జ :అదేపనిగా ఆన్‌లైన్‌లో-గడిపితే అనారోగ్యాలు ఖాయం!!
లండన్: అదేపనిగా అంతర్జాలం చూస్తూ గంటలకొద్దీ సమయాన్ని గడిపేయడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని తాజా అధ్యయనం పేర్కొంది. ఇలా చేయడం వల్ల రోగ నిరోధక శక్తి క్షీణిస్తుందనీ... జలుబు వంటి అనారోగ్యాల బారిన పడటం ఖాయమని స్వాన్‌సీ, మిలాన్ విశ్వవిద్యాలయాలకు చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు. అంతర్జాలానికి బానిసలయ్యే వారికి....అదో వ్యసనంలా అలవాటు పడిన వారికి రోగనిరోధకశక్తి దెబ్బతింటుందన్నారు. తాము నిర్వహించిన అధ్యయనంలో అంతర్జాలం బానిసలకు...అంతగా దాని జోలికి వెళ్లని వారికి మధ్య ఆరోగ్యం విషయంలో నెలకొన్న తేడాలు సుస్పష్టమైనట్లు తెలిపారు.
- *===========================
- visit my website - > Dr.Seshagirirao-MBBS -

