Monday, January 7, 2013

Can Diseases be cured by Laughter?,నవ్వుతో రోగాలు నయవవుతాయంటారు .నిజమేనా?

  •  


ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : నవ్వుతో రోగాలు నయవవుతాయంటారు .నిజమేనా?

జ : నవ్వు నాలుగువిధాలుగా చెడు అని పూర్వము అనేవారు. ఇప్పుడు నవ్వు నాలుగు విధాలుగా మంచి అని అంటున్నారు . ఏది ఎప్పుడు ఎలా మారుతుందో కాలమే నిర్ణయిస్తుందు. నలుగురి తో కలిసి కబుర్లు చెప్తూ నవ్వుతూ ఉండే వారిలో " endorphins "అనే హార్మోణులు దండిగా ఉత్పత్తి అవుతాయి . ఇవి ఆరోగ్యానికి మంచిది. .
నవ్వుతో లాభాలెన్నెన్నో..
  • నవ్వు  మంచి మందులా పనిచేస్తుందని, తరచుగా నవ్వుతూ గడిపేవాళ్లు మరింత ఆరోగ్యంగా ఉంటున్నట్టు పరిశోధనలు కూడా నొక్కి చెబుతున్నాయి. ఇంతకీ నవ్వినపుడు మన శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? ముఖంలోని కండరాలతో పాటు శరీరంలోని అన్ని కండరాలు సాగుతాయి. నాడి కొట్టుకోవటం, రక్తపోటు పెరుగుతుంది. శ్వాస వేగంగా తీసుకుంటాం. దీంతో మెదడుకు, కణజాలానికి ఆక్సిజన్‌ మరింతగా సరఫరా అవుతుంది. ఫలితంగా నిరుత్సాహం మాయమై హుషారు పుట్టుకొస్తుంది. నవ్వు చూపే ప్రభావాలపై చాలా పరిశోధనలు జరిగాయి. వాటిల్లో బయటపడ్డ వివరాలేంటో చూద్దాం.

* నవ్వు తేలికపాటి వ్యాయామంతో సమానంగా లాభాలు చేకూరుస్తున్నట్టు వెల్లడైంది. 10-15 నిమిషాల సేపు నవ్వితే 50 కేలరీలు ఖర్చవుతున్నట్టూ బయటపడింది.

* నవ్వు మూలంగా రక్తనాళాల సంకోచ, వ్యాకోచాలు తేలికగా జరుగుతున్నట్టు మేరీల్యాండ్‌ విశ్వవిద్యాలయం అధ్యయనంలో బయటపడింది. ఇలా రక్తప్రసరణ మెరుగుపడటానికి నవ్వు తోడ్పడుతుందన్నమాట.

* నవ్వు ఇన్‌ఫెక్షన్లతో పోరాడే యాంటీబోడీల స్థాయులు పెరగటానికి తోడ్పడుతున్నట్టు, రోగనిరోధక కణాల మోతాదులనూ పెంచుతున్నట్టు ఒక అధ్యయనంలో వెల్లడైంది.

* భోజనం చేసిన తర్వాత హాస్య సన్నివేశాలను చూసిన మధుమేహుల రక్తంలో గ్లూకోజు స్థాయులు తగ్గినట్టు ఒక అధ్యయనంలో బయటపడింది.

* స్పాండిలైటిస్‌ సమస్యతో బాధపడేవారు పది నిమిషాల సేపు హాస్య సన్నివేశాలతో కూడిన సినిమాలను చూస్తే రెండు గంటల పాటు నొప్పి లేకుండా హయిగా నిద్రపోయినట్టు మరో అధ్యయనం పేర్కొంటోంది.

* ధ్యానం మాదిరిగానే నవ్వు కూడా మెదడులో గామా తరంగాలను ప్రేరేపిస్తున్నట్టు లోమా లిండా విశ్వవిద్యాలయం అధ్యయనంలో బయటపడింది. మెదడులోని అన్ని భాగాల్లోనూ కనబడేవి ఒక్క గామా తరంగాలే. అంటే ధ్యానం మాదిరిగానే నవ్వు కూడా మెదడులోని అన్ని భాగాలపైనా ప్రభావం చూపుతుందన్నమాట.

ఆసుపత్రిలో ఉన్నవారికి పరామర్శించిరావడము మన సమంజము సాంప్రదాయము . విదెశాలలో అది కుదరదు. రోనిని కలిసేందుకు అనుమతించరు. చూడడానికి వచ్చేవారు అంటురోగాలు తెస్తారన్నది వారి భయము . బందుమిత్రులు వచ్చి పలకరైంచడము వల్ల రోగికి ఒక విధమైన మనోధైర్యము వస్తుందనేది మన నమ్మకము . ఇప్పుదు మన పద్దతే సరియైనదని అంటున్నారు.  హాస్పిటల్ లో విజిటర్స్ తాకిసి పెద్ద సమస్యే అయినప్పటికీ బందుమిత్రులు వచ్చి  చెప్పే కబుర్లు  , వారిలో కొందరైనా తెప్పించే నవ్వుల వల్ల రోగులు త్వరగా కోలుకుంటారని తేలింది .
  •  ===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.