Saturday, March 31, 2012

How to avoid abdominal distension, కడుపుబ్బరం తగ్గేదెలా?


  • image : courtesy with eenadu news paper.

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .



ప్ర : నేనొక ప్రముఖ సంస్థలో పని చేస్తున్నాను. స్నేహితులు, సహోద్యోగుల్లో ఎవరో ఒకరు తరచూ పార్టీలకు ఆహ్వానిస్తూనే ఉంటారు. కాదనలేక మొహమాటంగానే హాజరవుతున్నా. అయితే బయట రెస్టారంట్లలో మసాలా పదార్థాలు తీసుకుంటే ఇబ్బందిగా ఉంటోంది. కడుపులో ఉబ్బరం, తిప్పడం. ఒక్కోసారి విరేచనాలు అవుతున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారం చెప్పండి.

జ : బయటి తినుబండారాలు రుచిగా అనిపిస్తాయి. కానీ వాటిల్లో నూనెలు అధికం. తయారీలో శుభ్రమైన నీరు వాడాలి. నిల్వ ఉన్న పదార్థాలయితే ఆహారం కలుషితం అవుతుంది. దాన్ని తిన్నప్పుడు రకరకాల వ్యాధులు రావచ్చు. ఆహారం వండేటప్పుడు గిన్నెలు, చేతులను, కూరగాయలను శుభ్రంగా కడగాలి. లేదంటే ఆరోగ్య సమస్యలు రావచ్చు. కొంతమందికిది తక్షణం జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు వాంతులు, విరేచనాలు, అజీర్ణం లాంటి సమస్యలు బాధించవచ్చు. మాంసాహారం, కోడిగుడ్లు, వండిన కూరలు ఎప్పటికప్పుడు తినడం మేలనే విషయాన్ని మరిచిపోకూడదు. ఇక, మీరేం చేయాలంటే.. కాచి చల్లార్చిన నీళ్లు తాగడం మేలు. పెసరకట్టు, కందికట్టు లేదా బియ్యంగంజిలో చిటికెడు కరక్కాయ పొడి వేసి పుచ్చుకుంటే అజీర్ణం తగ్గుతుంది. ఉల్లిపాయ రసంలో నిమ్మరసం, వాము చిటికెడు ఉప్పు, బియ్యంగంజిలో కలిపి తీసుకోవాలి. మితాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. దానిమ్మ రసం 30ఎమ్‌ఎల్‌ చొప్పున తీసుకోవచ్చు. అల్లంరసం, తేనె కలిపి తీసుకున్నా ఫలితం ఉంటుంది. అజీర్ణంతో బాధపడేవారు భోజనానికి ముందు అల్లంరసం, సైంధవ లవణం చిటికెడు కలిపి తీసుకుంటే సత్వర ఉపశమనం దొరుకుతుంది. జీలకర్ర, పంచదార, మిరియాలపొడి చిటికెడు చొప్పున, తగినంత తేనె కలిపి తీసుకుంటే వాంతులు తగ్గుతాయి. రేగుపళ్లగుజ్జు, చెంచా యాలకులపొడి, లవంగాలు, పిప్పళ్లు చిటికెడు చొప్పున తీసుకుని పంచదార కలిపి తిన్నా మార్పు కనిపిస్తుంది.

Tab. Omeprazole 20 mg daily one Early morning .. or
Tab. Rabeprazole 20 mg daily one Early morning .. or
Tab. Pantaprazole 40 mg daily one Early morning .. తీసుకుంటే కడుపుబ్బరం తగ్గిపోతుంది.
  • =====================================

visit my website - > Dr.Seshagirirao-MBBS

అర్థం చేసుకుంటే అనుబంధాలే... రుసరుసలాడుతుంటే మిగిలేది మానసిక ఒత్తిడే



  • ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము


ప్ర : ఒక రోజు మా ఇరుగుపొరుగు స్నేహితురాళ్లందరం కలిసి రెస్టరంట్‌కు వెళదామనుకున్నాం. తీరా నేను బయల్దేరాక 'మన కార్యక్రమం రద్దయింది' అని ఓ స్నేహితురాలు నేను ఫోన్‌ చేస్తే చెప్పింది. మరో ఆవిడకి చేసినా అదే జవాబు. నేను కాల్‌ చేసే వరకు ఎవరూ చెప్పనందుకు పట్టలేని కోపమొచ్చింది. కానీ కొద్దిసేపయ్యాక 'ఎవరో ఒకరు తనకు చెబుతారులే' అని అందరూ అనుకోవడం వల్ల ఆ సమాచారం రాలేదని గ్రహించాను. ఎందుకిలా జరుగుతుంది ?

జ : మన చుట్టుపక్కల వాళ్లతో స్నేహంగా మెలగడం ఎంత ముఖ్యమో.. వారితో అతి చనువు లేకుండా ఉండటం కూడా అంతే అవసరం. ఎందుకంటే అనుబంధాలు దూరం కావడానికి గొడవలే పడనక్కర్లేదు... వారిని నొప్పించినా చాలు అగాధాలు పెరిగిపోతాయి. సంబంధాలు బెడిసికొడతాయి. పొరుగు వారు తరచూ ఇంటికి రావడం, వ్యక్తిగత విషయాల్లో చొరవ చూపడం, గంటల కొద్దీ కబుర్లు చెప్పడం వంటివి కొందరికి నచ్చకపోవచ్చు. అలాగనీ వాళ్లతో అంటీ ముట్టనట్టు కాకుండా పరిమితులకు లోబడి మెలగాలి. సందర్భాన్ని బట్టి మాట కలపడం.. అవసరాన్ని బట్టి వాళ్లింటికి వెళ్లడం చేయాలి. అయితే ముఖ్యమైన విందులు, వేడుకల వంటి వాటికి వెళ్లకుండా ఉండటం కూడా సరికాదు. అత్యవసర పరిస్థితుల్లో మానేస్తే.. వీలు చూసుకొని పొరుగింటికి వెళ్లిరావడం మంచిది. అలానే పండగలు, ప్రత్యేక సందర్భాలకు ఆహ్వానించడం.. చేసిన పిండివంటల్ని ఇతరులతో పంచుకోవడం.. వల్ల వారితో అనుబంధాలు దృఢమవుతాయి. కుదిరితే.. ఇరుగుపొరుగు వారంతా కలిసి ఓ రోజైనా విహారయాత్రకు వెళ్లివచ్చేలా ప్రణాళిక వేసుకోవచ్చు.

మాట పట్టింపు లేకుండా..కలుపుగోలుగా ఇరుగుపొరుగుతో కలిసిపోయినప్పుడే సత్సంబంధాలు మెరుగవుతాయి. అప్పుడే ప్రతి అవసరానికీ ఆదుకొనే ఆప్తులున్నారన్న భద్రత ఉంటుంది. లేదంటే తరచూ గొడవలు పడుతూ.. చీటికీ మాటికీ ఎదుటివారిపై రుసరుసలాడుతుంటే మిగిలేది మానసిక ఒత్తిడే .
  • .======================================

visit my website - > Dr.Seshagirirao-MBBS

చనువుగా ఉంటే అనుమానమా?



  • ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర : మా పెళ్త్లె పదిహేనేళ్లు. నేను ఉన్నత విద్యావంతురాలిని. కిందటేడాది నేను హాజరైన పార్టీలో ఓ ధనవంతుడు పరిచయమయ్యాడు. అప్పట్నుంచి
అతనితో చనువు. కానీ ఏనాడూ హద్దులు దాటలేదు. ఈ మధ్యే తన వ్యాపారంలో భాగస్వామిగా ఉండమంటూ ప్రతిపాదన తెచ్చాడు. అదే నా భర్తకు తెలిపి అతన్ని పరిచయం చేశా. అప్పట్నుంచి ఆయనలో మార్పు. చెప్పలేనంత పరధ్యానం. నా వల్ల కుటుంబానికి ఏదైనా లోటు జరిగిందా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఉన్నట్టుండి ఏడ్చేస్తారు. కొన్నాళ్లుగా లైంగిక చర్యకు దూరంగా ఉన్నాం. మేమిద్దరం దగ్గరగానే ఉంటున్నా మనసులో ఏదో అగాధం. ఇప్పుడేమో రోజూ కలయికలో పాల్గొనాలని ఉందంటున్నారు. ఆ స్నేహితుడిని ఇష్టపడుతున్నావా అని అడుగుతారు. ఒక్కసారిగా ఆయనలో వచ్చిన మార్పుతో కుంగిపోతున్నా.అలాగని నా స్నేహితుడితో కలిసి వ్యాపారం కూడా చేయాలని ఉంది. ఎటూ తేల్చుకోలేకపోతున్నా.

జ : కుటుంబంలో భార్య బాగా చదువుకోవడం, వ్యాపారాన్ని సమర్థవంతంగా నిర్వర్తించగలని నిరూపించడం, మరొకరితో కలిసి పనిచేయాలని నిర్ణయించుకోవడం వల్ల భర్త సహజంగానే కొంత అభద్రతకు లోనవుతాడు. కుటుంబంలో తామేదో అనవసర వ్యక్తనే నిర్ణయానికి వచ్చేస్తారు. అదే సమయంలో భార్య పట్ల అనుమానం కూడా మొదలవుతుంది. ఈ పదిహేనేళ్ల వైవాహిక జీవితంలో మీ భర్త కుటుంబానికి అవసరమైనవన్నీ సమకూర్చారు. అయినా జీవితానికి సంబంధించి మీకంటూ కొన్ని ఆలోచనలున్నాయి. ఇప్పుడు మీ మధ్య సమస్యలు పెరగడానికి అదే కారణం కావచ్చని ఆలోచించారా? మీరు మీ స్నేహితుడితో హద్దులు దాటకపోయినా భర్త మిమ్మల్ని అనుమానిస్తున్నాడంటే.. దానికి పరిష్కారం మీ చేతుల్లోనే ఉంది. మీ స్నేహితుడు నిర్వహించే వ్యాపారంలో మీరొక్కరే కాకుండా.. భర్తనూ భాగస్వామిని చేయండి. మీ స్నేహితుడితో మీకెలాంటి శారీరక సంబంధం లేదని మీ భర్త తెలుసుకునేలా నిరూపించండి. మీరు మీ భర్తతో ఎక్కువ సాన్నిహిత్యంగా ఉండటానికి ప్రయత్నించండి.

అతనిపట్ల మీకున్న ప్రేమను, ఇష్టాన్ని వివరించండి. కుటుంబానికి అతను ఎంత అవసరమో తెలియజేయండి. ఇన్నేళ్లుగా అతను చేసిన మంచి పనుల్ని గుర్తుచేస్తూ ఆ ఒత్తిడి నుంచి బయట పడేలా సహకరించండి. అప్పుడే మీ బంధం ధృడమవుతుంది. మానసికంగానే కాదు, శారీరకంగా కూడా మీ భర్తతో చనువుగా ఉండండి. ఆ తరవాతే ఆర్థిక అవసరాలు, స్నేహితుడితో కలసి నిర్వహించే వ్యాపారం గురించి ఆలోచించండి. కుటుంబం తరవాతే మిగతావన్నీ అనే విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో విస్మరించకండి. అతని ప్రశ్నల్లో, పరధ్యానంలో మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తున్న తీరు కనిపిస్తోంది. ఆ విషయాన్ని గమనించి, ప్రపంచంలో ఏ పరిచయమూ అతనికన్నా విలువైనది కాదని స్పష్టం చేయండి.
  • =================================

visit my website - > Dr.Seshagirirao-MBBS