Saturday, January 12, 2013

Is there any timings for fruit eating?,పండ్లు పలానా సమయములోనే తినాలన్న నియమాలు ఏమైనా ఉంటాయా?

  •  
  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : పండ్లు పలానా సమయములోనే తినాలన్న నియమాలు ఏమైనా ఉంటాయా?

జ : పండ్లు గొప్పా డిటాక్సిఫైయింగ్ పదార్ధాల జాబితాలొకి వస్తాయి. సహజ చెక్కెర్లను చక్కగా సరఫరా చేస్తాయి. సరైన మార్గములో పండ్లు తిన్నాప్పుడు శరీరానికి ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చిపెడతాయి. రోజులో మూడు సార్లుగా పండ్లు తింటుంటే శరీరమ్లోని విషతుల్యాల్ని వెలికి నెట్టేసి , జీర్ణవ్యవస్థను నెమ్మదింపచేయడములో సహకరిస్తాయి. ఖాళీ కడుపుతో పండ్లు తిన్నప్పుడు ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. రోజులో ఏసమయములోనైనా ఇలా తినవచ్చు .

పండ్లు తిన్నాక మరే ఇతర పదార్ధాలు తినడానికైనా అరగంట వ్యవధి ఇవ్వాలి. భోజనము తిన్నట్లైతే పండ్లు తినడానికి 3 గంటలు ఆగాలి. అంటే పండ్లు తినే ముందు ఆహారము జీర్ణము కావాలన్నమాట . రాత్రంతా జీర్ణవ్యవస్థ విశ్రాంతిలో ఉంటుంది కాబట్టి ఉదయమే పండ్లు తినడము మంచి ఆప్షన్‌ .

పండ్లు ఇతర పదార్ధాలతో కలిపి తినవద్దు . భోజనము తరువాత కాకుందా ముందుగానే తినాలి. పోషకాలు బాగా అందుతాయి... మరియు తినే అన్నము కూడా తగ్గుతుంది. అరటిపండు , ఆవకాడో వంటి హెవీ పండ్లు  మధ్యాహ్నము భోజనానికి , సాయంత్రం బ్రేక్ ఫాస్ట్ కి  నడుమ తినడము వల్ల జీర్ణవ్యవస్థకి బాగా పనిచేస్తుంది.  క్యాన్‌డ్ , ఫ్రోజన్‌ , ప్రా్సెస్డ్  పండ్లు తినవద్దు . వీటిలో చెక్కెరశాతము , ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యానికి మంచిది కాదు . పండ్లరసాలు ఇస్టపడేవారు తాజాగా తీసిన రసాలు మాత్రమే తాగాలి. క్యాన్లలో నిలవా ఉంచినవి మంచిది కాదు . జూస్ కంటే తాజా పండు జాయిగా తింటే పీజుపధార్ధము ఎక్కువగా ఉండి ఆరోగ్యానికి మంచిది.
  • =========================== 

 visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.