటి ఇబ్బందులు ఏవన్నా వస్తాయా? వెజిటబుల్ ప్రోటీన్ కంటే యానిమల్ ప్రోటీన్ క్వాలిటీ ఎక్కువట కదా? ఇంతకీ, మాంసాహారం మంచిదా? శాకాహారమా?

జ: ఆయుర్వేదం మాంసాహారాన్ని తీసిపారెయ్యలేదు. పైగా, మాంసవర్గం కింద వివిధ జంతుమాంసాల గుణ ధర్మాలను వివరించింది కూడా! అయితే మాంసాహారం, శాకాహారం- వీటిలో ఏది మంచిది అన్న సమస్య ఉత్పన్నమైనప్పుడు, ఆయుర్వేద గ్రంథాలను లోతుగా పరిశీలిస్తే, శాకాహారానికే ప్రాధాన్యత ఇచ్చినట్టు కనబడుతోంది. ఇటీవల బ్రిటన్‌లో ఒక ఆసక్తికరమైన సర్వేని నిర్వహించారు. సుమారు పదివేల మంది ప్రజల తాలూకు ఆరోగ్యాన్ని, వారి భోజనపు అలవాట్లతో ముడిపెట్టి అధ్యయనం చేసినప్పుడు, మాంసాహారుల కంటే శాకాహారులే ఎక్కువ ఆరోగ్యంతో ఉన్నారని తేలింది. అంతేకాదు, శాకాహారుల్లో జీర్ణాశయానికి సంబంధించిన క్యాన్సర్, గుండె జబ్బులు వంటివి తక్కువగా కనిపించినట్టు తేలింది. అయితే శాకాహారుల ఆరోగ్య రహస్యం కేవలం మాంసం తినకపోవడంలోనే లేదని పరిశీలనలు వెల్లడిస్తున్నాయి. శాకాహారంలో ఎక్కువగా పీచు పదార్థాలు, విటమిన్లు కలిగిన కూరగాయలు, పండ్లు ఉంటాయని, అవి వివిధ రకాలైన క్యాన్సర్లను, అకాల వార్ధక్యాన్ని, గుండె జబ్బులను నిరోధిస్తాయని గ్రహించాలి. మీరు మాంసాహారులమంటున్నారు కనుక మాంసాన్ని వదిలేయకుండానే, సాధ్యమైన ఎక్కువగా శాకాహారాన్ని తీసుకోవడం మంచిది. శాకాహారం మనిషికి కావలసిన సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించగలదని శాస్ర్తియంగా రుజువయ్యింది.
  • =================================================

visit my website - > Dr.Seshagirirao-MBBS

Friday, December 2, 2011

పళ్ళు ఊడిపోకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?,Tips to prevent teeth fall

  •  
  • ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము . 

ప్ర: పళ్ళు ఊడిపోకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

జ: చిగుళ్ళు, ఎముకల వ్యాధి రాకుండా ఉండాలంటే పళ్ళమీద పాచి ఏర్పడకుండా ప్రతిరోజూ రెండు పూటలా శుభ్రంగా పళ్ళను బ్రష్ చేసుకోవాలి. పళ్ళ మధ్య ఇరుక్కున్న చిన్నచిన్న ఆహార పదార్థాలను తీయకపోతే అవి కుళ్ళి సూక్ష్మజీవులు ఏర్పడవచ్చు. అందుకని ఫ్లాసింగ్ సహాయంతో పళ్ళ మధ్య ఇరుక్కున్న పదార్థాలను ప్రతిరోజూ తీసి వేస్తుండాలి. ఒకవేళ తీయకపోతే పళ్ళు ఊడిపోవడం జరుగుతుంది.

  • ================================================= 

visit my website - > Dr.Seshagirirao-MBBS

దంతాల నొప్పి ఎందుకు వస్తుంది?

  •  
  • ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర: నా వయస్సు 45 సంవత్సరాలు. ఆహార పదార్థాలు తీసుకునేటప్పుడు లేదా చల్లని, వేడి పదార్థాలు, తీపి, పులుపు వంటి రుచులతో కూడిన పదార్థాలు తీసుకున్నప్పుడు దంతాల నొప్పి ఎందుకు వస్తుంది?

జ: దంతాలు చిట్లినప్పుడు ఆ చిట్లిన దంతాలతో ఏదైనా నమిలినప్పుడు లేదా కొరికినప్పుడు ఏర్పడే ఒత్తిడి కారణంగా అవి బాధను కలిగిస్తాయి. ఎప్పుడైతే నమలడం మానివేస్తామో అప్పుడు ఒత్తిడి తగ్గి నొప్పి నెమ్మదిగా తగ్గుతుంది.
  •  ================================================= 

visit my website - > Dr.Seshagirirao-MBBS

నోటి నుండి దుర్వాసన , Bad breath,Halitosis

  •  
  • ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
 ప్ర: నా వయస్సు 26. నేను ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు దుర్వాసన వస్తోంది. దుర్వాసన రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి. వివరించండి?
జ: చిగుళ్ళు నొప్పి, చిగుళ్ళ నుంచి రక్తం కారడం, కొరికినప్పుడు పళ్ళు కదలడం, పళ్ళు చిగుళ్ళ మధ్య చీము కారడం తదితర సమస్యలతో బాధపడుతున్నప్పుడు చిగుళ్ళు ముడుచుకుపోతుంటాయి. జింజివైటిస్ కారణముగా ఇలా ముడుచుకపోవడంవల్ల నోటి దుర్వాసన వస్తుంది. మధుమేహ వ్యాధి ఉన్నవారిలో నోటిదుర్వాసన ఎక్కువగా ఉంటుంది. చిగుళ్ల వ్యాధులు, దంతాల మధ్య పాచిపేరుకోవటం వంటివి కూడా ముఖ్యకారణాలే.. గొంతు నందలి ఇన్ఫెక్షన్ మరియు పళ్ళ యందలి వాపు కారణంగా ఎర్పడిన చీము మరియు రక్తము అక్కడ నిలిచి, కుళ్ళి ధుర్గంధమైన వాసనను కలిగించును...   నోటి నుండి దుర్వాసన రాకుండా ఉండాలంటే ప్రతిరోజు రెండు పూటలా బ్రష్ చేసుకోవాలి. ఏడాదిలో కనీసం రెండుసార్లు అయినా దంత వైద్యుణ్ణి సంప్రదిస్తూ ఉండాలి.
  • ================================================= 
visit my website - > Dr.Seshagirirao-MBBS

Thursday, December 1, 2011

Trigeminal Neuralgia,ట్రైజెమినల్ న్యూరాల్జియా

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

  •  ప్ర: నా వయస్సు 45. ఫైనాన్షియల్ జాబ్ చేస్తున్నాను. ఒక ఏడాదిగా ముఖం కుడి భాగం లాగుతోంది. నొప్పిగా కూడా ఉంటోంది. రాత్రివేళ ఈ నొప్పి మరీ ఎక్కువగా ఉంటోంది. దీనివల్ల నమలడం కష్టంగా ఉంది. పంటినొప్పితో ఈ సమస్య మొదలవుతుంది. డాక్టర్‌ను కలిస్తే ఒక పంటిని తీసేశారు. అయినా ఈ సమస్య ఇలా ముఖంలో సగభామంతా పాకింది. న్యూరోఫిజిషయన్‌ను సంప్రదిస్తే కొన్ని మాత్రలు రాశారు. వాటివల్ల నొప్పి కొంత తగ్గినా ఆ భాగంలో తిమ్మిరిగా ఉంటోంది. అయితే ఈ మాత్రలను ఎక్కువకాలం వాడటం మంచిది కాదు అంటున్నారు. నా సమస్యకు విముక్తి కలిగే మార్గం చెప్పండి.

  • జ: మీకున్న సమస్యకు ట్రైజెమినల్ న్యూరాల్జియా అంటారు. ఈ వ్యాధి రావడానికి గల కారణమేమిటో ఇప్పటి వరకు తెలియదు. అయినా ఈ వ్యాధిని నయం చేసే మందులు ఉన్నాయి. మెజీరియం-200 మందును వారానికి ఒక రోజు చొప్పున నాలుగు వారాలపాటు వేసుకోండి. అవసరమైతే మరో మారు ఈ మందులు వేసుకోండి. ఆకుకూరలు, కాయగూరలు తీసుకోవాలి. యోగా, ప్రాణాయామం చేస్తే సమస్య త్వరగా తగ్గుతుంది.
  • ================================================= 
visit my website - > Dr.Seshagirirao-MBBS

జుట్టు ఒకేచోట గుడ్రముగా రాలిపోతోంది సలహా?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

  • ప్ర: నా వయస్సు 29. నేను ఒక గవర్నమెంట్ సంస్థలో టీచర్‌గా పనిచేస్తున్నాను. నేను చాలా సన్నగా ఉంటాను. గత 3 సంవత్సరాలుగా నా జుట్టు ఒకేచోట గుడ్రముగా రాలిపోతోంది. పైగా తల వెనుక భాగంలో దురదగా కూడా ఉంటోంది. డాక్టర్‌ను కలిస్తే పైపూతగా కొన్ని క్రీములు, ఇంజక్షన్లు కూడా ఇచ్చారు. అయినా ఏ మార్పూ లేదు. మరో డాక్టర్‌ను కలిస్తే ఇది ఆటోఇమ్యూన్ డిజార్డర్ అనీ, దీనికి మందులే లేవని అన్నారు. ఇప్పటికే చాలా భాగం జుట్టు రాలిపోయి వికారంగా ఉంది. ఇక కొద్ది రోజులలో మొత్తంగా రాలిపోతుందేమోనని భయంగా ఉంది. నా సమస్యకు పరిష్కారం తెలుపుగలరు.

  • జ: మీ సమస్యను ఆలోపేసియా అంటారు. ఇది ఆటోఇమ్యూన్ డిజార్డర్ అన్నది వాస్తవమే. దీనికి హోమియోలో చికిత్స ఉంది. పాస్పరస్-200 మందును ఉదయం, సాయంత్రం వారానికి ఒకరోజు చొప్పున వరసగా ఆరు వారాలు వాడండి. ఊడిపోయిన భాగాల్లో చాలా త్వరగా మళ్ళీ జుట్టు వచ్చేస్తుంది. మంచి పోషకాలున్న ఆహారం తీసుకోవడం చాలా అవసరం. రక్తహీనత రాకుండా ఆకుకూరలు తీసుకోవాలి. వ్యాయామం కూడా తప్పనిసరి.

  • ================================================= 
visit my website - > Dr.Seshagirirao-MBBS 

అభ్యంగన స్నానము అంటే ఏమిటి?తలస్నానానికి జాగ్రత్తలు తెలియజేయగలరు ?



  • ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి. కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు. ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును. ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర :  అభ్యంగన స్నానము అంటే ఏమిటి? తలస్నానానికి జాగ్రత్తలు తెలియజేయగలరు ?

జ : ఏదైనా తైలముతో...  తల , శరీరము బాగా మర్ధన చేసి , తలస్నానం చేయుటను అభ్యంగన స్నానము అంటారు .  ఆయిలీ బాత్ (Oil bath) అని కూడా అంటారు . తలస్నానం చేసేటప్పుడు వెంట్రు కలు చిక్కుపడకుండానూ, వెంట్రుకల కుదుళ్ళు బలహీనపడ కుండానూ, శిరో జాలు రాలిపోకుండానూ, తెల్లబడ కుండానూ తగిన జాగ్రత్తలు తీసు కోవాలి. తలస్నానం చేసేటప్పుడు వెంట్రుకల రక్షణ, ఆరోగ్యంపట్ల ఏ విధ మైన శ్రద్ధ తీసుకోవలసినదీ ముందుగా తెలుసుకోవాలి. తలస్నానానికి షాంపూ ను ఉపయోగించే వారు దాన్ని ఏవిధం గా ఉపయోగించ వలసినదీ తెలుసు కోవడం అవసరం. షాంపూను సరిగా ఉపయోగించకపోయి నట్లయితే వెంట్రుకల ఆరోగ్యం పాడై, వెంట్రుకలు రాలిపోతాయి. తలరుద్దుకునే విషయం, పరిశుభ్రతకోసం వాడే వస్తువులు, నీరు, తలతుడుచుకునే తువ్వాలు, చిక్కుతీసే బ్రష్‌ లేదా దువ్వెన గురించి సరైన అవగాహన ఉండాలి.

1. తలస్నానానికి అధికవేడి నీటినికానీ, చన్నీటిని కానీ ఉపయోగించకూడదు. గోరువెచ్చని నీటిని మాత్రమే వాడాలి.

2.తలస్నానానికి పరిశుభ్రమైన నీటినే ఉపయోగించాలి. ఉప్పునీరు, బోరింగ్‌ నీరు కంటే శుద్ధమయిన నీటిని వాడటం కురులకు ఆరోగ్యకరం.

3. తలస్నానం చేయటానికి అరగంట ముందుగా కొబ్బరినూనెను వెచ్చచేసి, ఆ నూనెను వెంట్రుకల కుదుళ్ళకు చేరేలాగా పట్టించాలి. వేళ్ళతో మృదువుగా మసాజ్‌ చేయాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి.

4. తలస్నానానికి కుంకుడుకాయలు, సీకాయను వాడటం వల్ల జుట్టు మెత్తగా ఉండటమే కాక, జుట్టు ఆరోగ్యమూ బాగుంటుంది.

5. అభ్యంగన స్నానానికి ముందుగా మెంతులు రుబ్బిన ముద్దను తలకుపట్టించే వారు. పేల నిర్మూలనకోసం హారతి కర్పూరం పొడిని లేదా కలరా ఉండల పొడిని కొబ్బరినూనెలో కలిపి జుట్టుకు రాసేవారు. చుండ్రు నిరోధానికి నిమ్మ రసాన్ని కానీ, లేతవేపాకుల ముద్దను కానీ జుట్టుకు రాసేవారు. హెన్నా తలకుపూసే వారు ముందుగా తలమీద నీరుపోసి, వాటిని కడిగేసిన తర్వాతనే షాంపూను కానీ, సీకాయసబ్బును కానీ, సీకాయ పొడినికానీ, కుంకుడురసాన్ని కానీ వాడాలి.

6. తలతడిపిన తర్వాతనే షాంపూతో రుద్దుకోవాలి.

7.షాంపూను నేరుగా జుట్టు మీద వేసుకో కూడదు.చేతిలో కొంచెంవేసుకొని,నీళ్ళు కలిపి, ఆ తర్వాత తలకు పట్టించి, వెంట్రుకలను శుభ్రపరచాలి.

8. నిమ్మ, కమలాఫలం, నారింజ తొక్క లను, ఎండిన మందార ఆకులు లేదా పూలను మెత్తగా పొడిచేసి, ఆ పొడిని సీకాయ పొడిలో కానీ కుంకుడు కాయ పొడిలో కానీ లేదా కుంకుడు రసంలో కానీ కలిపి తల రుద్దుకుంటే జుట్టు త్వరగా తెల్లబడదు. వెంట్రుకలు నిగనిగ లాడుతూ, మృదువుగా ఉంటాయి.

9.తలస్నానానికి ఉపయోగించే కుంకుడు రసంలో కానీ, సీకాయపొడిలో కానీ అన్నం వార్చిన గంజిని కలిపి తల రుద్దు కుంటే వెంట్రుకలు త్వరగా నెరిసిపోవు.

10.షాంపూను ఉపయోగించే వారు ఆ నురగ తలమీది నుంచి, వెంట్రుకల కుదుళ్ళలోంచి పూర్తిగా తొలగి పోయేం త వరకు తలమీద నీళ్ళు పోసుకుని జుట్టును బాగా శుభ్రపరచాలి.

11.తలస్నానానికి ఎక్కువగా షాంపూను వాడితే, వాటిలోని రసాయనాలు కేశాలకు హాని చేస్తాయి. వెంట్రుకల మురికి, జిడ్డు వదలడానికి తగినంత షాంపూను మాత్రమే వాడాలి.

12.వెంట్రుకలను శుభ్రపరచటానికి అడ్డదిడ్డంగా రుద్దకూడదు. అల్లా చేస్తే వెంట్రుకలు చిక్కు పడడం, తెగిపోవడం జరుగుతుంది.

13.వెంట్రుకల తడిని పీల్చడానికి తలకు చుట్టే టవలు మెత్తగానూ, తేలికగాను ఉండాలి. రఫ్‌గానూ బరువుగానూ వుండకూడదు.

14. ఇతరులు వాడిన తువ్వాలను తల తుడుచుకోడానికి ఉపయోగించకూడదు.

15. తలను తుడుచుకునేటప్పుడు పై నుంచి క్రింది వరకూ తుడవాలి. ఎడా పెడా ఇష్టం వచ్చినట్లు తుడవకూడదు.

16. తలవెంట్రుకలను సహజ గాలిలోనే ఆరనివ్వాలి. హెయిర్‌ డ్రయ్యర్‌ వాడక పోవడమే జుట్టు ఆరోగ్యానికి మంచిది.

17. వెంట్రుకలు తడిగా వున్నప్పుడు తల దువ్వుకూడదు. ఆరిన తర్వాతనే తల దువ్వుకోవాలి.

18. వెంట్రుకలు చిక్కు పడినపుడు వేళ్ళతో మెల్లగా ఆ చిక్కును తీయాలి. ఆ తర్వాత తల దువ్వుకోవాలి.

19. తలస్నానం చేసిన తర్వాత వెడల్పు పళ్ళున్న దువ్వెనతో కానీ, తల దువ్వుకునే బ్రష్‌ను ఉపయోగిస్తూ వెంట్రుకలను పై నుంచి క్రిందకు మెల్లగా దువ్వుకోవాలి.

20. వెంట్రుకలు పూర్తిగా ఆరిన తర్వాతనే జడ వేసుకోవడం లేదా ముడి చుట్టుకోవడం చేయాలి.


=================================================
visit my website - > Dr.Seshagirirao-MBBS