Sunday, May 20, 2012

Weitht reduction by Cellotherm Treatment,సె్ల్లోథెర్మ్‌ చికిత్స తో బరువు తగ్గడము



ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
  • ==========================
visit my website - > Dr.Seshagirirao-MBBS

Waxing for hair, అవాంచిత రోమాలు,unwanted hairs



ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర : మా అమ్మాయికి మొహం నిండా వెట్రుకలు చూసి పెళ్ళి సంబంధాలు తప్పిపోతున్నాయి. అవాంచిత రోమాలు ఎలా తీసివేయాలో తెలియజేయగలరు ?


జ : కొంత మందిలో అవాంఛితరోమాలు, కాళ్లు, చేతులపై విపరీతంగా వచ్చి ఇబ్బంది కలుగజేస్తుంటాయి. అవాంఛితి రోమాల సమస్య ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తోంది. అందుకోసం రకరకాల కృత్రిమ పద్దతులతో ఎటువంటి మార్పు లేనందున వారిలో చిరాకు మొదలవుతుంది. అలాంటప్పుడు త్రెడింగ్, షేవింగ్ లాంటి పద్ధతుల కన్నా.. వ్యాక్సింగ్ చక్కని ప్రత్యామ్నాయం. వ్యాక్సింగ్ కొందరికి పడకపోవచ్చు. కొన్ని సార్లు సరిగ్గా చేయకపోతే చర్మంపై దద్దుర్లు, ఎర్రటి పొక్కులు వస్తాయి. ఇక చేతులు, భుజాల దగ్గర బ్యాక్టీరియా ఉంటే ఇన్ ఫెక్షన్ కు కారణమై మచ్చలకు దారితీస్తుంది. కొందరిలో అవి త్వరగా తగ్గితే..మరికొందరిలో చాలా సమయం పట్టవచ్చు. కాబట్టి వాక్సింగ్ చేసుకొనే ముందు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరి...

దీన్ని తరచూ చేయించుకోవడం వల్ల అవాంచిత రోమాలు బలహినమై వాటి ఎదుగుదల క్రమంగా తగ్గిపోతుంది. వ్యాక్సింగ్ అలవాటు పడితే ఎండకు నల్లగా మారిన చర్మం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. మృత చర్మం తొలగి తాజాగా కనిపిస్తుంది. అవగాహన లేకుండా వ్యాక్సింగ్ చేయించుకోవడం వల్ల ఒక్కోసారి శరీరంలో నెత్తురు గడ్డకట్టి చర్మంపై మచ్చలు పడతాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

  • 1. వ్యాక్సింగ్ చేసే భాగానికి ముందుగా పౌడర్ రాసుకోవాలి. వ్యాక్స్‌ను వేడి చేసుకోవాలి. ఆ వేడిని తెలుసుకునేందుకు ప్రత్యేకంగా నైఫ్ దొరుకుతుంది. దాన్ని తీసుకుని వేడిని పరీక్షించుకుని అవాంఛిత రోమాలు పెరిగే వైపు నుంచి పూతలా వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకుంటే, తొలగించే లోపల ఆరిపోయి, తొలగించేందుకు కష్టం అవుతుంది. రెండుమూడు అంగుళాల మందం పొడవులో వేసుకుంటే చాలు.
  • 2. వ్యాక్సింగ్ చేసుకున్న వెంటనే దద్దుర్లు వస్తే వెంటనే నిపుణుల సలహా తీసుకొని యాంటీబయోటిక్స్ కూడా వాడాలి. యాంటిబయోటిక్ క్రీంను వారం రోజులు ముందు వాడాలి. తరవాత మరో రెండుమూడు రోజులు రాసుకుంటే అలర్జీ, పిగ్మెంటేషన్ వంటి సమస్యల నుండి బయట పడవచ్చు.
  • 3. బహుమూలాల్లో చేస్తున్నప్పుడు ఒక్కోసారి నొప్పి ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు కోల్డ్ కంప్రెషన్ ఇచ్చి ఐదునిమిషాల అనంతరం వ్యాక్సింగ్ చేసుకుంటే నొప్పి తక్కువగా ఉంటుంది. ముఖానికి వ్యాక్సింగ్ చేసుకుంటున్నప్పుడూ రెండు మూడు అంగుళాల మేర వేసి..ఆ భాగం సాగకుండా బొటనవేలు, చూపుడు వేలితో గట్టిగా నొక్కిపట్టుకుని వ్యాక్స్ పట్టీతో తొలగించాలి. అప్పుడు చర్మం కందిపోకుండా.. దద్దుర్లు రాకుండా ఉంటుంది. ఈ రోజుల్లో రకరకాల వ్యాక్స్‌లు అందుబాటులో ఉన్నాయి. అందులో...
  • 1. పాట్‌వ్యాక్స్ : ఇవి చిన్నచిన్న పాత్రల్లో వస్తాయి. పై పెదవి, ముఖంపైన ఉన్న అవాంఛిత రోమాల్నితొలగించేందుకు ఇవి సరైన ఎంపిక. కానీ దీనివల్ల చాలా త్వరగా అంటే మూడో రోజుకే మళ్లీ సమస్య మొదలవుతుంది.
  • 2. హాట్ వ్యాక్స్: ఈ రోజుల్లో చాలామంది దీన్ని ఎంచుకోవడానికి ఇష్టపడుతారు. ఎందుకంటే ఇది శరీరంలో ఎక్కడైనా వాడుకోవచ్చు. అవాంఛిత రోమాల్ని సులువుగా తొలగిస్తుంది. అయితే ఇది ఓ క్రమ పద్ధతిలో వేసుకోవాలి.
  • 3 కోల్డ్ వ్యాక్స్: దీన్ని పలుచగా కాకుండా మందంగా వేసుకోవాలి. సరిగ్గా తొలగించలేకపోతే.. చర్మం పైపొర కూడా ఊడిపోయే ప్రమాదం ఉంటుంది.
  • కొంత మంది స్త్రీలలో ముఖంపైన ఎక్కువగా అవాంచిత రోమాలు కన్పిస్తుంటాయి. ముఖంపైనే కాకుంటా చేతులు, కాళ్లు, మెడ తదితర భాగాలలో కూడా ఎక్కువగా కన్పిస్తాయి. ఈ అవాంచిత రోమాలతో బాధపడే స్త్రీలు దానికి తగిన పరిష్కారం చేసుకోండిలా...
  • * పసుపు కొమ్ముని బాగా గ్రైండ్ చేసి రాత్రిపూట ముఖంపైన పూతలా వేసి ఉదయాన్నే గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకునట్లైతే అవాంచిత రోమాలు మాయమైపోతాయి.
  • * బొప్పాయి కాయని, పసుపుని కలిపి గ్రైండ్ చేసి ముఖంపైన రుద్దినట్లైతే అవాంచిత రోమాలు తొలగిపోతాయి.
  • * కస్తూరి పసుపుని, జున్నుని కలిపిన మిశ్రమాన్ని ముఖానికి వాడుతూవచ్చినట్లైతే కూడా ముఖంపైన ఉన్న రోమాలను తగ్గించవచ్చును.
  • * కందుల పైతోలు, ఆవు పాలు, నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని ముఖంపైన అప్లైచేసి ఆరిన తరువాత శుభ్రపరచినట్లైతే అవాంచిత రోమాలు ఇట్టే మాయమైపోతాయి.
  • * కొంతమంది స్త్రీలలో కాళ్లు, చేతులపై ఉండకూడనిచోట వెంట్రుకలు పెరుగుతాయి. ఇటువంటివారు హరి దళం మోదుగ పుల్లలు కాల్చిన బూడిదను సమభాగాలుగా తీసుకుని అరటి దుంప రసంతో మర్దన చేసి పైన రాస్తూంటే వెంట్రుకలు ఊడిపోయి తిరిగి పుట్టవు.--మూలము : వెబ్ దునియా
  • * కురసాని వామును చూర్ణం చేసి + నువ్వుల నూనె ను కలిపి శరీరము పై వ్రాస్తూ ఉంటే అవాంచిత రోమాలు పోతాయి.--మూలము : ఏచూరి
  • * జమ్మి ఆకు రసం పూస్తూ ఉంటే అవాంచిత రోమాలు పోతాయి.--మూలము: ఏచూరి.
WAXING


salons we offer two different types of wax treatments to clients, hot wax and strip wax. The type you choose will depend on your preference, the area you are having waxed and how it suits your skin. therapists will be discuss the options available to help you choose the most suitable for you.

HOT WAX:

This wax consists of beeswax and resin and is melted to a thicker consistency than warm wax. Applied to the skin with a wooden spatula, it coats the hair with a thick layer and hardens around the hair to grip it tightly. Once dry, the wax is flipped up at the corner and pulled off quickly by the therapist. Many people find hot wax less painful than strip wax as the heat allows the pores to open so hair is removed more easily and it is the less sticky option more able to remove shorter hair than warm, strip wax.

STRIP(WARM) WAX:

This is the most popular method of waxing. It consists of resin, paraffin wax, glucose syrup and honey. Warm wax is smoothed onto the skin in a thin layer and immediately covered with a fabric or paper strip which is pressed/rubbed onto the waxed area before being removed in a quick swipe. Strip waxing is quicker than hot wax and larger areas can be waxed at one go.
  • ==========================

visit my website - > Dr.Seshagirirao-MBBS

Tuesday, May 15, 2012

పిల్లలకు తగినంత సూర్యకాంతి శరీరానికి తగలడము అవసరమా?, Sun rays are necessary for children health-Why?



ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర : పిల్లలకు తగినంత సూర్యకాంతి శరీరానికి తగలడము అవసరమా?.

జ : చాలా అవసరము . బిడ్డ పుట్టినప్పటి నుండి వారి శరీరానికి తిగిన సూర్యరశ్మి సోకుతుండాలి. కొందరు పిల్లలకు పుట్టుకతోనే " ఫిజియొలాజికల్ జాండిస్ " ఉంటుంది . అటువంటి పిల్లల శరీరము పై దుస్తులు లేకుండా ఉదయము , సాయంత్రము కొద్దిసేపు ఉంచితే మంచిది . ఇప్పుడు పరిశోధకులు మరో సరికొత్త విషయాన్ని గుర్తించారు . అలెర్జీలకు గురికాబడే పిల్లలకు సూర్యరశ్మి బాగామేలు చేసుందని ... వాతావరణ , మానవ ఆరోగ్య యూరోపియన్‌ కేంద్రము జరిపిన పరిశోధనలలోగుర్తించారు.

పిల్లలలో ఆహార సంబంధిత ఎలర్జీలు , ఎక్జిమా తగ్గడానికి ఎండ సహకరిస్తుంది . అంతగా సూర్యకాంతి సోకని ప్రదేశాల్లో నివసించే పిల్లలు , బాగా సూర్యకిరణాలు సోకే ప్రదేశాలలో ఉండేవారికంటే ఆహార ఎలర్జీలకు , ఎక్జిమా లకు ఎక్కువగా గురి అవుతారు . చర్మములో " విటమిన్‌ - డి " ఏర్పడడానికి శరీరానికి సూర్యకాంతి ముఖ్యము . కాబట్టి ఉదయము , సాయంత్రము వేళల్లో సూర్యరశ్మి సోకే విధము గా పిల్లల్ని ఆడుకోవడానికి ప్రోత్సహించాలి .
  • =============================
visit my website - > Dr.Seshagirirao-MBBS

Monday, May 14, 2012

మామిడి పళ్ళు శరీర బరువు ఎలా తగ్గిస్తాయి?,How Mangoes Aid Weight Loss


  • సువర్ణరేఖ మామిడి పండ్లు .

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .


ప్ర : మామిడి పళ్ళు శరీర బరువు ఎలా తగ్గిస్తాయి?

జ : మామిడి పళ్ళు ఎంతో రుచికరం. కనుకనే దానిని పండ్లలో రారాజు అని పిలుస్తాం. నోరూరించే ఈ వేసవికాల పండు వివిధ రకాలుగా తినవచ్చు. దీనితో తీపి, పులుపు, రుచుల వంటకాలు చేసుకోవచ్చు. మీరు మామిడిపండు ప్రియులైతే ఈపండు అనగా--సువర్ణరేఖ మామిడి పండ్లు..మీ శరీరానికి ఎంతో ఆరోగ్యకరంఅని తెలుసుకోండి. మామిడిపండులో, ఎన్నో విటమిన్లు, పీచు, మినరల్స్ వుంటాయి. చాలామంది మామిడిపండు బరువు పెంచుతుందని భావిస్తారు. కాని మామిడిపండ్లు శరీర బరువు తగ్గిస్తాయని మీకు తెలుసా? మరి ఈ మామిడిపండ్లు అవి బరువు తగ్గేందుకు ఎలా సహకరిస్తాయనేది పరిశీలించండి.

అనేక దశాబ్దాలనుండి మామిడి పండ్లు బరువు తగ్గేందుకు సహజ ఆహారంగా వాడుతున్నారు. చాలామంది పోషకాహార నిపుణులు బరువు తగ్గేందుకు మామిడిపండ్లను తినమని సిఫార్సు చేస్తారు. తింటే ఇవి ఎంతో సురక్షితం, చెడు దుష్ప్రభావాలు అసలే వుండవు.

మామిడి పండ్ల ఆరోగ్య ప్రయోజనం ప్రధానంగా దాని విత్తనాలనుండి వస్తుంది. అంటే టెంకనుండి వస్తుంది. దీని టెంకలో కావలసినంత పీచు, కొవ్వులు వుండి అవి అధిక బరువు కరిగించేస్తుంది. ఆకలిని లెప్టిన్ అనే పదార్ధం ఎప్పటికపుడు నియంత్రిస్తుంది. అది దీనిలో వుండటం చేత, ఆకలి మందగించి, కేలరీలు అధికంగా ఖర్చయ్యేలా చేస్తుంది. కొల్లెస్టరాల్ దీనిలో చాలా తక్కువ. దీనిలో వుండే అడిపోనెక్టిన్ అనే పదార్ధం ఇన్సులిన్ ఉత్పత్తి అధికం చేస్తుంది. అది కొవ్వును శక్తిగా తక్షణమే మారుస్తుంది.

బరువును తగ్గించటమేకాక, వ్యాధులు రాకుండా చేస్తుంది. మనలోని జీవక్రియ వేగవంతం చేస్తుంది. కఠిన ఆహారం పాటించకుండా వర్కవుట్లు చేయకుండా బరువు తగ్గాలనే వారికి మామిడిపండ్లు తినటం మంచి మార్గం. ఏ మందులు వాడకుండా బరువు సహజంగా తగ్గాలంటే,మామిడిపండు ఎంతో ప్రయోజనం.

మామిడిపండ్ల ఆరోగ్యప్రయోజనాలు మరిన్ని.....
1. ఎసిడిటీ వుంటే మామిడిపండు సహజ నివారణ కలిగిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరిచే ఎంజైములు వున్నాయి.
2. మొటిమలు తగ్గేందుకు ఒక మామిడిపండు రసాన్ని మీ ముఖంపై రుద్దితే చర్మంలోని రంధ్రాలు బాగా శుభ్రపడి మొటిమలు వెంటనే తగ్గుతాయి.
3. మామిడిపండు కొల్లెస్టరాల్ లెవెల్ తగ్గిస్తుంది. దీనిలో వుండే కరిగే పీచు, విటమిన్ సి మరియు పెక్టిన్ లు కొల్లెస్టరాల్ స్ధాయి నియంత్రిస్తాయి.
4. రెగ్యులర్ గా కనుక దీనిని తింటే, దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు కేన్సర్, డయాబెటీస్, గుండెజబ్బులకు కారణమయ్యే క్రిములను తొలగిస్తాయి.

  • ==========================

visit my website - > Dr.Seshagirirao-MBBS

Is our diet only for Hungry?,మనము తింటున్న ఆహారము ఆకలికోసమేనా?



ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర : మనము తింటున్న ఆహారము ఆకలికోసమేనా?

జ : ప్రతిప్రాణీ ఆహారం తీసుకోక తప్పదు. మనిషి రోజులో మూడుపూటలా భోజనం చేయాల్సిందే. ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ చేయడం తప్పనిసరి. అయితే మనం తీసుకునే ఆహారం కేవలం ఆకలి తీర్చడమే కాకుండా శరీరంలోని మొదడు తదితర భాగాలకు పోషణనందిస్తుంది. కాబట్టి తీసుకునే ఆహారాన్ని బట్టి అతని మనసు, ఆరోగ్యం ఆధారపడి ఉంటాయి.

మనం తీసుకునే ఆహారంలో సరిగా లేక అధిక మసాలాలు, కారాలు, ఉప్పు కలిగివున్నా, ఆకలికి మించి ఎక్కువగా తీసుకోవడం, లేదా తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం వంటివి చేసినా ఆరోగ్యానికి హానికరమంటున్నారు వైద్యులు. ఆహారం తీసుకోవడం ద్వారా శరీరానికి శక్తి అందడంతో పాటు ఉత్సాహంగాకూడా ఉంటుంది. ఆహారం తీసుకోవడం వల్లనే శరీరానికి శక్తి, బలం వస్తుందనుకోరాదు. మనం తీసుకునే ఆహారం ఏ మేరకు జీర్ణమయ్యిందనే విషయం కూడా తెలుసుకోవాలి. పని ఒత్తిడి కారణంగా ప్రస్తుతం యువత అందులోనూ మహిళలు సరైన ఆహారం తీసుకోవడం లేదనేది పోషకాహార నిపుణుల అభిప్రాయం.

కొంతమంది యువతులు మాత్రం సమయానికి ఆకలి తీర్చుకుంటున్నప్పటికీ, ముఖ్యంగా దారిలో ఏది కనపడితే అది తినేయడం లేదా కాఫీలు, టీ, స్నాక్స్‌వంటి చిరుతిండ్లతో ఓ పూట గడచిందని భావిస్తారు. దీంతో వారు తీసుకునే ఆహారం జీర్ణక్రియపై చెడు ప్రభావం చూపిస్తోంది. ఇలాంటి వారు సరైన ఆహారం తీసుకోకపోవడం మూలంగా తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారని కూడా వైద్యులు అంటున్నారు.

మరి ఆహారం ఎప్పుడు తీసుకోవాలి? కొంత మంది ఆహారం తీసుకోవడానికి ఎలాంటి సమాయాన్ని అనుసరించరు. ఒకరోజు ఒక సమయంలో తీసుకుంటే మరో రోజు మరో సమయంలో తీసుకుంటారు. కానీ అలా కాకుండా తీసుకునే ఆహారానికి నియమిత సమయం తప్పకుండా ఉండాలి. ఉదయంవేళ ఎంత బిజీగా వున్నప్పటికి బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరిగా తీసుకోవాలంటు న్నారు వైద్యులు. బ్రేక్ ఫాస్ట్ తరువాత 12 గంటల లోపుగా అన్ని పదార్ధాలతో కూడిన సంపూర్ణ భోజనం తీసుకోవాలి. దీంతో పగ లంతా పనిచేసేందుకు శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది.

  • ==========================
visit my website - > Dr.Seshagirirao-MBBS

What are the Ways to Get Rid Baby Gas? ,బేబీ లోఅపానవాయువు అరికట్టడమెలా?



ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

Q : బేబీ లోఅపానవాయువు అరికట్టడమెలా?

A : బిడ్డ పుట్టింది కొత్తగానే అయినా వారికికూడా ఆరోగ్య సమస్యలుంటాయి. మీరు తల్లిపాలు పడుతున్నప్పటికి కొన్నిసార్లు మీ బేబీ పొట్టలో గ్యాస్ లేదా మలబద్ధకం లేదా విరేచనాలతో బాధపడుతూంటుంది. దీనికి కారణం బేబీ జీర్ణ వ్యవస్ధ ఇంకా అభివృధ్ధి చెందుతూంటుంది. అయితే, బేబీలో కలిగే ఈ Gas అనారోగ్య సమస్యకు కొన్ని చిట్కాలు చూడండి.

వీపు తట్టండి - పాలు తాగిన ప్రతిసారి, బేబీని మీ చేతుల్లోకి తీసుకొని మెల్లగా వీపుపై తట్టండి. బేబీ త్రేన్చే వరకు ఒకటి నుండి రెండు నిమిషాలు ఈ పని చేయండి. ఈ త్రేన్పులు బేబీకి గ్యాస్ కలిగించకుండా చేస్తాయి.

బేబీ పొట్ట నిమరండి - గ్యాస్ పోగొట్టటానికి బేబీ పొట్టను మెల్లగా రుద్దండి. బేబీని వీపుపై పడుకో పెట్టండి. పొట్ట వేళ్ళతో సున్నితంగా రుద్దండి. గ్యాస్ జీర్ణ వ్యవస్ధగుండా బయటకు వస్తుంది.

వేడి నీరు - బేబీ కనుక బాగా గ్యాస్ తో బాధపడుతూంటే, గోరు వెచ్చటి నీరు పట్టండి. బేబీ గొంతు సున్నితం వేడి ఎక్కువ ఉండరాదు. బేబీని వేడినీటిలో స్నానం కూడా చేయించవచ్చు. ఆ వేడికి గ్యాస్ తగ్గే అవకాశం వుంది.

పోత పాలు - బేబీకి కనుక బాటిల్ పాలువంటివి ఇస్తుంటే వాటిని ఆపండి.దీనివలన కూడా గ్యాస్ వచ్చే అవకాశం వుంది.

వ్యాయామం - బేబీని వీపుపై పడుకోబెట్టి మెలలగా కాళ్ళు, చేతులు ఆడించండి. బేబీ కాళ్ళతో పైకి కిందకు సైకిల్ తొక్కుతున్నట్లు చేయండి. ఇది బేబీ పొట్టలో కండరాలను సడలించి గ్యాస్ బయటకు వచ్చేలా చేస్తుంది.

బేబీతో ఆడండి. కూర్చో పెట్టి ఆడించండి. ఇది బేబీ శారీరక కదలికలను పెంచుతుంది. గ్యాస్ త్రేన్పు లేదా అపానవాయువుల ద్వారా బయటకు వచ్చేస్తుంది. బేబీ నోటిద్వారా గాలి పీల్చకుండా కూడా చూడండి.

  • ==========================
visit my website - > Dr.Seshagirirao-MBBS

Tuesday, May 8, 2012

Wait for marriage upto 21 yrs,పెళ్ళికి 21 సం.వరకు ఆగండి



ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును. ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .


Q : మా పాపకు పద్దెనిమిది సంవత్సరాలు. వాళ్ల కాలేజ్‌లో లెక్చరర్‌తో ప్రేమలో పడింది. అతడు ఆమెకంటే 11 ఏళ్లు పెద్ద. మా అమ్మాయి నాకు చెప్పిన తరువాత నేను వెళ్లి అతడితో మాట్లాడిన. చాలా మంచి వ్యక్తిలాగా కనిపించాడు. కాకపోతే మా అమ్మాయి వయసు 18 ఏళ్లు మాత్రమే. ఇద్దరి వయసుల మధ్య తేడా ఎక్కువగా ఉంది. ఆ అబ్బాయి వ్యక్తిత్వం చూసిన తరువాత ఇది పెద్ద సమస్య కాదు అనిపించింది. కానీ మా స్నేహితులు, బంధువులు మాత్రం అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఆ బంధం ఎక్కువకాలం నిలబడదు అంటున్నారు. అమ్మాయికి నేను ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. మా పాప అతడిని చూడకుండా, మాట్లాడకుండా ఉండాలంటే కాలేజ్ మాన్పించేయాలా? లేదా వాళ్లకు పెళ్లి చేసేస్తే... తరువాత ఏం సమస్యలు వచ్చినా వాళ్ల బాధేదో వాళ్లు పడతారు అని ఊరుకోవాలా? నేను సింగిల్ పేరెంట్‌ను. నేను ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది?



A : మీరు మీ కూతురు, ఆమె ఇష్టపడిన అబ్బాయి మధ్య వయసు తేడా గురించి బాధపడకపోయినా పర్లేదు కానీ... మీ పాప వయసు గురించి మాత్రం ఆందోళన చెందాల్సిందే. ఎందుకంటే కేవలం పద్దెనిమిదేళ్లు ఆమెకి. ఈ వయసులో మంచేదో, చెడేదో తెలియదు. ఇప్పటిదాకా స్కూల్, మీ ఇంటిచుట్టుపక్కల వాతావరణం మాత్రమే చూసి ఉంటుంది. అక్కడ ఉన్న అబ్బాయిల గురించి మాత్రమే తెలుసు ఆమెకు. ఇప్పుడు ఒకేసారి కాలేజ్‌కు వెళ్లేసరికి అందులో కాస్త తెలివైన, మంచిగా ఉన్న వాళ్లను ఇష్టపడొచ్చు. ఇందుకు మరో కారణం కూడా ఉంది. ఆమె ఇంట్లో తండ్రి ప్రేమను పొందలేదు. సాధారణంగా తండ్రి ప్రేమ పొందని అమ్మాయిలు బయట అబ్బాయిలకు తొందరగా ఆకర్షితులవుతారు. కొంచెం అందంగా, ఆకర్షణీయంగా ఉన్నా, తెలివికలవాళ్లని వెంటనే ఇష్టపడతారు. ఈ వయసులో పెళ్లి, అందుకు కాబోయే భార్యాభర్తలిద్దరి మధ్య ఉండాల్సిన అవగాహన గురించి అసలే తెలియదు. అభిమానాన్ని, ఆకర్షణను కూడా ప్రేమ అనుకునే వయసు. అందుకే లెక్చరర్‌లో తెలివి, హుందాతనం మీ అమ్మాయిని ఆకర్షించి ఉంటాయి. ఆ అభిమానాన్ని కాస్త ప్రేమగా భావించి ఉంటుంది. అమ్మాయికి పద్దెనిమిదేళ్లే కాబట్టి కనీసం ఇంకో మూడేళ్లపాటు పెళ్లికి ఏం తొందరలేదని చెప్పండి. అప్పటివరకు వాళ్లిద్దరి మధ్య ఆరోగ్యకరమైన స్నేహాన్ని కొనసాగించమని చెప్పండి. ఈ మూడేళ్లలో మీ అమ్మాయి సర్కిల్ పెరుగుతుంది. విశ్లేషించుకునే శక్తి వస్తుంది. జీవితంపట్ల ఓ అవగాహన కూడా వస్తుంది. సమాజంపట్ల ఆమె ఆలోచన పరిధి కూడా పెరుగుతుంది. అప్పుడు ఇంతకుముందు తాను ఇష్టపడ్డ లెక్చరర్ తనకు సరైనవాడేనా, అది నిజమైన ప్రేమేనా అనేది ఆమెకు తెలిసొస్తుంది. ఆ మూడేళ్ల తరువాత కూడా అదే ప్రేమ వాళ్లిద్దరి మధ్య ఉంటే పెళ్లి చేయండి.
  • =============================

visit my website - > Dr.Seshagirirao-MBBS

Saturday, May 5, 2012

వయసులో చిన్న అయిన అబ్బాయితో కలిస్తే నష్టమా?, Any bad if have sex boy younger to me?




ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము

Q : నా వయసు నలభై దాటింది. నాకు పదిహేనేళ్ల క్రితం పెళ్లయ్యింది. పిల్లల్లేరు. పెళ్లయిన కొత్తల్లో మేమిద్దరం కలిసి హనీమూన్‌కు వెళ్లినప్పుడు మాత్రమే శారీరకంగా దగ్గరయ్యాం. అప్పటి నుంచి నేటి వరకు మా మధ్య ఎలాంటి లైంగిక చర్య జరగలేదు. నాలో ఆ ఆసక్తి ఉన్నా.. ఇన్నేళ్లూ నా భర్తకు తెలియజేయకుండా మౌనం వహించా. ఇప్పుడు కొంతకాలం క్రితం నా కన్నా వయసులో చిన్నవాడైన ఒకబ్బాయితో పరిచయమైంది. ఇద్దరం ఒకరినొకరం ఇష్టపడుతున్నాం. అతని సాన్నిహిత్యాన్ని నేనూ ఆనందిస్తున్నా. ఓసారి లైంగికచర్యలో పాల్గొనే ప్రయత్నం చేస్తే.. ఇద్దరం విఫలమయ్యాం. నాకు వయసైపోవడమే కారణమా?

A : లైంగిక జీవితాన్ని ఆనందించడానికి వయసుతో సంబంధం లేదు. కొన్నిసార్లు స్త్రీలలో తక్కువ ఉండాల్సిన పురుష హార్మోను స్థాయి పెరుగుతుంది. అప్పుడు లైంగిక వాంఛలు ఎక్కువవుతాయి. మీ సమస్య కూడా అదే. లైంగిక చర్యలో విఫలమవడానికి కారణము మీ ఇద్దరిలో ఉన్న భయమే . అయితే మీరు భర్తతో కాకుండా మీకన్నా వయసులో చిన్నవాడైన వ్యక్తితో లైంగికచర్యలో పాల్గొంటున్నారని రాశారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. సాధ్యమైనంత వరకు మీ స్నేహితుడిని దూరం పెట్టి మీరు, మీ భర్త దగ్గరయ్యేందుకు ప్రయత్నించండి. అంతకన్నా ముందు, మీరిద్దరూ ఇన్నేళ్లుగా దూరంగా ఉండటానికి గల కారణాలను తెలుసుకోండి. వాటిని సాధ్యమైనంత వరకు పరిష్కరించుకోండి. ఇద్దరి మధ్యా అనుబంధం పెరగడానికి ఎటువంటి మార్పులు చేసుకుంటే బాగుంటుందో కలిసి ఆలోచించుకుని, వాటిని ఆచరణలో పెట్టండి. అప్పుడే మీ బంధం దృఢమవుతుంది. అన్యోన్యత పెరుగుతుంది. మీ సమస్యల్లో చాలామటుకు తగ్గుతాయి.


  • =====================
visit my website - > Dr.Seshagirirao-MBBS

వయసు మీరాక వాంఛలేంటి? , Do women have Sex desires in old age?




  • ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .


Q : నాకు నలభై అయిదేళ్లు. ఇద్దరు పిల్లలు. పెళ్లయిన ఐదేళ్ల వరకు లైంగికచర్య అంటే పెద్దగా ఆసక్తి లేదు. దాంతో నా భర్తకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించేదాన్ని. ఆయనే చొరవ చూపి ఒత్తిడి చేస్తే, అయిష్టంగానే శారీరకంగా కలిసేవాళ్లం. మాకు ఇద్దరు పిల్లలు కలిగారు. పెద్ద వాళ్లయ్యారు. ఇప్పుడు నా పరిస్థితిలో మార్పు. ఆయన ఉద్యోగ విధులతో అలసిపోయి ఇంటికి చాలా ఆలస్యంగా వస్తున్నారు. నేను మాత్రం ఆయన నాతో సమయం కేటాయించాలని కోరుకుంటున్నాను. నాలో లైంగిక కోరికలు పెరిగాయి. మెనోపాజ్‌ దశలో ఉన్న నాలో ఈ తీరు చూసి మా వారు ఆశ్చర్యపోతున్నారు. ఆయన మాటలతో ఏదో తప్పు చేసిన దానిలా బిడియపడుతున్నా. ఈ మార్పు సహజమేనా?

A : మెనోపాజ్‌ వయసు వస్తే చాలు.. లైంగికాసక్తులు తగ్గుతాయనుకుంటారు చాలామంది. కానీ అది కేవలం అపోహ మాత్రమే. మీ వయసులో ఉండే చాలామంది మహిళలకు ఈ సమయంలో లైంగిక కోరికలు కొన్నిసార్లు తగ్గితే, మరికొన్ని సార్లు పెరగవచ్చు. ఇది సహజ సిద్ధంగా చోటుచేసుకునే మార్పు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. వాస్తవానికి మెనోపాజ్‌ దశ వచ్చాక, చాలామంది తామేదో నిస్సహాయులమని భావిస్తారు. ఆ లోపాన్ని కప్పి పుచ్చుకునేందుకు చిన్న వారిలా అలంకరణ చేసుకుంటారు. వయసుతో నిమిత్తం లేకుండా అందరితో మాట్లాడటానికి ప్రయత్నిస్తుంటారు. మీలోనూ అలాంటి మార్పే మొదలయ్యింది. పెళ్లయిన అయిదేళ్ల దాకా మీరు భర్తకు దూరంగా ఉండటానికి ప్రయత్నించారు. ఎలాంటి లైంగికాసక్తీ చూపలేదు. ఇప్పుడు మీలో ఒక్కసారిగా మార్పు కనిపించేసరికి మీ వారు ఆశ్చర్యపోతున్నారు. అంతమాత్రాన ఆయన మాటలతో బిడియ పడాల్సిన అవసరం లేదు. మీ భావాలను ఆయనకు వెల్లడించండి. కోరికలను వెల్లడించడానికి కూడా సంకోచించాల్సిన పని లేదు.
  • ==============================
visit my website - > Dr.Seshagirirao-MBBS

Tuesday, May 1, 2012

అతిపని అనర్ధము , Over working is bad for health



ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .


ప్ర : అతిగా పనిచేస్తే అనర్ధమని విన్నాను . నిజమేనా?
- కమలమ్మ , నానుబాల వీది -శ్రీకాకుళం టౌన్‌.

జ : రోజుకున్న 24 గంటల్లో 6 నుండి 8 గంటలపాటు మాత్రమే పనికి కేటాయించాలి . దాదాపు అన్నే గంటలు కాలము నిద్రపోవాలి . అలాకాక అతిగా పనిచేసేవారు అనర్ధము కొని తెచ్చుకుంటారు . ప్రపంచీకరణ నేపధ్యములో పనిగంటలు పెంచుతున్నారు . ఉద్యోగులు పదకొండు - పన్నెండు గంటలు పనిచేస్తున్నారు . ఈ అతి పని వల్ల మధ్యవయసుకన్నా ముందే డిప్రెషన్‌ కి లోనవుతున్నారు .

అప్పుడప్పుడు అధిక గంటలు పనిచేయడం లో తప్పులేదు ... కాని వరుసగా అనేక రోజులపాటు పనిగంటలు పెరిగితే చిక్కులు కొని తెచ్చుకున్నవారవుతారు . దీనివలన శరీరము లోపల పనితీరు మారుతుంది . నాడీసంబంధిత ఇబ్బందులు మొదలవుతాయి. శరీరానికి రిలాక్ష్ అయ్యే మార్గము తెలియక శరీరము బలహీనపడుతుంది . అధిక గంటలు పనివల్ల సంస్థలకు , సమాజానికి లాభసాటి అవుతుందేగాని వ్యక్తికి మాత్రము నష్టమేనన్నది పరిశోధనలలో తేలినది . అనారోగ్యానికి ముఖ్యము గా మానసిక అనారోగ్యానికి గురి అవుతారు .

================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

If no enough Sleep,sleeplessness,తగినంత నిద్ర లేకపోతే




ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును. ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర : నా వయసు 40 సం.లు. నాకు రాత్రులందు సరిగా నిద్రపట్టదు. పగలు చిరాకుగాను , నీరసముగాను ఉంటుంది తగిన సలహా ఇవ్వండి. సరియైన నిద్ర లేకపోతే వచ్చే అనర్ధాలు ఎమిటి ?----- రాము - దేశిళ్ళ వీది ,శ్రీకాకుళం టౌన్‌.

జ : ఏ వయసు వారికైనా రాత్రిపూట తగినంత నిద్ర లేకపోవడము చాలా పెద్ద ఆరోగ్య ప్రమాదాలకు దారితీస్తుంది. నిద్ర పట్టకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. రాత్రు అటు ఇటు దొర్లుతారు , నిద్ర రాదు , కలతనిద్రగా ఉంటుంది. మెలకువచ్చి మళ్ళీ నిద్ర పోవడము జరుగదు . కొంతమంది అతిగా టి.వి ల దగ్గర , కంప్యూటర్ల దగ్గర ఉండి ,లేదా కొన్ని రకాల అశ్లీల పుస్తకాలు , డిటెక్టివ్ నవలలు చదువుతూ నిద్రపోరు .

ఏవిధముగా నైనాసరే ఎక్కువకాలము నిద్రపట్టని పరిస్థితి ఉంటే అది శరీరములో వస్తున్న మార్పులను సూచిస్తుంది . తగింనంత నిద్ర లేకపోతే శరీరానికి విశ్రాంతి ఉండదు . అనేక అనారోగ్యాలకు తారితీస్తుంది .

తగింనంత నిద్ర లేకపోతే---?
  • పగలంటా మత్తుగా జూగుతూ ఉంటారు .
  • పనిమీద దృస్టి నిలపలేరు ,
  • ఏకాగ్రత ఉండదు .
  • కోపము , చిరాకు పెరుగుతాయి.
  • బి.పి . పెరుగుతుంది . వీరిలో వయసు పెరిగిన కొద్దీ మధుమేహము వచ్చే శాతము ఎక్కువ .
  • లోపలి అవయవాల పనితీరు మారిపోతుంది .
  • చిరాకుగా ఉండడము వలన ... సామాజిక సంబధాలు తెగిపోతాయి ,
  • మూడ్ సక్రమముగా ఉండదు ,
  • వృత్తి నైపుణ్యము తగ్గుతుంది ,
  • ఆడవారికి ఇంటి పనులలోనూ పొరపాట్లు జరుతుంటాయి.
  • సంసార బాంధవ్యాలలోనూ విబేదాలు వస్తాయి.
నిద్రపోకుంటే ఇన్నిరకాల ఇబ్బందున్నాయి. డాక్టర్ని సంప్రదించి తగిన సలహా తీసుకొని హాయిగా నిద్రపోవడము మంచిది .

చికిత్స :పెద్దవారికి --

Tab. Triptomer(Amitryptoline Hcl) 10 or 25 mg .... daily one at bed Time . లేదా,

Tab. Decolic (Dizepam 2mg + Dicyclomin Hcl) ... Daily one at bed time.
లేదా,

Tab. Stresnil (Alprozolam 0.25 +Melatonin 5mg) ... Daily one at bedtime.

  • .===============================
visit my website - > Dr.Seshagirirao-MBBS