Tuesday, July 30, 2013

unwanted hair removal,అవాంచిత రోమాలు వాక్షింగ్

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము . *

 ప్ర : మా అమ్మాయికి 10 సం.లు ... తన చేతుల పైన , కాళ్ళపైన అవాంచిత రోమాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. నేను వాక్షింగ్ చేసుకోవడము చూసి తనూ అలాగే చేయాలంటుంది. ఈ వయసులో పిల్లలకు వాక్సింగ్ చేయవచ్చా ? --------------- ఒక సోదరి.

జవాబు : చేతులు , కాళ్ళపై ఆ విధముగా వెంట్రుకలు రావడము హార్మోనుల ఇబ్బందులకు గాని, ఒవేరియన్‌ సిస్ట్ వంటి రుగ్మతలకు గాని సూచనకావచ్చు . మీ పాప అధిక బరువు వుంటే కనుక  ఈసమస్య ఎక్కువగా ఉంటుంది. ముందుగా పిల్లల వైద్యులతో తనకు చెకప్ చేయించండి. అవసరమైతే హార్మోనుల పరీక్షలు , అల్ట్రాసౌండ్ పరీక్షలు చేయించండి . . . అన్ని బాగుంటే వాక్సింగ్ సురక్షితముగా చేయవచ్చును. వాక్సింగ్  నొప్పితోకూడిన పక్రియ కనుక పాపకు ఆ విషయము ముందుగా చెప్పాలి.

ఓ రెండు మూడేళ్ళు పాటు  వాక్సింగ్ వంటి ప్రక్రియల కంటే " ప్యూమిక్ స్టోన్‌" రుద్దడము , నలుగు పెట్టడము వంటి  సంప్రదాయ , సహజ సిద్ధమైన పద్దతులవల్ల ఫలితము ఉంటుందేమో ప్రయత్నించండి .
  • =========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Monday, July 29, 2013

How to retain sexual potency in Diabetes?,డయబెటిస్‌లో లైంగిక సామర్థ్యం తగ్గకుండ ఉండాలంటే ఎలా?


  •  

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము . *

 Q : How to retain sexual potency in Diabetes?,డయబెటిస్‌లో లైంగిక సామర్థ్యం తగ్గకుండ ఉండాలంటే ఎలా?

A : నేడు కనిపిస్తున్న లైంగిక సమస్యల్లో అత్యదికం శాతం మానసిక దుర్బలత్వం, భయం, డయాబెటిస్‌ వలన వచ్చినవే. మధుమేహ వ్యాధిగ్రస్తులలో వచ్చే నాడీ సంబంధిత వ్యాధుల లోపాల వలన అంగస్తంభన శీఘ్రస్కలన సమస్య, సెక్స్‌ కోరికలను తగ్గటం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నాయి. దీనికి గల కారణం హార్మోన్ల లోపాలు, డయాబెటిస్‌ న్యూరోపతి, నిత్య జీవితంలో మానసిక ఒత్తిళ్లను ఎక్కువగా ఉండటం. లైంగిక సామర్ధ్యం మానసిక శక్తి మీద ఆధారపడి ఉంటుంది. భయం, ఆందోళన అనుమానాలు, శీఘ్రస్కలనాలు, స్తంభన లోపాలు వంటి సమస్యలు మనిషిని మానసికంగా భలహిన పరిచి లైంగిక సామర్థ్యాన్ని తగ్గిస్తున్నాయి. ఇటువంటి వారికి మొదటగా ఆత్మవిశ్వాసం పెంచాటానికి కౌన్సిలింగ్‌ ఇచ్చి తరువాత సమస్యకు అనుగుణంగా మందులు ఇవ్వడం వలన లైంగిక వైఫల్యాల నుంచి విముక్తి పొందవచ్చు.

మధుమేహా వ్యాధి గ్రస్తులతో లైంగిక సామర్థ్యం తగ్గకుండ ఉండాలంటే...
మంచి ఆహారపు అలవాట్లు అలవరచుకోవాలి. బాదం, ఖర్జూర, మొలకెత్తిన విత్తనాలు, పాలు,గ్రుడ్లు, తాజా ఆకు కూరలు తీసుకోవాలి. కీర దోసకాయ,క్యారెట్‌, బీట్‌రూట్‌తో తయారు చేసిన జ్యూస్‌ను రోజు ఉదయం ఒక గ్లాసు తీసుకోవాలి. యాపిల్‌, జామ దానిమ్మ,ద్రాక్ష, నేరేడు, వంటి తాజా పండ్లు తీసుకోవాలి. మద్యపానం సేవించుట స్మోకింగ్‌ గుట్కాలు, పాన్‌పరాగ్‌, నార్కోటిక్స్‌ తీసుకోవడం వంటి వ్యసనాలను వదిలివేయాలి. తక్షణ లైంగిక సామర్థ్యం కోసం స్టెరాయిడ్‌ నిత్యం వాడటం వలన లైంగిక పటుత్వం క్రమేపి తగ్గిపోతుంది. తీవ్ర మానసిక ఒత్తిళ్లు హార్మోన్ల ప్రభావం చూపి లైంగిక సామర్థ్యంను తగ్గించును. కావున మానసిక ఒత్తిడి నివారణకు నిత్యం యోగా, మెడిటేషన్‌తో పాటు ఒత్తిడి లేని మంచి జీవన విధానాన్ని అలవర్చుకొనుటకు ప్రయత్నం చేయాలి. ప్రతి రోజు ఉదయం వేకువ జామున 30 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకు వాకింగ్‌ చేయడం వలన మానసిక ప్రశాంతత ఏర్పడి ఒత్తిళ్లను అధిగమించవచ్చును.

Treatment :
  • గుండె జబ్బులు లేనివారు .. వయగ్రా మందును వాడవచ్చును . వారానికి 2 లేదా 3 రోజులు ... Tab. penegra 25 mg or 50 mg per day 2-3 hours before the act.
  • సుగరు వ్యాది ఉన్నవారు ... వాటికి సంబంధిత మందులు క్రమము తప్పకుండా వాడాలి 
  • .రోజూ ఒక బి.కాంప్లెక్ష్ మాత్ర వాడితే చాలా మంచిది .

  • =========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Do we reduce weight by weekly hunger fast?,వారములో ఒకరోజూ ఉపవాసము చేయడము వలన బరువు తగ్గుతామా?

  •  

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ఫ : వారములో ఒకరోజూ ఉపవాసము చేయడము వలన బరువు తగ్గుతామా?

జ : బరువు తగ్గడానికి ఉపవాసమనేది ఏ విధముగానూ సహకరించదు . ఉపవాసము సరిగా(పూర్తిగా ఏమీ తినకుండా) చేస్తే శారీరక వ్యవస్థలో విషతుల్యాలు వెలికినెట్టడానికి కుదరదు . ఉపవాస దీక్షలో ఉన్నపుడు పండ్లు తినడము , జ్యూస్లు త్రాగడము , నీరు త్రాగడము చేస్తూ ఉంటారు ... కాబట్టి టాక్షిన్లు వెలికి వెళ్ళిపోతాయి.

ఉపవాసము బరువుపై తాత్కాలిక ప్రభావము మాత్రమే చూపుతుంది . అదీ వారముకో రో్జు ఉపవాసము చేసేవారికి బరువు తగ్గడానికి ఉపవాసము చేపట్టడము అన్నది సరైన పద్దతి కాదు . దీనివలన అత్యవసర పోషకాలు శరీరము కోల్పోతుంది. . . జీవక్రియ నెమ్మదిస్తుంది.

  •  *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Do joint pains disturb sexual life?,శృంగార జీవితానికి కీళ్ల నొప్పులకు అవరోధమా?

  •  

  • image : courtesy with Surya telugu news paper July 15, 2013
  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము . *

 Q : Do joint pains disturb sexual life?,శృంగార జీవితానికి కీళ్ల నొప్పులకు అవరోధమా?

A : నేడు ఆధునిక యుగంలో చాలా మంది నొప్పులతో వేధించ బడుతూ శృంగార జీవితానికి దూరమవుతున్నారు. కీళ్లనొప్పుల సమస్య వలన కదలికలు కష్టంగా మారుట వలన దాంపత్య జీవితంలో పూర్తి స్థాయి ఆనందాన్ని పొందలేక చాలామంది తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.

లక్షణాలు

    కీళ్ల నొప్పులు తీవ్రస్థాయిలో ఉండటం వలన శృంగారంలో ఆకర్షన పరస్పరం తక్కువగా ఉండి తృప్తి ఆనందం తగ్గుతాయి.
    కీళ్ల వాపుతో ఉండటం వలన స్పర్శను ఇష్టపడక పోవడం.
    కీళ్లలో వాపుతో పాటు నొప్పి ఎక్కువగా ఉండి శృంగారంలో కదలికలు తక్కువగా ఉండటం.
    అంగస్తంబన సరిగా జరుగక పోవుట వంటి లక్షణాలతో బాధ పడుతుంటారు.
    సమస్యను అధిగమించాలంటే....
    కీళ్ల నొప్పులు శృంగార జీవితానికి పెద్ద అడ్డంకి ఏమికాదు
    భాగస్వాములు ఇద్దరు సంయమనంతో నిమ్మదిగా శృంగారంలో పాల్గొనడం వలన తృప్తిని ఆనందాన్ని పొందవచ్చు.
    కీళ్ల నొప్పులు ఎక్కువగా ఉన్న కీళ్లపై భారం పడకుండ మెత్తటి కుషన్స్‌ అమర్చుకుని శృంగారంలో పాల్గొనడం వలన నొప్పి తీవ్రత తగ్గును.
    శృంగారంలో పాల్గొనేటప్పుడు కీళ్ల నొప్పులు వస్తాయనే భావనను, భయ పడటాన్ని మానుకోవాలి. ఇలా భయపడటం వలన మానసికంగా కృంగిపొయి శృంగార ప్రేరణ తగ్గిపొతుంది. ఒక వేల భయం అనిపిస్తే భాగస్వాములిద్దరు సామరస్యంగా చర్చించుకోని భయాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి.
    భాగస్వామిలో ఏర్పడే అసౌకర్యాన్ని గుర్తించి ప్రేమతో మొదులుకోవడం వలన దాంపత్య జీవితంలో విజయం సాధించవచ్చును.
 
 తీసుకోవలసిన జాగ్రత్తలు
    ఆహరపు అలవాట్లు మార్చుకోవాలి. కాల్షియం ఉన్న ఆహర పదార్ధాలను తీసుకోవాలి. ముఖ్యంగా ఉప్పు, వంటలలో నూనెను తగ్గించాలి.
    మాంసాహరం, ఆల్కహల్‌ స్మోకింగ్‌(అలవాటు ఉన్నవారు) వెంటనే మానివేసే ప్రయత్నం చేయాలి.
    ఆధిక బరువు ఉన్నవారు బరువు తగ్గడానికి వ్యాయమం యోగా నిత్యం చేయాలి.
    వ్యాయమం నడక, సైక్లింగ్‌ మొదలైనవి చేయడం వల్ల నొప్పులు కొద్దిగా ఎక్కువ అనిపించినా కూడా ప్రతి రోజు కొద్దిసేపు వ్యాయమం చేయడానికి ప్రయత్నించాలి.
    నొప్పి తీవ్రత తగ్గించుకోవటానికి అతిగా పెయిన్‌ కిల్లర్స్‌ వాడకూడదు. నీరు సరిపడినంతగీ తాగాలి. తాజా కూరగాయలునిత్యం ఆహరంలో ఉండే విధంగా తీసుకోవాలి.

చికిత్స : స్వంత వైద్యము పనికిరాదు ... వికటిస్తే ప్రాణానికే ప్రమాధము . మీ ఫామిలీ డాక్టర్ ని సంప్రదించి సరియైన చికిత్స తీసుకోవాలి. కారణాన్ని బట్టి ట్రీట్ మెంట్  ఉంటుంది.
  • =========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Sunday, July 28, 2013

Why do we get Hepatitis A.B?,హెపటైటిస్‌-ఎ,బి ఎందుకోస్తాయ్‌?

  •  

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము . *

ప్ర : Why do we get Hepatitis A.B?,హెపటైటిస్‌-ఎ,బి ఎందుకోస్తాయ్‌?

జవాబు : --హెపటైటిస్‌-బి-->
హెపటైటిస్‌ -బి అనేది కాలేయానికి సంబంధించిన వ్యాధి. హెపటైటిస్‌ -బి వైరస్‌ ద్వారా ఈ వ్యాధి వస్తుంది. ఈ వైరస్‌ హెసడ్నావైరస్‌ కుటుంబానికి చెందిన వందల రకాల వైరస్లలో ఇది ఒక రకం. దీనికి సీరం హెపటైటిస్‌ అని ఇంకో పేరుంది. ఈ వ్యాధి ఆసియా మరియు ఆఫ్రికా ఖండాలలో చాలా చోట్ల ప్రబలంగా ఉంది. ఒంట్లో హెపటైటిస్‌ వైరస్‌ ఉన్నవాళ్ళు మన దేశంలో, మన ప్రాంతంలో చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. మొత్తం జనాభాలో వీరు 3 - 5 శాతం వరకూ ఉన్నట్టు అంచనాలు చెబుతున్నాయి. కాలేయానికి వాపు రావటం, వాంతులు, పచ్చ కామెర్లు ఈ వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి ముదిరితే కాలేయం గట్టిబడిపోయి లివర్‌ కాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంది.

వ్యాప్తి మరియు వ్యాధి లక్షణాలు
ఒకసారి హెపటైటిస్‌ -బి వైరస్‌ ఒంట్లో ప్రవేశించిందంటే ఒంట్లో దాని సంఖ్య విపరీతంగా లక్షల్లో పెరిగిపోతూ అది లివర్‌ను దెబ్బతియ్యటం ఆరంభిస్తుంది. ఇక వాళ్ళ రక్తంలోనూ, వీర్యంలోనూ, లాలాజలంలోనూ, ఇతరత్రా శారీరకా స్రావాలన్నింటిలోనూ ఈ వైరస్‌ ఉండొచ్చు. ఈ వైరస్‌ ఎక్కువగా శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది. సెక్స్‌, రక్తమార్పిడి, సూదులు, సిరింజిలు తల్లి నుండి బిడ్డకు సంక్రమించవచ్చును.

తొలి దశ
హెపటైటిస్‌-బి వైరప్‌ శరీరంలో ప్రవేశించిన తర్వాత సాధారణంగా చాలామందికి కొద్దిరోజుల్లో కామెర్లు వస్తాయి. దీన్ని ‘అక్యూట్‌’ దశ అంటారు. కామెర్లతో పాటు వికారం, అన్నం సయించకపోవటం, కొద్దిపాటి జ్వరం వంటి లక్షణాలూ ఉండొచ్చు. ఈ దశలో మనం elisa పరీక్ష చేస్తే ‘పాజిటివ్‌’ వస్తుంది. అంటే ఏదో మార్గంలో హెపటైటిస్‌ -బి వైరస్‌ వీరి శరీరంలో ప్రవేశించిందని, దాని కారణంగా కామెర్లు వచ్చాయని అర్థం. వీరికి ‘లివర్‌ ఫంక్షన్‌ టెస్లు’ల్లో కూడా కాస్త తేడాలుంటాయి.
1. ఇలా కామెర్లు వచ్చి, హెపటైటిస్‌ -బి ‘పాజిటివ్‌’ ఉన్న వారిలో నూటికి 99.5 మందికి ప్రాణాపాయం ఉండదు. ఈ దశలో మనం వీరికి మంచి ఆహారం, పూర్తి విశ్రాంతి ఇస్తే చాలు. ముఖ్యంగా లివర్‌ను దెబ్బతీసే మందులు వాడకూడదు. పసర్లు తాగించటం, చేతులు కాల్పించటం వంటివేమీ చెయ్యకూడదు.
2. క్రమంగా కామెర్లు వాటంతట అవే తగ్గిపోతాయి. 95 శాతం మందికి ఆర్నెల్ల తర్వాత వీరికి మళ్ళీ Elisa పరీక్ష చేస్తే ‘నెగిటివ్‌’ వచ్చేస్తుంది.
3. పెద్దల్లో కేవలం కొద్దిమందికి(5%) మాత్రం ఆర్నెల్ల తర్వాత కూడా హెపటైటిస్‌ - బి వైరస్‌ ఒంట్లో ఉండిపోవచ్చు. అదే పిల్లల్లో అయితే 90 శాతం మందికి ఈ వైరస్‌ పూర్తిగా పోదు, అది అలాగే శరీరంలో ఉండిపోతుంది.
4. అంటే హెపటైటిస్‌ -బి ఎంతోమందికి సోకినా కేవలం కొద్దిమందికి మాత్రమే అది ఒంట్లో నిల్వ ఉండిపోతుంది. ఇది దీర్ఘకాలిక సమస్యకు ఆరంభం!
5. ఒకసారి హెపటైటిస్‌ -బి ఉన్నట్టు తేలిందంటే వారి నుంచి అది ఇతరులకు సంక్రమించకుండా ఇంట్లోని వారంతా టీకాలు వేయించుకోవటం వంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. జీవిత భాగస్వాములకు ఈ జాగ్రత్తలు మరీ ముఖ్యం!

వైరస్‌ మకాం
కామెర్లు తగ్గిన ఆర్నెళ్ల తర్వాత కూడా Elisa పరీక్ష పాజిటివ్‌ వస్తుంటే దాన్ని దీర్ఘకాలిక సమస్యగా క్రానిక్‌ హెపటైటిస్‌ గా పరిగణిస్తారు. అంటే ఇక హెపటైటిస్‌ - బి వైరస్‌ శరీరంలో ఉండిపోవటానికే ప్రయత్నిస్తోందన్నట్టే. ఇలా హెపటైటిస్‌ -బి ఒంట్లో ఉండిపోతున్నా కూడా వీరిలో 60 శాతం మంది జీవితాంతం అలాగే... ఏ సమస్యలూ లేకుండా ఉండిపోవచ్చు. వీళ్ళను uneffected క్యారియర్స్‌ అంటారు. ఏలక్షణాలూ, ఏబాధలూ ఉండవు. చాలాసార్లు ఒంట్లో వైరస్‌ ఉన్న విషయం కూడా వీరికి తెలీదు. మామూలు హెల్త్‌చెకప్‌లకు వెళ్ళినప్పుడో, రక్తదానం చేసినప్పుడో, గర్భం దాల్చినప్పుడు సాధారణంగా చేసే పరీక్షలోనే ఈ విషయం బయటపడుతుంది. మరిన్ని పరీక్షలు చేస్తే వీరికి elisa -పాజిటివ్‌ ఉంటుంది గానీ మిగతా పరీక్షలు  నార్మల్‌గానే ఉంటాయి , వైరల్‌లోడ్‌ కూడా తక్కువే ఉంటుంది. అంటే వీళ్ళ ఒంట్లో వైరస్‌ ఉందిగానీ దానివల్ల లివర్‌ ప్రభావితం కావటం లేదని అర్థం. వైరస్‌ వల్ల వీరికే సమస్యా లేకపోయినా వీరి నుంచి వైరస్‌ ఇతరులకు సంక్రమించే అవకాశం మాత్రం ఉంటుంది.

1. వీళ్ళకు లివర్‌ సమస్యలు వచ్చే అవకాశం తక్కువే. అయినా వీళ్ళు ఆర్నెల్లకోసారి వైద్యులను కలిసి ముఖ్యమైన పరీక్షలు ఒకటి రెండు చేయించుకోవటం ఉత్తమం. ఎందుకంటే ఇప్పటికి వైరస్‌ వల్ల ఏ ఇబ్బందీ లేకపోయినా జీవితాంతం ఇలాగే ఉంటుందని చెప్పలేం.
2. కొందరు జీవితాంతం ఈ దశలోనే ఇలాగే ఏ ఇబ్బందీ లేకుండా గడిచిపోయేవారూ ఉంటారు.
3. వీళ్ళు ఎప్పుడు రక్తదానం చెయ్యకూడదు. దేనికోసం వైద్యుల దగ్గరకు వెళ్ళినా హెపటైటిస్‌ -బి ఉన్న విషయం చెప్పాలి. మద్యం ముట్టకూడదు. చక్కటి ఆహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వీరి నుంచి వైరస్‌ సంక్రమించకుండా సన్నిహితులంతా జాగ్రత్తలు తీసుకోవాలి.

భవిష్యత్తులో ప్రమాదం
ఒంట్లో వైరస్‌ నివాసం ఏర్పరచుకున్న ‘క్రానిక్‌ హెపటైటిస్‌’ బాధితుల్లో 60 శాతం మందికి ఏ ఇబ్బందీ లేకపోయినా, ఓ 40 శాతం మందికి భవిష్యత్తులో ఒక మోస్తరు నుంచి తీవ్రస్థాయి లివర్‌ వ్యాధులు మొదలయ్యే అవకాశం ఉంటుంది. వీరికి భవిష్యత్తులో సమస్య ఎలా ఉండొచ్చు? ఎంత తీవ్రంగా ఉండొచ్చన్నది ముందే చెప్పేందుకు పరీక్షలు ఉపకరిస్తాయి.
1. పరీక్షల్లో - ఎలీసా పాజిటివ్‌గా ఉండటమే కాకుండా HBeAg కూడా పాజిటివ్‌ ఉండి, SGPT (కాలేయానికి సంబంధించిన ఎన్‌జైమ్‌) ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉండి వైరల్‌ లోడ్‌ 5లక్షల కంటే ఎక్కువ ఉందంటే అర్థం వీరికి భవిష్యత్తులో ఎప్పుడోకప్పుడు లివర్‌ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని!
2. దాన్ని నివారించుకోటానికి కావాల్సిన మందులు ఇప్పుడు మన అందుబాటులో ఉన్నాయి. వీరు తక్షణం పెగ్‌-ఇంటర్‌ఫెరాన్‌, లెమోవిడిన్‌, ఎడిఫోవిర్‌, ఎంటకావిర్‌ వంటి యాంటీ వైరల్‌ మందులు తీసుకోవటం ద్వారా మున్ముందు కూడా అసలు లివర్‌ వ్యాధి రాకుండా నివారించుకునే అవకాశం ఉంది.
3. సన్నిహితులకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మద్యం ముట్టకుండా, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతుండాలి. తరచూ వైద్యులను సంప్రదిస్తుండాలి. కొంతకాలంగా హెపటైటిస్‌ - బి వైరస్‌ ఒంట్లో ఉండి లివర్‌ ప్రభావితమైనా కూడా ఏ సమస్యా లేకుండా గడిపేవాళ్ళు కొందరైతే కొందరికి ఎప్పుడైనా తీవ్రమైనా లివర్‌ సమస్యలు ఆరంభం కావచ్చు. తీవ్రస్థాయి కామెర్లు, లేదా పొట్ట ఉబ్బరం, జలోదరం, సరైనా స్పృహ లేకపోవటం, రక్తపువాంతుల వంటి లక్షణాల్లో ఏవో ఒకటి మొదలవ్వచ్చు, కొందరికి అన్నీ రావచ్చు.
4. పరీక్షల్లో: వీరికి HBsAg పాజిటివ్‌ ఉంటుంది. ఇక HBeAg పాజిటివ్‌ ఉండొచ్చు, నెగిటివ్‌ ఉండొచ్చు. అలాగే వైరల్‌ లోడ్‌ ఉండొచ్చు, తక్కువ కూడా ఉండొచ్చు. ఎందుకంటే లివర్‌ మీద దుష్ర్పభావాలు వచ్చిన తర్వాత ఒంట్లో వైరల్‌ లోడ్‌ తగ్గిపోవచ్చు కూడా.
5. అల్ట్రాసౌండ్‌ పరీక్షలో చూస్తే మెత్తగా, మృదువుగా ఉండాల్సిన లివర్‌ గట్టిబడుతూ చిన్నదవుతున్నట్టు, గడ్డలుగడ్డలుగా తయారవుతున్నట్టు కనబడొచ్చు, ప్లీహం పెద్దదై కూడా ఉంటుంది, ఎండోస్కోపీలో అన్నవాహికలోని రక్తనాళాలు పెద్దవై కనబడతాయి.
6. దీనర్థం: వైరస్‌ దీర్ఘకాలం ఒంట్లో ఉండటం వల్ల లివర్‌ దెబ్బతినటం ఆరంభమైంది. వైరస్‌ వల్ల అది గట్టిబడిపోవటం మొదలైంది. కొద్దికొద్దిగా గట్టిబడుతున్న తొలి దశను పైబ్రోసిస్‌ అనీ, మరీ ముదిరిన తర్వాత దశను ‘సిర్రోసిస్‌’ అనీ అంటారు. దీనికి కూడా యాంటీ వైరల్‌ మందులు ఆరంభిస్తే లివర్‌ అస్థితి నుంచి మరింత దెబ్బతినకుండా ఉంటుంది. రక్తపువాంతుల వంటి సమస్యలకు కూడా చికిత్స చెయ్యొచ్చు. మొత్తం మీద ఇప్పుడున్న చికిత్సలతో - చాలాకాలం పాటు వీరి సాధారణ జీవితానికి సమస్యల్లేకుండా చూడొచ్చు.
7. సిర్రోసిస్‌ మొదలైన తర్వాత కూడా కొన్ని దశాబ్దాల పాటు జీవించే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి నిర్వేదంలోకి జారిపోకుండా చికిత్స తీసుకోవటం ముఖ్యం.
8. ఆల్కహాల్‌ ముట్టకూడదు, తరచూ వైద్యుల పర్యవేక్షణ అవసరం.
9. వైరస్‌ సన్నిహితులకు సంక్రమించకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి.

విపరీత పరిస్థితి
కొందరికి ఇతరత్రా లివర్‌ సమస్యలేమీ మొదలవ్వకపోయినా.. దీర్ఘకాలంగా ఒంట్లో హెపటైటిస్‌-బి వైరస్‌ ఉన్న కారణంగా లివర్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉంటుంది.
ఏ పరీక్ష ఏం చెబుతుంది?
HBsAg: ఇది పాజిటివ్‌ ఉంటే హెపటైటిస్‌ -బి వైరస్‌ ఒంట్లో ఉందనే అర్థం.
SGPT :ఇది ఎక్కువుంటే ఒంట్లో వైరస్‌ బాగా చురుకుగా ఉండి తన సంఖ్యనూ, ప్రాబల్యాన్నీ బాగా పెంచుకుంటోందని అర్థం.
HBeAg: ఇది పాజిటివ్‌ ఉంటే ఇప్పుడు లివర్‌ బాగానే ఉన్నా భవిష్యత్తులలో దెబ్బతినే అవకాశం ఉందని అర్థం.
డిఎన్‌ఏ వైరల్‌ లోడ్‌: దీనిలో వైరస్‌ సంఖ్య ఎంత ఉందో చూస్తారు. ఇది 5 లక్షలకు మించి ఉన్నట్టయితే లివర్‌ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఇది కాస్త ఖరీదైన పరీక్ష.

ముందు జాగ్రత్త
ఇది సోకకుండా చూసుకోవాలంటే ముందుస్తు జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి.
1. హెపటైటిస్‌ - బి సెక్స్‌ ద్వారా సంక్రమించే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి కండోమ్‌ వంటి సురక్షిత జాగ్రత్తలు తీసుకోకుండా సెక్స్‌లో పాల్గోనవద్దు.
2. ఒకరి టూత్‌బ్రష్‌లు, రేజర్లు, నెయిల్‌కట్టర్లు వంటివి మరోకరు వాడొద్దు. బయట సెలూన్లలో కూడా కచ్చితంగా కొత్త బ్లేడు వాడేలా చూడాలి.
3. ఇంజక్షన్‌ సూదుల వంటివి ఒకరికి వాడినవి మరొకరు ఉపయోగించవద్దు. డిస్పోజబుల్‌ సూదులు, సిరంజీలు వాడటం ఉత్తమం.
4. చెవులు కుట్టటం, ముక్కులు కుట్టటం, పచ్చబొట్లు వేయించుకోవటం వీటికి ఒకరికి వాడిన పరికరాలు మీకు వాడకుండా చూసుకోవాలి.
5. రక్తం ఎక్కించేటప్పుడు, రక్తమార్పడి విషయంలో పూర్తి సురక్షితమైన పద్ధతులను అనుసరించటం... చాలా అవసరం!

పెళ్లి
టీకాలున్నాయి కాబట్టి హెపటైటిస్‌ -బి బాధితులు ఈ విషయం ముందుకానే అందరికీ తెలిపి, వారి అనుమతితో నిశ్చితంగా పెళ్ళి చేసుకోవచ్చు. భాగస్వామికి తప్పకుండా హెపటైటటిస్‌ - బి టీకా మూడు డోసులు ఇప్పించాలి. మూడో డోసు కూడా పూర్తయిన రెండు నెలల తర్వాతే సాధారణ సెక్సు జీవితాన్ని ప్రారంభించాలి. కొన్ని సందర్భాల్లో సిరోసిస్‌ వచ్చిన వాళ్ళు తప్పించి మిగతా అందరూ (అన్‌అఫెక్టెడ్‌ క్యారియర్స్‌ కూడా) పిల్లలను కూడా కనొచ్చు.

గర్భిణులు
గర్భిణులంతా తప్పనిసరిగా HBsAg పరీక్ష చేయించుకోవాలి. హెపటైటిస్‌-బి ఉన్నా కూడా బిడ్డలను కనొచ్చు. గర్భస్రావాలు చేయించుకోవాల్సిన అవసరమే లేదు. కాకపోతే పుట్టగానే బిడ్డకు ఒక తొడకు  హెపటైటిస్-ఇమ్యూనోగ్లోబ్యులిన్ల ఇంజక్షన్‌, మరో తొడకి హెపటైటిస్‌-బి టీకా రెండు తప్పకుండా ఇవ్వాలి. నెల రోజులకు మరో టీకా, ఆర్నెల్లకు మరో టీకా ఇప్పించాలి. దీంతో తల్లి నుంచి బిడ్డకు వైరస్‌ సంక్రమించకుండా 95 శాతం వరకూ నివారించవచ్చు.

టీకాలు
1. ప్రపంచ ఆరోగ్య సంస్థతో సహా ఏ ప్రామాణిక సంస్థా కూడా ప్రజలంతా హెపటైటిస్‌ టీకా తప్పకుండా తీసుకోవాలని సిఫార్సు చెయ్యటం లేదు. కొంతమంది మాత్రం తప్పకుండా తీసుకోవాలి.
2. చిన్న పిల్లలకూ, స్కూలు వయసు పిల్లలందరకీ తప్పకుండా టీకా ఇప్పించాలి.
3. కుటుంబంలో ఎవరికన్నా హెపటైటిస్‌ -బి ఉంటే, ఆ ఇంట్లోని వారంతా తప్పకుండా టీకా తీసుకోవాలి. వైద్య సిబ్బంది, తరచూ రక్తమార్పిడి అవసరమయ్యే రకరకాల వ్యాధి పీడితులకు కూడా టీకా తప్పనిసరి.
4. ఇవాళ మొదటి టీకా వేయించుకుంటే - మళ్ళీ సరిగ్గా నెలకు ఒకటి, ఆర్నెల్లకు మరోకటి, మొత్తం మూడు టీకాలే తీసుకోవాలి.


హెపటైటిస్‌-ఎ
(ఇన్ఫెక్షన్‌ హెపటైటిస్‌) హెపటైటిస్‌ -ఎ వైరస్‌ ద్వారా వచ్చే లివర్‌ వ్యాధి. ఇది కలుషితమైన నీటి ద్వారా కాని, లేక కలుషితమైన ఆహారం ద్వారా కాని వ్యాప్తి చెందుతుంది. ప్రతి ఏటా, ప్రపంచవ్యాప్తంగా పది మిలియన్ల ప్రజలు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. రోగక్రిమి శరీరంలో ప్రవేశించినప్పటి నుండి రోగల ణాలు మొదలయ్యే వరకు (ఇంక్యుబేషన్‌ పీరియడ్‌) సాధా రణంగా, రెండు నుండి నాలుగు వారాల వరకు ఉంటుం ది. హెపటైటిస్‌ -ఎ టీకాతో ఈ వ్యాధిని నిరోధించవచ్చు.

వ్యాధి పుట్టుక
వ్యాధికారక క్రిమి గొంతు లేక ప్రేవులోని కణజాలాన్ని చొచ్చుకొని, రక్తం ద్వారా లివర్‌కు చేరి, అక్కడ అభివృద్ధి చెందుతుంది.

ప్రివలెన్స్‌
వ్యాధికారక క్రిములు రోగి మలంలో కనబడతాయి. ఈ వ్యాధి ప్రబలంగా ఉన్న దేశాలను సందర్మించే వారికి, రోగితో సంభోగించిన వారికి, రోగి వాడిన సూదులు, సిరెంజిలు వాడిన వారికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ.

డా ధర్మేష్‌ కపూర్‌, హెపటాలజిస్ట్‌--గ్లోబల్‌ హాస్పిటల్‌, లక్డీకపూల్‌ @ surya Telugu daily news paper (July 15, 2013)

  • ===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

Good sleep protect our health How?, నిద్రో రక్షతి రక్షితః అంటారు నిజమేనా?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర : Good sleep protect our health How?, నిద్రో రక్షతి రక్షితః అంటారు నిజమేనా?
జ : చెప్పటానికి కాస్త చిత్రంగా ఉన్నా నిద్రో రక్షతి రక్షితః అన్న సూక్తిని సమర్థించు కోవచ్చు. నిద్ర ను జాగ్రత్తగా కాపాడుకొంటే ఆ నిద్రే ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుతుంది. నిద్ర కు ఉన్న బలం అదే. వాస్తవానికి నిద్ర అంటే జీవితంలో ఒక అత్యంత అవసరమైన అంశం అన్న మాట. శరీరమంతా నిద్ర లోనే తగిన విశ్రాంతిని పొందగలుగుతుంది. మెదడు, ఆవశ్యక అంగాలు తప్ప మిగిలిన అవయవాలన్నీ పూర్తిగా పనిచేయటం నిలిపివేసి విశ్రాంతినొందుతాయి.

రోజుకి ఎంత సేపు నిద్ర పోవాలి అనే దాన్ని ఏకరీతిన నిర్ధారించలేం. వయస్సు, ఆరోగ్య పరిస్తితుల్ని ద్రష్టిలో ఉంచుకోవాలి. ఆరోగ్యవంతమైన మనుషుల్లో రోజుకి7-8 గంటల పాటు నిద్ర అవసరం. పెద్ద వయస్సు వారు, చిన్నారుల్లో ఎక్కువ సేపు నిద్ర కావాల్సి ఉంటుంది. నిద్ర ద్వారా శరీరంలోని అవయవాలన్నీ రీ చార్జ్‌ అవుతాయి. ఎదుగుదల కు తోడ్పడే గ్రోత్‌ హార్మోన్‌ నిద్ర తో ముడివడి ఉంటుంది. అందుకే చిన్నారులు ఎక్కువ సేపు నిద్ర పోతారు. దీని వలన వారిలో గ్రోత్‌ హార్మోన్‌ ఎక్కువగా స్రావితం అవుతుంది. ఫలితంగా చిన్నారులు చక్కగా ఎదగగలుగుతారు. అందుకే పసికందులు 15-18 గంటల పాటు నిద్రలోనే ఉంటారు. ఎదిగే కొద్దీ ఈ సమయం తగ్గుతూ వస్తుంది. బడికి వెళ్లే పిల్లలకు 10-12 గంటల పాటు నిద్ర అవసరం. పెద్ద వాళ్లలో ముఖ్యంగా మహిళల్లో నిద్ర అవసరం చాలా కనిపిస్తుంది.

తగినంత నిద్ర లేకపోతే వ్యాధి నిరోధక శక్తి జనించదు. దీని వలన తేలిగ్గానే చిన్నా చితక రోగాల బారిన పడతారు. అంతేగాకుండా మెదడులో హార్మోన్‌ ల స్రావం దెబ్బ తింటుంది. పలితంగా చికాకులు, విసుగుదల పెరిగిపోతాయి. తెలియకుండానే శరీరం లోపల మైక్రో స్లీపర్లు రెడీ అవుతాయి. వీటి విడుదల వలన మగత గా తయారు అవుతుంది. దీని వలన సరైన నిర్ణయం తీసుకొనే శక్తిని కోల్పోతారు. చివరకు నిద్ర లేని లక్షణంతో డిప్రెషన్‌ కు లోనయ్యే అవకాశం ఉంటుంది.నిద్రను నిర్లక్ష్యం చేస్తే నిద్ర లేమికి గురయ్యే అవకాశం ఉంటుంది. కావాలని నిద్ర ను తప్పించుకొనే వారికి అది అలవాటుగా మారిపోతుంది. కొన్ని రోజులకు నిద్ర పోదామని అనుకొంటున్నా నిద్ర పట్టని స్థితి ఏర్పడుతుంది. అప్పుడు చింతించి ఉపయోగం ఉండదు. శరీరం లోపల రెండు రకాల గ్రంథులు ఉంటాయి.

నాళ గ్రంథులు (అంటే గ్రంథి నుంచి ఒక నాళం ఉంటుది) నుంచి ఎంజైమ్‌ లు స్రావితం అవుతాయి. వీటి ని జీర్ణ ప్రక్రియలో ఉపయోగిస్తారు. నిద్ర లేకపోవటం వలన ఈ స్రావం సరిగ్గా ఉండదు. నిద్ర సరిగ్గా లేకపోతే కొన్ని సార్లు జీర్న ప్రక్రియ మీద ప్రభావం చూపవచ్చు. వినాళ గ్రంథులు (అంటే నాళం లేకుండా ఉండే గ్రంథులు)హార్మోన్‌లను స్రవిస్తాయి. ఇవి నేరుగా రక్తంలోకి విడుదల అయి ఎక్కడ అవసరం ఉంటాయో అక్కడ పనిచేస్తాయి. వీటి విడుదలను మెదడు క్రమబద్దీకరిస్తుంది. సరిగ్గా నిద్ర లేకపోతే ఈ సమన్వయం తగ్గిపోయి సక్రమంగాహార్మోన్‌ల స్రావం ఉండకుండా పోతుంది. ఎక్కువ కాలం నిద్ర లేని అలవాటు తో ఒత్తిడి పెరిగిపోతుంది. ఇది రెస్టులెస్‌ కండీషన్‌ కు, డిప్రెషన్‌ కు దారి తీస్తుంది.

  • *=========================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

Monday, July 22, 2013

Feeling anxiety for small things , చిన్న విషయానికి ఆందోళన చెందడం

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము . *

ప్ర : ఎందుకో తెలియదుకాని ప్రతి చిన్న విషయానికీ ఆందోళన పడుతుంటాను . ఎవరైనా ఇంటి వస్తున్నారన్నా, నేను ఎవర్నైనా కలవాలన్నా , పిల్లల పరీక్షలయినా అందోళనగా ఉంటుంది. ఇక డబ్బు విషయాలు నిద్ర రాకుండా చేస్తుంటాయి. ఇది చెడ్డ అలవాటని తెలుసు . ఎలా అధిగమించాలి ?.

జ : ఆందోళన అనేది సహజము గా వస్తుంది. మామూలుగా మానవులకు కొద్దిగా ఆందోళన అవసరమే . దైనందిన జీవితము సరిగా సాగడానికి ఇది అవసరము.
  • =========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Itching and scaly scalp,మాడు దురదగా స్కేలిగా ఉండడము

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము . *

 ప్ర : హుమిడిటీ వాతావరణము వలన నా మాడు దురదగా , స్కేలిగా ఉండు జుట్టు నూనెగా చిక్కుల్లో కనబడుతుంది . ఏం చేయాలి ?

జ : తడి వాతావరనములో చాలా మంది ఎదుర్కొనే సమస్య ఇది . వేసవి నుండి వర్షాలు విముక్తి ఇచ్చినా హ్యుమిడిటీ  మాడుకు , శిరోజాలకు సమస్యలు తెచ్చిపెడుతుంది. తలలో బాగా చెమటలు పోసి  క్రిములు -- ఫంగస్ , ఈష్ట్ , బాక్టీరియా ఏర్పడతాయి. దీనివల్ల చుండ్రు పెరిగి స్కేలీగా ఉండును. దురదకూడా ఉంటుంది.

తరచూ లేదా ప్రతిరోజూ  మైల్డ్ షాంపు తో తలస్నానము చేస్తుండాలి. మాడును పరిశుబ్రముగా ఉంచుకోవాలి. జుట్టుకు నూనె రాయవద్దు . దీనివల్ల ఫంగస్ ఇంఫెక్షన్‌ పెరుగుతుంది. ఒకవేళ నూనె రాస్తే అరగంటలో స్నానము చేయాలి.  వెంట్రుకలు హైరోస్కోపిక్ గుణాలు కలిగి నీటిని త్వరగా పీల్చేస్తాయి. దీనివలన చిక్కులు పడి మేనేజ్ చేయడము కష్టమవుతుంది. శిరోజాల స్వభావాన్ని అనుసరించి హెయిర్ క్లెన్సర్లు వాడాలి. తరచూ తలస్నానము వల్ల జిడ్డు మురికి పేరుకోవు .

కండిషనింగ్ చేసుకుంటుంటే చిక్కులు పడవు . స్టయలింగ్ ఉత్పత్తులు వాడడము తగ్గించాలి. తల వర్షము నీళ్ళలో తడవకుండా జాగ్రత్త వహించాలి. మూడు వారాలకొకసారి డీప్ కండిషనింగ్ ప్రోటీన్‌ చికిత్సవల్ల చిక్కులు పడడము తగ్గిపోతుంది .
  • =========================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

Sunday, July 21, 2013

Beauty and Sleep, అందానికి నిద్రకి లంకె

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ఫ్ర : అందానికి నిద్రకి లంకె(సంబంధము)ఉందంటారు . అది ఏమిటి?

జ : నిద్రకు , ఆరోగ్యానికి అవినాభావసంబంధము ఉంటుంది .. ఇది మనము ఎల్లప్పుడూ చెప్పుకునే సంగతే . ఇక్కడ నిద్రకు ... అందానికి చాలా దగ్గరి సంబంధము ఉన్నది. 7-8 గంటలు హాయిగా , సుఖముగా నిద్రపోయినప్పుడు అనేక అంతర్గత జీవక్రియలు కొనసాగుతాయి. ఈ ప్రక్రియలన్ని చురుగా పూర్తయితే ముఖము ప్రత్యేకముగా మెరిసిపోతుంటుంది. అదే నిద్రలేమి ముఖము పేలవం గా , నీరసం గా కనబడుతుంది. వయసు మీదపడిన భ్రాంతి కలిగిస్తుంది. కళ్ళకింద ఉబ్బులు వచ్చేసి , అలసటగా కనపడతారు .

నిద్ర చాలనపుడు బరువూ పెరిగిపోతారు . పనుల్లో చురుకుతనము మందగిస్తుంది. కాబట్టి కంటినిండా నిద్రపోతే అందం ఇనుమడించి , నిగారింపుగా కనపడతారు . అయితే అతిగా నిద్రపోయినా అందం ప్రబావితం కాక తప్పదని నిపుణులు చెప్తున్నారు . అతిగా నిద్రపోవడమువల్ల చర్మము సాగిపోతుంది. ఇది అనారోగ్యకర లక్షణము . ఆహారము కొంచమే తిన్నప్పటికీ 10 గంటలకు మించి నిద్రపోతే స్థూలకాయము వస్తుంది . అంటే నిద్ర విషయములోనూ ''అతి'' అనర్ధదాయకమే .
  • ===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

Friday, July 19, 2013

role of food labels in health,ఆరోగ్యవిషయములో ఫుడ్ లేబుల్స్ పాత్ర

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 Q :What is the role of food labels in health?.ఆరోగ్యవిషయములో ఫుడ్ లేబుల్స్ పాత్ర ఏమిటి?.

జ : ప్యాక్డ్ పదార్ధాల విషయములో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తెలుసుకోవాలి . ఇందుకు సంబంధించిన  ఫుడ్ లేబుల్స్ కు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఫుడ్ & డ్రగ్ ఎడ్మినిష్ట్రేషన్‌ (FDA) సిఫార్స్ చేసిన ఆహారలేబుల్స్ ఆ యా పదార్ధాలలో చెక్కెరలు , ప్రోటీన్లు , కొవ్వులు , ఇతత పోషకాలు ఎంతెంత ఉంటాయనంది సూచిస్తుంది. వీటిపైగల చాలా భాగము పోషకాల్ని గ్రాముల్లో పోర్కొంటారు. కొన్నింటిని మి.గ్రా. ల్లో తెలియజేస్తారు.

సర్వింగ్ సైజ్ , దానిలో వాడిన ఇత పదార్ధాల వివరాలు ఉంటాయి,తయారు తేదీలు ఉంటాయి.  ఏవి కొన్నా ముందుగా వీటిని చదువుకోవాలి. తమ తమ ఆరోగ్య స్థితిగతుల్ని బట్టి ఏ పాదార్ధాలు అవసరమో , ఏది ఎక్కుగో ,ఏదిపడదో  నిర్ణయించుకున్న తర్వాతే వాటిని కొనుగోలు చేయాలి. ప్రదానముగా గనించాల్సినది తయారీ తేదీల్ని , క్యాలరీల మోతాదూ సరిచూడాలి. కాబట్టి కుటుంబము మొత్తము ఆరొగ్యాన్ని కాపాడే పాదార్ధాల షాపింగ్ ను హడావిడిగా , మొక్కుబడిగా ముగించక ఆచితూచి నింపాదిగా ఎంచుకోవాలి.
  • =========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Tuesday, July 9, 2013

How to prevent rough eruption of daily beard saving,నిరంతర షేవింగ్ వల్ల వచ్చే షేవ్బంప్స్

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము . *

 ప్ర : నిరంతర షేవింగ్ వలన నాముఖము పై అసమాన ఎరప్షన్‌ వచ్చి చూడడానికి అసలు బాగుండడములేదు . వీటిని పోగొట్టే మార్గము సూచించంది ?

జ : షేవింగ్ వలన " స్యూడో ఫాలిక్యులిటీస్ బార్బె " లేదా షేవ్ బంప్స్ వస్తాయి. ఇవి షేవింగ్ ఇర్రిటేషన్‌ వలన కలిగే సమస్య . మందపాటి వెంట్రుకలుండడమువల్ల మగవారిలో సహజముగా ఈ సమస్య ఉంటుంది. ఇది సర్వసాదారణమే.

షేవ్ చేసిన వెంట్రుకలు తిరిగి పెరుగుతున్నప్పుడు  వెనక్కి పెరిగి కుదుళ్ళ నుండి తిన్నగా రావడానికి బదులు కర్లీగా వస్తాయి. సూడో ఫాలిక్యులిటీస్ వలన చర్మము ఎర్రగా కంది పోతుంది . దురద కూడా వస్తుంది. ఆ ప్రదేశము ఇన్పెక్షన్‌ అయి చిన్న చిన్న పొక్కుల్లాంటివి రావచ్చు. ప్రతి రోజూ షేవ్ చేసుకునేవారు 0.5 - 1 మి.మీ.దాకా వెంట్రుక పొడవు వదిలేయాలి. ఎలక్ట్రిక్ రేజర్ వాడడము ఒక మంచి ప్రత్యామ్నాయము .
  • =========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Precautions taken after swimming-pool bath,స్విమ్మింగ్ చేశాక శిరోజాల రక్షణకు జాగ్రత్తలు

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ఫ్ర : స్విమ్మింగ్ చేశాక శిరోజాల రక్షణకు ఏవిధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ?

జ : పూల్ లో డైవ్ చేయడానికి మించిన వ్యాయామము , వేసవిలో చల్లదనాని మరొకటిలేదు. పూల్ కలిపిన క్లోరీన్‌ హానికి బయపడి స్విమ్మింగ్ కు దూరముగా ఉండడము సబబుకాదు . శిరోజాలకు నష్టము జరక్కుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.

హెడ్ క్యాప్ పెట్టుకుని నీటిలోకి దిగాలి. జుట్టుకి ఆలివ్ లేదా కొబ్బరి నూనే కొద్దిగా రాసుకోవాలి . స్విమ్మింగ్ చేసిన తరువాత క్లోరీన్‌ ఆనవాళ్లును శుభ్రముగా కడిగేసి , కండిషనర్ అప్లైచేయాలి . " క్లారిఫైయింగ్ షాంపూ " క్లోరీన్‌ ను కడగడానికి మంచి ఎన్నిక . వారానికోసారి హెయిర్ ప్యాక్ వేసుకుంటే జుట్టు రఫ్ గా కాదు . . . దీనికి పెరుగు ,గుడ్డు  మిశ్రమము బాగా పనిచేస్తుంది. ప్రోటీన్లు , విటమిన్లు , ఖనిజలవణాలు ఉన్న ఆహారపదార్ధాలు అధికము గా తినాలి.
  • =========================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

Sunday, July 7, 2013

Diet and Life style in weight loss- డైట్ .లైఫ్ స్టైల్ ...వెయిట్లాస్ ప్రోగ్రాం ని ప్రభావితము చేస్తాయా?

  • ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము . 
 ప్ర : డైట్ , లైఫ్ స్టైల్ ...వెయిట్లాస్ ప్రోగ్రాం ని ప్రభావితము చేస్తాయా?.

జ : బరువు తగ్గాలని భావిస్తున్నట్లయితే ఈ రెండూ కీలక పాత్ర  వహిస్త్రాయి. దాదాపు 80 శాతము బరువు విషయాలు ఈ రెండింటితో ముడిపడి ఉంటాయి . బాగా వ్యాయమము చేస్తూ ఉన్నా ... ఆహారము , జీవన విధానము లోను సరిగా లేకపోతే ఆశించిన ఫలితాలు  పొందలేము . వేళ ప్రకారము భోజనము చేసినా మితము గా ఉండాలి . పనిలో పడి సమయానికి భోజము చేయక చిరుతిల్లు తిన్నా బరువు తగ్గే విషయము లో లాభము ఉండదు. చాలినంత నిద్ర పోతున్నారా  లేదా అలోచించాలి . చాలా మంది హిందూ స్త్రీలు  దేవుని పూజలు , వ్రతాలు పేరిట ఉపవాసాలు చేస్తారు కాని ప్రసాదము పేరిట చెక్కెర , నూనే పదార్ధాలు తింటూ ఉంటారు. ఇది కొవ్వుగా మారి శరీర బరువును పెంచుతుంది. కడుపునిండా అంబలి , గెంజి తాగిన వారికి అనారోగ్యము దూరము గా ఉంటుంది.
  • ==========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS

Drinking water in summer,వేసవికాలములో నీరు త్రాగడము

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ఫ్ర : వేసవి కాలములో నీరు తాగడాన్ని ఏ విధముగా పెంచుకోవాలి ?

జ : నీరు త్రాగడానికి ఒక ఫార్ములా , పద్దతి అనుసరించాల్సిన అవసరములేదు . దాహము వేసినప్పుడల్లా త్రాగవచ్చును. రోజికు రెండు - మూడు లీటర్ల నీటిని లక్ష్యముగా పెట్టుకొని అప్పుడప్పుడు ఓ గ్లాసు చొప్పున్న దాహముతో నిమిత్తములేకుండా త్రాగుతూ ఉందాలి .

జ్యూస్ లు , పాలు , మజ్జిగ , కొబ్బరినీరు , రసము , సూప్ ...చివరకు కాఫీ , టీ, వంటి పానీయాలు కూదా ఈ నీటికోవలోకి వస్తాయి. దాహము వేసినప్పుడు నోరు , గొంతు , ఎండిపోయినట్లుంటాయి. ఈ లక్షణాన్ని నిర్లక్ష్యము చేయకూడదు . ఇలా చేయడము వల్ల శరీరములొ నీటిస్థాయి తగ్గిపోయి మూత్రము సరిగా రాదు. వ్యాయామము చేసినపుడు , ఎండలోకి వెళ్ళినప్పుడు నీటి అవసరము మరింత ఎక్కువ కాబట్టి కావలసినంత నీరు త్రాగుతూ ఉండాలి . . . లేనట్లయితే డీహైడ్రేషన్‌ వస్తుంది. ఉదయము లేస్తూనే గ్లాసులకొద్దీ (లీటర్లకొద్దీ)నీరు తాగేయాలనుకోవడము సరికాదు. దీనివల్ల శరీరముపై ముఖ్యము మూత్రపిండాల పైన అనవర ఒత్తిడి పెరుగుతుంది . సోడియము , పొటాసియం వంటి ఇతర లవణాలు డైల్యూట్ అయిపోతాయి. రోజంతా కొద్దికొద్దిగా దాహము ఉన్నా లేకపోయినా నీరు త్రాగుతూ ఉండడము మంచి అలవాటు
  • *===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

Saturday, July 6, 2013

feeling guilty of her beauty, అందంగా లేనని బాధపడుతోంది.

  •  



ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

Q : నాకు చిన్న వయసులోనే పెళ్లయింది. వెంటనే పాప కూడా పుట్టింది. నాకింకా నలభయ్యేళ్లు దాటలేదు. అప్పుడే అమ్మాయి పెళ్లీడుకొచ్చింది. నేను సన్నగా ఉంటా. మా అమ్మాయి కంటే రంగు ఎక్కువే! ఎప్పుడైనా తనూ, నేనూ బయటకు వెళితే 'మీరిద్దరూ అక్కాచెల్లెళ్లా' అని అడుగుతున్నారు. నేను అందంగా ఉన్నానని ఎవరైనా నాతో అంటే దానికి కోపం వస్తోంది. ఈ మధ్య తరచూ 'నాకు అక్క కాదు కావల్సింది, అమ్మ కావాలి! నువ్వు వయసుకు తగ్గట్టు వ్యవహరించడం లేదు' అంటూ చిరాకు పడుతోంది. నాతో బయటకు రావడం కూడా తగ్గించేసింది. తొందరలో పెళ్లి చేద్దామని సంబంధాలు చూస్తున్నాం. 'నేనెవరికీ నచ్చనులే' అంటూ అసహనంగా మాట్లాడుతోంది. నన్నొక శత్రువులా చూస్తోంది. అందంగా కనిపించడం నా తప్పు కాదు కదా! ఏదైనా సలహా ఇవ్వండి.- ఓ సోదరి

A : మొదట మీ అమ్మాయి తన అందం గురించి తక్కువ అంచనా వేసుకోవడం, ఆత్మన్యూనతకు లోనవ్వడానికి సంబంధించి లోతుగా ఆలోచించండి. మీతో పోల్చుకుని మాత్రమే బాధపడుతోందా... ఇతరుల మాటలకు తను కుంగిపోతోందా అన్నదీ జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ తన అందం, రూపురేఖల గురించి మీరు కానీ, కుటుంబసభ్యులు కానీ ఆటపట్టిస్తూ ఏమయినా అనడం జరుగుతోందా? ఇంట్లో వాళ్లే తరచూ తన అందం గురించి విమర్శిస్తూ మాట్లాడుతుంటే అది ఆత్మన్యూనతకు దారితీస్తుంది. అటువంటి పరిస్థితి ఉంటే వెంటనే మారేలా చూడండి.

మీరు అమ్మాయితో బయటకు వెళ్లేప్పుడూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఎవరైనా తన ముందు మిమ్మల్ని పొగిడినప్పుడు ఆ ప్రశంసను స్వీకరిస్తూనే, సంభాషణను మార్చేయండి. మీ అమ్మాయికి సంబంధించిన ప్లస్‌ పాయింట్లను సందర్భోచితంగా ప్రస్తావించండి. 'మా అమ్మాయి మంచి రంగులూ, డిజైన్లూ ఎంపిక చేస్తుంది', 'మొన్న పండక్కి తనకి పంజాబీ డ్రెస్‌ కొందామనుకున్నా, తను చక్కటి జీన్స్‌, టాప్‌ కొనమంది. అలాగే చేశా. నిజంగానే అవి తనకు చాలా బాగున్నాయ్‌' అని చెప్పండి. అదేసమయంలో అందం, రూపురేఖల కన్నా చదువూ, వృత్తిపరంగా లభించే గుర్తింపు చాలా ముఖ్యమని నెమ్మదిగా అర్థం అయ్యేలా చెప్పండి. అలా పేరు తెచ్చుకున్న కొందర్ని ఉదాహరణగా చూపండి. ప్రవర్తనా పరంగా వచ్చే గుర్తింపు ఎప్పటికీ వెంటే ఉంటుందనే నిజాన్నీ, సౌందర్యం అనేది తాత్కాలికమనే విషయాన్నీ వివరించండి. అలానే ఇప్పుడు అందానికి మెరుగులద్దుకునే సౌందర్య సాధనాలెన్నో అందుబాటులో ఉన్నాయి. నిపుణుల సాయంతో మొటిమలూ, ఛాయ మెరుగుపడటం వంటి సమస్యల్ని అధిగమించేలా చూడండి. అమ్మాయి దూరమవుతోంది అన్న ఆలోచనను పక్కనపెట్టి, మీరు మంచి స్నేహితురాలని తను అనుకునేలా మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీ వైపు నుంచి చేసుకోవాల్సిన మార్పులేమైనా ఉన్నాయేమో ఆలోచించండి. అమ్మాయితో బయటకు వెళ్లినప్పుడు హుందాగా కనిపించేలా తయారవ్వండి. 'అమ్మ నాకు ఎప్పుడూ అండగా నిలబడుతుంది. అర్థం చేసుకొని నా కోసం ఆరాట పడుతుంది' అనే స్థాయికి తీసుకురండి.

source : Dr.Padmaja - Psychologist@dear vasundara
  •  =========================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS -