Thursday, May 30, 2013

Talking with boys during nights ,రాత్రిళ్లు ఫోనులో అబ్బాయిలతో మాట్లాడుతోంది

  •  




ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .


Ques :మా అమ్మాయికి పదిహేడేళ్లు. ఇంటర్మీడియట్‌ పరీక్షలు రాసింది. బాగా చదువుతుంది. ఐఐటీకి పంపించాలని మావారూ, నేనూ కలలుకంటున్నాం. కానీ తనకి మాత్రం అవేమీ పట్టడం లేదు. ఇలా పరీక్షలు అయిపోయాయో లేదో అలా రిలాక్స్‌ అయిపోయింది. సమస్య అది కాదు. తను రాత్రిళ్లు ఫోనులో అబ్బాయిలతో మాట్లాడుతోంది. లేదంటే, నెట్‌ ముందు గంటల తరబడి కూర్చుంటుంది. 'నీ తీరేం బాగోలేదు, ఫోన్లు మాట్లాడటం ఆపెయ్‌' అంటే మూడ్‌ ఆఫ్‌ చేసుకుంటుంది. 'మీరు అనుకొన్నట్టేం కాదు.. మాది క్లీన్‌ ఫ్రెండ్‌షిప్‌' అంటోంది? అబ్బాయిలతో అలా మాట్లాడకూడదు అని తనకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో తెలియడం లేదు?

Ans: ఇప్పుడు యూత్‌లో ఓ ట్రెండ్‌ నడుస్తోంది. ఫేస్‌బుక్‌లో కానీ మరే ఇతర సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌లోకానీ ఖాతా లేకపోతే వాళ్లు అసలు యూతే కాదని కుర్రకారు అభిప్రాయం. ప్రతి సంఘటనా ఫేస్‌బుక్‌లో పెట్టాలి. ఆ పోస్టింగులకు బోలెడు లైక్స్‌ రావాలి. లేకపోతే దిగులు. ఇక, ఎస్సెమ్మెస్‌లు ఇచ్చిపుచ్చుకోవడం అనేది చాలా సాధారణం.

ఇవన్నీ అటుంచితే టీనేజీ అంటే అటు బాల్యం పోలేదు ఇంకా పెద్దరికం రాలేదు అన్నట్టుగా ఉంటుంది. ఈ వయసులో హార్మోన్ల ప్రభావమూ ఎక్కువే. వాళ్ల మనసు కొత్త స్నేహాలూ, కొత్త సరదాలూ కోరుకుంటుంది. అపోజిట్‌ సెక్స్‌తో మాట్లాడాలి, వాళ్ల నుంచి ప్రశంసలు అందుకోవాలి అన్న ఆరాటమూ సహజం. మారుతున్న కాలాన్నీ, పిల్లల ప్రవర్తననీ తల్లిగా మీరు అర్థం చేసుకోవాలి. కేకలు వేయడం, మందలించడం, సెల్‌ఫోన్‌ లాక్కోవడం, నెట్‌ ఆఫ్‌ చేయడం చేస్తుంటారు చాలామంది. వీటివల్ల పెద్దగా ఫలితం ఉండదని గుర్తుంచుకోండి. అలా కట్టడి చేయడం వల్ల వాళ్లు అన్ని విషయాలూ మీకు చెప్పరు. చెప్పేదొకటి, చేసేదొకటి తరహాగా మారిపోతారు. ఆ పరిస్థితి రాకుండా చూడటం మీ చేతుల్లోనే ఉంది.

మీ అమ్మాయి బాగా చదువుతుంది. ఈ తరం అమ్మాయిలానే ప్రవర్తిస్తోంది. 'నేను మాట్లాడుతోంది కేవలం ఓ ఫ్రెండ్‌తో మాత్రమే' అని గట్టిగా చెబుతుంటే నమ్మి చూడండి. చాలామంది తల్లిదండ్రులు చేసే తప్పేంటంటే, పిల్లలకు మార్కులెలా వస్తున్నాయి అని ఆరా తీస్తారు. ఎలా చదువుతున్నారనీ తెలుసుకొంటారు. కానీ స్నేహితులెవరు... ఎలాంటి వాళ్లు అని తెలుసుకోరు. నిజానికి ఈ వయసులో టీనేజీ పిల్లలకు ఒక అమ్మ కన్నా ఓ ఫ్రెండ్‌ అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. అదే అమ్మే స్నేహితురాలిగా ఉంటే మంచిది కదా! ఫ్రెండ్‌తో చెప్పుకొనే కష్టం, సుఖం అమ్మతోనే పంచుకొంటారు. స్వేచ్ఛగా అన్ని విషయాలూ చర్చిస్తారు. తనతో అమ్మ హోదాలో కాకుండా ఒక ఫ్రెండ్‌లా మారి మాట్లాడండి. రాత్రిళ్లు అబ్బాయిలతో మాట్లాడటం వల్ల ఎటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందో చూచాయగా తెలియచెప్పండి. వీలుంటే ఫోన్లలో మాట్లాడే స్నేహితులని సరదాగా ఇంటికి తీసుకురమ్మని అడగండి. తనన్నట్టుగా వాళ్ల మధ్య క్లీన్‌ ఫ్రెండ్‌షిప్‌ ఉంటే ఆ అబ్బాయిని ఇంటికి తీసుకొస్తుంది. లేదూ, అలా ఒకరిద్దరి గురించి ప్రస్తావన తీసుకొచ్చే వాతావరణం లేకపోతే 'మీ గ్యాంగ్‌ని ఇంటికి తీసుకురా, టీ పార్టీ ఇద్దాం' అని చెప్పండి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ వయసులో పిల్లలని మందలిస్తే రివర్స్‌ అవుతారు. వాళ్ల దారిలోకి వెళ్లి మాట్లాడితే అన్ని విషయాలూ స్వేచ్ఛగా పంచుకుంటారు. ఇది టీనేజర్ల పాలిట తల్లిదండ్రులు పాటించాల్సిన వేదం అనుకోండి!

courtesy with Dr.poornima Nagaraj@Eenadu vasundara
  • =========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Pain in Menses , pain in menstrual period, బహిష్ట కాలములో కదుపునొప్పి

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : మా అమ్మాయి వయస్సు 14 సం.లు .ఋతుక్రమములో మగతగా ఉంటుంది. కొన్నిసార్లు కడుపునొప్పి కూడా ఉంటుంది. ఆ సమయములో ఎక్కువసార్లు లిట్రిన్‌ కి వెళ్తూ ఉంటుంది. కారణము , నివారణ తెలియజేయగలరు?

జ : హార్మోనుల స్థాయిల ఎచ్చు-తగ్గుదల , వాటి మధ్య నిష్పత్తి మారడము వల్ల ఈ లక్షణాలన్నీ ఋతుక్రమ సమ్యములో .. మామూలే . కొన్ని సార్లు హీమోగ్లోబిన్‌ స్థాయిలు తక్కువగా ఉండడము వలన " డిజినెస్ (మగత)" ఉండవచ్చును. రక్తహీనత ఉందేమో హీమోగ్లోబిన్‌ % ను పరీక్షచేయించుకోండి . కదుపు నొప్పికి .. Tab. Dysmen రోజుకి 2 చొప్పున్న 2 రోజులు వాడాలి. ఐరన్‌ , ఫోలిక్ యాసిడ్ , బి-కాంప్లెక్ష్ మాత్రలు రెగ్యులర్ గా వాడితే కొంత కాలానికి పూర్తికా నయమగును
  • =========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

స్విమ్మింగ్ ఫూల్ లో కెమికల్స్ ఆరోగ్యానికి హానికరమా?

  •  
  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 Q : స్విమ్మింగ్ ఫూల్ లో కెమికల్స్ ఆరోగ్యానికి హానికరమా?
A ; స్విమ్మింగ్ ఫూల్ లో డిసిన్‌ఫెక్టెంట్ లు ఎక్కువగా వాడుతుంటారు. ఎక్కువగా వాడేది క్లోరీన్‌ . ఇది నీటిలో బ్యాక్టీరియాను నశింపచేయగలదు . ఫూల్స్ లో క్లొరీన్‌ కాన్‌సెంట్రేషన్‌ కొంచెం ఎక్కువగానే ఉంటుంది . పొటెన్‌షియల్ హానిక బై-ప్రొడక్ట్ " హా" (హలోసెటిక్ యాసిడ్) ఉంటుంది . స్విమ్మింగ్ ఫూల్ ను క్రమము తప్పకుండా క్లీన్‌ చేస్తూఉంటే ' హా ' కనీసమాత్రముగా ఉంటుంది . అయినా తగిన జాగ్రత్తలు అవసరము . 
  • నీరు ... ముక్కు , చెవులు ,నోటిలోకి వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 
  • పిల్లకకు ఏదైనా ఇన్‌ఫెక్షన్‌ ఉంటే తగ్గే వరకూ స్విమ్మింగ్ కు పంపకూడదు , 
  •  స్విమ్‌ చేసిన తరువాత ఇంటికి రాగానే గోరువెచ్చని నీటితో తల స్నానము చేయించుకోవాలి .
  • శిరోజాలకు .. క్లోరీన్‌ వలన నష్టము జరుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి,
  • మంచి స్విమ్మింగ్ ఫూల్ ని ఎంచుకోవాలి, 
  • సమ్మర్ లో రష్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ జాగ్రత్తలు పాటించాలి. 

  • =========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Wednesday, May 29, 2013

మధ్యాన్నాం వేళ కడుపుబ్బరముగా ఉంటుంది . కారణం ఏమిటి ?

  •  

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : మధ్యాన్నాం వేళ కడుపుబ్బరముగా ఉంటుంది . కారణం ఏమిటి ?

జ ; సెలియాక్ వ్యాధి (Coeliac disease) లేదా గాస్ట్రోపెరెసిస్ వంటి వైద్య సమస్య ఉందేమో పరీక్షలు చేయించుకోండి . ఆహారము ఉదరం లొనే ఉండిపోయి వేళ ప్రకారము జీర్ణక్రియకు కిందికి వెళ్ళకపోవడాన్ని ఇలా అంటారు. ఇది కాని పక్షములో భోజనాల మధ్య విరామాన్ని తగ్గించండి . గాలి మింగకుండా జాగ్రత్తపడేందుకు వీలుగా నెమ్మదిగా ఆహారాన్ని నమిలి మింగండి . తరచూ కొద్ది కొద్దిగా ఆహారాన్ని తింటుండండి . అంటే ఒక్క సారి ఎక్కువగా తినకండి . భోజనము తో పాటు ఏరోనేటెడ్ డ్రింక్స్ , తీపి వస్తువులు తీసుకోవద్దు . 
  • =========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Thursday, May 9, 2013

Hints to increase body size , సహజంగా లావెక్కేలా చిట్కాలు చెప్పండి

  •  
  •  

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .


ప్ర : నేను సన్నము గా పొడవుగా ఉంటాను.నార్మల్ గా లావెక్కేందుకు ఉపాయము చెప్పంది -- స్వాతి (లావేరు-శ్రీకాకుళం జిల్లా).

 జ :    లావెక్కాలంటే సన్నబడటమంత కష్టం కొందరికి. దానికోసం వారు విశ్వ ప్రయత్నాలు చేస్తారు, అయినా లావెక్కరు. అలాంటప్పుడు ఈ జాగ్రత్తలు పాటిస్తే కొంత ఫలితం

ఉంటుంది.

* మెటబాలిజం, జీన్స్‌ వంటివి ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉంటాయి. దాన్ని బట్టే వారి శరీర తత్వం ఆధారపడి ఉంటుంది. సన్నగా ఉన్నామనే ఆత్మన్యూనతతో కొందరు

అదేపనిగా తినడానికి ప్రాధాన్యమిస్తారు. అయితే ప్రతి ఒక్కరూ బీఎంఐ (బాడీ మాస్‌ ఇండెక్స్‌) ప్రకారమే పోషకాహారాన్ని తీసుకోవాలి. అతిగా తినడం వల్ల లావు అవడం

మాటేమో కానీ ఇతరత్రా అనారోగ్యాలు చుట్టుముట్టే ప్రమాదముంది.

* 'అసలే సన్నగా ఉన్నావ్‌, నీకు వ్యాయామం ఏంటి?' అంటుంటారు కొందరు. కానీ అది నిజం కాదు. రోజూ వ్యాయామం చేయడం వల్ల శరీరం చక్కటి ఆకృతిని

పొందుతుంది. లావెక్కడం అంటే బరువు పెరగడం కాదు, దృఢత్వాన్ని పొందడమని మరిచిపోకూడదు.

* ఒకేసారి ఎక్కువగా తినడం కంటే విరామమిస్తూ కొద్దికొద్దిగా ఐదారు సార్లు తినడం మంచిది. వీటిల్లో తాజా పండ్ల ముక్కలూ చేర్చుకోవాలి. కాలక్షేపంగా తినడానికి గుప్పెడు

జీడిపప్పు, బాదం చేతిలో ఉంచుకొని అప్పుడప్పుడు తింటే సహజంగా బరువు పెరగడానికి ఉపయోగపడతాయి. రోజూ రాత్రి పడుకునే ముందు నాలుగైదు బాదం గింజల్ని

ముక్కలుగా చేసుకుని, వేడి పాలల్లో వేసుకొని తాగినా ఫలితం ఉంటుంది.

* ఉదయాన్నే పెరుగు అన్నము తింటే లావెక్కేందుకు దోహదం చేస్తుంది.

* పగటి పూట నిద్రపోతే లావెక్కే వీలుంది. కనుక రాత్రి మాత్రమే నిద్రపోయే అలవాటు కాకుండా పగలు కొంతసేపు నిద్రపోయే అలవాటు చేసుకోవాలి.

*తినే ఆహారంలో ఎర్రని మాంసాహారం , గుజ్జు కలిగిన పండ్లు, నూనెలో వేపినకూరల తినడానికి ప్రయత్నించాలి  ...

* ఆకలిని చంపేయగల శక్తి నీటికి ఉంది. నీరు బాగా తాగితే భోజనం తక్కువగా తింటారు. ఫలితంగా లావెక్కే అవకాశం తగ్గుతుంది. అవసరమున్నప్పుడే నీరు తాగాలి . భోజనము ముందు నీరు తాగడము చేయకూడదు .
  • =========================== 

visit my website - > Dr.Seshagirirao-MBBS -