Wednesday, January 30, 2013

What is Rinxiey and infomania?,రింగ్జయిటీ ...ఇన్ఫోమేనియా అంటేఏమిటి?

  •  
  • image : courtesy with Prajasakti news paper

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము . 


    ఇది యువతీ యువకుల్లో విస్తరిస్తున్న ఒకరకమైన మానిసిక రుగ్మత-అవును ఫోన్‌కాల్సూ, ఎస్‌ఎమ్సెస్‌లూ వ్యక్తుల్లో మానసిక బలాన్నో, బలహీనతనో కలిగిస్తున్నాయి. అంటే ఆధునిక సమాచార స్రవంతిలో పాజిటివ్‌, నెగెటివ్‌ అంశాలు కూడా వ్యక్తుల్ని, ముఖ్యంగా యువతను ప్రభావితం చేస్తున్నాయి. ప్రస్తుతం సెల్‌ఫోన్‌ అదే చేస్తోంది. ఇది కేవలం సమాచార వారధిగానే గాక యువతలో 'రింగ్జయిటీ', 'ఇన్ఫోమేనియా' లాంటి మానసిక బలహీనతలకు దారితీస్తోంది. నగరాల్లోని, పట్టణాల్లోని యువతే దీనికి ఎక్కువగా ప్రభావితమౌతోంది.

ఏదో ముఖ్యమైన పని మీదుంటారు. అయినా 'బాడీ ప్రెజెంట్‌ మైండ్‌ ఆప్సెంట్‌ అన్నట్లు మీ మనసు మాత్రం అక్కడుండదు. మళ్లీ... మళ్లీ ఎవరైనా ఫోన్‌ చేస్తారేమోనని సెల్‌వైపే చూస్తుంటారు. అనుకోకుండా రింగైనట్లు అనిపిస్తుంది. చూసే సరికి ఏదీ ఉండదు. ఇలాంటి ఫీలింగ్‌ గనుక కలిగిందంటే అది తప్పక 'రింగ్జయిటీ' అనే రుగ్మతే అంటున్నారు మానసిక నిపుణులు . యువత గంటల తరబడి మాట్లాడుకోవడంవల్ల, ఇష్టమైన వ్యక్తులు (స్నేహితులు, లవర్స్‌) ఫోన్‌చేసి ఎక్కువ సేపు ముచ్చటించుకోవటంవల్ల క్రమంగా ఇదొక బలహీనతగా మారుతోంది. చివరికీ ఎవ్వరూ ఫోన్‌ చేయకపోయినా చేస్తారేమోనన్న ఫీలింగ్‌ను కలిగిస్తుంది. దీనివల్ల ఏకాగ్రత లోపించడం, నిద్రలేమి వంటి సమస్యలూ ఎదురౌతున్నాయి. ముఖ్యంగా చదువుకునే వాళ్లు ఎక్కువగా డిస్టర్బ్‌ అవుతున్నారు. ఇదొక ఫాంటమ్‌ రింగింగ్ సిండ్రోం . మన చెవులకు శబ్దాలు వినే సెన్సిటివ్ సామర్ధ్యము 1000 నుండి 6000 హెర్ట్ జ్ మధ్యలో ఉంటుంది . రోజులో ఇంతకు మించి చెలువు వింటే  దాని సామర్ధ్యము లో  ఎచ్చుతగ్గులు వస్తాయి. వినికిడి లోపాలు ఏర్పడతాయి.

ఉదాహరణ :
''ఎప్పుడూ చలాకీగా ఉండే అమ్మయి  సెల్‌ కొన్నప్పట్నించీ తెగ బిజీ ఐపోయింది. ఫ్రీగా మాట్లాడట్లేదు. సీరియస్‌గా మొహం పెట్టి ఎప్పుడూ ఎస్సెమ్మెస్‌లు చదువుతూ, పంపుతూ ఉంటుంది'' తన కూతురు గురించి ఓ తల్లి చెప్పిన మాటలివి. అంతేకాదు సాయంకాలం రాగానే స్నానంచేసి ఫ్రెష్‌ అయి చదువుకునే తను సెల్‌ఫోన్‌ పట్టుకుని కూర్చుంటుందని ఆవేదన వ్యక్తం చేసింది. అవును మరి ఎస్సెమ్మెస్సా మజాకా! ఎందుకలా అని అమ్మాయిని అడిగితే ''ఫ్రెండ్స్‌ చిలిపి ఎస్సెమ్మెస్‌లు పంపుతుంటారు. రిప్లరు ఇవ్వొద్దూ'' అంటోందామె. అప్పుడప్పుడూ సరదాకు ఇలాంటివి చేయొచ్చునేమోగానీ అదే పనిగా ఎస్సెమ్మెస్‌ల బిజీలో మునిగిపోవడమేంటి? కొందరైతే ఎప్పుడెప్పుడు ఎస్సెమ్మెస్‌ వస్తోందా? ఎప్పుడు రిప్లరు ఇద్దామా అనే ఆలోచనతో ఉంటారు. కొన్నిసార్లు ఎవరూ పంపకపోయినా బీప్‌మని శబ్దం వచ్చినట్లు అనిపించి ఫోన్‌ తీసి చూస్తారు. ఒకటికి రెండుసార్లు ఇలా చేస్తున్నారంటే అది తప్పక 'ఇన్‌ ఫోమేనియా'నే అంటున్నారు మానసిక నిపుణులు. అదొక బలహీనతగా మారి యువత చదువుకూ, పనికీ, లక్ష్యానికీ ఆటంకం కల్పిస్తోంది.

 ప్రయివేటు కంపెనీల ఎస్సెమ్మెస్‌ల ఆఫర్లకు యువతీ యువకులు ఆకర్షితులౌతున్నారు. చిలిపి ఎస్సెమ్మెస్‌లూ, రొమాంటిక్‌ ఎస్సెమ్మెస్‌లూ, సరదా ఎస్సెమ్మెస్‌లూ, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌కు సంబంధించిన కొటేషన్సూ, స్ఫూర్తినిచ్చే కొటేషన్సూ, వివిధ ఆనందకరమైన సందర్భాల్లో కృతజ్ఞతలూ సహజమేమో కానీ, అవి శృతిమించితేనే ప్రమాదం. ప్రస్తుతం యువతలో ఈ అతి పోకడలు కనిపిస్తున్నాయి. రొమాంటిక్‌ ఎస్సెమ్మెస్‌ల వల్లో పడి చదువు పాడు చేసుకుంటున్నారు. ఏకాగ్రత లోపంతో, నిద్ర లేమితో బాధ పడుతున్నారు. మానసిక బలహీనతకు గురౌతున్నారు. ఇలాంటి అవకాశం మీరు రానీయకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

*అప్పుడప్పుడూ సరదా ఎస్సెమ్మెస్‌లూ, కాల్సూ తప్పుకాదు. కానీ అదే పనిగా వాటికి ప్రభావితం కావొద్దు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే 'రింగ్జయిటీ' ఇన్పోమేనియా' లాంటివేవీ మీ దరికి చేరవు.
  • =========================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

How to prevent memory-loss?,జ్ఞాపక శక్తి లోపించకూడదంటే...ఏమి చేయాలి?

  •  
  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .


జ్ఞాపకశక్తి అనేది మన నిత్య జీవితంలో ప్రతి పనికి అవసరం. ఇది లోపిస్తే ప్రతి పనికి అంతరాయం. ఏదెైనా విషయం గుర్తుంచుకున్నప్పుడు వెంటనే గుర్తుకు రాకపోవడాన్ని జ్ఞాపకశక్తి లోపంగా వ్యవహరిస్తారు. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు జరిగే సంఘటనలు మెదడులోని న్యూరాన్లలో నిక్షిప్తమై ఉంటాయి. అవసరమైనప్పుడు ఆ విషయాన్ని బయటకు వెంటనే తేవడమే జ్ఞాపకశక్తి.

కారణాలు:

    సరెైన పోషక ఆహారం తీసుకోకపోవడం.
    మెదడులో కణుతులు ఏర్పడటం వల్ల మెదడుకు సోకే ఇన్‌ఫెక్షన్స్‌ వలన,
    థయామిన్‌ లోపం వలన,
    మెదడుకు ఆక్సీజన్‌, గ్లూకోజ్‌ సరిగా అందని పరిస్థితుల్లో,
    తలకు బలమైన గాయాలు తగలడం వలన,
    కొన్ని రకాల మత్తు పదార్థాలను అధికంగా వాడటం వలన (ఆల్కహాలు వంటివి),
    థెైరాయిడ్‌ లోపం,
    మానసిక ఒత్తిడికి అధికంగా గురికావడం,


    లక్షణాలు:
    సరెైన సమయంలో చదివింది గుర్తుకు రాకపోవడం.
    వస్తువులు ఎక్కడ పెట్టామో గుర్తుకు రాకపోవడం.
    కొందరు కొన్ని విషయాలు ఒకటి రెండు రోజులు తర్వాతనే మరచిపోవడం.
    కొంతమంది గృహిణులు బజారుకు వెళ్ళిన తర్వాత ఇంటికి తాళం వేసామో, లేదో, గ్యాస్‌ ఆఫ్‌ చేసామో లేదో అని ఆందోళన పడటం వంటి లక్షణాలు ఉంటాయి.

    ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు తమకు జ్ఞాపకశక్తి లోపించిదేమో అని ఆందోళన చెందడం సహజం. అలా కాకుండా చేసే పని మీద దృష్టి సారించి ఏకాగ్రతతో చేయుట భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం వలన మానసికి ఒత్తిడి లేకుండా జీవనాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తే ‘జ్ఞాపకశక్తి’ మెరుగు పడుతుంది.

    చికిత్స:
     జ్ఞాపకశక్తి లోపాన్ని నివారించడానికి అద్భుతమైన మందులు ఉన్నాయి. ఈ మందులను ఎన్నుకునే ముందు వ్యక్తి మానసిక, శారీరక అలవాట్లను పరిగణలోకి తీసుకోవాలి. అలాగే జ్ఞాపకశక్తి లోపానికి గల కారణాలెైన భయం, మానసిక ఒత్తిడి, నెగటీవ్‌ ఆలోచనలు ఉంటే వాటి నుండి బయట పడేందుకు కౌన్సిలింగ్‌ ఇప్పించాలి.
ఒమేగా-3 ఫ్యాటీయాసిడ్స్ గల ఆహారము తీసుకోవడము వల్ల జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుందని తేలింది. చేపలు ,అవిసెగింజలు వంటి వాటిలో ఒమేగా-3 ఫ్యాటీయాసిడ ఉంటాయి.
  • ========================
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Sunday, January 27, 2013

Medical tests after menopause?,మెనోపాజ్ తరువాత ఎటువంటి వైద్యపరీక్షలు అవసరము ?

  •  


ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర : మెనోపాజ్ తరువాత ఎటువంటి వైద్యపరీక్షలు అవసరము ?

జ : మెనోపాజ్ తరవాత  సర్వసాధారణము గా ఈస్ట్రోజన్‌ లెవల్స్ తక్కువ  అవడము వలన ... నీరసము , ఆయాసము , విసుగు ,నిద్రపట్టక పోవడము ఉంటాయి. ఇవన్నీ ప్రమాదకరమైనవి కావు . కొన్ని వయసు తో వచ్చే ప్రమాధకరమైన వ్యాదులను దృష్టిలో పెట్టుకోవాలి.  అవి -- >
  • పెల్విక్ పరీక్ష : దీనిలో స్త్రీ వైద్యనిపుణులు సెర్వైకల్ క్యాన్సర్ సంబంధిత తనికీలు చేస్తారు. 
  • బ్రెస్ట్ పరీక్ష : ఇందులో కూడా రొమ్ము కణితలు , గడ్డలు విషయమై పరీక్షలు చేస్తారు. 
  •  పాప్ స్మియర్ : ఏడాది కొకసారి చేయించుకుంటే మంచిది. క్యాన్సర్ జబ్బులు ముందుగానే పసిగట్టవచ్చును. 
  • మెమ్మోగ్రామ్‌ పరీక్ష : రొమ్ము క్యాన్సర్ ముందుగానే గుర్తించవచ్చును. 
  • రక్తపోటు : బి.పి. రికార్డ్ చేయడము వలన ప్రమాదకరమైన ఎన్నో ఉపద్రవాలను ఎదుర్కోవచ్చు. 
  • మదుమేహము : సుగర్  తనికీ చేయించుకుంటే సరైన సమయము లో మంచి చికిత్స పొందవచ్చు 
  • థైరాయిడ్ : ఇవి అంతగా ముఖ్యము కాకపోయినా ... బారీ కాయము గలవారు థైరాయిడ్ ఫంక్షన్‌ పరీక్షలు చేయించుకుంటే మంచిది. 
  • లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు : కొవ్వు శాతము , మంచి , చెడు కొలెస్టిరాల్ తెలుసుకోవడం వలన జీవితకాలము పొడిగించవచ్చు . 
ఇవన్నీ ముందస్తు ఆరోగ్యపరిరక్షణకోసము అవసరము . 
===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

Saturday, January 26, 2013

Young Children behave differently?, చిన్న వయస్సు పిల్లల్లో చిరాకు పరాకులు ఎందుకు కనిపిస్తాయి ?

  •  


ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : చిన్న వయస్సు పిల్లల్లో చిరాకు పరాకులు ఎందుకు కనిపిస్తాయి ? వీటిని ఎలా ఎదుర్కొనాలి ?

జ : పిల్లల్లో అవగాహన పెరిగి కొంచెం ఎదిగేకొద్దీ కోపం , అసహనం , పెంకితనం  ప్రదర్శిస్తుంటారు . తనలోని స్వతంత్ర ధోరణిని , తన అభిప్రాయాన్ని పరిగణించాలన్న దృక్పధాన్ని వ్యక్తం చేసే తొలి ప్రయత్నాల్లో భాగం ఇవి . పిల్లలకు రెండు మూడేళ్ళు దాటాక ఈ ధోరణి పెరుగు తుంటుంది. అందరూ ఒకేమాదిరి ఉండాలని కూడా ఏం లేదు .

పిల్లల టెంపర్మెంట్ ను బట్టి వారి ధోరణి మారుతుంటుంది . వారి నోటివెంట " నో ' అనే వ్యతిరేక పదం ఎక్కువ సందర్భాలలో వినబడుతుంది. ఆకలి , అలసట , నిద్ర , తమను పట్టించుకోవడం లేదన్న భావం ఎక్కువగా ఉన్నప్పుడు వారిలో ఈ ధోరణి మరింత గా బయటపడుతుంటుంది. కొందరు మరీ సున్నితము గా ఉంటారు.  మార్పును సులువు గా జీర్ణించుకోలేరు . ఇటువంటి వారిని జాగ్రత్త గా టాకిల్ చేయాలి . వారు వ్యతిరేక పంధాలో ఉన్నప్పుడు పెద్దలూ అదే మొండివైకరి ప్రదర్శిస్తే లాభం ఉండదు. బుజ్జగింపు అవసరమవుతుంది.  ఒక్కోక్క సారి విపరీతంగా ప్రవర్తించినప్పుడు ... వారేదైనా ఒత్తిడికి గురి అవుతున్నారేమో గమనించాలి.
  • =========================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

Friday, January 25, 2013

ముఖం మీద తెల్లని ప్యాచ్ ఎందువల్ల అయివుంటుంది ?, Cause for white patch on the face skin?

  •  
  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : మా పాప వయసు 11 సంవత్సరాలు . ముఖం మీద తెల్లని ప్యాచ్ కనబడుతుంది . ఎందువల్ల అయివుంటుంది ?

జ : తెల్లని , రంగు నెరసిన చర్మపు మచ్చలన్నీ .. బొల్లి , కుష్టు , సోరియాసిస్ ... రోగాలకే పరిమితం అని భావించకూడదు . ముఖము పై తెల్లని మచ్చలు పొడి చర్మము వల్ల రావచ్చు. ఇతర అనారోగ్య కారణాలు వల్లా కావచ్చు . ఒక నెల రోజులు పాటు " అలెవెరా " అధారిత జెల్ క్రీములను వాడండి . మారుపు ఉందేమో గమనించండి . ఏ మాత్రము తేడా లేకపోతే అది సోరియాసిస్ అయివుండవచ్చును . మంచి స్కిన్‌ స్పెషలిస్ట్ ని సంప్రదించండి.
  • ===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

శరీరంపై దురదతో కూడిన దదుర్లు వస్తున్నాయిఎలాంటి చికిత్స తీసుకోవాలి?,Treatment for skin allergy

  •  
  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : మా బాబు వయస్సు ఐదు సంవత్సరాలు. ప్రతిరోజు సాయంత్రం శరీరంపై దురదతో కూడిన దదుర్లు వస్తున్నాయి. వీటి నుంచి నీరు కారుతుంది, మాడి పోయిన తరువాత నల్లని మచ్చలుగా మిగిలిపోతున్నాయి. చేతులపై, కాళ్ళపై ఎక్కువగా ఉన్నాయి. ఇందుకు కారణం ఎమిటీ? ఎలాంటి చికిత్స తీసుకోవాలి?


జ : మీ బాబుకు వచ్చిన చర్మవ్యాధిని పాపులార్‌ అర్టికేరియా అంటారు. సాధారణంగా ఇది చిన్నపిల్లల్లో వచ్చే మాములు చర్మరుగ్మత. చర్మం అలర్జికి గురైనప్పుడు వచ్చే రియాక్షన్‌. దీని గురించి మీరు దిగులు పడాల్సింది ఏమి లేదు. దోమకుట్టినా, ఏదైన క్రిములు కుట్టినా ఈ విధంగా వళ్ళంతా వస్తుంది. యాంటిఇస్టమిన్స్‌ - తో వీటిని నయం చేయవచ్చును .  దోమల నుంచి రక్షణ ఉండాలి. యాంటి ఎలెర్జిక్ కెలెమిన్‌ లోషన్స్‌ కాళ్ళుచేతులకు అప్లైచేయాలి. దోమలు కుట్టకుండా జాగ్రత్త పడాలి.

  • =========================== 

visit my website - > Dr.Seshagirirao-MBBS -

Thursday, January 24, 2013

can we reduce weight on stoping breakfast?,బ్రేక్ ఫాస్ట్ మానేస్తే బరువు శీఘ్రం గా తగ్గుతారా?



  •  

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : బ్రేక్ ఫాస్ట్ మానేస్తే బరువు శీఘ్రం గా తగ్గుతారని ఓ మిత్రుడు సలహా ఇచ్చాడు . ఎంతవరకు నిజము ?

జ : బరువు తగ్గడము కోసము బ్రేక్ ఫాస్ట్ మానేసి స్ట్రెయిన్‌ అవ్వడము సరియైన ప్రక్రియ కాదు . మంచి పోషకాలతో నిండిన బ్రేక్ ఫాస్ట్ ముందుగా తిని తర్వాత ఒక గంట ,,, గంటన్నర పాటు వర్కవుట్లు చేస్తే మంచిది. మనకి ఆహారము నుండి ఎనర్జీ అవసరము ... లేనట్లయితే మజిల్ లాస్ అవుతుంది. బరువూ పెరుగుతారు. బ్రేక్ ఫాస్ట్ తినకపోతే మెదడు స్టార్వేషన్‌ సిగ్నల్స్ పంపుతుంది. ఫలితముగా కొవ్వునిల్వలు పేరుకు పోతాయి. రోజూ మొత్తం ఆహారములో బ్రేక్ ఫాస్ట్ మానేయడము సరైన ఆలోచన కాదు . రాత్రంతా ఖాలీ కడుపుతో ఉండి ... తెల్లవారుతునే వర్కవుట్లు చేసి ఉపాహారము మానేయడము వల్ల లాభాలు కంటే నస్టాలే ఎక్కువ ఉంటాయి.
  • =========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Monday, January 21, 2013

Infertility ,pree mature overian failure, సంతానలేమి.

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును. ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
  •  
 ప్ర : నాకు 30 ఏళ్ళు రెండేళ్ళ క్రితం వరకూ ఋతుక్రమము ఖచ్చితము గా వచ్చేది. తర్వాత ఇర్రెగ్యులర్ గా అయి పూర్తిగా ఆగిపోయాయి. పరీక్షలు చేయించుకున్నాను. నా ఓవరీలు సాధారణము గా పనిచేయడము లేదని వైద్యులు తెలిపారు. గత నాలుగేళ్ళుగా గర్భం కోసము ప్రయత్నిస్తున్నా. ఏదైనా మార్గము ఉందా? .

జ : బహుశా మీకు "ప్రీమెచ్యూర్ ఓవేరియన్‌ ఫయిల్యూర్ (premature overian failure)" కావచ్చు . కొందరు మహిళలకు పరిమిత సంఖ్యలో అండాలుంటాయి. ఇవి ఎగ్జాస్ట్ అయ్యాక ఓవరీల పనితీరు ఆగిపోతుంది. మీకు కొన్ని హార్మోనల్ , జెనెటికల్ పరీక్షలు అవసరము . మంచి సంతానసాఫల్య కేంద్రాన్ని సంప్రదించండి . అప్పుడే మీ పరిస్థితికి కారణము గుర్తించే వీలుంటుంది. డోనర్ ఎగ్ .. మీ భర్త వీర్యము ద్వారా " ఐ.వి.ఫ్." పద్దతిలో మీరు గర్భము దాల్చే ఏకైక మార్గము ఉంది. ఇది సంతృప్తికరమైన పరిష్కారము .
  • =========================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

Saturday, January 12, 2013

Is there any timings for fruit eating?,పండ్లు పలానా సమయములోనే తినాలన్న నియమాలు ఏమైనా ఉంటాయా?

  •  
  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : పండ్లు పలానా సమయములోనే తినాలన్న నియమాలు ఏమైనా ఉంటాయా?

జ : పండ్లు గొప్పా డిటాక్సిఫైయింగ్ పదార్ధాల జాబితాలొకి వస్తాయి. సహజ చెక్కెర్లను చక్కగా సరఫరా చేస్తాయి. సరైన మార్గములో పండ్లు తిన్నాప్పుడు శరీరానికి ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చిపెడతాయి. రోజులో మూడు సార్లుగా పండ్లు తింటుంటే శరీరమ్లోని విషతుల్యాల్ని వెలికి నెట్టేసి , జీర్ణవ్యవస్థను నెమ్మదింపచేయడములో సహకరిస్తాయి. ఖాళీ కడుపుతో పండ్లు తిన్నప్పుడు ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. రోజులో ఏసమయములోనైనా ఇలా తినవచ్చు .

పండ్లు తిన్నాక మరే ఇతర పదార్ధాలు తినడానికైనా అరగంట వ్యవధి ఇవ్వాలి. భోజనము తిన్నట్లైతే పండ్లు తినడానికి 3 గంటలు ఆగాలి. అంటే పండ్లు తినే ముందు ఆహారము జీర్ణము కావాలన్నమాట . రాత్రంతా జీర్ణవ్యవస్థ విశ్రాంతిలో ఉంటుంది కాబట్టి ఉదయమే పండ్లు తినడము మంచి ఆప్షన్‌ .

పండ్లు ఇతర పదార్ధాలతో కలిపి తినవద్దు . భోజనము తరువాత కాకుందా ముందుగానే తినాలి. పోషకాలు బాగా అందుతాయి... మరియు తినే అన్నము కూడా తగ్గుతుంది. అరటిపండు , ఆవకాడో వంటి హెవీ పండ్లు  మధ్యాహ్నము భోజనానికి , సాయంత్రం బ్రేక్ ఫాస్ట్ కి  నడుమ తినడము వల్ల జీర్ణవ్యవస్థకి బాగా పనిచేస్తుంది.  క్యాన్‌డ్ , ఫ్రోజన్‌ , ప్రా్సెస్డ్  పండ్లు తినవద్దు . వీటిలో చెక్కెరశాతము , ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యానికి మంచిది కాదు . పండ్లరసాలు ఇస్టపడేవారు తాజాగా తీసిన రసాలు మాత్రమే తాగాలి. క్యాన్లలో నిలవా ఉంచినవి మంచిది కాదు . జూస్ కంటే తాజా పండు జాయిగా తింటే పీజుపధార్ధము ఎక్కువగా ఉండి ఆరోగ్యానికి మంచిది.
  • =========================== 

 visit my website - > Dr.Seshagirirao-MBBS -

Wednesday, January 9, 2013

Whitening(graying) of hair - నా జుట్టు నెరుస్తుంది (తెల్లబడుతుంది) ఏమిచెయ్యాలి?

  •  
  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

1. ప్ర ; నేను 20-25 సం. మధ్యలో ఉన్నా ఇప్పుడే నా జుట్టు నెరుస్తుంది (తెల్లబడుతుంది) తెల్లబడకుండా ఉండాలంటే ఏమిచెయ్యాలి?

జ : వెంటుకల ఎదుగుదల దశలో మెలనిన్‌ సింథసిస్ తో జుట్టు కుదుళ్ళ పిగ్మెంటేషన్‌ అనుసంధానమై ఉంటుంది. మనము 40 లోకి వచ్చేదాకా పిగ్మెంట్స్ రీసైక్లింగ్ ప్రభావవంతము గా ఉంటుంది. వారసత్వ లక్షణాలు, హైపర్ / హైపో థైరాయిడ్ వంటి  ఆటో ఇమ్యూన్‌ పరిస్థితులు జుట్టు త్వరితము గా తెల్లబడడానికి దారితీస్తాయి.  దెర్మటాలజిస్ట్ ను సంప్రదించిన తర్వాత ' కాల్సియంపెంటొథెనేట్  " ఓరల సప్లిమెంటేషన్‌ ద్వారా కొంత ప్రయోజనం ఉంటుంది. తెల్లజుట్టును పీకవద్దు . మరీ ఎక్కువగా ఉంటే వెజిటబుల్ , మెటాలిక్ డైయిలు వాడండి . ఒక సారి వచ్చేసిన తెల్ల వెంట్రుకల్ని ఏం చేయలేము ... ఇకపై రాకుండా లేదా వేగం తగ్గించడానికి మాత్రమే చర్యలు తీసుకోగలము .

జుట్టు నెరుస్తోంటే.. చికిత్సలున్నాయా?

  2. ప్ర  :  నా వయసు ముప్ఫైలోపే. కానీ ఇప్పుడే జుట్టు నెరవడం మొదలైంది. ఈ సమస్య రోజురోజుకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. నా జుట్టు మళ్లీ నల్లగా అవుతుందా లేక రంగు వేసుకోవాల్సిందేనా? మునుపటిలా నల్లగా అయ్యేందుకు సహజపద్ధతులు ఏవైనా పాటించొచ్చా. ఈ మధ్య వెజిటబుల్‌ డైల గురించి విన్నా. అవి ఎక్కడ దొరుకుతాయి. వాటిని వాడటం వల్ల సమస్యలేమైనా ఉంటాయా?
  

A : జుట్టు తెల్లగా అవుతోందనగానే ఏదో రంగు వేసుకోవడం ఆ సమస్యకు పరిష్కారం కాదు. ముందు దానికి అసలైన కారణం తెలుసుకోవాలి. సాధారణంగా విటమిన్‌ బి12 లోపం వల్ల ఇలా కావచ్చు. అలాగే గాఢత ఎక్కువగా ఉన్న షాంపూలు.. అంటే చాలా షాంపూల్లో పీహెచ్‌ 13, 14 అంతకన్నా ఎక్కువగా ఉన్నవి వాడినప్పుడు వాటిలోని రసాయనాల వల్ల జుట్టు నెరుస్తుంది. నేరుగా తగిలే ఎండా, ఐఫోన్లూ, కంప్యూటర్ల నుంచి వచ్చే రేడియేషన్‌ వల్లా, జన్యుపరంగా, బొల్లి లాంటి సమస్య ఉన్నప్పుడు కూడా జుట్టు త్వరగా రంగు మారుతుంది.

చిన్న వయసులోనే ఈ సమస్య వస్తే గనుక దాన్ని నివారించేందుకు ప్రత్యేకమైన క్యాల్షియం పాంటోథినేట్‌ మాత్రలు ఉంటాయి. వాటిని నిపుణుల సలహా మేరకు వాడాలి. అలాగే మరికొన్ని హెయిర్‌జెల్స్‌ ఉంటాయి. వాటిని గనుక వాడుతుంటే కొన్నినెలలకు జుట్టు మళ్లీ నల్లగా మారుతుంది. అయితే సమస్యను ఎంత త్వరగా గుర్తిస్తే చికిత్స అంత సులువవుతుంది. లేదంటే తలకు రంగు వేసుకోవడమే పరిష్కారం అవుతుంది. అవి కూడా ఏవి పడితే అవి కాకుండా అమోనియా, పీపీడీ లేని రంగుల్ని ఎంచుకోవాలి. ఎందుకంటే వాటి వల్ల ఇతర చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అవి కొందరికి పడకపోవచ్చు కూడా! అందుకే ఈ రెండు లేని ప్లాంట్‌ ఎక్స్‌ట్రాక్ట్‌ వెజిటబుల్‌ డైలని ఎంచుకుంటే మంచిది. ఇవి మందుల దుకాణాల్లో దొరుకుతాయి. అవి శాశ్వత రంగులే కానీ వాటిని జీవితాంతం తగిన జాగ్రత్తలతో వాడాల్సి ఉంటుంది.

అంతకన్నా ముందు మీరు వైద్యుల సలహా తీసుకుంటే మీ సమస్యకు అసలైన కారణం తెలుస్తుంది. సమస్యను బట్టి ఏ మందులు వాడాలనేది వాళ్లే సూచిస్తారు.
  •  ==================================
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Tuesday, January 8, 2013

Does smoking effect skin color?,స్మోకింగ్ వలన చర్మము ప్రభావితం అవుతుందా?


  •  



  •  

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : స్మోకింగ్ వలన చర్మము ప్రభావితం అవుతుందా? తెలియజేయండి ?

జ : ఖచ్చితము గా ప్రభావితం అవుతుంది . స్మోకింగ్ చర్మానికి పోషకాలు , ఆక్షిజన్‌ సరఫరా చేసే రక్తనాళాలను కుంచింపజేస్తుంది. దీనివల్ల చర్మము " హైఫోక్షియా" అనే దశకు చేరుతుంది. ఒక్క సిగరెట్ స్మోకింగ్ చర్మ రక్తనాళాలను దాదాపు ఓ గంటపాటు కుచింపజేయగలదు .

సాధారణముగా స్మోకర్లు  ప్రతి గంటా రెండు గంటలకు ఓ సిగరెట్ తాగుతుంటారు. కాబట్టి పొగతాగే వారి చర్మము దాదాపు రోజంతా హైపోక్షిక్ అవుతుంది .ఇలా కొన్నాళ్ళు గడిచేకొద్దీ చర్మము మెరుపును మృదుత్వాన్ని కో్ల్పోతుంది. స్మొకింగ వల్ల ఉత్పత్తి అయ్యే హైపోక్సియా వల్ల చర్మము కొలాజెన్‌ , ఎలాస్టిన్‌ పైబర్లకు కూడం నష్టము జరుగుతుంది . చర్మము మందము తగ్గిపోయి ఎలాస్టిసిటి కోల్పోతారు. పొగతాగే వారి చర్మము పొగతాగనివారి చర్మము కంటే 25 శాతము పల్చగా ఉంటుంది. పల్చని చర్మము నెమ్మదిగా సాగిపోవడము మొదలు పెట్టి 5 ఏళ్ళు ఎక్కువ వయసు పైబడిన వారిలా కనబడుతారు. చర్మము హీలింగ్ , పునరుజ్జీవ శక్తులు కూడా ప్రభావితము అవుతాయి. పొగతాగే వారికి గాయాలు , పుళ్ళు నెమ్మదిగా నయమవుతాయి. గోళ్ళు , పెదాలు నల్ల బడతాయి. నికొటిన్‌ వేళ్ళు  పసుపు బారినట్లు ఉంటాయి. సోరియాసిస్ , లెగ్ అల్సరేషన్‌ సమస్యలు ఇటువంటివారికి ఎక్కువ .
  •  ===========================
visit my website - > Dr.Seshagirirao-MBBS

Monday, January 7, 2013

Do more sleep good for health?,హాయిగా నిద్ర పోతే ఆరోగ్యమంటారు . అదెలా?

  •  

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర : హాయిగా నిద్ర పోతే ఆరోగ్యమంటారు . అదెలా?

జ : నిద్ర లేచి పలురోగాలకు కారణమవుతుంది. అలాగని బద్దకముగా అదే పనిగా నిదుర పోరాదు . ఏదైనా అతిగా చెయ్యడము అనర్ధమే కదా! నిద్రలెకపోతే ఏమవుతుంది ... మహా అయితే మరునాడు కునిపాట్లు తప్పవు అనుకుంటే పొరపాటే . రోజుకి సరాసరి 8 గంటలు నిద్ర పోవాలి. ఇది మెదడుకు విశ్రాంతి నిచ్చి దాని పనితములో చురుకుతనము పెంపొందిస్తుంది.

నిద్ర చాలి నంత లేకపోవడము వల్ల జీర్ణవ్యవస్థ క్రమబద్దీకరణ , గ్లూకోజ్ మెటబాలిజం , రక్తపోటు , మధుమేహము వంటి ముఖ్యమైన శారీరక పనితీరు ప్రభావితమువుతుందని చికాగో పరిశోధకులు పేర్కొన్నాయి. నిద్రపై ప్రయోగాత్మక , పరిశీలనాత్మక  అధ్యయనాలు జరిపి ఈ విషయాన్ని గుర్తించారు.  ఆరు గంటలకంటే తక్కువ సేపు నిద్రపోవడము వల్ల బాడీమాస్ ఇండెక్ష్ (BMI) , స్థూలకాయము పెరుగుతుందని లేలింది. చాలినంత నిద్రలేకపోవడము వల్ల " ఘ్రెలిన్‌ " అనే హార్మొనులు ఉత్పత్తి ప్రభావితం అవుతాయని తేలినది . దీనివలన ఆకలి పెరుగు తుంది . ఫలితముగా ఆహారము అధికము గా తీసుకోవడము... బరువు పెరగడము జరుగుతాయి.

నిద్ర లేమి వల్ల గ్లూకోజ్ మెటబాలిజం అసంబద్ధత , రక్తపోటు  పెరుగుతాయి. ఈ ప్రబావాలు పిల్లలలోనూ , యుక్తవయస్కులలోనూ ఎక్కువగా కనిపిస్తాయి. అర్ధరాత్రి వరకు నిద్రలేకుండా టి.వి లు చూసేవారు  , కంఫ్యూటర్లు పైన పనిచేసేవారు ఎక్కువగా గురు అవుతారు.

  • ===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

Can Diseases be cured by Laughter?,నవ్వుతో రోగాలు నయవవుతాయంటారు .నిజమేనా?

  •  


ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : నవ్వుతో రోగాలు నయవవుతాయంటారు .నిజమేనా?

జ : నవ్వు నాలుగువిధాలుగా చెడు అని పూర్వము అనేవారు. ఇప్పుడు నవ్వు నాలుగు విధాలుగా మంచి అని అంటున్నారు . ఏది ఎప్పుడు ఎలా మారుతుందో కాలమే నిర్ణయిస్తుందు. నలుగురి తో కలిసి కబుర్లు చెప్తూ నవ్వుతూ ఉండే వారిలో " endorphins "అనే హార్మోణులు దండిగా ఉత్పత్తి అవుతాయి . ఇవి ఆరోగ్యానికి మంచిది. .
నవ్వుతో లాభాలెన్నెన్నో..
  • నవ్వు  మంచి మందులా పనిచేస్తుందని, తరచుగా నవ్వుతూ గడిపేవాళ్లు మరింత ఆరోగ్యంగా ఉంటున్నట్టు పరిశోధనలు కూడా నొక్కి చెబుతున్నాయి. ఇంతకీ నవ్వినపుడు మన శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? ముఖంలోని కండరాలతో పాటు శరీరంలోని అన్ని కండరాలు సాగుతాయి. నాడి కొట్టుకోవటం, రక్తపోటు పెరుగుతుంది. శ్వాస వేగంగా తీసుకుంటాం. దీంతో మెదడుకు, కణజాలానికి ఆక్సిజన్‌ మరింతగా సరఫరా అవుతుంది. ఫలితంగా నిరుత్సాహం మాయమై హుషారు పుట్టుకొస్తుంది. నవ్వు చూపే ప్రభావాలపై చాలా పరిశోధనలు జరిగాయి. వాటిల్లో బయటపడ్డ వివరాలేంటో చూద్దాం.

* నవ్వు తేలికపాటి వ్యాయామంతో సమానంగా లాభాలు చేకూరుస్తున్నట్టు వెల్లడైంది. 10-15 నిమిషాల సేపు నవ్వితే 50 కేలరీలు ఖర్చవుతున్నట్టూ బయటపడింది.

* నవ్వు మూలంగా రక్తనాళాల సంకోచ, వ్యాకోచాలు తేలికగా జరుగుతున్నట్టు మేరీల్యాండ్‌ విశ్వవిద్యాలయం అధ్యయనంలో బయటపడింది. ఇలా రక్తప్రసరణ మెరుగుపడటానికి నవ్వు తోడ్పడుతుందన్నమాట.

* నవ్వు ఇన్‌ఫెక్షన్లతో పోరాడే యాంటీబోడీల స్థాయులు పెరగటానికి తోడ్పడుతున్నట్టు, రోగనిరోధక కణాల మోతాదులనూ పెంచుతున్నట్టు ఒక అధ్యయనంలో వెల్లడైంది.

* భోజనం చేసిన తర్వాత హాస్య సన్నివేశాలను చూసిన మధుమేహుల రక్తంలో గ్లూకోజు స్థాయులు తగ్గినట్టు ఒక అధ్యయనంలో బయటపడింది.

* స్పాండిలైటిస్‌ సమస్యతో బాధపడేవారు పది నిమిషాల సేపు హాస్య సన్నివేశాలతో కూడిన సినిమాలను చూస్తే రెండు గంటల పాటు నొప్పి లేకుండా హయిగా నిద్రపోయినట్టు మరో అధ్యయనం పేర్కొంటోంది.

* ధ్యానం మాదిరిగానే నవ్వు కూడా మెదడులో గామా తరంగాలను ప్రేరేపిస్తున్నట్టు లోమా లిండా విశ్వవిద్యాలయం అధ్యయనంలో బయటపడింది. మెదడులోని అన్ని భాగాల్లోనూ కనబడేవి ఒక్క గామా తరంగాలే. అంటే ధ్యానం మాదిరిగానే నవ్వు కూడా మెదడులోని అన్ని భాగాలపైనా ప్రభావం చూపుతుందన్నమాట.

ఆసుపత్రిలో ఉన్నవారికి పరామర్శించిరావడము మన సమంజము సాంప్రదాయము . విదెశాలలో అది కుదరదు. రోనిని కలిసేందుకు అనుమతించరు. చూడడానికి వచ్చేవారు అంటురోగాలు తెస్తారన్నది వారి భయము . బందుమిత్రులు వచ్చి పలకరైంచడము వల్ల రోగికి ఒక విధమైన మనోధైర్యము వస్తుందనేది మన నమ్మకము . ఇప్పుదు మన పద్దతే సరియైనదని అంటున్నారు.  హాస్పిటల్ లో విజిటర్స్ తాకిసి పెద్ద సమస్యే అయినప్పటికీ బందుమిత్రులు వచ్చి  చెప్పే కబుర్లు  , వారిలో కొందరైనా తెప్పించే నవ్వుల వల్ల రోగులు త్వరగా కోలుకుంటారని తేలింది .
  •  ===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

Lazyness reduce your lifespan?, బద్దకం ఆయుక్షీణమా?

  •  
  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : బద్దకము ఆయుక్షీణమంటారు . వివరించగలరు?

జ : ఏపనీచేయకుండా బద్దకము పెంచుకునేవారికి ఆయుర్ధాయము తగ్గిపోతుంది. మానవులను త్వరగా మరణించేలా చేస్తూన్న అంశాలలో .. స్మోకింగ్ , ఆల్కహాల్ సరసన  ఇప్పుదు బద్దకము కూడా చేరింది . ఎతువంటి శారీరకవ్యాయామము చెయ్యక బద్దకము గా బతకడము వల్ల ఏటా 53  లక్షల మంది మరణిస్తున్నారు. మనిషి  శారీరకము గా కష్టపడాలి. కాని చాలా మంది కష్టపడడానికి ఇష్టపడరు. ఫలితముగా కొవ్వు పేరుకుపోయి  పొట్టలు పెరుగుతున్నాయి. భారీకాయముతో డయాబెటిక్ , గుండె సంబంధిత వ్యాదులు తెచ్చుకుంటున్నారు .

కాబట్టి పతిరోజూ క్రమము తప్పకుండా 30 నుండి 40 నిముషాలు ఏదో ఒక రకమైన వ్యాయామము చేయాలి. నడక , సైక్లింగ్ , గార్డెనింగ్ , అనేక రకాలైన ఆటలు వంటివి చేస్తూఉండాలి . మానవులకు... కాదు కాదు   ప్రతి జీవికి జరా-మరణాలు తప్పవు . ఆ రెండింటి మధ్యకాలము లో ఆరోగ్యముగా బ్రతకాలంటే శారీరక శ్రమ అవసరము . జంతువులు తమ ఆహారము కోసము  నిరంతరము శ్రమపడుతూనే ఉంటాయి. కావున వాటికి ప్రత్యేకముగా శారీరక శ్రమకోసము కొంత టైం అంటూ కేటాయించనవసము లేదు .
  •  =========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Sunday, January 6, 2013

కూరగాయలు ఉడికిస్తే పోషకాలు కోల్పోతాయంటారు?, vigetablels loose nutrients on cooking is true?

  •  
  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : కూరగాయలు ఉడికిస్తే పోషకాలు కోల్పోతాయంటారు . ఎంతవరకు నిజము ?

జ : కూరగాయలు ఉడికించె సమయములో నీటిలొ కరిగే పోషకాలు  విటమిన్‌ బి, సి , లు వంటివి కొంత శాతము వరకు మాత్రము కోల్పోతాయి. అయితే వండడము వల్ల బీటా కెరోటీన్‌ , లైకోఫెన్‌ వంటి వాటిని యీజీగా గ్రహించ గలుగుతాము . పోషకాలు ఎక్కువగా ఉండాలంటే వండే సమయాన్ని తగ్గించాలి.
===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -