Sunday, November 30, 2014

What is Cyber knife VSI ?, సైబర్ నైఫ్ VSI అంటే ఏమిటి?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
  •  
  •  

 ప్ర : సైబర్ నైఫ్ VSI అంటే ఏమిటి?

 జ : ఇది సైబర్ యుగం. అన్నీ రంగాల్లోనూ సైబర్ విప్లవ ఫలితాలు అందుతున్నాయి. క్యాన్సర్ చికిత్స రంగమూ దీనికి మినహాయింపు కాదు. సైబర్ నైఫ్... పేరుకు ఇదేదో కంప్యూటర్ కత్తిలా అనిపిస్తున్నా... నిజానికి కత్తి కాని కత్తి ఇది. క్యాన్సర్ ఉన్న మేరకు మెత్తగా కోసే కత్తి ఇది. కాకపోతే ఆ కోతకు గాటు ఉండదు. నొప్పి ఉండదు. బాధ ఉండదు. క్యాన్సర్ అంటే ఒకప్పుడు ప్రాణాంతకమైన వ్యాధి. ఒకసారి వచ్చిందంటే చికిత్సకు లొంగదనే అపోహ. కానీ అదిప్పుడు వాస్తవం కాదు. శరీరంలోని ఏ భాగంలో క్యాన్సర్ ఉన్నా... అత్యంత సంక్లిష్టమైన చోట్లలో క్యాన్సర్ కణితి ఉన్నా ఇప్పుడున్న అత్యాధునిక సునిశితమైన పరికరాలతో సులువుగా తొలగించడం ఇప్పుడు సాధ్యమే.

సైబర్ నైఫ్ VSI అనేది శరీరం మొత్తానికి ఉపయోగపడే రోబోటిక్ రేడియో సర్జరీ సిస్టం. శరీరంలో క్యాన్సర్ మరియు క్యాన్సర్ కాని కణుతులు, మెదడు, వెన్నెముక, ఊపిరితిత్తులు, కాలేయం, క్లోమ గ్రంధి మొదలైన ఏ భాగంలో ఉన్నా సునిశిత, సంపూర్ణ, విశిష్ట రేడియేషన్ శస్త్ర చికిత్స సదుపాయాన్నిచ్చే ఏకైక పరికరం సైబర్ నైఫ్ VSI. సునిశిత వైద్య పరిజ్ఞాన్నాన్ని, అత్యంత సమర్ధవంతమైన కంప్యూటర్ టెక్నాలజీని, అత్యత్తమ ఇమేజ్ గైడింగ్ టెక్నాలజీని సమ్మిళితం చేసి, శరీరంలో ఏ అవయవంలోనైనా ఉన్న క్యాన్సర్ కణితులను యుద్దాలలో వారే క్రూయిజ్ మిసైల్ టెక్నాలజీలాగా, సూదిమొనంత ఖచ్చిత్వంతో, అధిక మోతాదులో రేడియేషన్ వెలువరిస్తూ ప్రక్క భాగాలపై ఎటువంటి దుష్ప్రభావం లేకుండా చేసే అత్యాధునిక టెక్నాలజీ సైబర్ నైఫ్ VSI.


సైబర్ నైఫ్ VSI ప్రయోజనాలు


చికిత్సా కాలం 4-5 వారల నుంచి 5 రోజులకంటే తక్కువకు కుదింపు
సబ్ మిల్లీమీటర్ కచ్చితత్వంతో చికిత్స అందిస్తుంది
ఏక్స్ ట్రాక్రానియల్ మరియు ఇంట్రాక్రానియల్ కణితులకు చికిత్స
ఆరోగ్యవంతమైన కణజాలానికి, క్లిష్టమైన భాగాలకు రేడియేషన్ తగ్గించి కణుతులను నాశనం చేస్తుంది.
అతి తక్కువ దుష్ప్రభావాలతో అధిక క్యాన్సర్ నిర్మూలన రేడియేషన్ అందిస్తుంది
సౌకర్యవంతమైన, కోతలేని ప్రత్యామ్నాయ శస్త్ర చికిత్స కల్పిస్తుంది
ట్రామినల్ న్యూరాల్జియా, వాస్కులర్ మాల్ఫార్మేషన్స్ వంటి రోగులకు ఖచ్చితమైన చికిత్స అందించబడుతుంది.

ఇతర వ్యాధుల్లోనూ ఉపయోగం
 సైబర్‌నైఫ్ సేవలను కేవలం క్యాన్సర్ కోసం మాత్రమే కాకుండా... క్యాన్సర్ కాని ఇతర వ్యాధుల్లోనూ ఉపయోగించుకోడానికి వీలవుతుంది. వాటిలో కొన్ని...  మెనింజియోమాస్  పిట్యూటరీ  అకౌస్టిక్ న్యూరోమాస్  మెదడులో ఉండే క్రేనియల్ నర్వ్ స్క్వానోమాస్  గ్లోమస్‌జ్యుగులేర్  ఆపరేషన్‌కు వీలుకాని  పారాగాంగ్లియోమాస్  హిమాంజియోమాస్  రక్తనాళాల అమరిక సరిగా లేని సందర్భాల్లో (వాస్కులార్ మాల్‌ఫార్మేషన్)  ఇటీవలే నమలడం సైతం కష్టమైనంతగా దవడ నొప్పితో సల్మాన్‌ఖాన్‌కు వచ్చిన ట్రైజెమినల్ న్యూరాల్జియా  క్లస్టర్ హెడేక్ వంటి సంక్లిష్టమైన తలనొప్పులు  తలలోని అత్యంత సంక్లిష్టమైన నరాలకు సర్జరీ చేయలేని సందర్భాల్లో సైబర్‌నైఫ్ సేవలను ఉపయోగించుకోవచ్చు.

  • Courtesy with : Dr.Mohana Vamsi (Oncologist -Hyd)@saakshi news paper 30/11/2014

Friday, November 28, 2014

Lipo sucction vs weight reduction,లైఫో సక్సన్‌ వల్ల బరువు తగ్గుతామా?.

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .



 ప్ర : లైఫో సక్సన్‌  వల్ల బరువు తగ్గుతామా?.

జ : శరీరములో కొవ్వు ఎక్కువగా పేరుకుపోయిన చోట నుండి ఒకవిధమైన పద్దతిద్వారా బయటకు పీల్చివేయడమే లైపోసక్షన్‌ అంటారు. దీనినే లైపో ప్లాస్టీ , లైపోఎక్టమీ అని అంటాము . ఒక బాగములో నుండి కొవ్వును తగ్గించుకోవాలనుకున్నప్పుడు మీ ఫిగర్ ను ఇంప్రూవ్ చేసేందుకు పనికివచ్చే ట్రీట్మెంట్ ... లైపోసక్షన్‌. అంతేకాని వెయిట్ రిడక్షన్‌('weight'reduction) కు లైపోసక్షన్‌ సరియైన ఆప్షన్‌ కారు. బరువు కొద్దిగా తగ్గినా తిరికి కొద్దిరోజులలోనే పెరగ వచ్చు. ఎక్కువ బాగాలనుండి కొవ్వు సక్షన్‌ చేస్తే శరీర ఆకృతి అస్తవ్యస్తము మారుతుంది. వంకటింకరగా తయారవుతుంది.

Monday, November 24, 2014

food cooking care for diabetics ,మధుమేహం వంట జాగ్రత్తలు సలహా ఇవ్వండి.

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
  •  
  •  
ప్ర: మా మామగారికి మధుమేహం వచ్చింది. రక్తంలో చక్కెర స్థాయుల్ని అదుపులో ఉంచేందుకు మందులు వాడమనీ, వ్యాయామం చేయమనీ వైద్యులు చెప్పారు. వంట చేసేటప్పుడు ఏవైనా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందా.. సలహా ఇవ్వండి.

జ: మధుమేహానికీ.. ఆహారపుటలవాట్లకూ చాలా దగ్గరి సంబంధం ఉంది. ఈ వ్యాధితో బాధపడుతున్నప్పుడు ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వంటకు ఉపయోగించే నూనెల్ని గడ్డకట్టిన స్థితిలో కాకుండా గది ఉష్ణోగ్రతలో.. ద్రవ రూపంలో ఉన్నప్పుడు వాడాలి. వనస్పతీ, నెయ్యి వంటివి పూర్తిగా మానేయాలి. కనోలా, ఆలివ్‌, గ్రేప్‌సీడ్‌ నూనెల్ని ఎంచుకోవడం మంచిది. కొవ్వుశాతం కలిగిన పాలనే ఎంచుకోవాలి. పెరుగు కూడా కొవ్వులేని పాలతోనే చేసుకోవాలి. సాధారణ పనీర్‌కి బదులు సోయా పనీర్‌ని ఎంచుకోవాలి. బేకరీ పదార్థాలు చేసేప్పుడు వెన్నలాంటి కొవ్వు పదార్థాలకు బదులు యాపిల్‌సాస్‌నీ... చాక్లెట్‌చిప్స్‌కి బదులు కోకో పౌడర్‌నీ ఎంచుకోవాలి. నూనెలో వేయించిన పదార్థాలను తీసుకోవడం మానేయాలి. వేపుడు కూరలను నీళ్లలో లేదా ఆవిరిపై ఉడికించి... తరవాత తక్కువ నూనెలో వేయించుకోవాలి. ఉడికించడం, గ్రిల్‌, బేకింగ్‌ పద్ధతుల్లో పదార్థాలను వండుకోవాలి. మాంసాహారులైతే చికెన్‌ చర్మాన్ని తొలగించి ఆ తరవాత వండుకోవాలి. మాంసాహారం వండుతున్నప్పుడు కనిపించే కొవ్వుని తొలగించాలి. వండేటప్పుడు పైకి తేలే నురగునీ ఎప్పటికప్పుడు తీసేస్తే కొవ్వు శాతం తగ్గుతుంది. వండిన మాంసాహారాన్ని ఫ్రిజ్‌లో గంటసేపు ఉంచితే కొవ్వు పైకి తేలి గట్టిపడుతుంది. అప్పుడు దాన్ని సులభంగా తీసేయొచ్చు. మధుమేహం ఉన్నవారికి రక్తపోటు వచ్చే అవకాశాలూ ఎక్కువ కాబట్టి ఉప్పూకారాల వినియోగాన్నీ తగ్గించుకోవాలి. బదులుగా కొత్తిమీరా, పుదీనా, కసూరి మేథీ, దాల్చినచెక్క పొడీ, యాలకులపొడీ, సోంపు పొడీ, నిమ్మరసం, మామిడి, ఉసిరిపొడి లాంటివి వేసుకోవచ్చు. వీటిలో పీచు కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి మంచిది. భోంచేశాక తీపి తినే అలవాటున్న వారు దానికి బదులుగా బొప్పాయీ, జామ, పుచ్చకాయ, బత్తాయీ, యాపిల్‌ లాంటివి ఎంచుకోవచ్చు.
  • *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Tuesday, November 18, 2014

How many types of cancers present?, క్యాన్సర్లు ఎన్నిరకాలు గా ఉంటాయి?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర : క్యాన్సర్లు ఎన్నిరకాలు గా ఉంటాయి?

జ : మన శరీరములో ఏ భాగానికైనా రాగలిగే క్యాన్సర్లు దాదాపు వంద (100) రకాలకు పైగా ఉండడమే కాకుండా వాటిలో మళ్ళీ ఎన్నో సబ్ టైపులు కూడా ఉంటాయి. సాధారణము గా మన శరీరములో  కొత్త కణాలు ఏర్పడడము , పాతకణాలు అంతరించిపోవడము అనే ప్రక్రియ ఒక క్రమపద్ధతిలో జరుగుతూ ఉంటుంది. ఈ సమతుల్యత దెబ్బతిని కొత్తకణాలు అపరిమితము గా పెరిగిపోవడమే  క్యాన్సర్ . ఖచ్చితము గా కారణము ఇది అని తెలియకపోయినా ... స్మోకికంగ్ , దుర అలవాట్లు , కొన్ని రకాల వైరస్ లు , రసాయనాలు , రేడియేషన్‌  మున్నగునవి క్యాన్సర్ కణము పుట్టుకకు కారణము అయ్యే అంశాలని చెప్పవచ్చు . అందుకే కొన్ని వృత్తులలో ఉండే వారికి కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదము ఎక్కువగా గమనిస్తూ ఉంటాము .

గడ్డలు ప్రధానముగా 2 రకాలు గా ఉంటాయి. 1. ప్రమాదము లేని గడ్డలు .. వేటినే " బినైన్‌ ట్యూమర్స్ " అని , 2.హానికర గడ్డలను ''మాలిగ్నెంట్ ట్యూమర్స్'' అని అంటారు. బినైన్‌('Benign) ట్యూమర్స్ ప్రాణాపాయము కానివి , ఇతర శరీర భాగాలకు , చుట్టుప్రక్కల కణజాలములోకి ప్రవేశించలేవు. చిన్నపాటి శస్త్రచికిత్స ద్వారా వీటిని పూర్తిగా తొలగించవచ్చు. . . కాని ప్రాణాపాయ ('malignant) గడ్డలు చుట్టుప్రక్కల కణజాలములోనికి , లింఫ్ ప్రవాహము ద్వారా ఇతర శరీరభాగాలకు వ్యాపించి అక్కడ కొత్త గడ్డలను ఏర్పరచుగలుగుతాయి.

Saturday, November 15, 2014

Do breast cancer effect in young age?,బ్రెస్ట్ క్యాన్స్ ర్ చిన్న వయసులోనూ రావచ్చా?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
  •  


 ప్ర : బ్రెస్ట్ క్యాన్స్ ర్  చిన్న వయసులోనూ రావచ్చా? సాధారనము గా బ్రెస్ట్ క్యాన్సర్ ఏ వయసు వారికి వస్తుంది?

జ : వయసూ , ఎత్తు , బరువు , పేద , ధనిక  ఏ విషయమూ క్యాన్సర్ కు ఎదురు (అడ్డు) కాదు . ప్రపంచ వ్యాప్తముగా పతి 8 మందిలో ఒకరు రొమ్ము క్యాన్సర్ కు గురి అవుతున్నారు. మనదేశములో ప్రతి 22 మంది స్త్రీలలో ఒకరు రొమ్ము క్యాన్సర్ కు గురి అవుతున్నారు. అయితే చిన్న వయసులో ఈ వ్యాధి వచ్చే అవకాశము తక్కువ .
పట్టణ మహిళలో ,
  • అధిక బరువు ఉండే వారిలో , 
  • వయసు పై బడిన స్త్రీలలో , లేటు వయస్సులో పిల్లలు కన్నవారిలోనూ, 
  • పిల్లలకి పాలివ్వని తల్లులలోనూ , 
  • రజస్వల త్వరగా అయిన వారిలో , 
  • మెనొపాజ్ కు 55 ఏళ్ళు పై బడినా చేరుకోని వారిలో, 
  • దీర్ఘ కాలికముగా హార్మోను ట్రీట్మెంట్ తీసుకున్న వారిలో ,
..........ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదము ఎక్కువ .

Irregular monthly periods,నెలసరి చాలా ఇర్రెగ్యులర్ ఉంటుంది

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
  •  
  •  

 ప్ర : మా అమ్మాయి వయసు 14 ఏళ్ళు , నెలసరి చాలా ఇర్రెగ్యులర్ ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని నెలలుగా రాదు . నెలసరి వచ్చినప్పుడు  రక్తస్రావము కూడా 8-10 రోజులు ఉంటుంది ..ఎందువల్ల ? ఏం చేయాలి ?

జ : రజస్వల అయ్యాక ఋతుక్రమము సక్రమముగా రావడానికి కొంత సమయము పడుతుంది. అయితే క్రమము లేని నెలసరి  సరిగ్గా మేనేజ్ చెయ్యడానికి కొన్ని సాధారణ చర్యలు తీసుకోవాలి.
  • ఆరోగ్యవంతమైన ఆహారాన్ని వేళప్రకారము తింటుండాలి. 
  • చిరుతిండ్లు , ఫాస్ట్ ఫుడ్ తగ్గించాలి. 
  • ఐరన్‌ , విటమిన్‌ సప్లిమెంట్లు తీసుకుంటూ ఉండాలి ,
  • వ్యాయామము తప్పనిసరిగా చేస్తుండాలి.వ్యాయామము , రిలాక్షేషన్‌ టెక్నిక్స్ ద్వారా వత్తిడి తగ్గిందుకోవాలి.
  • చాలాసార్లు ఋతుక్రమము సరిగా లేకపోవడానికి స్థూలకాయము కారణం అవుతుంది. జాగ్రత్తపడాలి.

  • *=========================== 

Tuesday, November 4, 2014

Difference ovulation pain and rupturecsyst pain ఒవులేషన్‌ నొప్పికి.రప్చర్ సిస్ట్ నొప్పికి నడుమ తేడా ఉంటుందా?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
  •  
-



 ప్ర : ఒవులేషన్‌ నొప్పికి, రప్చర్ సిస్ట్  నొప్పికి నడుమ తేడా ఉంటుందా? వివరించగలరు?

జ : నొప్పి అనేది కొద్దిపాప్టి తేడా తప్ప అన్నివేళలా ఒకేలా ఉండును. ఓవులేషన్‌ ఋతుక్రమము మధ్యలో జరుగుతుంది. కొద్దిగా నొప్పి కొంచం సేవు ఉంటుంది. రప్చర్ సిస్ట్ వల్ల నొప్పి ఋతుక్రమము సైకిల్ లో ఎప్పుడైనా రావచ్చు. సిస్ట్ స్వభావము బట్టి నొప్పి తీవ్రత ఉంటుంది. సింపుల్ సిస్ట్ అయితే అందోళన పడనవసరము లేదు. రప్చర్ చాక్లెట్ సిస్ట్  లేదా రప్చర్ ఫిజియోలాజికల్ లూటిల్ సిస్ట్ (చాలా అరుదు)అయితే తీవ్రమైన నొప్పితో పాటు బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. కొన్ని సార్లు రప్చర్ లూటీల్ సుస్ట్ ను ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గా పొరపడే అవకాశముంది. మీరు గైనకాలజిస్ట్ ను సంప్రదిస్తే మంచిది.
  • *=========================== 

Monday, November 3, 2014

Hits to heart patients,హృద్రోగులకు జాగ్రత్తలు తెలియజేయండి?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
  •  

  •  
ప్ర : హృద్రోగులకు జాగ్రత్తలు తెలియజేయండి?

జ : హృదయ స్పందన వేగం తగ్గితే...
1) రక్త సరఫరా తగ్గడం వల్ల మెదడుకు తగినంత రక్తం సరఫరా కాదు.
2) శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది.
3) నాడీ చాలా నెమ్మదిగా కొట్టుకుంటుంది.
వేగం పెరిగితే...
1) గుండె దడ వస్తుంది
2) సృహ తప్పడం జరుగుతుంది
3) తల తిరిగినట్లుగా అనిపిస్తుంది.

చికిత్స విధానం:

గుండె వేగం తగ్గినప్పుడు చాతి పెైభాగంలో చర్మం కింద ‘పేస్‌ మేకర్‌’ అమర్చి గుండె వేగాన్ని సరిదిద్దుతారు. గుండె వేగం పరిగినప్పుడు బీటా బ్లాకర్స్‌ గుండె లయను క్రమబద్దీకరించే మందులు ఇస్తారు.
గుండె లయ తప్పకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు:
1) మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి.
2) క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
3) బరువు పెరగకుండా చూసుకోవాలి.
4) రక్త పోటును అదుపులో పెట్టుకోవాలి.
5) కొలెస్ట్రాల్‌ పెరగకుండా చూసుకోవాలి.
6) సమతూ ఆహారం తీసుకోవాలి.
7) పొగ తాగటం మానివేయాలి.
8) జీవనశెైలిని, ఆదనపు అలవాట్లు మార్చుకోవాలి.

- డా శ్రీధర్‌ కస్తూరి-అవేర్‌ గ్లోబల్‌ హాస్పిటల్స్‌, హైదరాబాద్‌
  • *===========================

Tell us Alcoholic bad effects,మద్యపానీయాలు ఆరోగ్య దుష్ర్పభావాలు తెలియజేయండి.

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
  •  

  •  
ప్ర : Tell us Alcoholic bad effects,మద్యపానీయాలు ఆరోగ్య దుష్ర్పభావాలు తెలియజేయండి.

జ : ఇటీవల కాలంలో పట్టణాలలోనే కాక, గ్రామాలలో కూడా మద్యపానం విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా గ్రామాల్లో, వ్యవసాయధారులు తాగుడు వల్ల ఎన్నో అనర్థాలకు గురవుతున్నారు. ముఖ్యంగా మగవారిలో మద్యపానం ఎక్కువ అవడం వల్ల వారికి అనేక ఆరోగ్య సమస్యలతో పాటు, కుటుంబ ఆదాయం తగ్గి, సామాజిక సమస్యలతో బాధపడు తున్నారు.

మద్యపానీయులను (ఆల్కహాలు) చక్కెర ఉన్న ద్రవ పదార్థాలను పులియ బెట్టి తయారు చేస్తారు. ఈ మద్యపానీయాలు ముఖ్యంగా మూడు రకాలుగా ఉంటాయి.బట్టీ పట్టిన మద్య పానీయాలలో మాల్టెడ్‌ మద్యాలు, వెైన్ల కన్నా ఆల్కహాల్‌ శాతం ఎక్కువగా ఉంటుంది.

  • మద్యపానీయాల వినియోగంలో సురక్షిత పరిమితులు:
ఎంత మద్యం తాగితే సురక్షితమో చెప్పడం చాలా కష్టం.
మద్యం వల్ల కాలేయ వ్యాధి వస్తుంది అన్న దాన్ని సూచనగా తీసుకున్నట్ల యితే కింద తెలిపిన మోతాదుకు మించి తాగ రాదు.
మగవాళ్లు : ఒక రోజుకు 190 మి.లీ. లేదా 1/4 సిసీ ఘాటు మద్యం.
ఆడవాళ్లు : రోజుకు 65 మి.లీ.
ప్రతిరోజు తాగే వారికి ఎప్పుడో సరదా కోసం తాగేవారి కంటే ఎక్కువ హాని కలుగుతుంది.
ఒక వారం రోజుల పైగా తాగే ఆల్కహాలును ఒకటి రెండు రోజుల్లోనే తాగి నట్లయితే గాయపడడానికి, ప్రమాదాల వల్ల చనిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.

  • ఆహార పోషణలో మద్యం పాత్ర?
ఒక గ్రామం మద్యం ద్వారా 7.0 కాలరీల శక్తి లభిస్తుంది. కానీ ఈ కాలరీలు అంత మంచివి కాదు. ఎందుకంటే వీటిలో ఆహార పుష్టినిచ్చే గుణం లేదు. కేవలం శక్తిని మాత్రం ఇస్తాయి. పేదవారిలో, ముఖ్యంగా సాంఘీక, ఆర్థిక పరిస్థితులు తక్కువగా ఉన్న వారిలో మద్యపానం వలన లోప పోషణ ఎక్కువ కలుగుతుంది. మద్యపానం చేసే వారు ఆరోగ్యంగా ఉన్న వారి కంటే ఎక్కువ ఆహారం తింటారు. దీనికి గల కారకాలు ఏమిటంటే...

    ఆహారం తక్కువగా తీసుకోవడమూ, ముఖ్యంగా అన్ని పోషకాలు గల సమతూల ఆహారాన్ని తీసుకోకపోవడము.

    జీర్ణకోశంలో మార్పు రావడం వలన గాని, సరిగా పని చేయకపోవడం, పోషక పదార్థాలు సరిగా గ్రహించుకో లేకపోవడం, లోప పోషణ వలన పేగులు పాడవడం జరుగుతుంది.
    కాలేయం మరియు ప్యాన్‌క్రియాస్‌ దెబ్బతినడం.
    శరీరంలో పోషకాల జీవక్రియ, నిల్వ ఉంచుకొనే శక్తి తగ్గటం.
    పోషక పదార్థాలు, ముఖ్యంగా బి విటమిన్ల అవసరం ఎక్కువ కావడం.
    మల మూత్రాల ద్వార ఎక్కువ పోషకాలు విసర్జితం కావడం.

  •     మద్యపానీయాలతో కలిగే అనార్యోగ్య పరిస్థితులు
    మద్యం సేవించడం వలన చాలా శరీర భాగాలకు, జీవకోశాలకు అనేక విధాల హాని కలుగుతుంది.

    జీర్ణకోశం వ్యాధులు:
    ఆల్కహాల్‌లో ఉండే హానికర గుణం వల్ల, అది సంక్రమించే లోప పోషణ వల్ల కాలేయం దెబ్బ తింటుంది. పోషకాహారం దృష్ట్యా తగిన ఆహారం తీసుకుంటు న్నప్పటికీ, మద్యం ఎక్కువగా తాగడం వల్ల కాలేయం దెబ్బ తింటుంది. కొవ్వు పేరుకోవడం వల్ల కాలేయం పెరుగుతుంది. ఉదయం పూట వికారంగా ఉండి వాంతి వస్తున్నట్టు ఉంటుంది. నీళ్ళ విరోచనాలు అవుతాయి. పొత్తి కడుపు కుడి వెైపు పెైభాగాన నొప్పిగా ఉంటుంది. కాలేయం వాపు వస్తుంది. ఇది ముదిరే కొద్ది కామెర్లు వస్తాయి. రక్తం కక్కుకుంటారు. స్పృ హ కూడ తప్పవచ్చు. వీరిని నొప్పి నుండి, మరణం నుండి కాపాడాలంటే సకాలంలో చికిత్స చేయించాలి. మద్యపానం మానిపించాలి. పుష్టికరమైన ఆహారం ఇవ్వాలి. మద్యపానం వల్ల పేగులు, పాన్‌క్రియాస్‌ కూడా బాగా దెబ్బ తింటాయి.

    గుండె జబ్బులు:    బి1 (థెైయమిను) లోపసం వల్ల గుండెలోని కండరాలకు హాని కలగడం చేత గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది.
    
రక్తహీనత:    మద్యపానీయాలలో రక్తహీనత ఎక్కువగా ఉంటుంది. తెల్ల కణాల శాతం తగ్గి వ్యాధి నిరోధక శక్తి సన్నగిల్లుతుంది. కాలేయం దెబ్బతిని పేగుల నుండి రక్తం స్రవిస్తుంది. రక్తం గడ్డ కట్టే గుణంలో లోపం ఏర్పడుతుంది.

    మెదడు నరాలు:    తాగుడు వల్ల మెదడు మందగిస్తుంది. నరాలలో శక్తి తగ్గుతుంది. విటమిన్లు, ముఖ్యంగా ‘బి’ విటమిన్ల లోపం వల్ల మద్యపానం మెదడుపెై పొరలపై  చూపే చెడు ప్రభావం వల్ల ఇలా అవుతుంది. నడక తిన్నగా ఉండదు. మాట తడబడు తుంది. కళ్ళ కదలికలో లోపం ఉంటుంది. మానసికంగా కృంగిపోతారు. పక్షవాతం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మద్యపానం చేసే వ్యక్తి ఒకసారి ఇలాంటి లోపానికి గురయితే చికిత్స చేయడం కష్టమవుతుంది.

    లెైంగిక వాంఛ: పరుషుల్లో మద్యపానం వల్ల లెైంగిక వాంఛ తగ్గిపోతుంది. నపుంసత్వం ఏర్ప డుతుంది. ముఖం మీద వెంట్రుకలు తగ్గి ఆడంగి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సమస్యలున్నపుడు తాగుడు మరింత పెరిగి, వారి పరిస్థితి ఇంకా దిగజారిపోతుంది. తాగుడు పూర్తిగా మానడమే దీనికి విరుగుడు.

    క్యాన్సర్‌ : ఆల్కహాలిసమ్‌ వల్ల జీర్ణావయవాలలో నోరు, గొంతు, కంఠనాళం, కడుపు, శ్వాసావయవాలు, క్యాన్సర్‌ వ్యాధికి గురయ్యే ప్రమాదముంది. కాలేయం క్యాన్సర్‌కు మద్యపానానికి దగ్గరి సంబం ధం ఉంది.తాగుడు వల్ల ఆరోగ్య సమస్యలే కాక, ఆర్థిక సమస్యలు కూడా వస్తాయి. తాగుడుకు అలవాటు పడిన వారి పని సామర్థ్యం తగ్గి పోతుంది. వారు పనికి తరచు గెైరు హాజరవుతారు. అనారోగ్యానికి గురవుతారు. ఈ కారణాల వల్ల ఉత్పత్తి పడిపోతుంది. తాగుడు నిరుద్యోగానికి దారి తీస్తుంది. అకాల మరణం కూడా సంభవించవచ్చు. మద్యపానం అలవాటుగా మారకముందే దాని వల్ల కలిగే ముప్పును గ్రహించాలి. లేని పక్షంలో రకరకాల ఇబ్బందులకు లోనయ్యే అవకాశం ఉంటుంది.

  •     - డా కె. ఉమామహేశ్వరి--    ప్రొఫెసర్‌ (ఆహారం పోషణ)--    ప్రధాన శాస్తవ్రేత్త--    గుణ నియంత్రణ పరిశోధనాలయం--    ఆచార్య ఎన్‌.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం--    రాజేంద్ర నగర్‌, హైదరాబాద్‌


  • *=========================== 

Saturday, November 1, 2014

Coupe and Lubricants,పిల్లలను కనే ప్లానింగ్ లో ఉన్న దంపతులు సెక్స్ లో లూబ్రికెంట్స్ వాడకూడదా?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .



 ప్ర : పిల్లలను కనే ప్లానింగ్ లో ఉన్న దంపతులు సెక్స్ లో లూబ్రికెంట్స్ వాడకూడదా?

జ : సెక్స్ లో పాల్గొన్నాప్పుడు సౌకర్యము కోసమో , మరే ఇతర కారణం గానో కొందరు లూబ్రికెంట్స్  వాడుతుంటారు. అయితే పిల్ల ప్లానింగ్ లో ఉన్న దంపతులు మాత్రం వీటిని వాడకూడదు . చాలా లూబ్రికెంట్ల లలో వాడే రసాయనాలు వీర్యానికి హాని కలిగించే అవకాశాలుంటాయి. ఈ  రసాయనాలు కొన్నింటిని  పెట్రోలియిం నుంచి వెలికితీస్తారు. కావున వీర్యానికి హాని కలిగించడము ద్వారా గర్భం అవకాశాలకు అవరోధము  కలిగించడములోరసాయనాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. సదరు రసాయనాలకు వీర్యకణాలు  ఎక్స్ పోజ్ అయినప్పుడు సరిగా ప్రయాణించలేవు .అంతేకాకుండా ఈ రసాయనాలు టాక్సిక్ ప్రభావము కలిగివుండి  " డి.ఎన్‌.ఎ " కు హాని కలిగిస్తాయి. దింతోపాటే పిండము ఎదుగుదల లోపాలకు కూడా కారణమవుతాయి.  కనుక పిల్లలను కనే ప్లాన్‌ లో ఉన్న దంపతులు లూబ్రికెంట్స్ వాడకూడదు.
  • *=========================== 

Cautions of Food taking in Winter,శీతాకాలములో భోజన పదార్ధాల విషములో జాగ్రత్తలేమైనా తీసుకోవాలా?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .



 ప్ర : శీతాకాలములో భోజన పదార్ధాల విషములో జాగ్రత్తలేమైనా తీసుకోవాలా?

జ : శీతాకాలములో పగలు తక్కువగా ఉండడము , చలి ఎక్కువగా ఉండడము వలన జీర్ణ శక్తిలో కొంత తగ్గుదల ఉంటుంది. తేలికగా జీర్ణమయ్యే పదార్ధాలు , మితముగా ఆహారము తీసుకోవాలి.ఈ క్రింది నియమాలు పాటిస్తే మేలు కలుగుతుంది.
  • ఉప్పు , వగరు , ఆమ్లగుణము కలిగిన ఆహారపదార్ధాలు అతిగా తినవద్దు , వీటివలన అజీర్ణము , కడుపు ఉబ్బరము , గాస్ సమస్య వంటివి ఏర్పడతాయి. 
  • అతిగా వేయించిన కూరలు , మాంసాహారం వంటివి తక్కువగా తీసుకోవడము  లేదా అసలు దూరము గా ఉండడము మంచిది. జంక్ ఫుడ్ జోలికి వెళ్ళవద్దు .
  • ఆకుకూరలు బాగా కడిగి శుభ్రం చేయాలి .  పచ్చి కూరలు తినడం శీతాకాలము లో మంచిది కాదు .పండ్లు , కాయకూరలు పూర్తి శుభ్రము గా కడకకుండా వాదవద్దు .
  • శుచి , శుభ్రత కలిగిన ప్రదేశాలలో ఉండే ఆహారము తీసుకుంటే మంచిది . 
  • మిగిలి పోయిన ఆహార పదార్ధాలను ఫ్రిజ్ లో దాచిపెట్టి  మరుచటి రోజూ తినవద్దు . 
  • అతి చల్లని నీరు త్రాగవద్దు . ఐస్ క్రీమ్‌ లు వంటివి అతిగా తీసుకోవడము మంచిది కాదు .
  • సులభము గా జీర్ణము అయ్యే కాయకూరలు చక్కగా ఉడికించి తినడము మంచిది. 
  • వంటకాలకు మంచి నూనె , కొబ్బరినూనె , ఆలివ్ నూనె వంటివి వాడడం మంచిది. 
  • వీలున్నంత వరకు పాత బియ్యం వాడడము మంచిది. 


  • *===========================

Vitamin D necesity in human,విటమిన్‌ 'D' మనుషులకు చాలా అవసరమా?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
  •  
  •  

 ప్ర : విటమిన్‌ 'D' మనుషులకు చాలా అవసరమని విన్నాను . ఎంతవరకు నిజము?

జ : మన ఆరో్గ్యము కాపాడుకోవడములో విటమున్లు ప్రముఖ పాత్రను పోషిస్తాయి. అందులో విటమిన్‌'D' ది ఓ ప్రత్యేకమైన పాత్ర . చాలామంది తమ ఆరోగ్య విషయాల్లో ఈ విటమున్‌ పాత్రను విస్మరిస్తుంటారు . ఇది లోపించడము వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. విటమిన్‌ 'D' లోపమువల్ల  -- స్థూలకాయము వస్తుంది. మిగతా వారితో పోల్చితే వీరు తక్కువ చురుకుదనము కలిగి ఉంటారు.

పూర్తి వివరాలకోసము  http://vydyaratnakaram.blogspot.in/2010/12/vitamin-d.html  క్లిక్ చేయండి .

విటమిన్‌ 'D' కోసము రోజూ 10 నిముషాలు ఎండలో నడవాలి. మన శరీరము చర్మము సూర్యరశ్మి ద్వారా తగినంత విటమిన్‌ 'D' ని తయారుచేసుకుంటుంది. అది కాకుండా పాలు . పాల ఉత్పత్తులు , ఆకుకూరలలో ఇది పుష్కలము గా లభిస్తుంది.

  • *===========================