Monday, January 7, 2013

Lazyness reduce your lifespan?, బద్దకం ఆయుక్షీణమా?

  •  
  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : బద్దకము ఆయుక్షీణమంటారు . వివరించగలరు?

జ : ఏపనీచేయకుండా బద్దకము పెంచుకునేవారికి ఆయుర్ధాయము తగ్గిపోతుంది. మానవులను త్వరగా మరణించేలా చేస్తూన్న అంశాలలో .. స్మోకింగ్ , ఆల్కహాల్ సరసన  ఇప్పుదు బద్దకము కూడా చేరింది . ఎతువంటి శారీరకవ్యాయామము చెయ్యక బద్దకము గా బతకడము వల్ల ఏటా 53  లక్షల మంది మరణిస్తున్నారు. మనిషి  శారీరకము గా కష్టపడాలి. కాని చాలా మంది కష్టపడడానికి ఇష్టపడరు. ఫలితముగా కొవ్వు పేరుకుపోయి  పొట్టలు పెరుగుతున్నాయి. భారీకాయముతో డయాబెటిక్ , గుండె సంబంధిత వ్యాదులు తెచ్చుకుంటున్నారు .

కాబట్టి పతిరోజూ క్రమము తప్పకుండా 30 నుండి 40 నిముషాలు ఏదో ఒక రకమైన వ్యాయామము చేయాలి. నడక , సైక్లింగ్ , గార్డెనింగ్ , అనేక రకాలైన ఆటలు వంటివి చేస్తూఉండాలి . మానవులకు... కాదు కాదు   ప్రతి జీవికి జరా-మరణాలు తప్పవు . ఆ రెండింటి మధ్యకాలము లో ఆరోగ్యముగా బ్రతకాలంటే శారీరక శ్రమ అవసరము . జంతువులు తమ ఆహారము కోసము  నిరంతరము శ్రమపడుతూనే ఉంటాయి. కావున వాటికి ప్రత్యేకముగా శారీరక శ్రమకోసము కొంత టైం అంటూ కేటాయించనవసము లేదు .
  •  =========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.