Saturday, November 24, 2012

Hear what your body tells-ఆరోగ్య పరంగా శరీరము చేప్పేది వినండి

  • ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
ప్ర : ఆరోగ్య పరంగా శరీరము చేప్పేది వినండి  అంటారు . వివరించగలరు ?
అరుణకుమారి - శ్రీకాకుళం టౌన్‌.
జ : వైద్యులను కలవాలంటే ... టైమ్‌ ఉండదు , ముందుగా ఎపాయింట్ మెంట్  ఉండాలి. ఏదో చిన్న సమస్యే కదా వెయిట్ చేస్తే పోలే అని అనుకుంటారు. చాలా మంది  అనారోగ్యము అనిపించినా నిర్లక్ష్యము చేస్తూ ... దానంతటదే సర్దుకుంటుందిలే అని అభిప్రాయ పడతారు. నిర్లక్ష్యము మంచిది కాదు . మంచి డాక్టర్ ని కలవాలి. శరీరవ్యవస్థ దానికి వచ్చే అసౌకర్యాలను లక్షణాల రూపేన మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఈ క్రింది వాటిలో శరీరము చెప్పేది వినండి  .
1. నియంత్రణలేని క్రేవింగ్ (uncontrolled Craving) : తరచుగా దాహము గా ఉంటున్నా , ఆకలి గా ఉంటున్నా , తీపి తినాలనిపిస్తున్నా ... అది బహుసా డయాబిటీస్ (మధుమేహము ) కు సూచన . అలసట , కళ్ళు తేలిపోవడము , నీరసము , బరువు తగ్గిపోవడము ... ఇలా రోజుకు ఒకసారి కంటే ఎక్కువ ఉంటే వైద్యుని సంప్రదించి సుగరు స్థాయిలను తనికీ చేయించుకోవాలి.

2. బరువు తగ్గడము , పెరగడము : కొద్ది కిలోలు అటు ..ఇటు  కావడము సహజమే . కాని ఈ తేడాలు సుమారు 2 నెలలో 6-7 కిలోలు ఎక్కువ... తక్కువా ... అనిపిస్తే  థైరాడ్ వ్యాదులకు సూచన  కావచ్చును . వైద్యుని సంప్రదించాలి.

3.ఎక్కడైనా కణితి (Lump) : శరీరము ఏ భాగములోనైనా ఉండమాదిరిగా లంప్ తగులుతున్నా ... సహజము గా రెండు వారాలలో అది తగ్గకపోయినా ..క్యా్న్సర్ కు సంబంధినది కావచ్చు .... వైద్యుని సంప్రదించాలి.

4 . శరీరము , మనసు చెప్పేవి : శారీరకము గా , మానసికం గా బాగా లేనప్పుడు అందుకు తగిన సిగ్నల్స్ అందుతుంటాయి .వాటిని తప్పనిసరిగా పరిగణలోనికి తీసుకోవాలి. .

జలుబు చేస్తే డాక్టర్ వద్దకు వెళ్ళాల్సిన అవసము రాఫు . అదే తీవ్రమైన గొంతునొప్పి లేదా సైనస్ , నిరంతము దగ్గు , తలనొప్పి, తూలిపోవడము , ఎప్పుడూ శరీరము లో జ్వరము ఉన్నట్లు ఫీలవడమూ, తిన్నది మామూలే అయినా జీర్ణము కాకపోవడము , రోజూ 3 సార్లు కంటే ఎక్కువ విరోచనము అవడము , స్త్రీలలో  మాటి మాటి కీ రక్తస్రావము అవడము  మున్నగు అనేక సాదారణ ఆరోగ్య సమస్యలు నిర్లక్ష్యము చేయకుండా సరియైన వైద్యుని కలవాలి.
  • =====================

 visit my website - > Dr.Seshagirirao-MBBS

Health Hints to feel good all the day?-రోజంతా హుషారుగా ,ఆనందము గా ఉందేందుకు ఆరో్గ్య సూత్రాలు చెప్పండి ?

  • ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర: రోజంతా హుషారుగా ,ఆనందము గా ఉందేందుకు ఆరో్గ్య సూత్రాలు చెప్పండి ?

జ : ముచ్చట గా మూడు సూత్రాలు పాటించాలి .
1) నిద్ర : మనిషికి నిద్ర ఎంత అవసరమో గుర్తించుకొని నిద్ర పోవాలి. అందరికీ ఒకే గంటల నిద్ర చాలదు . వ్యక్తి వ్యక్తి కి నిద్రకు సంబందించి తేడాలు ఉంటాయి. నిద్ర పోయే సమయము , సహజము గా లేచే సమయము నోట్ చేసుకోవాలి ... ఇలా ఒక వారము చేయాలి . అప్పుడు మనిషికి కావలసిన సగటు నిద్ర కాలము తెలుసంది. సరాసరి రోజుకి 8 గంటలు నిద్ర అవసరము .
2) పానీయాలు : శరీరము లో నీటి కొరత ఏర్పడితే మూడ్ మారిపోతుంది. మంచినీరు , పానీయాలు అన్నీ కలిపి రోజుకి 1.5 నుంది 2.0 లీటర్ల వరకూ త్రాగాలి. అవసరము కన్నా ఎక్కువ నీరు తాగితే శరీరక వ్యవస్థ నుండి ప్రధాన లవణాలు వెలికి వెళ్ళిపోయే అవకాశము ఉన్నది. అందుకే మన శరీరము లో దాహము అనే ప్రక్రియ నిరంతమూ పనిచేస్తూ ఉంటుంది.
3). కదలిక : అది ఉదయమా , సాయంత్రమా అన్నది పక్క పెట్టి ఎప్పుడు వీలుపడితే అప్పుడు వ్యాయామము చేయాలి . సుమారు రోజుకు 30 నిముషాలనుండి 60 నిముషాల వరకూ నడక చాలు. ఎవరికి వీలైన ఎక్షరసైజ్ వారు చేసుకున్నా మంచిదే. వ్యాయామము మెదడుకూ, శారీరానికీ  ఉత్సాహాన్నీ , ఉత్తేజాన్ని కలుగజేస్తుంది . 
  • ====================== \
visit my website - > Dr.Seshagirirao-MBBS

Friday, November 23, 2012

నాకు 3 వారాలకొకసారి నెలసరి ఋతుక్రమము వస్తోంది . ఇది సహజమేనా?

  • ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము . 
 ప్ర : నా వయసు 19 సం.లు. నాకు 3 వారాలకొకసారి నెలసరి ఋతుక్రమము వస్తోంది . ఇది సహజమేనా?.కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడాలా?

జ : ఋతుక్రమ సమయాన్ని రక్తస్రావము అయిన మొదటి రోజునుంచి  తదుపరి నెల మొదటిరోజుదాకా లెక్కించాలి. ఋతుక్రమాన్ని రెండు దశలుగా విభజిస్తారు.
మొదటిది : ఫాలిక్యులార్ ఫేజ్ (14 రోజులు ) , రెండోది : లూటియల్ ఫేజ్ (14 రోజులు ) . ఫాలిక్యులార్ ఫేజ్ కాలపరిమితి మారుతుంటుంది. కాని లూటియల్ ఫేజ్ సాధారణం గా అలాగే ఉంటుంది. సాధారణ పరిస్థితిలో 2-3 రోజులు తక్కువగా ఋతుక్రమము వస్తుంటుంది.
ఏది ఏమైనా ఋతుక్రమము ప్రతినెలా ఒకే కాలపరిమితిలో వస్తూ ఉంటే 21 రోజులనుండి 35 రోజుల మధ్య  నార్మల్ గానే పరిగణించాలి.

పీరియడ్స్ త్వరత్వరగా వస్తుంటే  సిస్ట్ లేదా ఓవరీస్ లో ఇన్‌ఫెక్షన్‌, హైపర్ థైరాయిడ్ ...  కారణము కావచ్చు .  ఋతుక్రమములో తాత్కాలికము గా మార్పు వస్తే అది అధిక ఒత్తిడి వలన కావచ్చును. 2-3 నెలలు పాటు ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడితే ఋతువు(నెలసరి) క్రమబద్ధము అవుతుంది . ఈ పిల్స్ వాడడానికి ముందు కారణాన్ని గుత్తించాలి. అందుకు గాను వైద్యురాలిని సంప్రదించాలి. కాంట్రాసెప్టివ్ పిల్స్ తాత్కాలికముగా శరీరము లో ఉత్పత్తి అయ్యే ఈస్ట్రోజన్‌ , ప్రొజెస్టరాన్‌ లను తగ్గిస్తాయి. వైద్యులు సూచించిన మేరకు కాంట్రాసెప్టివ్ పిల్స్ తీసుకోవడము వల్ల ఏ ఇబ్బందీ ఉండదు. ఇవి సురక్షితమైనవా? .. కావా? అన్న సందేహానికి తావులేదు.

  • ===============================
 visit my website - > Dr.Seshagirirao-MBBS

Wednesday, November 21, 2012

Exercises in Pregnency - గర్భిణీ చేయవలసిన వ్యాయామము

  • Image : Courtesy with :  http://www.promdinurses.com/2009/07/exercise-during-pregnancy.html

  • ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
ప్ర : నేను గర్భము దాల్చాను . ఎటువంటి ఎక్చర్ సైజులు చేయవచ్చు ?

జ :  లాభాలు :
గర్భిణీ గా ఉన్నప్పుడు వ్యాయామము చేయడచు వలన మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చును . బరువు అతిగా పెరగకుండా నియంత్రించవచ్చును.  ప్రతిరోజూ వ్యాయామము చేయడము వలన మీ శరీర ధారుడ్యము ప్రసవ వేదనను ఎదుర్కొనడానికి వీలు పడును. తుంటి ఎక్షరసైజుల వలన పురుడు సునాయాసము గాను , నార్మల్ గాను అయ్యేందుకు దోహదపడుతుంది.

చేయవలసిన వ్యాయామాలు :
  • వాకింగ్-- మంచి వ్యాయామము . మొదటి దశనుంది నెలలు నిండినవరకూ తేలికపాటి నడక రోజుకు 20 నిముషాలు చాలా మంచిది .
  • యోగా --తేలికపాటి రీతిలో యోగా చేయవచ్చును .
  • జాగింగ్ / రన్నింగ్ :  ఆయాసము రానంతవరకూ చిన్నగా జాగింగ్ గాని చిన్న పాటి రన్నింగ్ గాని చేయవచ్చును . జారి పడిపోకుండా జాగ్రత్త వహించాలి . నెలలు నిండిన వారు చేయకూడదు .
  • స్విమ్మింగ్ : గర్భము దాల్చిన మొదటి నుండి  చివరి వరకూ తేలిక పాటి ఈదడము చేయవచ్చును .

గర్భధారణ సమయంలో వ్యాయామం ఒక నిర్దిష్ట సమయం మరియు వ్యవధి ఉండాలి. జాగ్రత్తలు ఉన్నాయి:

  •      గర్భం ప్రమాదంలో సంకేతాలు ఉన్నాయి ఉంటే ఎప్పుడూ వ్యాయామము చేయకూడదు .
  •       అల్పరక్తపోటు నివారించడానికి ఎప్పుడూ నేల నుండి పైకి నెమ్మదిగా పైకి లేవాలి.  మొదటి వైపు రోల్ మరియు తరువాత ఉదర కండరాలపై వత్తిడి  నివారించడానికి వీలు పడేవిదంగా చేయాలి .
  •      కాలు  తిమ్మిరి నివారించడానికి కాళు ను  ఎప్పుడూ బిగపెట్ట వచ్చు .
  •      కండర అలసట నివారించడానికి తక్కువ  hyperextend చేయాలి .
  •      వ్యాయామం చేస్తున్నప్పుడు  మీ శ్వాసను బిగపట్టి ఉంచకూడదు .ఇది ఉదర మరియు గర్భాశయంలోని ఒత్తిడి పెంచుతుంది .
  •     ఈ శ్వాస తీసుకోవడము నెమ్మది నెమ్మది గా చేయాలి . లేకపోతే  గర్భాశయంలోని ఒత్తిడి మూలాన ఉమ్మనీటి పొర  చిట్లడం జరగవచ్చును.

  • ==============================
 visit my website - > Dr.Seshagirirao-MBBS

What is Brain workouts?-బ్రెయిన్‌ వర్కవుట్లు అంటే ఏమిటి?

  •  
  • ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము . 

ప్ర :  What is Brain workouts?-బ్రెయిన్‌ వర్కవుట్లు అంటే ఏమిటి?

జ : మెదడు చురుగా , పాదరసం లా పనిచేయడానికి ... ప్రతిరోజూ మెదడుకు వ్యాయామాలు అవసరము . బ్రెయిన్‌ ఎక్షరసైజ్ లనే " బ్రెయిన్‌ వర్క్ అవుట్స్ " అంటాము .  ప్రరోజూ రొటీన్‌గా ఈ బ్రెయిన్‌ వర్కవుట్లు భాగము చేసుకోవాలి .  వార్తాపత్రికల్లోని క్రాస్ వర్డ్ పజిల్స్ పూర్తి  చేస్తూ ఉండాలి . కాలిక్యులేటర్ దాచేసి , పేపర్ , పెన్సిల్ తీసుకొని నెలవారీ బడ్జెట్ నో , ఇతర లెక్కల్నో వేసుకోండి . ప్రయాణము చేస్తూంటే ఆయా ప్రదేశాలకు వెళ్ళగల సమయాన్ని , తదుపరి స్టేషన్‌ ను అంచనా వేసుకుంటూ ఉండాలి. గ్రాసరీ బిల్లుల్ని బుర్రలోనే అంచనా చేసుకోవాలి. ఎక్కడ షాపింగ్ చేయాలి , బడ్జెట్ ఎంత అన్న లెక్కలూ కడితే మెదడుకు పదును లభిస్తుంది.
  • ======================
 visit my website - > Dr.Seshagirirao-MBBS

Thursday, November 15, 2012

Come out of Negativity in Life -జీవితం నుంచి ప్రతికూలతల్ని ఏవిధంగా తొలగించుకోవాలి ?

  • ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : జీవితం నుంచి ప్రతికూలతల్ని ఏవిధంగా తొలగించుకోవాలి ?

జ : జీవితం లో ప్రతిఒక్కరికీ ఏదో ఒక చేదు అనుభవమో , చేదు జ్ఞాపకమో, అనారోగ్యమో , అవమానమో ఉంటునే ఉంటాయి. అంతమాత్రాన దిగులుతో ఉండరాదు . అన్నింటిన్నీ అధిగమిస్తూ జీవితం లో ముందుకు సాగిపోవాలి. ఎంతటి ఉన్నత ష్థాయికి వెళ్ళిన వ్యక్తిలోనైనా వృత్తిగత , వ్యక్తిగత సమస్యలుంటాయి. ఇది సహజము . కష్టము వెంట సుఖము , కన్నీటివెంట సంతోషము ఉంటనే ఉంటాయి. వాటంతటవి రావు . మనమే సంతోషము వెతుక్కుంటూ పరుగులు తీయాలి.

మెడడు కంటే హృదయము చెప్పే మాటల్నే ఎక్కువగా వింటుండాలి. బుర్ర కాలిక్యులేట్ చేస్తుంది . మనస్సు  స్పందిస్తుంది. ఎదుటివారు సంతోషముగా , ఉత్సాహముగా ఉన్నారు కాబట్టి వారికేం దిగుళ్ళూ, విచారాలు లేవనుకోకూడదు . వారికుండవలసిన చిక్కులు వారికీ ఉంటాయి కాని బయటకు కనిపించరు.  నిరంతరము చెడు అనుభవాలను , చెడు జ్ఞాపకాలను వదలి ... సంతోషకర క్షణాలనే మళ్ళీ మళ్ళీ స్పురించుకుంటూ ముందుకు సాగాలి. అప్పుడే జీవితం అనందముగా ఉంటుంది. ఇది అంత సాధ్యమైన పని కాదు. సాదనచేస్తే అసాధ్యమేమీ కాదు.
  • =======================
 visit my website - > Dr.Seshagirirao-MBBS

పాలిండ్ల(breast) సైజుల్లో తేడాలుంటాయి ఎందుకని?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర : పాలిండ్ల(breast) సైజుల్లో తేడాలుంటాయి ఎందుకని?

జ : అనేక మంది పెళ్లీడుకొచ్చిన యువతులతో పాటు వివాహమైన మహిళల పాలిండ్ల సైజుల్లో(breast sizes) పెద్ద తేడాలు ఉంటాయి. ముఖ్యంగా... కొంతమంది యువతులు తమ వక్షోజాలు చిన్నవిగా ఉండటాన్ని జీర్ణించుకోలేరు. దీంతో వివాహమైన తర్వాత తమ భర్తలను సుఖపెట్టలేమన్న బెంగ వారిని పట్టుకుటుంది. ఇదే అంశంపై సెక్స్ నిపుణులను సంప్రదిస్తే..

సాధారణంగా వక్షోజాల సైజుల్లో తేడాలు ఉంటాయి. దీనికి ప్రధాన కారణం రొమ్ముల్లోని కొవ్వు కణజాలాన్ని బట్టి వాటి సైజు ఉంటుందన్నారు. చిన్నగా ఉండటం ఒక్కోసారి వంశపారంపర్యంగా ఉండవచ్చంటున్నారు. వివాహమై, పిల్లలు పుట్టి, పాలిచ్చే సమయంలో రొమ్ముల్లోని పాలగ్రంథుల పరిమాణంలో మార్పు వచ్చి సైజు పెరిగే అవకాశం ఉంటుందని చెపుతున్నారు.

అలాగే, ఆహారంలోనూ కొవ్వు, వెన్న, నెయ్యి, ఇతర కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల వక్షోజాల సైజులు పెంచుకోవచ్చని సలహా ఇస్తున్నారు. ఒకవేళ మరీ చిన్నగా ఉంటే సిలికాన్ ఇంప్లాం చేయించుకోవచ్చని చెపుతున్నారు. ముఖ్యంగా భర్తని సంతోష పెట్టడానికి శరీర కొలతలు సర్జరీల ద్వారా మార్చుకునే బదులు గొప్ప వ్యక్తిత్వంతో మనస్సు గెలుచుకుని సంతోష పెట్టేందుకు ప్రయత్నించాలని కోరుతున్నారు.
  • ================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS

Can a pragnant women drink coffee?-గర్భవతిగా ఉన్నప్పుడు కాఫీ తాగవచ్చా?

  • ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము . 

 ప్ర : నేను గర్భం దాల్చాను. నాకు కాఫీ తాగే అలవాటు చాలా ఎక్కువ. ఇప్పుడు కూడా అలా తాగవచ్చా?

జ : గర్భధారణ సమయంలో ఉదరంలో ఎసిడిటి పెరిగి చాలా అసౌకర్యంగా ఉంటుంది. దీనివల్ల వికారం, గుండెల్లో మంట వంటి లక్షణాలు పెరగుతాయి. కాఫీ తాగడం వల్ల ఎసిడిటి మరింతగా పెరుతుంది. కాబట్టి కాఫీని రోజుకు ఒకటి లేదా రెండు కప్పులకు మాత్రమే పరిమితం చేయండి. గర్భం దాల్చాక కాఫీని నియంత్రించుకోక తప్పదు. అలవాటు మార్చుకోలేకపోతే, ఒకసారి ఈ విషయంలో మీ వైద్యురాలి వద్ద ప్రస్తావించి ఆమె సలహా తీసుకోవడం ఉత్తమం.
  • =================================
 visit my website - > Dr.Seshagirirao-MBBS

Wednesday, November 14, 2012

గర్భిణీ స్త్రీలు బొప్పాయి , అనాస పండ్లు తినకూడదంటారు ,ఎందుకని ?

  • ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము . 
 ప్ర : గర్భిణీ స్త్రీలు బొప్పాయి , అనాస పండ్లు తినకూడదంటారు ,ఎందుకని ?

జ : ఆహారానికి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కోవిధంగా చెప్తూ అపోహలకు గురిచెస్తుంటారు. ఇలా వింటూ పోతే చివరకు తినడానికి ఏవీ మిగలవు . ఇది మంచి ఆలోచన కాదు . గర్భము దాల్చాక ఆరోగ్యవంతమైన ఆహారము తినాలి . బొప్పాయి , అనాస పండ్లే కాకుండా మీట్ , చేపలు , చీజ్ , సాల్ట్ , స్పిసెస్  మొదలైనవి కూడా గినకూడదని చాలామంది  చెప్తుంటారు . నిజానికి వీటికి సంబంధించి శాస్త్రీయ సాక్ష్యాధారాలేవీ లేవు . ప్రాసెస్డ్ మీట్ , సాఫ్ట్ చీజ్ వంటి వాటిలో బాక్టీరియా ఎక్కువ ఉండే పదార్ధాలు తినకూడదు . కొంతమందికి కొన్ని పదార్ధాల టాలరెన్స్  ఉండదు , అటువంటి వాటిని జాగ్రత్తగా గుర్తించి మానివేయాలి.

కాబట్టి  ఇది పడదు , అది తగదు అన్న ఆలోచనలు చేయవద్దు . తాజా పండ్లు , కాయకూరలు , తినండి . మీరు చికిత్స తీసుకునే వైద్యురాలి సలహా మాత్రమే అనుసరిస్తూ అన్ని ఆహారపదార్ధాలు తినవచ్చును .
  • =================================
 visit my website - > Dr.Seshagirirao-MBBS

Saturday, November 3, 2012

Night meal at earl time is good?-రాత్రివేళ ఆలస్యముగా తినవద్దని వైద్యులు సూచిస్తారు మంచిదా?

  • ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
 ప్ర : రాత్రివేళ ఆలస్యముగా తినవద్దని వైద్యులు సూచించారు . కాని పెందలాడి తినడము వలన రాత్రు షిఫ్ట్ అయ్యాక కడుపు మాడ్చుకోవలసి వస్తుంది . ఏధైనా సూచిస్తారా?.

జ : మన శరీరము 24 గంటల క్లాక్ కు అనుసంధానమై ఉంటుంది . రోజు పూర్తయ్యేసరికి చాలా భాగము క్యాలరీలు ఖర్చయిపోతాయి.  రాత్రిపూట బాగా ఆకలనిపిస్తే పండ్లు ,నట్స్ లేదా పాలు , పెరుగు ,చీజ్ వంటి దైరీ ఉపత్తులు తీసుకోడి. కాటేజ్ చీజ్ ట్రై చేయండి . దీనిలో కెసిన్‌ ప్రోటీన్‌ అధికము గా ఉండి శక్తిని నెమ్మదిగా శరీరములోకి చిడుదల చేస్తుంది. కానీ ఇవన్నీ కేలరీలను ఎక్కువ చేసి ఊబకాయానికి దారితీయును . ఆకలిగా ఉన్నప్పుడు ఎక్కువగా నీరు త్రాగండి .ఇక్కడ డాక్టర్లు రాత్రి తొందరగా తినమన్నది . మంచి నిద్రకోసము . ఆలస్యముగా  తింటే నిద్రకు వెంటనే ఉపద్రమించాలి .. కానీ తిన్నవెంటనే నిద్రపోతే ఆరోగ్యానికి మందిదికాదు. కనీసము 7-8 గంటలు రాత్రి నిద్ర అవసరము .
  •  ================================================= 
visit my website - > Dr.Seshagirirao-MBBS

Low Joint Flexibility ?-వయస్సు నలభైల్లోకి వచ్చేసరికి జాయింట్ల ప్లెక్సిబిలిటీ తగ్గుతుంది . ఎందుకని ?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర : వయస్సు నలభైల్లోకి వచ్చేసరికి జాయింట్ల ప్లెక్సిబిలిటీ తగ్గుతుంది . ఎందుకని ? .

జ : వయసు తో పాటు జాయింట్లు , ముఖ్యము గా వెన్నెముక వెంట రానురాను స్టిఫ్నెస్   తగ్గి ప్లెక్షిబిటీల్ లో తేడావస్తుంది . వీటికి తొకి లక్షణాలు వెన్నెముక లేదా బ్యాక్ పెయిన్‌ . ఇందుకు ప్రదాన కారణము పూర్ పోశ్చర్ , జీవనవిధానము సరిగ్గా లేకపోవడం , ఆఫీసుకు డరివ్ చేసే తీరు , డెస్క్ దగ్గర కూర్చునే విధానము .... వీటినన్నింటినీ తగిన రీతిలో మార్చుకోవాలి .

పైగా యవ్వనములో ఉన్నప్పుడు ఉత్పత్తి అయినంత ఎలాస్టిన్‌ .. వయసు మళ్ళిన తరువాత ఉండదు . అప్పుడు కణాలు పూర్తి ప్రోటీన్‌ తో ఉంటాయి. సాగని ఫైబ్రిన్‌ ప్రోటీన్‌ కూడా ఉంటుంది. ఎలాస్టిన్‌ ఫైబ్రిన్‌ నిష్పత్తి  , టిష్యూల్లో రకాలు , వాటి పనితీరును బట్టి మారుతాయి . నిజానికి వయసు మళ్ళినకొద్దీ ఎలాస్టిన్‌ మోతాదు అవసరము ఎక్కువ ఉంటుంది కాని , ఆ స్థాయిలో ఉత్పత్తి జరుగదు .  అయితే 40 సం.లు తరువాత ప్లెక్షిబిలిటీ పెందుకోగల మార్గాలు , అవకాశాలు చాలా ఉన్నాయి. అవి -> వ్యాయామము అనగా ... వాకింగ్ , స్వింగింగ్  మరి ఏదైనా ఇతర మనకు తగిన క్రీడ చేస్తే ప్లెక్సిబిలిటీ మరుగుపడుతుంది . యోగా చేసినా ఉపయోగము ఉంటుంది . ఏది చేసినా 20- 40 నిముషాల మాత్రమే చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. క్రమము తప్పకుండా చేయాలి.

కాల్సియం , చేపలు , పండ్లు , ఆకుకూరలు , పప్పులు ఉన్న ఆహారము తీసుకోవాలి. అవసమైతే ... Tab. glucosamine sulfate + MSM ( Jointace Plus) వాడవచ్చును. దీర్ఘకాలిక కీళ్ళ నొప్పులు ఉంటే Diacerin + Glucosamine +MSM ... combination (Jointace -DN) వాడంది.
  •  ================================================= 
 visit my website - > Dr.Seshagirirao-MBBS

Frequent urine pasing - తరచూ మూత్రానికి వెళ్ళాలసివస్తోంది

  •  
  • ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర : నా వయసు 55 సం.లు . పదేళ్ళుగా డయాబెటీస్ ఉంది . గత ఆర్నెళ్లు గా తరచూ మూత్రానికి వెళ్ళాలసివస్తోంది. కంట్రోల్ చేసుకోవడమూ కష్టముగా ఉంటోంది. షుగర్ , ''హెచ్బి ఎ 1 సి ''  మామూలుగానే ఉన్నాయి. ప్రోస్టేట్ పరీక్షలు సాధారనముగానే ఉన్నాయి. మరి దీనికి కారణము ఏమిటి? .
: దీర్ఘకాలిక డయాబెటీస్ ఉన్నవారికి పాలీయూరియా మరియు  యు.టి.ఐ. (Urinary Tract Infection) ఉండవచ్చును . యూరిన్‌ రొటీన్‌ టెస్ట్ , మైక్రోస్కోపిక్ చేయించుకోండి . దానివలన కొంత సమాచారము తెలుస్తుంది. . మీరు '' నీరు '' ఎక్కువగా తాగండి . మూత్రానికి తరచూ వెళ్తుండండి . వైస్యుల సలహా మేరకు తీపి పదార్ధాలు , తీపి పండ్లు తినడము మానేయంది . రోజూ బి.కాంప్లెక్ష్ మాత్ర తీసుకోండి. అవసమనుకుంటే డాక్తర్లు సలహా తో Anti-cholinergics తీసుకోండి . బ్లాడర్ రీ టరినింగ్ టెక్నిక లు డాక్టర్ ని అడిగి ప్రాక్టిస్ చేయండి.
  •  ================================================= 
visit my website - > Dr.Seshagirirao-MBBS