Showing posts with label more sleeping in pregnency. Show all posts
Showing posts with label more sleeping in pregnency. Show all posts

Thursday, June 4, 2015

more sleeping in pregnency,గర్భిణి లో ఎక్కువ నిద్ర మంచిది కాదా?

  • ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము . 
  •  
  •  
 ప్ర : ఇప్పుడు నాకు నాలుగో నెల .చాలా అలసటగా ఉంటుంది. ఎప్పుడూ నిద్రపోతూ ఉంటాను. పటివేశ దాదాపు 5 గంటలు , రాత్రులలో మరో 10 గంటలు నిద్రపోతూ ఉంటాను. ఇది సహజమేనా?

జ : గర్భము దాల్చాక ఎంతోకొంత నీరసము ,అలసట్ ,  అతినిద్ర ఉండడము సహజమే కాని ఎక్కువ అలసట , మరీ నిద్రపోవడము మంచిది కాదు. హైపో థైరాడ్ జబ్బు ఉందేమో పరీక్షలు చేయించుకోండి.  తరువాత చురుకుగా('active) గా ఉండడానికి ప్రయత్నించండి. ఏదో ఒక వ్యాయామము , ఏదో ఒక వ్యాపకము , పనులు , హాబీలతో మిమ్మలి మీరు చురుకు గా ఉండడానికి ప్రయత్నించండి. దీనివల్ల హుషారుగా ఉండి , నిద్రపోవాలన్న ఆలోచన రాదు. పౌష్టికాహారము తీసుకుంటే అలసట రాదు . వ్యాయామము ఒక తప్పనిసరి పనిగా లేదా  ట్రీట్మెంట్ గా బావించి రోజూ నడక ('walking) వ్యాయామము చేయాలి.

  • *===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -