Thursday, January 24, 2013

can we reduce weight on stoping breakfast?,బ్రేక్ ఫాస్ట్ మానేస్తే బరువు శీఘ్రం గా తగ్గుతారా?



  •  

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : బ్రేక్ ఫాస్ట్ మానేస్తే బరువు శీఘ్రం గా తగ్గుతారని ఓ మిత్రుడు సలహా ఇచ్చాడు . ఎంతవరకు నిజము ?

జ : బరువు తగ్గడము కోసము బ్రేక్ ఫాస్ట్ మానేసి స్ట్రెయిన్‌ అవ్వడము సరియైన ప్రక్రియ కాదు . మంచి పోషకాలతో నిండిన బ్రేక్ ఫాస్ట్ ముందుగా తిని తర్వాత ఒక గంట ,,, గంటన్నర పాటు వర్కవుట్లు చేస్తే మంచిది. మనకి ఆహారము నుండి ఎనర్జీ అవసరము ... లేనట్లయితే మజిల్ లాస్ అవుతుంది. బరువూ పెరుగుతారు. బ్రేక్ ఫాస్ట్ తినకపోతే మెదడు స్టార్వేషన్‌ సిగ్నల్స్ పంపుతుంది. ఫలితముగా కొవ్వునిల్వలు పేరుకు పోతాయి. రోజూ మొత్తం ఆహారములో బ్రేక్ ఫాస్ట్ మానేయడము సరైన ఆలోచన కాదు . రాత్రంతా ఖాలీ కడుపుతో ఉండి ... తెల్లవారుతునే వర్కవుట్లు చేసి ఉపాహారము మానేయడము వల్ల లాభాలు కంటే నస్టాలే ఎక్కువ ఉంటాయి.
  • =========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.