Saturday, September 21, 2013

shall I wear high heel footware in pregnancy?, గర్భిణీలు హై హీల్ పాదరక్షలు వాడవచ్చునా?




ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము . *

ప్ర :  హై హీల్స్ షూస్ ను చాలా కంఫర్టబుల్ గా ధరిస్తూ ఉంటాను. గర్భము దాల్చాక కుడా వీటిని వాడవచ్చునా?

జ : గర్భము ధరించాక  హార్మోన్ల ప్రబావము వలన వెన్నెముకను సపోర్ట్ చేసే లిగమెంట్స్ మెత్తగా(సాఫ్ట్ ) మారుతాయి , ఈ దశలో లిగమెంట్స్ సాగడము , డ్యామేజీ అవడానికి అవకాశాలు ఎక్కువ . బాగా ఎత్తు మడమల పాదరక్షలు ధరించడము వల్ల పోశ్చర్ ను మార్చుతాయి. వెన్నెముక పై అధనపు వత్తిడి పడుతుంది కావున లోయర్ బ్యాక్ పెయిన్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ . ఎదో ముఖ్యమైన సందర్భాలలో తప్ప హైహీల్స్ వాడకూడదు. బ్రాడ్ బేస్డ్ లోహీల్స్ వాడడము మంచిది.
  • =========================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

Teenage is very sensitive & Zigjag how to maintain?, యుక్తవయసు చిక్కుముడి వంటి దశ ఎలా గడపాలి?


  •  


  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ఫ్ర : యుక్తవయసు చిక్కుముడి వంటి దశ  అంటారు కదా ... ఈ దశను ప్రశాంతముగా దాటే మార్గము లేదా?

జ : యుక్త వయసు Teenage (14 -21) పిల్లలలో భావోద్రేకాలు కలగా పులగం గా ఉంటాయి . తల్లిదండ్రుల చాటున అప్పటిదాకా ఉన్నవారు తమ స్వంత ఐడెంటిటీ  కోసము పాకులాడుతుంటారు. ప్రతీదీ తనకు తెలుసని భావిస్తారు. ఎన్నో మార్పులకు నిలయమయిన ఈదశ లో నియంత్రణలో ఉంచుకోగల కొన్ని అంశాలుంటాయి. ఈ వయసులో హార్మోనల్ మార్పులు ఎక్కువకాబట్టి ఆహారము విషయం లో జాగ్రత్తలు అవసరము . తక్కువ స్పైసీ గా , తక్కువ ఆయిలీ గా ఉండే పదార్ధాలు తినాలి. బర్గర్లకు బదులు శాండ్ విచ్ లు , భోజనాల నడుమ పండ్లు తీసుకోవాలి. ఏరియేటెడ్ పానీయాల షానే తాజా పండ్లరసాలు , సూప్స్ , మంచినీళ్ళు  , పల్చటి మజ్జిగ తాగుతూ ఉండాలి.

కొద్దికొద్దిగా ఎక్కువసార్లు ఆహారము తీసుకోవాలి. బాదంపప్పు , జీడిపప్పు , ఆప్రికోట్స్ వంటివి తినాలి . ఎందుకంటే పెద్దయ్యాక ఉండే ఎత్తులో 20 శారము , బరువులో 50 శాతము  ఈ వయసులోనే వస్తాయి . చాలినంత రెస్ట్ ఉండాలి. పునరుత్తేజము కోసం ఏధైనా రిక్రియేషన్‌ అవసరము . ప్రరి రోజూ ఏదో ఒక వ్యాయామము చేయాలి. ... సైక్లింగ్ , యోగా , స్విమ్మింగ్ , ఏరోబిక్ ఎక్షరసైజ్ లు చేస్తూఉండాలి. గార్డెనింగ్ , ఇంటిపనులు చేస్తూఉండాలి. .... ఇలా యుక్తవయసు పిల్లల్ని ఓ పద్దతి గా ఉంచగల్గితే ఈ దశ స్మూత్ గా సాగిపోతుంది .

  • *=========================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

Tuesday, September 17, 2013

Are eggs good protein supplement?,గుడ్లు ప్రోటీన్‌ కు మంచి ఆధారమేనా?


  •  


  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : గుడ్లు ప్రోటీన్‌ కు మంచి ఆధారమేనా?.పిల్లలకు రోజూ ఇవ్వవచ్చా?

జ : గుడ్డు చాలా అద్బుతమైన ఆహారము . దీని ప్రోటీన్‌ లో అన్ని అత్యవసరమైన ఎమినోయాసిడ్స్ ఉంటాయి. కాబట్టి గుడ్లు సంపూర్ణ ప్రోటీన్‌ ఆహారము , ఖరీదైన పోషకాహారము . పిల్లలనా , పెద్దలైనా రోజుకో గుడ్డు తినడము వలన శరీరానికి చక్కని పోషకాలు అందుతాయి. పిల్లలకు రోజూ ఒక గుడ్డు వివిధ రూపాలు గా వండి ఇవ్వవచ్చును .బాగా బొద్దుగా ఉన్న పిలలైతే పచ్చసొన తీసేసి ఉడికించిన తెల్లసొన గుడ్డు ను ఇవ్వాలి. గుడ్డు ఏవిధముగా తిన్నా మంచిదే.
*===========================
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Monday, September 16, 2013

Do polarized glasses good to eyes?,పోలరైజ్డ్ గ్లాసులు కంటికి మంచిదేనా?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర : Do polarized glasses good to eyes?,పోలరైజ్డ్ గ్లాసులు కంటికి మంచిదేనా?

జ: పొలరైజ్డ్ గ్లాసులు లేదా స్పెక్టకిల్స్ విజిబిలిటీని పెంచుతాయి. వర్షము పడిన తరువాత వీటి విజిబిలిటీ మరింత పెరుగుతుంది. వర్షము కురుస్తున్న లేదా మబ్బులు ఉన్నా తేలికపాటి కాంతి వేవ్స్ ఎన్నో యాంగిల్స్ లో స్కాటర్ అవుతాయి. అప్పుడు  దృష్టిసారించి చూడడము కష్టముగా ఉంటుంది. పోలరైజ్డ్ గ్లాసులకు పోలరైజింగ్ ఫిల్టర్ లు ఉంటాయి. అవి స్కాటర్ అయిన కాంతులను  " సింగిల్ రే " గా మార్చగలవు కాబట్టి రోడ్డు వైపు , ట్రాఫిక్ సిగ్నల్స్ పై దృష్టి సారించడము సులువుగా ఉంటుంది. ముఖ్యము గా రాత్రివేళ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎదుటవాహనాల హెడ్ లైట్స్ గ్లేర్ ను ఎదుర్కోడానికి పోలరైజ్డ్ గ్లాసులు పెట్టుకోవడము శ్రేయస్కరము . ఇవి కంటికి హానికరము కావు .


*===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

Sunday, September 8, 2013

How to prevent bad smell of Leather shoe?,లెదర్ షూ దుర్వాసన రాకుండా సూచనలు ఇవ్వండి ?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : లెదర్ షూ దుర్వాసన రాకుండా సూచనలు ఇవ్వండి ?

జ : లెదరు జంతువు చర్మము కదా దానివాసన ఎక్కడికి పోతుంది...!
  • అదే షూ రెండు మూడు రోజూలు వరుసగా ధరించడము వలన వాసన వస్తుంది. దుర్వాసన వస్తుంటే లెదర్ కు ఒకరోజు రెస్ట్ ఇవ్వాలి. వాసన తగ్గి మామూలు స్థాయికి వస్తుంది.
  • ప్రతి రోజూ షూ తీసేసిన తరువాత దాన్ని శుబ్రముగా క్లీన్‌ చేసి లోపలికి గాలి వెళ్ళేటట్లు ఉంచాలి. 
  • షూ వేసుకోవడానికి ఒక గంట ముందు పొడిగుడ్డతో తుడిచి మంచి పాలిష్ తో పాలిష్ చేయాలి. 
  • ప్రతిరోజూ వేసుకున్న షాక్స్ మార్చుతూ ఉండాలి .
  • ఎప్పుడూ షూ ను హెయిర్ డ్రయర్ లేదా మరేదైనా వస్తువుతో  డ్రై చేయవద్దు . దీనివల్ల లెదర్ ష్రింకవుతుంది ,పగుళ్ళు బారినట్లు అవుతుంది. 
  • సిడార్ ఉడ్ షూ టిస్సు పేపర్ వాడడము వలన తేమ పీల్చి చక్కని పరిమళాన్ని ఇస్తుంది. 
  • షూ పాలిష్ ను నాణ్యమైన దాన్ని వాడాలి .

*===========================
visit my website - > Dr.Seshagirirao-MBBS -

After Caesarian Operation sex,సెజేరియన్‌ ఆపరేషన్‌ తరువాత దాంపత్యజీవితం

  •  
  •  
  • ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
 ప్ర : సెజేరియన్‌ ఆపరేషన్‌ తరువాత ఎంతకాలము తరువాత సెక్ష్ లో పాల్గొనాలి ? బర్త్ కంట్రోల్ కి సులువైన మార్గము చెప్పండి ?

జ : Caesarian Section Operation తరువాత 8-10 వారాల తరువాత దాంపత్యజీవితం ఆరంభించవచ్చును. బిడ్డకు పాలుస్తున్నప్పుడు మీ భార్యకు ఋతుక్రమము రాకపోవచ్చు . అంతమాత్రాన గర్భము దాల్చరని అనుకోకూడదు ... కాబట్టి కుటుంబనియంత్రణ తప్పనిసరి. దీనికి శాశ్వత పరిష్కారము టూబెక్టమీ లేదా వేసక్టమీ . మల్టీలోడ్ , కాపర్ టీ వంటి ఇంట్రాయుటెరైన్‌ కాంట్రాసెప్టివ్ ను గర్భసంచిలో ఇన్‌సర్ట్ చేయడము వల్ల 3-4 సం.లు గర్భము రాకుండా పనిచేస్తుంది. 
  •  *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Tuesday, September 3, 2013

How do parents behave with their children?,తల్లిదండ్రులు వారిపిల్లలతో ఎలా మెలగాలి?

  •  



ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

Q : తల్లిదండ్రులు వారిపిల్లలతో ఎలా మెలగాలి?

Ans : ప్రపంచంలో అతి జాగ్రత్తగా నిర్వహించాల్సిన బాధ్యతల్లో చాలా ముఖ్యమైనది తల్లిదండ్రులుగా ఉండడమే. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు తరాలు రూపొందేది తల్లిదండ్రులు చేతుల్లోనే. అంతే కాదు ఏ వ్యక్తికైనా జీవితంలో అత్యంత మధురమైన అనుభవాలు ఉండేది కూడా బాల్యంలోనే. కాబట్టి తల్లిదండ్రులు కోపం ప్రదర్శించే తీరు, మాట్లాడే తీరు పిల్లల మీద దాదాపుగా శాశ్వతమైన ముద్ర వేస్తాయి. ముఖ్యంగా కోపాన్ని ప్రదర్శించే ముందు ఒక్కసారి పునరాలోచించుకోవడం చాలా అవసరం.
  • - చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు తాము పిల్లలుగా ఉన్నపుడు ఎంత బాధ్యతగా ఉండేవారో పిల్లలకు ఉదహరిస్తూ చెప్తుంటారు. ఇలా చేయడం అంత మంచిది కాదు. చిన్నతనంలో మీలోపాలను గనుక మీ తల్లిదండ్రులు ఎత్తి చూపినపుడు మీరు పొందిన బాధ ఎలాంటిదో ఒక్కసారి గుర్తుతెచ్చుకోండి. కాబట్టి మీ సామర్థ్యం గురించి చెప్పడం కాకుండా వారు చెయ్యాల్సిన పనులు మరింత బాధ్యతాయుతంగా చేయడం ఎలాగో ఒకసారి వారికి వివరిస్తే సరిపోతుంది.
  • - తప్పు చేయనివారు ఈ లోకంలో ఎవరూ ఉండరు. తప్పుచేయడం చాలా సహజమైన విషయం. జీవన నైపుణ్యాలు నేర్చుకోవడంలో తప్పుచేయడం ఒక భాగం. మీ పిల్లలు మీకు నచ్చినట్టుగానే ప్రవర్తించాలని కోరుకోవడం మీరు చేసే అతి పెద్ద తప్పవుతుంది. కాబట్టి మీకు నచ్చని కోర్సు ఎంచుకున్నాడని అతడిని నిందించడం కుదరదు.
  • - ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలను ఒకరితో ఒకరికి పోలిక చేర్చి మాట్లాడడం ఎప్పుడూ సరికాదు. ఇలా చేయడం వల్ల వాళ్లిద్దరి మధ్య శత్రుత్వం ఏర్పడే ప్రమాదం ఉంటుంది. మీ పిల్లల మధ్య సయోధ్య చెడకుండా ఉండాలంటే ఇలాంటి పోలికలు ఎప్పుడు పెట్టకూడదు.
  • - తల్లిదండ్రులుగా వారి పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉంటుంటాం. అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటాం, ఇలా ప్రతి పనిని దగ్గరుండి చూసుకోవడం వల్ల వారిలో బాధ్యతారాహిత్యం పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ప్రతిచోటా ప్రతిసారీ మనం ఉండి చూసుకోలేకపోవచ్చు, అలాంటి సమయాల్లో వారు చాలా ఇబ్బంది పడతారు. కొన్ని సార్లు పిల్లలకు ఊపిరి సలపనివ్వని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కొన్ని పనులు, కొన్ని నిర్ణయాలు వారికే వదిలేయాలి. ఇది వారిలో నిర్ణయించుకునే శక్తిని పెంపొదిస్తుంది. కాబట్టి పిల్లల విషయంలో అతిజాక్షిగత్త పనికి రాదు.
  • - పిల్లల దగ్గర మీరు మీ భాగస్వామిని గురించిన ఫిర్యాదుల గురించి మాట్లాడకూడదు. అలా మాట్లాడడం వల్ల మీ మీద, మీ భాగస్వామి మీద కూడా వారికి గౌరవం తగ్గిపోవచ్చు. అంతేకాదు ఎప్పుడైనా మీ ఇద్దరి మధ్య ఎటువంటి విభేదాలు లేవనుకున్నపుడు వారు ఆరోగ్యంగా, ఆనందంగా ఎదగడం మాత్రమే కాదు వారు చాలా సురక్షితంగా ఉన్నట్టు భావిస్తారు కూడా.
  • -తల్లిదండ్రులుకు ఇష్టం లేని పనిచెయ్యాల్సి వచ్చినపుడు పిల్లలు చాలా ఒత్తిడికి లోనవుతారు. అలాంటి సందర్భాలు ఎదురైనపుడు వారిని నిందించకుండా అలాంటి అవసరం ఏమి ఏర్పడిందో తెలుసుకోవడం చాలా అవసరం.
  • - ఆలోచించకుండా నీలాంటి పిల్లాడు ఇంకెవరికి ఉండడు. ఇలాంటి పిల్లాడు ఉండడం కంటే అసలు పిల్లలు లేకపోవడమే మంచిది వంటి మాటలు అసలు మాట్లాడకూడదు. ఇవి మీ పిల్లలను చాలా బాధిస్తాయి. అంతేకాదు జీవితంలో చెరిగిపోని ముద్రలుగా వారి మనసులో మిగిలిపోతాయి.

  • *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -