Monday, May 14, 2012

Is our diet only for Hungry?,మనము తింటున్న ఆహారము ఆకలికోసమేనా?



ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర : మనము తింటున్న ఆహారము ఆకలికోసమేనా?

జ : ప్రతిప్రాణీ ఆహారం తీసుకోక తప్పదు. మనిషి రోజులో మూడుపూటలా భోజనం చేయాల్సిందే. ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ చేయడం తప్పనిసరి. అయితే మనం తీసుకునే ఆహారం కేవలం ఆకలి తీర్చడమే కాకుండా శరీరంలోని మొదడు తదితర భాగాలకు పోషణనందిస్తుంది. కాబట్టి తీసుకునే ఆహారాన్ని బట్టి అతని మనసు, ఆరోగ్యం ఆధారపడి ఉంటాయి.

మనం తీసుకునే ఆహారంలో సరిగా లేక అధిక మసాలాలు, కారాలు, ఉప్పు కలిగివున్నా, ఆకలికి మించి ఎక్కువగా తీసుకోవడం, లేదా తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం వంటివి చేసినా ఆరోగ్యానికి హానికరమంటున్నారు వైద్యులు. ఆహారం తీసుకోవడం ద్వారా శరీరానికి శక్తి అందడంతో పాటు ఉత్సాహంగాకూడా ఉంటుంది. ఆహారం తీసుకోవడం వల్లనే శరీరానికి శక్తి, బలం వస్తుందనుకోరాదు. మనం తీసుకునే ఆహారం ఏ మేరకు జీర్ణమయ్యిందనే విషయం కూడా తెలుసుకోవాలి. పని ఒత్తిడి కారణంగా ప్రస్తుతం యువత అందులోనూ మహిళలు సరైన ఆహారం తీసుకోవడం లేదనేది పోషకాహార నిపుణుల అభిప్రాయం.

కొంతమంది యువతులు మాత్రం సమయానికి ఆకలి తీర్చుకుంటున్నప్పటికీ, ముఖ్యంగా దారిలో ఏది కనపడితే అది తినేయడం లేదా కాఫీలు, టీ, స్నాక్స్‌వంటి చిరుతిండ్లతో ఓ పూట గడచిందని భావిస్తారు. దీంతో వారు తీసుకునే ఆహారం జీర్ణక్రియపై చెడు ప్రభావం చూపిస్తోంది. ఇలాంటి వారు సరైన ఆహారం తీసుకోకపోవడం మూలంగా తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారని కూడా వైద్యులు అంటున్నారు.

మరి ఆహారం ఎప్పుడు తీసుకోవాలి? కొంత మంది ఆహారం తీసుకోవడానికి ఎలాంటి సమాయాన్ని అనుసరించరు. ఒకరోజు ఒక సమయంలో తీసుకుంటే మరో రోజు మరో సమయంలో తీసుకుంటారు. కానీ అలా కాకుండా తీసుకునే ఆహారానికి నియమిత సమయం తప్పకుండా ఉండాలి. ఉదయంవేళ ఎంత బిజీగా వున్నప్పటికి బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరిగా తీసుకోవాలంటు న్నారు వైద్యులు. బ్రేక్ ఫాస్ట్ తరువాత 12 గంటల లోపుగా అన్ని పదార్ధాలతో కూడిన సంపూర్ణ భోజనం తీసుకోవాలి. దీంతో పగ లంతా పనిచేసేందుకు శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది.

  • ==========================
visit my website - > Dr.Seshagirirao-MBBS

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.