Friday, January 25, 2013

శరీరంపై దురదతో కూడిన దదుర్లు వస్తున్నాయిఎలాంటి చికిత్స తీసుకోవాలి?,Treatment for skin allergy

  •  
  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : మా బాబు వయస్సు ఐదు సంవత్సరాలు. ప్రతిరోజు సాయంత్రం శరీరంపై దురదతో కూడిన దదుర్లు వస్తున్నాయి. వీటి నుంచి నీరు కారుతుంది, మాడి పోయిన తరువాత నల్లని మచ్చలుగా మిగిలిపోతున్నాయి. చేతులపై, కాళ్ళపై ఎక్కువగా ఉన్నాయి. ఇందుకు కారణం ఎమిటీ? ఎలాంటి చికిత్స తీసుకోవాలి?


జ : మీ బాబుకు వచ్చిన చర్మవ్యాధిని పాపులార్‌ అర్టికేరియా అంటారు. సాధారణంగా ఇది చిన్నపిల్లల్లో వచ్చే మాములు చర్మరుగ్మత. చర్మం అలర్జికి గురైనప్పుడు వచ్చే రియాక్షన్‌. దీని గురించి మీరు దిగులు పడాల్సింది ఏమి లేదు. దోమకుట్టినా, ఏదైన క్రిములు కుట్టినా ఈ విధంగా వళ్ళంతా వస్తుంది. యాంటిఇస్టమిన్స్‌ - తో వీటిని నయం చేయవచ్చును .  దోమల నుంచి రక్షణ ఉండాలి. యాంటి ఎలెర్జిక్ కెలెమిన్‌ లోషన్స్‌ కాళ్ళుచేతులకు అప్లైచేయాలి. దోమలు కుట్టకుండా జాగ్రత్త పడాలి.

  • =========================== 

visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.