Friday, February 14, 2014

సాల్యుబుల్ ఇన్‌సాల్యుబుల్ ఫైబర్ అని అంటుంటారు కదా ఈ రెండింటికీ తేడా ఏమిటి ?

  •  
  •  

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : సాల్యుబుల్ , ఇన్‌సాల్యుబుల్ ఫైబర్ అని అంటుంటారు కదా, ఈ రెండింటికీ తేడా ఏమిటి ?

జ : పిండిపదార్ధాలు, కొవ్వు పదార్ధాలు, మాంసకృత్తులు.. వీటన్నింటినీ మన శరీరం పచనం చేసుకుని.. జీర్ణం చేసేసుకుంటుంది. కానీ పీచు ఇలా పూర్తిగా 'జీర్ణం' అయిపోదు. అందుకే దీనివల్ల 'మలం' పరిమాణం పెరుగుతుంది. పీచు శాకాహారంలోనే ఉంటుంది. మాంసాహారంలో ఉండదు. పీచుపదార్ధాలు తీసుకున్న ప్రతిసారీ తగినంతగా నీరు కూడా తాగాలి. రెండు రకాలు ..............>

* కరగని పీచు: మన ఆహారంలోనే ఉంటుందిగానీ.. నీటిలో కరగని రకం పీచు ఇది. దీన్ని 'ఇన్‌సాల్యుబుల్‌ ఫైబర్‌' అంటారు. ఇది జీర్ణం కాదు, విసర్జన ద్వారా అలాగే బయటకు వెళ్లిపోతుంది. ముడిధాన్యం, పప్పులు, కాయగూరల్లో ఉండే 'సెల్యులోజ్‌' అనే ముతకరకమైన పీచు, దాని కన్నా కొద్దిగా పల్చగా ఉండే హెమీసెల్యులోజ్‌, లిగ్నన్స్‌ వంటివి ఈ తరహావి. దీనివల్ల మలం పరిమాణం పెరుగుతుంది, జీర్ణ వ్యవస్థలో ఆహారం కదలికలూ పెరుగుతాయి.

* కరిగే పీచు: ఇది బాగా నీటిని పీల్చుకుని ఉబ్బి, ఒక రకమైన జిగురులా తయారయ్యే రకం పీచు. దీన్నే 'సాల్యుబుల్‌ ఫైబర్‌' అంటారు. ఓట్స్‌, బార్లీ, చిక్కుళ్లు, బఠాణీల వంటి గింజలు, సపోటా వంటి పండ్లు.. ఇలాంటి వాటిలో ఉండే జిగురుగా తయారయ్యే గమ్స్‌, పెక్టిన్స్‌, మ్యూసిలేజస్‌.. ఇవన్నీ ఈ తరహావి. ఈ రకం పీచుకు ఆరోగ్యపరంగా చాలా ప్రాధాన్యం ఉంది. రక్తంలో కొలెస్ట్రాల్‌, చక్కెర స్థాయుల వంటివి తగ్గించటం వంటి ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఇది వీటన్నింటిలో ఎక్కువగా ఉంటుంది.

- ఈ కరిగే పీచు, కరగని పీచుల స్థాయులు.. ఒక్కో పదార్థంలో ఒక్కో మోతాదులో ఉంటాయి. మొత్తానికి మన ఆరోగ్యానికి రెండూ ముఖ్యమైనవే.
  •  *===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

Wednesday, February 12, 2014

Causes for Stroks and prevention?,స్ట్రోక్స్ కి కారణాలేమిటి ? తీసుకోవల్సిన జాగ్రత్తలేమిటి?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర : ఇటీవల చాలా చిన్నవయసులోనే స్ట్రోక్స్ వస్తున్నాయి. దీనిగురించి ప్రతి ఒక్కరూ అందోళన చెందుతున్నారు ... అసలు ఈ స్ట్రోక్స్ కి కారణాలేమిటి ? తీసుకోవల్సిన జాగ్రత్తలేమిటి?.

జ : స్ట్రోక్స్ రావడము మీ శరీరక బరువు , నిద్ర , జీవనశైలి వంటి వాటిపై ఆధారపడి వుంటుంది. అధిక బరువు ఉన్నా , చాలినంత నిద్రపోలేక పోతున్నా , డ్రింకింగ్ అలవాట్లు, స్మోకింగ్ అలవాట్లు ఉన్నా స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

చిన్నవయసులో స్ట్రోక్స్ తో బాధపడే వారిలో స్మోకింగ్ , శారీరక చురుకుదనము లేమి , హైపర్ టె్న్సన్‌ , అత్యధిక కొలెస్టిరాల్ , స్థూలకాయము , తాగుడు , రాత్రివేళ 6(ఆరు) గంటలకంటే తక్కువ నిద్రపోవడము వంటివి వున్నట్లు పరిశోదకులు గమనించారు.  వయసు , వారసత్వము , జీవనశైలి , తదుపరి కారణాలు , ఈ అలవాట్లకు దూరము గా ఉన్నవారు చక్కని జీవనశైలి అనుసరించేవారు స్ట్రోక్స్ గురించి భయపడనవసరములేదు . 

  • *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Thursday, February 6, 2014

Vaginal discharge is a problem?, వెజైనల్‌ డిశ్ఛార్జి సమస్యకు సంకేతమా?

  •  
  •  

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

Q : పెళ్లయినప్పటి నుంచి నాకు వెజైనల్‌ డిశ్ఛార్జి అవుతోంది. దానికితోడు ఈ మధ్య వాసన కూడా ఉంటోంది. మొదట్లో దీన్ని తేలిగ్గా తీసుకున్నా కానీ... ఇప్పుడు భయపడుతోన్నా. ఇదేమైనా సమస్యకు సంకేతమా?
- ఓ సోదరి
A :మీకు ముందు నుంచీ ఒకేలాంటి స్రావాలు విడుదలవుతూ ఉండి, ఒకేలాంటి వాసన వస్తోంటే భయపడక్కర్లేదు. ఇది చాలా సాధారణం. ఈ పరిస్థితి లైంగిక సమయంలో ప్రతిస్పందనకు సంకేతం. అయితే అధ్యయనాలు మాత్రం ఈ స్రావాలూ, వాసన కూడా శరీరంలోని సహజ వాసనల్ని నిరోధించి, దీర్ఘకాల లైంగిక సంతృప్తికి అడ్డు తగులుతాయని చెబుతున్నాయి. అయితే మీరూ, మీ భర్తా ఆ స్రావాల విడుదలలో ఏదయినా తేడా గుర్తించినా, దుర్వాసన వస్తున్నా ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ సలహా తీసుకోవడం మంచిది. అది ఇన్‌ఫెక్షన్‌కు సంకేతం కావచ్చు కాబట్టి వైద్యులు అవసరమైన పరీక్షలను సూచిస్తారు. ఇక, ఆ వాసనను తొలగించుకోవడానికి పీహెచ్‌ న్యూట్రల్‌ క్లెన్సర్లు అని ఉంటాయి. డాక్టర్‌ సలహాతో వాటిని వాడి చూడండి. కొంతవరకూ మార్పు ఉంటుంది.

Courtesy with : Dr.Sharmila Majundar@eenadu vasundhara

*===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

Feeling anxious after sex , కలయిక తరవాత సమయంలో ఏడుపొస్తోంది

  •  
  •  

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

రెండేళ్ల క్రితం మాకు పెళ్లయింది. పిల్లలు లేరు. మా మధ్య ఎలాంటి సమస్యలూ లేవు. అయితే కలయిక తరవాత నేనెందుకో చాలా ఉద్వేగానికి లోనవుతున్నా. ఒక్కసారిగా ఏడుపొచ్చినంత పనవుతోంది. పెళ్లయిన మొదటినుంచీ ఇదే పరిస్థితి. నా తీరు చూసి మా వారూ ఆందోళన పడుతున్నారు. ఇదేమైనా సమస్యా?
- ఓ సోదరి
మీరనుకుంటున్నట్లు ఇదేమీ సమస్య కాదు. మీరు చాలా సాధారణంగానే ఉన్నారు. కాబట్టి ముందు భయపడటం మానేయండి. కొన్నిసార్లు కలయిక తరవాత ఉద్వేగాలు చోటుచేసుకోవడం అనేది సర్వసాధారణం. అది భాధ కావచ్చు.. కోపం కావచ్చు. లేదంటే ఆనందం కూడా కావచ్చు. కలయిక సమయంలో కొందరు మహిళల్లో ఎదురయ్యే కొన్ని రకాల ఆలోచనలు ఇలాంటి ఉద్వేగాలకు లోనుచేస్తాయి. ఉదాహరణకు.. 'మేం ఒకప్పటిలా ఆనందంగా ఉంటున్నామా?', 'పిల్లలు కలుగుతారా?', 'వైవాహిక బంధాన్నీ, లైంగిక జీవితాన్నీ సంపూర్ణంగానే ఆనందిస్తున్నానా?' లాంటి ప్రశ్నలు మహిళల్లో మొదలవుతాయి.. వీటన్నింటికీ తోడు.. కలయిక సమయంలో ఆర్గాజమ్‌ ఆక్సిటోసిన్‌, డొపామైన్‌, నోర్పినెఫ్రైన్‌' లాంటి న్యూరో కెమికల్స్‌ని విడుదలవుతాయి. అవి స్త్రీ మెదడులో ఉద్వేగాలను ఉత్తేజిత పరుస్తాయి. అలాంటప్పుడే ఈ పరిస్థితి ఎదురవుతుంది. మీ తీరుకీ అదే కారణం. అయితే కలయికలో పాల్గొన్న తరవాత లేదా లైంగిక చర్య గురించి ఆలోచించినప్పుడల్లా మీలో ఉద్వేగాలు పెరగడం, మీరు చెప్పినట్లు ఏడుపొచ్చేయడం, అతిగా ఆందోళన పడటం లాంటి సమస్యలు కనిపిస్తూ ఉంటే సెక్సాలజిస్టును సంప్రదించడం మంచిది. డాక్టర్లు వాటిని అదుపులో ఉంచేందుకు ఏం చేయాలనేదీ సూచిస్తారు.

Courtesy with : Dr.Sharmila Majundar@eenadu vasundhara

  • *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Monday, February 3, 2014

How to fulfil balanced diet to children,పిల్లలకు సమతులాహారం ఎలా?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

Q : మా అబ్బాయికి ఎనిమిదేళ్లు. ఈ వయసులో పిల్లలకు సమతులాహారం ఇవ్వాలంటారు కదా.. వాడికి అన్ని రకాల పోషకాలు అందుతున్నాయా లేదా అన్న సందేహం నాలో మొదలయ్యింది. ఒకవేళ అదే జరిగితే.. ఆ లోపాన్ని ఎలా భర్తీ చేయాలి. నా సందేహం తీర్చగలరు..

- ఓ సోదరి

A : మీ అబ్బాయి ముందు ఎత్తుకు తగ్గ బరువు ఉన్నారా లేదా అన్నది గమనించుకోవాలి. తరవాత చదువులోనూ చురుగ్గా ఉంటున్నాడా, తరచూ ఇన్‌ఫెక్షన్లు బారిన పడకుండా ఉంటున్నాడా చూడాలి. ఒకసారి అంతా బాగానే ఉందనుకుంటే అప్పుడు సమతులాహారంపై శ్రద్ధపెట్టండి. ఎంత తింటున్నాడనేది కాకుండా ఎలాంటి నాణ్యమైన పదార్థాలను మీరు పెడుతున్నారనే విషయానికి ప్రాధాన్యం ఇవ్వండి. పిల్లల ఎదుగుదలలో సరైన మాంసకృత్తుల పాత్ర కీలకం. అంటే గుడ్డూ, పాలూ, పాల పదార్థాలూ, పప్పుదినుసులూ మాంసాహారం లాంటివి వాళ్ల వయసుకు తగినట్లుగా అందివ్వాలి. అన్నిరకాల కూరగాయలూ, ఆకుకూరలూ మేలుచేసే కొవ్వుపదార్థాలూ మంచి ఫ్యాటీయాసిడ్లు తినేలా చూడాలి. అలాగే వేరుసెగనలూ, నువ్వులూ లాంటివి కూడా అందివ్వడం మొదలుపెట్టాలి. దానివల్ల మేలుచేసే ఫ్యాటీయాసిడ్లు పిల్లలకు అందుతాయి. రోగనిరోధకశక్తి పెరగడానికి విటమిన్‌ ఎ, సి ఎక్కువున్న ఆహారపదార్థాలు ఇవ్వాలి. ముదురు పసుపు రంగు పండ్లూ, కూరగాయలూ తినిపించాలి. పిల్లలకు అన్నిరకాల పోషకాలు సమగ్రంగా అందాలంటే ఆకుకూరలను మించిన పరిష్కారం లేదు. ఇక, చక్కెరను పిల్లలు ఎంత మోతాదులో తీసుకుంటున్నారనేదీ చూడాలి. సాధారణంగా అయితే పాలల్లో వేసుకున్నా, చాక్లెట్‌లా తిన్నా.. చక్కెర రోజుకు రెండు చెంచాలు మించకూడదు. చివరగా జంక్‌ఫుడ్‌ వల్ల కెలొరీలు పెరగడం తప్ప ఎలాంటి పోషకాలు అందవు. వాళ్ల ఎదుగుదలకు తోడ్పడవు. అందుకే వాటిని పూర్తిగా తగ్గించాలి.

  • *===========================
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Saturday, February 1, 2014

సంతాన నిరోధక మాత్రలు వాడితే కావలసినప్పుడు గర్భము దాల్చే అవకాశాలు ప్రబావితం అవుతాయా?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : పెళ్ళై మూడేళ్ళు అయినది. పిల్లలు కలుగకుండా సంతాన నిరోధక మాత్రలు (Oral contraceptive pills) వాడితిని . కొన్నాళ్ళు భర్తకు దూరము గా ఉండడము వలన  మాత్రలు వాడడము మానేసాను . తిరిగి కలిసి ఉంటున్నాము . సంతానము కావాలనుకుంటున్నాము. పిల్స్ వాడినందువల్ల గర్భము ధరించే అవకాశాలు ప్రభావితమవుతాయా?.
జ ; ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ పూర్తిగా సురక్షితమైనవి. వీటిని రెగ్యులర్ గా వాడితే గర్భము రాదు. వాటిని వాడడం నానేశాక మూడు నెలలు దాకా వాటి ప్రభావం ఉంటుంది. ఆ పై ఏసమస్యా లేకుండా గర్భం దాల్చవచ్చు . ఈ టైం దాటాక కూడా గర్భం రాకపోతే ఇంకేదైనా కారణం ఉండివుండవచ్చును . గైనకాలజిస్ట్ తో సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోండి. 

*===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -