Tuesday, May 1, 2012

అతిపని అనర్ధము , Over working is bad for health



ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .


ప్ర : అతిగా పనిచేస్తే అనర్ధమని విన్నాను . నిజమేనా?
- కమలమ్మ , నానుబాల వీది -శ్రీకాకుళం టౌన్‌.

జ : రోజుకున్న 24 గంటల్లో 6 నుండి 8 గంటలపాటు మాత్రమే పనికి కేటాయించాలి . దాదాపు అన్నే గంటలు కాలము నిద్రపోవాలి . అలాకాక అతిగా పనిచేసేవారు అనర్ధము కొని తెచ్చుకుంటారు . ప్రపంచీకరణ నేపధ్యములో పనిగంటలు పెంచుతున్నారు . ఉద్యోగులు పదకొండు - పన్నెండు గంటలు పనిచేస్తున్నారు . ఈ అతి పని వల్ల మధ్యవయసుకన్నా ముందే డిప్రెషన్‌ కి లోనవుతున్నారు .

అప్పుడప్పుడు అధిక గంటలు పనిచేయడం లో తప్పులేదు ... కాని వరుసగా అనేక రోజులపాటు పనిగంటలు పెరిగితే చిక్కులు కొని తెచ్చుకున్నవారవుతారు . దీనివలన శరీరము లోపల పనితీరు మారుతుంది . నాడీసంబంధిత ఇబ్బందులు మొదలవుతాయి. శరీరానికి రిలాక్ష్ అయ్యే మార్గము తెలియక శరీరము బలహీనపడుతుంది . అధిక గంటలు పనివల్ల సంస్థలకు , సమాజానికి లాభసాటి అవుతుందేగాని వ్యక్తికి మాత్రము నష్టమేనన్నది పరిశోధనలలో తేలినది . అనారోగ్యానికి ముఖ్యము గా మానసిక అనారోగ్యానికి గురి అవుతారు .

================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.