Tuesday, July 26, 2011

నేసల్‌పాలిపొసిస్ , Nasal Polyposis



Q : నా భర్య 36 సంవత్సరాలు. తరచూ ముక్కు దిబ్బడ, జలుబుతో బాధపడుతుంది. ముక్కుతో గాలిపీల్చుకోవడానికి ఇబ్బందిపడి, నోటితో గాలిపీల్చుకుంటోంది. గొంతు మారిపోతుంది. డాక్టర్‌ను కలిశాం. నేసల్‌పాలిపొసిస్‌ అనే సమస్య ఉందన్నారు. ఇది కొత్తగా వింటున్నాం, దీని గురించి చెప్పండి.

హరీశ్వర్‌, ఇబ్రహీంపట్నం

A : నేసల్‌పాలిపొసిస్‌ ఎలర్జీ వల్ల వచ్చేది. మన దేశంలో 30 శాతం మంది నేసల్‌ ఎలర్జీ లేదా బ్రాంకైల్‌ ఎలర్జీతో బాధపడుతున్నారు. ఎక్కువగా ఆస్ప్రిన్‌ వాడేవారిలో నేసల్‌పాలిపోసిస్‌ ఉండే అవకాశముంది. మందులతో రెండు నెలల వరకు చికిత్స చేస్తారు. చికిత్స ఉపయోగించే స్టీరాయిడ్స్‌ వల్ల ఎలాంటి హాని ఉండదు. స్టీరాయిడ్లు మందుల రూపంలో లేదా బిళ్లలరూపంలో ఉంటాయి. 50 నుంచి 60 శాతం మంది మందులకు స్పందిస్తారు. స్పందించని వారికి సిటి స్కాన్‌ చేస్తారు. వ్యాధి తీవ్రతను గుర్తిస్తారు. ఎండోస్కోపిక్‌ సైనస్‌ సర్జరీ చేస్తారు. ఆపరేషన్‌ తర్వాత 5 నుంచి 10 ఏళ్లపాటు డాక్టర్‌ పర్యవేక్షణలో చికిత్స కొనసాగించాలి. పర్యవేక్షణలో లేకుంటే వ్యాధి మళ్లీ వచ్చే అవకాశముంది. అలాగని ఆపరేషన్‌ ఫెయిలయ్యిందిన భావించకూడదు. ఇది వ్యాధి గుణం. ఆపరేషన్‌ సక్సెస్‌ రేటు 90 శాతం ఉంటుంది.


  • ==================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

నోటితో ఎందుకు గాలిపీలుస్తారు?, with Adenoids breath with mouth?



Q : మా అబ్బాయి వయసు ఎనిమిదేళ్లు. పళ్లు ఎత్తుకు వస్తున్నాయి. దంత వైద్యున్ని సంప్రదించాం. నోటితోగాలి పీల్చుకునే అలవాటుందా అని అడిగారు. ఉందని చెప్పాం. ఇఎన్‌టి డాక్టర్‌ను కలవాలని సూచించారు. నోటితో ఎందుకు గాలిపీలుస్తారు? అసలు ఏమిటీ సమస్య?

Kamala - Srikurmam

A : మూడు నుంచి 8 సంవత్సరాల పిల్లలు అడినాయిడ్స్‌ సమస్యతో బాధపడుతుంటారు. ముక్కుకు, నోటికి మధ్య పెరిగే కొయ్యగండలను ఎడినాయిడ్స్‌/టాన్సిల్స్‌ అంటారు. ముక్కు కుహరంలోని లింఫ్‌ గ్రంథులు, గొంతుకలోనున్న టాన్సిల్సు. ఇవి శరీరాన్ని క్రిముల దాడి నుండి కాపాడతాయి. ఈ అడినాయిడ్స్‌ మరీ ఉబ్బి పెద్దగా మారితే పిల్లలు శ్వాసను ముక్కుతో పీల్చలేక నోటితో పీల్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఇవి పెరగడం కొందరిలో ఎక్కువ, తక్కువ ఉంటుంది. జన్యుపరమైన కారణాల వల్ల కూడా పెరిగే అవకాశముంది. అడినాయిడ్స్‌ పెరిగి ఎక్కువ స్థలాన్ని ఆక్రమించినప్పుడు పిల్లలు ముక్కుతోకాక నోటితో గాలిపీలుస్తారు. గురక పెడతారు. తరచూ జలుబు, చెవినొప్పితో బాధపడతారు. ఈ సందర్భాలలో ఎక్స్‌రే తీస్తారు. ఎంత భాగంలో పెరిగిందనేది పరిశీలిస్తారు. తొలి దశలో కొంత కాలం మందులతో మూడు నుంచి నాలుగు నెలలు చికిత్స చేస్తారు. మందులతో చికిత్స చేసినా మార్పు రాకుంటే అడినాయిడెక్టమి ఆపరేషన్‌ చేస్తారు. ఆధునిక పరిజ్ఞానం వల్ల శస్త్ర చికిత్సలో నొప్పి తక్కువ ఉండే ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. ఉదయం ఆసుపత్రిలో చేరి ఆపరేషన్‌ తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్లొచ్చు. ఒకటి, రెండు రోజులు విశ్రాంతి తీసుకుని స్కూలుకు కూడా వెళ్లొచ్చు.



  • =============================
visit my website - > Dr.Seshagirirao-MBBS

Tuesday, July 12, 2011

పిల్స్ మానేసేక సంతానము కలగడానికి ఎన్నాళ్లు పడుతుంది?, How much time take to conceive after stoping pills?



ప్ర : నేను గత రెండేళ్ళుగా ఓరల్ కాంట్రాసెప్టివ్ ఫిల్స్ వాడుతున్నాను . ఇప్పుడు పిల్లలు కావాలనుకుంటున్నాం . పిల్స్ మానేశాక ఎన్నాళ్ళకు గర్భం వస్తుంది ?

కామాక్షి -- రణస్థలము

జ : మీరు , మీ భర్త కొన్ని ర్కాల రక్తపరీక్షలు చెయించుకోండి . రుబెల్లా టెస్ట్ చేయించుకుంటే మీరు ఇమ్యున్‌ గా ఉన్నారో లేదో తెలుస్తుంది . ఇమ్యూన్‌ గా లేకపోతే వ్యాక్షినేషన్‌ తీసుకుని మూడు నెలలు వెయిట్ చేయండి . ఆరోగ్య సమస్యలు ఏవీ లేకపోతే ఇవేవీ అవసరము లేదు .

బిడ్డ కాలనుకున్నాప్పుడు ఓ నెల ముందుగా పిల్స్ ఆపేయాలి . పిల్స్ మానేశాక సాధారణ ఋతుక్రమము వచ్చిన తర్వాత పిల్స్ తాలూకు హార్మొన్ల ప్రభావము శరీరం నుండి పోవడానికి ఒక నెల సమయము పడుతుంది . తరువాత సంతానానికి మీరు రెడిగా ఉన్నట్లే .

  • ===============================
visit my website - > Dr.Seshagirirao-MBBS

భోజనము మానేయడం వలన బరువు తగ్గుతుందా?, Do we reduce weight on fasting?



ప్ర : భోజనము మానేయడం వలన బరువు తగ్గుతుందా?.

రమ్య - నరసన్నపేట.

జ : రోజులో ఓ భోజనము మానేస్తే బరువు తగ్గుతామని చాలామంది భావిస్తారు . కాని ఇలా మానేసినప్పుడు శారీరక మెటబాలిజం పడిపోతుంది . తదుపరి భోజనము ఎప్పుడు తింటామో తెలియని శరీరము ప్రతి క్యాలరీని స్టోర్ చేయడం ఆరంభిస్తుంది . దీనికి బదులు నిర్ణీత వేళల్లో ఆహారము తింటుండడం వల్ల జీవక్రియ చురుగ్గా ఉంటుంది . శరీరము పోషకాల్ని జీర్ణము చేసుకుంటుంది .

సరియైన ఆహారము తినడం అవసరము . తక్కువ క్యాలరీలు ఉండే పండ్లు , కూరగాయలు , బాగా పోషకాలు లభంచే ఆహారము తినాలి . క్యాలరీలు తక్కువ ఉండి పోషకాలు అధికముగా లభించే గింజలు , లెంటిల్స్ , నట్స్ , ఆరోగ్యవంతమైన ఫ్యాట్స్ ఉండే ఆహారము తినడం వల్ల అందుకు తగిన వ్యాయామాలు చేయడం ద్వారా బరువు తగ్గుతారే తప్ప ఆహారము మానేయడం వల్ల కాదు .

--Dr.Seshagirirao-MBBS

  • ==============================
visit my website - > Dr.Seshagirirao-MBBS

పిల్లలు పుట్టడానికి స్పెర్మ్ కౌంట్ 40 మిలియన్లు ఉంటే సరిపోదా? ,Sperm count and fertility capacity



Q : నా వయసు 32. మా ఆవిడ వయసు 26. పెళ్లై రెండేళ్లు అవుతోంది. ఇంతవరకు పిల్లలు లేరు. మా ఆవిడకు 20 రోజులకోసారి పీరియడ్స్ వస్తాయి. మందులు వాడితే 28 రోజులకోసారి వస్తుంటాయి. మానేస్తే పాత పద్ధతే. ఈ మధ్య డాక్టర్‌ని కలిస్తే మందులు రాసిచ్చారు. నా స్పెర్మ్ కౌంట్ 40 మిలియన్లు ఉంది. కొద్ది రోజుల తర్వాత మా ఆవిడకి పి.సి.టి టెస్ట్ చేశారు. మేం కలిసిన రెండు గంటల తర్వాత వెళితే టెస్ట్‌లో ‘ఆల్ సెమ్స్ డెడ్’ అని వచ్చింది. దాంతో తర్వాత మళ్లీ పరీక్షీస్తామన్నారు. మందులు రాసిచ్చి, నెల తర్వాత రమ్మన్నారు. పిల్లలు పుట్టడానికి స్పెర్మ్ కౌంట్ 40 మిలియన్లు ఉంటే సరిపోదా? ఎర్లీ పీరియడ్స్ వల్ల ఏమైనా సమస్య ఉందా? ఉంటే పరిష్కారం ఏంటి? తెలియజేగలరు.
- రాజేష్, పాలకొండ

A : స్పెర్మ్ కౌంట్ 20 మిలియన్ల కన్నా అధికంగా ఉన్నప్పుడు దానిని నార్మల్ కౌంట్‌గానే పరిగణిస్తాం. ఈ కౌంటే గాక వాటి ఆకృతి, కదిలిక కూడా ఎంతో ముఖ్యమైనవి. ఆకృతిలో తేడాలో ఉన్నా, కదలిక బాగా తక్కువగా ఉన్నా ఈ స్పెర్మ్స్ అండాన్ని చేరుకునే అవకాశం ఉండదు. మీ విషయంలో కౌంట్ బాగానే ఉన్నా కదలికలు ఉన్న స్పెర్మ్స్ మాత్రమే ఏమీ లేవు. అందుచేత ప్రెగ్నెన్సీ రాకపోయి ఉండవచ్చు. స్పెర్మ్ కౌంట్ పరీక్ష చేయించుకునేటప్పుడు శాంపుల్ కలెక్షన్ ఎంతో ముఖ్యమైనది. ల్యాబ్‌వారు సమకూర్చిన బాటిల్‌లోనే శాంపుల్ ఇవ్వడం, ఆ బాటిల్‌ని క్లీన్ చేయకుండా ఉండటం, అలాగే ఇంటిలో శాంపుల్‌ని కలెక్ట్ చేసినట్లయితే ల్యాబ్‌కి అరగంట లోపల అందజేయడం ఎంతో ముఖ్యం. కలయికకి ముందర కండోమ్ వాడినా, కొన్ని రకాల స్పెర్మ్‌సెడైడ్ జెల్లీస్ వాడినా ఇటువంటి రిపోర్ట్ రావచ్చు. అందుచేత మీకు చెప్పిన జాగ్రత్తలన్నీ పాటించి స్పెర్మ్ కౌంట్ టెస్ట్ మరొక్కసారి చేయించుకోండి. తిరిగి ఇదే రిపోర్ట్ వచ్చినట్లయితే ఆండ్రాలజిస్ట్‌ని సంప్రదించి తగిన సూచనలు పొందండి. పీరియడ్స్ కూడా 25 రోజుల గ్యాప్‌తో వచ్చేలా మీ భార్యకి చికిత్స ఇప్పించండి.


డాక్టర్ రాధిక--గైనకాలజిస్ట్, నిమ్స్


  • ===================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

మేనరికం... రిస్క్ ఎక్కువా?,Are cousin marriages more risk at mental retardation?


Q : మేనరికం... రిస్క్ ఎక్కువా?,Are cousin marriages more risk at mental retardation?

నాకు మా బావతో పెళ్లి ఫిక్సయింది. మా మేనత్త కూడా అప్పట్లో తన మేనబావనే పెళ్లి చేసుకుంది. మా బావకు ఓ చెల్లెలు ఉంది. తను మానసికంగా ఎదగలేదు. ఇప్పుడు మా బావను పెళ్లి చేసుకుంటే నాకూ అలాంటి పిల్లలు పుట్టే అవకాశం ఉందా? భయంగా ఉంది. ఇంట్లో వాళ్లకు ఈ విషయం చెప్పలేకపోతున్నాను. మా బ్లడ్‌గ్రూప్స్ వేరే... నా భయాన్ని తీర్చగలరు.
- హంసదుర్గ, ఇ-మెయిల్

A : మేనరికం వల్ల పుట్టే పిల్లల్లో జన్యుపరమైన లోపాలు వచ్చేందుకు అవకాశం కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. మొదటి తరమే కాక ముందు తరాలలో కూడా మేనరికం ఉన్నా, వారికి మానసికంగా ఎదగని పిల్లలు పుట్టి ఉన్నా మీకూ ఇటువంటి పిల్లలు పుట్టేందుకు ఈ రిస్క్ మరింత అధికంగా ఉండవచ్చు. జన్యుపరమైన లోపాలు కొన్నింటిని ముందే గుర్తుపట్టడం సాధ్యమౌతుంది. కార్యోటైపింగ్ అనే పరీక్ష ద్వారా దంపతులిద్దరిలోనూ జన్యుపరమైన తేడాలను గుర్తించవచ్చు. కాని అన్ని లోపాలనూ గుర్తించడం సాధ్యం కాదు. అందుచేత ప్రెగ్నెన్సీ వచ్చాక మీరు జెనెటిక్ కౌన్సెలింగ్ తీసుకోండి. అలాగే ఆమ్నియో సెంటిసిస్ అనే ఉమ్మనీరు పరీక్షలో బిడ్డకు ఉన్న లోపాలను గుర్తించవచ్చు. అందుచేత మీరు అవసరాన్ని బట్టి ఆ పరీక్ష చేయించుకొని డెలివరీకి ముందే బిడ్డ ఆరోగ్యం గురించి సంతృప్తి చెందవచ్చు. బ్లడ్ గ్రూప్ వేరయినా ఆర్.హెచ్. టైప్ ఒకటే అయినట్లైతే బిడ్డపై ఎటువంటి ప్రభావం చూపదు.

డాక్టర్ రాధిక--గైనకాలజిస్ట్, నిమ్స్
  • ===================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

Monday, July 11, 2011

సిఫిలిస్... మళ్లీ వస్తుందా?,Do I get syphilis again after treatment?





Q : నేను కొంతకాలంగా సిఫిలిస్ వ్యాధితో బాధపడుతున్నాను. చికిత్స తీసుకుంటున్నాను. అయితే ఈ వ్యాధి పూర్తిగా నయం కాదని, శారీరకంగా, మానసికంగా బలహీనంగా ఉన్నప్పుడు తిరిగి విజృంభిస్తుందని విన్నాను. ఇది నిజమేనా? ఈ వ్యాధి పూర్తిగా నయం అయ్యే మార్గం తెలియజేయగలరు.


A : ట్రెపోనిమా పాలిడమ్ అనే సూక్ష్మజీవి ద్వారా సిఫిలిస్ వ్యాధి ఒకరి నుండి ఒకరికి అంటువ్యాధిలా వ్యాపిస్తుంది. ఇది లైంగిక కార్యకలాపాల ద్వారా కూడా ఒకరి నుండి ఒకరికి సంక్రమించవచ్చు. ఈ వ్యాధి లక్షణాలను ప్రాథమికదశలో కనిపెట్టడం కొంచెం కష్టమే. అలాగే రక్తపరీక్షల ద్వారా కూడా ఈ వ్యాధి ప్రాథమిక దశలో బయటపడకపోవచ్చు. సిఫిలిస్ వ్యాధిని ప్రైమరీ, సెకండరీ, టర్షియరీ... సిఫిలిస్‌గా విభజించారు. ప్రైమరీ సిఫిలిస్ దశలో చీముగడ్డ లేదా అల్సర్‌గా ఇది ముక్కు, నోరు, ఛాతీ లేదా జననేంద్రియాలపై కలగవచ్చు. ఈ దశలో ఎక్కువ నొప్పి కాని వేరే ఇతర లక్షణాలు కాని ఉండకపోవడం వల్ల సాధారణంగా చికిత్స జరగకపోవచ్చు. ఈ దశలో చేసిన రక్తపరీక్షలు కూడా సిఫిలిస్ వ్యాధికి నెగిటివ్‌గా రావచ్చు. ఇది ఒకటి నుంచి ఐదు వారాల వరకు కొనసాగి దానంతట అదే తగ్గిపోతుంది. కాని శరీరం లోపల మాత్రం ఈ వ్యాధి దాగి ఉండవచ్చు. ఈ దశ మొదలైన రెండు నుంచి ఆరు నెలల తర్వాత శరీరం మొత్తం ర్యాష్‌లాగ సెకండరీ సిఫిలిస్ బహిర్గతం అవుతుంది. దీనివల్ల కూడా ఇతర సమస్యలు ఉండవు కాబట్టి ఈ దశ కూడా నిర్లక్ష్యానికి గురికావచ్చు. రెండు నుంచి ఆరు వారాలలో ఈ దశ కూడా తగ్గుముఖం పడుతుంది. ఇప్పుడు చేసిన రక్తపరీక్షలలో సిఫిలిస్ వ్యాధిని తప్పక గుర్తించవచ్చు.

లేటెంట్ సిఫిలిస్: ప్రైమరీ, సెకండరీ సిఫిలిస్ వచ్చిన వ్యక్తులలో ఈ వ్యాధి శరీరంలో దాగి ఉండి ఇతరులకు సోకడం లేదా ఆ వ్యక్తికే తిరిగి బయట వ్యాధి రూపంలో కనపడటం ఒక సంవత్సరం కన్నా ఎక్కువ సమయంలో జరిగినప్పుడు దానినే లేటెంట్ సిఫిలిస్‌గా గుర్తిస్తారు.

టర్షియరీ సిఫిలిస్: ఈ దశలో గుండెకు, నరాలకు, కళ్లకు, వినికిడికి సంబంధించిన ఎన్నో సమస్యలను ఈ సిఫిలిస్ కలగచేస్తుంది.

గర్భిణీలలో సిఫిలిస్: గర్భిణిగా ఉన్నవారిలో ఈ వ్యాధి వచ్చినప్పుడు దాని ప్రభావం తల్లి, పిండంపై చాలా తీవ్రంగా ఉండవచ్చు. ఈ వ్యాధి సోకడం వల్ల పుట్టిన బిడ్డకు కాలేయం, స్ల్పీన్, చర్మం, ఎముకలు...వంటి ఎన్నో అవయవాల పనితీరు క్రమంగా ఉండకపోవడాన్ని గమనిస్తాం.

డయాగ్నసిస్: రక్తపరీక్షల ద్వారా ఈ వ్యాధిని ఎంతో సులువుగా గుర్తించడానికి వీలవుతుంది. ఇప్పుడు లేటెస్ట్‌గా చేసే ట్రిపనీమా యాంటీబాడీ టెస్టులు కూడా ఈ వ్యాధిని గుర్తించడానికి, చికిత్స చేయడానికి దోహదపడతాయి.

చికిత్స: పెన్సిలిన్ ఇంజక్షన్లు, టెట్రాసైక్లిన్, ఎరిత్రోమైసిన్ ట్యాబ్లెట్లతో చికిత్స వల్ల ఒకప్పుడు ఎంతో విస్తృతంగా ఉన్న ఈ వ్యాధిని నియంత్రించగలిగాం. అలాగే ప్రాథమిక దశలోనే గుర్తించడం వల్ల సిఫిలిస్ వ్యాధిని మిగతా దశలకు వెళ్లకుండా, దాని ప్రభావం అవయవాలపై పడకుండా కూడా నియంత్రించడం వీలైంది. అందుచేత మీరు చికిత్స పూర్తిగా తీసుకున్నట్లయితే ఈ వ్యాధి పూర్తిగా నయం కాదని, తిరిగి విజృంభిస్తుందని భయాలు పెట్టుకోకండి. భార్యాభర్తలిద్దరూ పరీక్షలు చేయించుకొని చికిత్స చేయించుకోవడం వల్ల ఈ వ్యాధి తిరిగి రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.


డాక్టర్ రాధిక--గైనకాలజిస్ట్, నిమ్స్


  • =====================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

గర్భసంచి చిన్నదైతే పిల్లలు పుట్టరా?, Can not conceive in case of small Uterus?



Q : నా వయసు 24. పెళ్లయి మూడు నెలలు అవుతోంది. నేను మెచ్యూర్ అయినప్పటి నుంచి పీరియడ్స్‌లో ఇర్రెగ్యులర్ ప్రాబ్లమ్ ఉంది. రెండు నెలలకు ఒకసారి పీరియడ్ వస్తుంది. డాక్టర్ని సంప్రదిస్తే గర్భసంచి చిన్నగా ఉందని చెప్పారు. నా రిపోర్ట్స్ పంపిస్తున్నాను. నా యుటెరస్ నార్మల్ యుటెరస్‌తో కంపేర్ చేస్తే ఎంత చిన్నగా ఉంది? 25% కంటే చిన్నగా ఉంటే కన్సీవ్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయని విన్నాను. అది నిజమేనా? సహజ పద్ధతిలో నేను కన్సీవ్ కాలేనా? ఐవిఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీకైనా ఎలిజిబిలిటీ ఉందా? దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పగలరు.

A : యుక్తవయసు దాటిన స్ర్తీలలో గర్భసంచి సుమారు 8 - 9 సెంటీమీటర్ల పొడవు, 5 - 6 సెంటీమీటర్ల వెడల్పు ఉంటుంది. ప్రతి అవయవంలోనూ మనిషి మనిషికీ తేడా ఉన్నట్లే గర్భసంచి పరిమాణం విషయంలో కూడా సుమారుగా 1-2 సెంటీమీటర్ల వరకు కొంత తేడా ఉండొచ్చు. ఈ పరిమాణంలో ఉండే గర్భసంచి ప్రెగ్నెన్సీలో నెలలు నిండే కొద్దీ బరువులో ఎనభై గ్రాముల నుంచి కేజీ వరకు పెరగడాన్ని గమనిస్తాం. అలాగే కొలతలో కూడా 8 నుంచి 9 సెంటీమీటర్లు ఉండే గర్భసంచి ప్రెగ్నెన్సీ సమయంలో 32 - 36 సెంటీమీటర్ల వరకు, కవలలు ఉన్న సందర్భాలలో ఇంకా కొంచెం ఎక్కువ పెరగవచ్చు. దీనిని బట్టి గర్భసంచి సైజు ఎంతగా వ్యాకోచించవచ్చో మీరు గమనించండి.

మీకు గర్భసంచి కొంచెం చిన్నదిగా ఉన్నదని, 4.5 to 5.0 సెంటీమీటర్ల వరకు ఉన్నదని, దాని పెరుగుదలకు మందులు వాడుతున్నారని రాశారు. గర్భసంచి సైజు కొన్ని సార్లు జన్యు ఆధారితంగా నిర్ణయం కాగా, కొన్నిసార్లు హార్మోన్ల లోపాల వల్ల చిన్నదిగా ఉండటం జరగవచ్చు. ఇటువంటి సందర్భాలలో ఆరు నెలల నుంచి ఏడాది వరకు ఈస్ట్రోజెన్, ప్రొజెస్టరాన్ ట్యాబ్లెట్లను నెల నెలా ఇస్తారు. వీటి వల్ల సరైన సైజులో గర్భసంచి పెరుగుతుందన్న గ్యారెంటీ ఏమీ లేదు. కాని పనితీరును మాత్రం క్రమబద్ధీకరించడానికి ఈ ట్యాబ్లెట్లు దోహదపడవచ్చు. మీకు గర్భసంచి చిన్నదిగా ఉన్నా పీరియడ్స్ వస్తున్నాయి కాబట్టి మీరు కొంతకాలం పాటు ఈస్ట్రొజెన్, ప్రొజెస్టరాన్ ట్యాబ్లెట్లను డాక్టర్ పర్యవేక్షణలో వాడండి. కోర్స్ అయిపోయిన తర్వాత స్కానింగ్ మళ్లీ చేయించుకొని గర్భసంచి సైజులో ఏమైనా పెరుగుదల ఉన్నదేమో గమనించండి.

స్వల్పంగా సైజు తక్కువగా ఉన్నట్లయితే ప్రెగ్నెన్సీలో ఎటువంటి ఇబ్బంది కలగకపోవచ్చు. కాని సైజు బాగా తక్కువ ఉన్న పరిస్థితులలో అబార్షన్లు అవడం, నెలలు నిండకుండానే బ్లీడింగ్ అవడం, ప్రీ టెర్మ్ డెలివరీ అయిపోవడం, బరువు తక్కువగా ఉన్న పిల్లలు పుట్టడం... వంటి సమస్యలు తలెత్తవచ్చు. పీరియడ్స్ రెగ్యులర్‌గా వచ్చినట్లయితే సహజంగానే ప్రెగ్నెన్సీ వచ్చేందుకు అవకాశం ఉంది.

బయట ఐవిఎఫ్ పద్ధతిలో టెస్ట్‌ట్యూబ్‌లోనే పిండాన్ని ఏర్పరిచినా అది ఎదగవలసింది గర్భసంచిలోనే కదా! మీరు కొన్నాళ్లు ట్రై చేసినా ప్రెగ్నెన్సీ రానట్లయితే హిస్టరోస్కోపీ పరీక్ష చేయించుకోండి. ముందు పీరియడ్స్ సక్రమంగా వచ్చేలా చికిత్స తీసుకొని ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించండి.


-డాక్టర్ రాధిక--గైనకాలజిస్ట్, నిమ్స్


  • ================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

Saturday, July 9, 2011

నోటిపూత, నోటిపుండ్లు.Stomatitis


  • [SoreMouth--aphthous-ulcer.jpg][Sore+mouth.jpg]


ప్ర :
నేను ఉద్యోగస్తురాలిని. వయసు 23. ఒత్తిడి అధికంగా ఉంటుంది. శాకాహారిని. ఆహారం, నిద్ర టైం ప్రకారం ఉండవు. గత కొన్ని మాసాలుగా తరచూ నోటిపూతతో బాధపడుతున్నాను. అన్నం సరిగ్గా తినలేకపోతున్నాను. పరిష్కారం సూచించండి.

- రమ్య, హైదరాబాద్‌

జ : నోటిపూత, పుండ్లు.. ఈ సమస్యలతో చాలామంది బాధపడుతుంటారు. పనుల ఒత్తిడితో ఆహార నియమాలు పాటించకపోవడం, పోషకాహారలోపం, విటమిన్‌ సి, బి2, బి3, ఇనుము, క్యాల్షియం వంటి ఖనిజాలు తగ్గినప్పుడు నోటిలోని సున్నిత పొరలు చిట్లి పుండ్లుగా మారుతుంటాయి. కొన్ని సందర్భాల్లో స్త్రీలలో తలెత్తే హార్మోన్ల సమస్య, ఘాటైన ద్రవ్యాలు ఎక్కువగా వాడటం, కాఫీ టీలు అధికంగా తీసుకోవడం వల్ల నోటి పూత సమస్య తలెత్తుతుంది. సాధారణంగా ఆహార మార్పులతో తగ్గిపోతుంది.

ఆయుర్వేదిక్ చికిత్స :
ఈ సమస్య నుంచి బయటపడటానికి ఆహార నియమాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. జీవన శైలి మార్పులూ అవసరమే.
* వీలైనంత వరకూ ప్రతిరోజూ ఆహారంలో ఆకు కూరలు ఉండేలా చూసుకోవాలి. రెండు, మూడు గ్లాసుల మజ్జిగ తాగాలి.
* రాత్రి నిద్రపోయే ముందు గ్లాసుడు పాలు తాగితే కడుపులో ఏర్పడే పూతలు, మంటలు తగ్గుతాయి. నోటి పూత సమస్య బాధించదు.
* పొద్దున లేవగానే పటికను పావు చెంచా తీసుకుని నీళ్లలో మరిగించి చల్లారాక పుక్కిలించాలి. ఈ విధంగా రోజుకి 2, 3 సార్లు చేస్తే సమస్య తగ్గుతుంది.
* రావి పాలలో మంచి నెయ్యి కలిపి పూత ఉన్న చోట రోజుకి ఒకటి రెండుసార్లు రాస్తుంటే త్వరగా తగ్గుతుంది.
* ప్రతిరోజూ రాత్రి అర చెంచాడు ఉసిరిక రసం నీళ్లలో కలిపి పుచ్చుకొన్నా ఫలితం ఉంటుంది.
* అతి మధురం వేళ్లను కషాయంగా చేసి పుక్కిలిస్తే నోటిపూత తగ్గుతుంది. అలాగే మెంతి ఆకులను కషాయంగా చేసి పుక్కిలించినా మంచిదే.

డా|| పెద్ది రమాదేవి-ఆయుర్వేదిక్‌ ఫిజీషియన్‌-ఫోన్‌: 9246276791

ఆలోపథిక్ చికిత్స :
నోటి శుబ్రతను పాటించాలి . భోజనం తరువాత చేతి వేళ్ళల్తో పళ్ళను శుబ్రము గా తోముకోవాలి లేదా టూత్ పేస్ట్ తో బ్రష్ చేస్తే మరీ మంచిది. దీనివల్ల పళ్ళ సందుల్లో ఇరుక్కుపోయిన ఆహారపదార్దాల తో సూక్ష్మజీవుల పక్రియ తగ్గి నోరు పరిశుబ్రముగా ఉంటుంది .
నోటిపూత ఉన్నవాళ్ళు :
Dentacain mouth wash ,or Hexin mouth wash , or Betadin mouth wash తో రోజుకి రెండుసార్లు పుక్కలించాలి .
Tab. Beplex forte రోజుకొకటి చొప్పున 7-10 రోజులు వాడాలి , లేదా...
Tab. Folic acid రోజుకి ఒకటి చొప్పున్న 7-10 రోజులు వాడాలి ,లేదా.....
Tab.Supradyn రోజుకి ఒకట్ చొప్పున్న 7-10 రోజులు వాడాలి ,
నోటి పుల్లు ఎక్కువగా బాధపెడుతుంటే ... Tess mouth gel Ointment పుల్లు పై రాయాలి .
పౌష్టికాహారము తీసుకోవడం లోనే నోటిపూత చికిత్స ప్రముఖ పాత్ర వహిస్తుంది .

--డా. వందనా శేషగిరిరావు -శ్రీకాకుళం .


  • ===================================
visit my website - > Dr.Seshagirirao-MBBS