Saturday, September 22, 2012

మూత్రంలో ప్రోటీన్‌..గుండెపోటు అవగాహన-Urine protein and heart attack Awareness

  •  
  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : మూత్రము లో ప్రోటీన్‌ పోతూ ఉంటే గుండెపోటు వస్తుందా?

జ : మూత్రంలో ఏమాత్రం ప్రోటీన్‌ పోతున్నా మధుమేహులు జాగ్రత్త పడటం మంచిది. ఎందుకంటే మధుమేహుల్లో కిడ్నీ సమస్యలూ తలెత్తే అవకాశముంది. దీంతో మూత్రంలో అల్బుమిన్‌ అనే ప్రోటీన్‌ పోవటం కనిపిస్తుంది. ఇలాంటివారికి గుండెపోటు, పక్షవాతం, గుండెవైఫల్యం ముప్పు ఎక్కువగా ఉంటున్నట్టు తాజాగా బయటపడింది. సాధారణంగా 90% మంది మధుమేహుల్లో మూత్రంలో అల్బుమిన్‌ స్థాయులు మామూలు మోతాదులోనే ఉంటాయి. అయినప్పటికీ వీరికి కూడా గుండెజబ్బుల ముప్పు పెరుగుతోందా? అనేదానిపై ఇటలీ పరిశోధకులు తొమ్మిదేళ్ల పాటు అధ్యయనం చేశారు. ఈ ప్రోటీన్‌ మోతాదు కొద్దిగా పెరిగినా గుండె సమస్యల ముప్పు పొంచి ఉంటున్నట్టు గుర్తించారు. ఇక దీని మోతాదు పెరుగుతున్నకొద్దీ ముప్పూ ఎక్కువవుతూ వస్తోందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల మధుమేహులు మూత్రంలో అల్బుమిన్‌ పోతుంటే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించటం మేలని నిపుణులు సూచిస్తున్నారు.
  •  ================================
 visit my website - > Dr.Seshagirirao-MBBS

Wednesday, September 19, 2012

problem with one kidney?-ఒక కిడ్నీతో సమస్యలు వస్తాయా?



  • ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .



Q : నా వయసు 22 సంవత్సరాలు. అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ చేయించుకున్నాను. కుడివైపు కిడ్నీ లేదని, ఎడమ వైపు మాత్రమే కిడ్నీ ఉందని చెప్పా రు. క్రియాటినిన్‌ 1.0, యూరిన్‌ 28 ఉంది. ఒక కిడ్నీ ఉండటం వల్ల భవిష్య త్తులో ఏవైనా సమస్యలు తలెత్తుతాయా ? తెలుపగరలు. విక్రం, సదాశివపేట.

A : కొంత మందికి పుట్టుకతోనే ఒక కిడ్నీ ఉంటుంది. ఒక కిడ్నీ ఉన్నప్పటికీ ఈ కిడ్నీ సాధారణంగా పనిచేస్తే ఎలాంటి ఇబ్బందులు రావు. మీ కిడ్నీ ప్రస్తుతానికి సాధారణంగా పనిచేస్తుంది. అయితే ఒక కిడ్నీ ఉన్నవారిలో కొంత మందికి మూత్రంలో ప్రోటీన్‌ పోయే అవకాశం ఎక్కువుంటుంది. రక్తపోటు ఎక్కువగా ఉండొచ్చు. ఇలా ఉంటే భవిష్యత్తులో కిడ్నీ దెబ్బతినకుండా ఉండాలంటే రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలి. మూత్రంలో ప్రోటీన్‌ పోకుండా మందులు వాడాల్సి ఉంటుంది. మూత్రంలో ఇన్‌ఫెక్షన్‌ రాకుండా చూసుకోవాలి. నొప్పి నివారణ మందులు, కిడ్నీకి హానికలిగించే మందులు వాడకూడదు.

--డాక్టర్‌ శ్రీధర్‌,కన్సల్టెంట్‌ నెఫ్రాలజిస్ట్‌,-అవేర్‌ గ్లోబల్‌ హాస్పటల్‌ హైదరాబాద్‌.

  • =========================

visit my website - > Dr.Seshagirirao-MBBS

A.V.fistula operation-ఎవి ఫిస్ట్యులా ఆపరేషన్‌



  • ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము


Q ; నా వయసు 48 సంత్సరాలు. నేను క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌ అనే వ్యాధితో బాధపడుతున్నాను. క్రియాటినిన్‌ 6.4 , యూరియా 204 ఎంజి/డిఎల్‌ ఉంది. నాకు ఏ విధమైన ఇబ్బందులు లేవు. డాక్టర్‌గారు ఎవి ఫిస్ట్యులా ఆపరేషన్‌ చేయించుకోవాలని సూచించారు. ఏ లక్షణాలు లేకున్నా ఈ ఆపరేషన్‌ చేయించుకోవడం అవసరమా? సలహా ఇవ్వగలరు. దిలీప్‌ కుమార్‌, హైదరాబాద్‌.

A : మీరు క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌ నాలుగో దశలో ఉన్నారు. ఇప్పుడు ఏ లక్షణాలు లేనప్పటికీ మీకు భవిష్యత్తులో డయాలసిస్‌ అవసరమవుతుంది. డయాలసిస్‌ అంటే నిమిషానికి 200 మిల్లీలీటర్ల రక్తం బయటికి పంపించి కృత్రిమ కిడ్నీ ద్వారా ఫిల్టర్‌ చేసి మళ్లీ లోపలికి పంపిస్తారు. చేతిపైన ఉండే రక్తనాళాల్లో ఇంత రక్తం రాదు. ఎవిఫిస్టుల్యా అంటే లోపలి పెద్ద రక్తనాళంపైన ఉండే చిన్న రక్తనాళానికి కలపడం ద్వారా పైన ఉండే చిన్న రక్తనాళంలో రక్తప్రవాహాన్ని పెంచుకోవడం. ఈ ఆపరేషన్‌ చేసిన తర్వాత నెల నుండి రెండు నెలల తర్వాత చిన్న రక్తనాళాల్లో రక్తప్రవాహం పెరుగుతుంది. అప్పుడు ఈ రక్తాన్ని డయాలసిస్‌కు ఉపయోగించుకోవచ్చు. ఇది ముందే చేయించుకోవడం ద్వారా హాస్పిటల్‌లో చేరకుండానే అవుట్‌ పేషెంట్‌గానే చేరి డయాలసిస్‌ చేయించుకోవచ్చు. చాలా ఖర్చు తగ్గుతుంది. ఎమర్జెన్సీ డయాలసిస్‌ కోసం వాడే క్యాథటర్‌ వల్ల వచ్చే ఇన్‌ఫెక్షన్లు, ఇతర సమస్యలను నివారించొచ్చు. అందుకని ఎవి ఫిస్ట్యులా ఆపరేషన్‌ చేయించుకోవడం మంచిది.

-డాక్టర్‌ శ్రీధర్‌,కన్సల్టెంట్‌ నెఫ్రాలజిస్ట్‌.
  • .=================================

visit my website - > Dr.Seshagirirao-MBBS

Saturday, September 15, 2012

Does fish eating prevent Diabetes?-చేపలు తింటే మధుమేహము రాదా?




  • ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము --
  • మధుమేహము వంశపారంపర్యముగా(Gene mediated) 90 శాతమువరకూ వస్తుంది. ఏమి తిన్నా ... ఏమి తినకపోయినా వంశములో ఉంటే ... డయాబెటిక్ జీన్‌ గనుక డామినెంట్ అయి ఉంటే ఏదో ఒక వయసులో ... ముందో , వెనకో రాక మానదు. చేపలు తిన్నా ,, మాంసము తిన్నా దాని ఉదృతము(leval) లో కొద్ది గా తేడా తప్పితే తగ్గిపోవడము అంటూ , రాకపోవడం అంటూ జరుగదు.

మాంసం బదులు.. చేపలు.. చేప తింటే చక్కెర వ్యాధికి చెక్ చెప్పినట్లే. రోజూ ఫిష్ తినేవారికి షుగర్ వ్యాధి రానే రాదట. రోజూ చేపలు తినడం వల్ల డయాబెటీస్‌ను దూరంగా ఉంచవచ్చని... లండన్‌లోని వలెన్సియా యూనివర్సిటీ నిపుణులు పరిశోధించి తేల్చారు. 55 నుంచి 80 ఏళ్ల మధ్య ఉన్న 945 మందిపై జరిపిన పరిశోధనలో ఈ విషయాన్ని గుర్తించారు... చేపలు తిన్నవారిలో డయాబెటీస్‌ సాధారణ స్థితిలో ఉన్నట్లు కనిపెట్టారు. అదే సమయంలో మాంసం తిన్న వారిలో షుగర్ లెవల్స్ ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు నిర్ధారించారు... చేపలు తినడం వల్ల డయాబెటీస్‌ను కంట్రోల్‌ చేస్తున్నట్లు గుర్తించారు... చేపల వల్ల గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుందని వలెన్సియా యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. చేప తినండి.. చక్కెర వ్యాధికి దూరం కండి.


  • .=============================

visit my website - > Dr.Seshagirirao-MBBS

Thursday, September 6, 2012

గర్భము దాల్చాక చేయాల్సిన , చేయకూడని పనుల్ని వివరించండి ?




ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర : గర్భము దాల్చాక చేయాల్సిన , చేయకూడని పనుల్ని వివరించండి ?

జ : చేయవలసినవి :
  • శరీరాన్ని వివిధ రకాల ఇన్‌ఫెక్షన్ల నుంది కాపాడుకునేందుకు గాను అవసరమైన వ్యాక్షిన్లు తీసుకోవాలి .
  • తొలి మూడు మాసాలు దూరప్రయాణాలు డాక్టర్ సలహా మేరకే చేయాలి .
  • మంచి అహారము తీసుకోవాలి .
  • వేవుళ్లు కోసము డాక్టర్ సలహా మేరకు మాత్రలు వాడాలి.
  • స్లీపింగ్ పొజిషన్‌ మార్చుకోవాలి ... బోర్లా పడుకోకూడదు . ఏదో ఒక పక్కకు ఒత్తిగిలి పడుకోవాలి .
  • క్రమము తప్పకుండా ఫోలిక యాసిడ్ , ఐరన్‌ , కాల్సియం మాత్రలు తీసుకోవాలి .
  • క్రమము తప్పకుండా ప్రతి నెలా వైద్యపరీక్షలు చేయిందుకోవాలి .
  • సంసారజీవితం సురక్షితము గా జరుపుకోవచ్చును . దీనికోసము మీ డాక్టర్ని సంప్రదించాలి.

ఏం చేయకూడదు .:

  • వెజైనల్ బ్లీడింగ్ , ఫ్లూయిడ్ లీకేజీ లను నిర్లక్ష్యం చేయకూడదు . డక్టర్ ని సంప్రదించాలి.
  • గర్భదారణ తరువాత ఆక్యుపంచర్ ట్రీట్ మెంట్ , పచ్చబొట్లు వంటివి తీసుకోకూడదు.
  • చాతిలో నొప్పి , కాళ్ళు వాపులు కనిపిస్తే ... తుట్టసారము అని నిర్లక్ష్యము చేయరాదు .
  • ఒక మోస్తరు వ్యాయామము చేయడం మానకూడదు .
  • పురుడు (ప్రసవం) గురింఛి భయము , ఆలోచన పడకూడదు .
  • ఎటువంటి ఒత్తిడులకు లోనుకాకూడదు.
visit my website - > Dr.Seshagirirao-MBBS