Showing posts with label స్మోకింగ్ వలన చర్మము ప్రభావితం అవుతుందా?. Show all posts
Showing posts with label స్మోకింగ్ వలన చర్మము ప్రభావితం అవుతుందా?. Show all posts

Tuesday, January 8, 2013

Does smoking effect skin color?,స్మోకింగ్ వలన చర్మము ప్రభావితం అవుతుందా?


  •  



  •  

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : స్మోకింగ్ వలన చర్మము ప్రభావితం అవుతుందా? తెలియజేయండి ?

జ : ఖచ్చితము గా ప్రభావితం అవుతుంది . స్మోకింగ్ చర్మానికి పోషకాలు , ఆక్షిజన్‌ సరఫరా చేసే రక్తనాళాలను కుంచింపజేస్తుంది. దీనివల్ల చర్మము " హైఫోక్షియా" అనే దశకు చేరుతుంది. ఒక్క సిగరెట్ స్మోకింగ్ చర్మ రక్తనాళాలను దాదాపు ఓ గంటపాటు కుచింపజేయగలదు .

సాధారణముగా స్మోకర్లు  ప్రతి గంటా రెండు గంటలకు ఓ సిగరెట్ తాగుతుంటారు. కాబట్టి పొగతాగే వారి చర్మము దాదాపు రోజంతా హైపోక్షిక్ అవుతుంది .ఇలా కొన్నాళ్ళు గడిచేకొద్దీ చర్మము మెరుపును మృదుత్వాన్ని కో్ల్పోతుంది. స్మొకింగ వల్ల ఉత్పత్తి అయ్యే హైపోక్సియా వల్ల చర్మము కొలాజెన్‌ , ఎలాస్టిన్‌ పైబర్లకు కూడం నష్టము జరుగుతుంది . చర్మము మందము తగ్గిపోయి ఎలాస్టిసిటి కోల్పోతారు. పొగతాగే వారి చర్మము పొగతాగనివారి చర్మము కంటే 25 శాతము పల్చగా ఉంటుంది. పల్చని చర్మము నెమ్మదిగా సాగిపోవడము మొదలు పెట్టి 5 ఏళ్ళు ఎక్కువ వయసు పైబడిన వారిలా కనబడుతారు. చర్మము హీలింగ్ , పునరుజ్జీవ శక్తులు కూడా ప్రభావితము అవుతాయి. పొగతాగే వారికి గాయాలు , పుళ్ళు నెమ్మదిగా నయమవుతాయి. గోళ్ళు , పెదాలు నల్ల బడతాయి. నికొటిన్‌ వేళ్ళు  పసుపు బారినట్లు ఉంటాయి. సోరియాసిస్ , లెగ్ అల్సరేషన్‌ సమస్యలు ఇటువంటివారికి ఎక్కువ .
  •  ===========================
visit my website - > Dr.Seshagirirao-MBBS