Wednesday, January 30, 2013

How to prevent memory-loss?,జ్ఞాపక శక్తి లోపించకూడదంటే...ఏమి చేయాలి?

  •  
  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .


జ్ఞాపకశక్తి అనేది మన నిత్య జీవితంలో ప్రతి పనికి అవసరం. ఇది లోపిస్తే ప్రతి పనికి అంతరాయం. ఏదెైనా విషయం గుర్తుంచుకున్నప్పుడు వెంటనే గుర్తుకు రాకపోవడాన్ని జ్ఞాపకశక్తి లోపంగా వ్యవహరిస్తారు. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు జరిగే సంఘటనలు మెదడులోని న్యూరాన్లలో నిక్షిప్తమై ఉంటాయి. అవసరమైనప్పుడు ఆ విషయాన్ని బయటకు వెంటనే తేవడమే జ్ఞాపకశక్తి.

కారణాలు:

    సరెైన పోషక ఆహారం తీసుకోకపోవడం.
    మెదడులో కణుతులు ఏర్పడటం వల్ల మెదడుకు సోకే ఇన్‌ఫెక్షన్స్‌ వలన,
    థయామిన్‌ లోపం వలన,
    మెదడుకు ఆక్సీజన్‌, గ్లూకోజ్‌ సరిగా అందని పరిస్థితుల్లో,
    తలకు బలమైన గాయాలు తగలడం వలన,
    కొన్ని రకాల మత్తు పదార్థాలను అధికంగా వాడటం వలన (ఆల్కహాలు వంటివి),
    థెైరాయిడ్‌ లోపం,
    మానసిక ఒత్తిడికి అధికంగా గురికావడం,


    లక్షణాలు:
    సరెైన సమయంలో చదివింది గుర్తుకు రాకపోవడం.
    వస్తువులు ఎక్కడ పెట్టామో గుర్తుకు రాకపోవడం.
    కొందరు కొన్ని విషయాలు ఒకటి రెండు రోజులు తర్వాతనే మరచిపోవడం.
    కొంతమంది గృహిణులు బజారుకు వెళ్ళిన తర్వాత ఇంటికి తాళం వేసామో, లేదో, గ్యాస్‌ ఆఫ్‌ చేసామో లేదో అని ఆందోళన పడటం వంటి లక్షణాలు ఉంటాయి.

    ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు తమకు జ్ఞాపకశక్తి లోపించిదేమో అని ఆందోళన చెందడం సహజం. అలా కాకుండా చేసే పని మీద దృష్టి సారించి ఏకాగ్రతతో చేయుట భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం వలన మానసికి ఒత్తిడి లేకుండా జీవనాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తే ‘జ్ఞాపకశక్తి’ మెరుగు పడుతుంది.

    చికిత్స:
     జ్ఞాపకశక్తి లోపాన్ని నివారించడానికి అద్భుతమైన మందులు ఉన్నాయి. ఈ మందులను ఎన్నుకునే ముందు వ్యక్తి మానసిక, శారీరక అలవాట్లను పరిగణలోకి తీసుకోవాలి. అలాగే జ్ఞాపకశక్తి లోపానికి గల కారణాలెైన భయం, మానసిక ఒత్తిడి, నెగటీవ్‌ ఆలోచనలు ఉంటే వాటి నుండి బయట పడేందుకు కౌన్సిలింగ్‌ ఇప్పించాలి.
ఒమేగా-3 ఫ్యాటీయాసిడ్స్ గల ఆహారము తీసుకోవడము వల్ల జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుందని తేలింది. చేపలు ,అవిసెగింజలు వంటి వాటిలో ఒమేగా-3 ఫ్యాటీయాసిడ ఉంటాయి.
  • ========================
visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.