Wednesday, January 30, 2013

What is Rinxiey and infomania?,రింగ్జయిటీ ...ఇన్ఫోమేనియా అంటేఏమిటి?

  •  
  • image : courtesy with Prajasakti news paper

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము . 


    ఇది యువతీ యువకుల్లో విస్తరిస్తున్న ఒకరకమైన మానిసిక రుగ్మత-అవును ఫోన్‌కాల్సూ, ఎస్‌ఎమ్సెస్‌లూ వ్యక్తుల్లో మానసిక బలాన్నో, బలహీనతనో కలిగిస్తున్నాయి. అంటే ఆధునిక సమాచార స్రవంతిలో పాజిటివ్‌, నెగెటివ్‌ అంశాలు కూడా వ్యక్తుల్ని, ముఖ్యంగా యువతను ప్రభావితం చేస్తున్నాయి. ప్రస్తుతం సెల్‌ఫోన్‌ అదే చేస్తోంది. ఇది కేవలం సమాచార వారధిగానే గాక యువతలో 'రింగ్జయిటీ', 'ఇన్ఫోమేనియా' లాంటి మానసిక బలహీనతలకు దారితీస్తోంది. నగరాల్లోని, పట్టణాల్లోని యువతే దీనికి ఎక్కువగా ప్రభావితమౌతోంది.

ఏదో ముఖ్యమైన పని మీదుంటారు. అయినా 'బాడీ ప్రెజెంట్‌ మైండ్‌ ఆప్సెంట్‌ అన్నట్లు మీ మనసు మాత్రం అక్కడుండదు. మళ్లీ... మళ్లీ ఎవరైనా ఫోన్‌ చేస్తారేమోనని సెల్‌వైపే చూస్తుంటారు. అనుకోకుండా రింగైనట్లు అనిపిస్తుంది. చూసే సరికి ఏదీ ఉండదు. ఇలాంటి ఫీలింగ్‌ గనుక కలిగిందంటే అది తప్పక 'రింగ్జయిటీ' అనే రుగ్మతే అంటున్నారు మానసిక నిపుణులు . యువత గంటల తరబడి మాట్లాడుకోవడంవల్ల, ఇష్టమైన వ్యక్తులు (స్నేహితులు, లవర్స్‌) ఫోన్‌చేసి ఎక్కువ సేపు ముచ్చటించుకోవటంవల్ల క్రమంగా ఇదొక బలహీనతగా మారుతోంది. చివరికీ ఎవ్వరూ ఫోన్‌ చేయకపోయినా చేస్తారేమోనన్న ఫీలింగ్‌ను కలిగిస్తుంది. దీనివల్ల ఏకాగ్రత లోపించడం, నిద్రలేమి వంటి సమస్యలూ ఎదురౌతున్నాయి. ముఖ్యంగా చదువుకునే వాళ్లు ఎక్కువగా డిస్టర్బ్‌ అవుతున్నారు. ఇదొక ఫాంటమ్‌ రింగింగ్ సిండ్రోం . మన చెవులకు శబ్దాలు వినే సెన్సిటివ్ సామర్ధ్యము 1000 నుండి 6000 హెర్ట్ జ్ మధ్యలో ఉంటుంది . రోజులో ఇంతకు మించి చెలువు వింటే  దాని సామర్ధ్యము లో  ఎచ్చుతగ్గులు వస్తాయి. వినికిడి లోపాలు ఏర్పడతాయి.

ఉదాహరణ :
''ఎప్పుడూ చలాకీగా ఉండే అమ్మయి  సెల్‌ కొన్నప్పట్నించీ తెగ బిజీ ఐపోయింది. ఫ్రీగా మాట్లాడట్లేదు. సీరియస్‌గా మొహం పెట్టి ఎప్పుడూ ఎస్సెమ్మెస్‌లు చదువుతూ, పంపుతూ ఉంటుంది'' తన కూతురు గురించి ఓ తల్లి చెప్పిన మాటలివి. అంతేకాదు సాయంకాలం రాగానే స్నానంచేసి ఫ్రెష్‌ అయి చదువుకునే తను సెల్‌ఫోన్‌ పట్టుకుని కూర్చుంటుందని ఆవేదన వ్యక్తం చేసింది. అవును మరి ఎస్సెమ్మెస్సా మజాకా! ఎందుకలా అని అమ్మాయిని అడిగితే ''ఫ్రెండ్స్‌ చిలిపి ఎస్సెమ్మెస్‌లు పంపుతుంటారు. రిప్లరు ఇవ్వొద్దూ'' అంటోందామె. అప్పుడప్పుడూ సరదాకు ఇలాంటివి చేయొచ్చునేమోగానీ అదే పనిగా ఎస్సెమ్మెస్‌ల బిజీలో మునిగిపోవడమేంటి? కొందరైతే ఎప్పుడెప్పుడు ఎస్సెమ్మెస్‌ వస్తోందా? ఎప్పుడు రిప్లరు ఇద్దామా అనే ఆలోచనతో ఉంటారు. కొన్నిసార్లు ఎవరూ పంపకపోయినా బీప్‌మని శబ్దం వచ్చినట్లు అనిపించి ఫోన్‌ తీసి చూస్తారు. ఒకటికి రెండుసార్లు ఇలా చేస్తున్నారంటే అది తప్పక 'ఇన్‌ ఫోమేనియా'నే అంటున్నారు మానసిక నిపుణులు. అదొక బలహీనతగా మారి యువత చదువుకూ, పనికీ, లక్ష్యానికీ ఆటంకం కల్పిస్తోంది.

 ప్రయివేటు కంపెనీల ఎస్సెమ్మెస్‌ల ఆఫర్లకు యువతీ యువకులు ఆకర్షితులౌతున్నారు. చిలిపి ఎస్సెమ్మెస్‌లూ, రొమాంటిక్‌ ఎస్సెమ్మెస్‌లూ, సరదా ఎస్సెమ్మెస్‌లూ, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌కు సంబంధించిన కొటేషన్సూ, స్ఫూర్తినిచ్చే కొటేషన్సూ, వివిధ ఆనందకరమైన సందర్భాల్లో కృతజ్ఞతలూ సహజమేమో కానీ, అవి శృతిమించితేనే ప్రమాదం. ప్రస్తుతం యువతలో ఈ అతి పోకడలు కనిపిస్తున్నాయి. రొమాంటిక్‌ ఎస్సెమ్మెస్‌ల వల్లో పడి చదువు పాడు చేసుకుంటున్నారు. ఏకాగ్రత లోపంతో, నిద్ర లేమితో బాధ పడుతున్నారు. మానసిక బలహీనతకు గురౌతున్నారు. ఇలాంటి అవకాశం మీరు రానీయకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

*అప్పుడప్పుడూ సరదా ఎస్సెమ్మెస్‌లూ, కాల్సూ తప్పుకాదు. కానీ అదే పనిగా వాటికి ప్రభావితం కావొద్దు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే 'రింగ్జయిటీ' ఇన్పోమేనియా' లాంటివేవీ మీ దరికి చేరవు.
  • =========================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.