Saturday, March 1, 2014

Tension is more in Teenage how to prevent?,టీనేజర్లలో వత్తిడి ఎక్కువగా ఎందుకుంటుంది?ఎలా తగ్గించుకోవాలి?

  •  


  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
ప్ర :  టీనేజర్లలో వత్తిడి ఎక్కువగా ఎందుకుంటుంది?ఎలా తగ్గించుకోవాలి?
జ : బాల్యదశ పన్నెండు సంవత్సరాల దాకా, ఆ తర్వాత కౌమారదశ, ఈ కౌమారదశనే టీనేజ్‌ అంటారు. ఆంగ్లభాషలో చెప్పుకుంటే థర్టీన్‌(Thirteen) నుంచీ నైన్టీన్‌(Nineteen) వరకూ టీనేజ్‌ వయస్సు. ఆ నెంబర్ల చివర 'టీన్‌' అనే మాట టీనేజ్‌నే స్ఫురింప చేస్తుంది. టీనేజ్‌ వయస్సును యుక్త వయస్సుగా పరిగణిస్తారు పెద్దలు. ఆ వయస్సులో మానసికంగా, శారీరకంగా కూడా పిల్లల్లో, ముఖ్యంగా ఆడపిల్లల్లో కొన్ని మార్పులు స్పష్టమవుతాయి. కౌమారదశలో ఎంతో ఉత్సాహంగా ఉండటమే కాక, వారిలో స్వతంత్రగా ప్రవర్తించాలన్న మనస్తత్వమూ ఏర్పడుతుంది.

తమకుగల అభిరుచుల్ని అభివృద్ధి పరుచుకునే విషయములో , తమ ఐడెంటిటీని ప్రదర్శించే ప్రయోగాలకు సంబంధించి ఈ వయసు అత్యంత కీలకమైనది. అలాగే కెరీర్ చాయిస్ లకు సంబంధించిన మూలం కూడా ఈ వయసులోనే మఒదలవుతుంది. తమ స్వంత అంచనాలను అందుకోలేకపోయినప్పుడు వారిలో ఆందోళన మొదలౌవుతుంది ... అది వత్తిడికి దారితీస్తుంది. ర్యాంకుల హడావిడిని అందుకునే క్రమములో టార్గెట్లు వారిని భయపెడుతూ ఉంటాయి.

కార్పొరేట్ కాలేజీల వాతావరనములో సర్దుబాట్లు ఒక్కోసారి వారికి కష్టము అవుతాయి. ఒక్క సారిగా జీవన శైలి మారిపోతుంది. తమ తల్లిదండ్రులు చాలా డబ్బు ఖర్చుపెడుతున్నారన్న భావం వల్ల గిల్టీగా ఫీలవుతారు. తల్లిదండ్రుల్ని ఎవాయిడ్ చేయడము , డిప్రెషన్‌ కి లోనుకావడము , కోపాన్ని ప్రదర్శించడము , బాగా తక్కువ లేదా ఎక్కువ తినడం , నిద్రకు సంబంధిన లోపాలు , కుటుంబసభ్యులు , స్నేహితులు లతో కలవకపోవడము వంటివి ఒత్తిడి లక్షణాలు,

టీనేజర్స్ ని వత్తిడినుండి కాపాడడము లో తల్లిదండ్రులదే కీలకపాత్ర .
  • ఓర్పుగా , సహనము గా వ్యవహరిస్తేనే ఫలితము ఉంటుంది. 
  • వారి శక్తికి మించి కాకుండా వాస్తవిక లక్ష్యాలు నిర్ణయించాలి.
  • తల్లిదండ్రులు నిరంతము  టచ్‌ లో ఉండాలి ,
  • కొంత ఫ్రీ టైమ్‌ ఇస్తే టీనేజలు రిలాక్ష్ అవుతారు, 
  • వారు చెప్పేది జాగ్రత్తగా వినాలి ... సలహాలు .. సూచనలు ఇవ్వాలి . వీలయినంత ఎక్కువగా ఎఫెక్షన్‌ అందించాలి. 
  • ప్రతిసారి వారికి సాయపడే ధోరణి కాకుండా వారి వారి ప్రతిభ , నైపుణ్యాల్ని ఉపయోగించుకోనివ్వాలి. గైడెన్స్ ఇస్తే చాలు.

  •  *=========================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.