Wednesday, September 16, 2015

తగ్గిన బరువు తిరిగి పెరగకుండా ఉండాలంటే ఎంతసేపు వ్యాయామము చేయాలి?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
  •  
  •  

ప్ర :  తగ్గిన బరువు తిరిగి పెరగకుండా ఉండాలంటే ఎంతసేపు వ్యాయామము చేయాలి?

ప్ర : కనీసము రోజూ 90 నిముషాలు పాటు వ్యాయామము చేయాలి తగ్గిన బరువు తిరిగి పెరగకుండా ఉంటుంది. . ఇంతసేపు వ్యాయామము చేయాలంటే చాలా ఓపిక ఉండాలి.  ఒక్క ఎక్షరసైజ్ మూలంగానే బరువు పెరగడం అదుపు  సాధ్యపడదు . అహారము కూడా తక్కువగా తీసుకోవాలి. ఆకుకూరము , కాయకూర్లు ఎక్కువగా తినాలి. కార్బోహైడ్రెట్స్ కంటే పోటీన్‌ ఫుడ్ తీసుకోవడం చేస్తూఉండాలి. చేసే వ్యాయామము క్రమము తప్పకుండా చేయాలి. తక్కువ ఆహారము రోజులో ఎక్కువసార్లు  తీసుకోవాలి. పీచుపదార్ధము ఎక్కువగా ఉన్న ఆహారమునే తీసుకుంటూ ఉండాలి.

  •  *===========================

Saturday, September 12, 2015

చాడీలు చెప్పడం అనారోగ్యమా?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
  •  

  •  
ప్ర : చాడీలు చెప్పడం అనారోగ్యమా?

జ : అవును చాడీలు చెప్పడం ఒక చెడు అలవాటు . దానివలన మానసికము గా ఒత్తిడికి గురు అయ్యే ప్రమాదము ఉన్నది. వయసు ఎంతపెరిగినా మూడోవ్యక్తి గురించి చాడీలు మాట్లాడుకుంటారు. ఇలా చాడీలు చెప్పుకోవడానికి కారణాలు చాలానే ఉంటాయి.

  • కొందరు ఉబుసుపోక చాడీలు చెప్పుకుంటారు.
  • కొందరు అలా చెప్పుకో్వడము లో ఎనలేని ఆనందాన్ని పొందుతారు. 
  • కొందరు అసూయతో చాడీలు చెప్తూ ఉంటారు.  
తమకంటే వాళ్ళు ముందున్నరనో , తమకు ఆ అవకాశము లాలేదనో మూడోవ్యక్తి గురించిన అనవసర సంభాషణకు దిగుతుంటారు. ఇది ఎంతమాత్రము సమంజసము కాదని గ్రహించాలి. అసూయ అనేక అనర్ధాలకు దారితీస్తుంది. ఎదుటి వ్యక్తిని కించపరుస్తూ మాట్లాడడం , అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటూ చాడీలు చెప్పుకుంటూ మాట్లాడడము చేస్తూఉంటారు. అసూయతో లేనిపోని ఒత్తిడికి లోనై  ఆరోగ్యము పాడుచేసుకుంటారు. 

మానసిక అలసట అంటే ఏమిటి? చికిత్స ఎలా?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
  •  
  1.  

 ప్ర : మానసిక అలసట అంటే ఏమిటి? చికిత్స ఎలా?

జ : రోజూ చేసే పనులవల్ల శరీరము బాగా అలసిపోతుంది. నిజమే - ఈ విషయాన్ని అందరూ గుర్తిస్తారు ... అయితే దీంతోపాటు మనసూ అలసిపొతుంది. ప్రతి పనికీ శరీరము ఎంగగా కష్టపడుతుందో మనసు కూడా అంతే ఒత్తిడికి గురవుతుంది. ఈ ఒత్తిడి అలా అలా పెరిగిపోయి .. మానసికంగా కుంగిపోయేలా చేస్తుంది . ఆ ఒత్తిడి ఎంతగా పెరిగిపోతుందంటే ... - ఇక ఆ పనిచేయడము నావల్లకాదు అని చేతులెత్తేసేదాకా . ఇటువంటి ఒత్తిడిని వెలికినెట్టేయడము ఒక్క వ్యాయామము వల్లనే అవుతుంది. ఒక గంట నడకో , జాగింగో , సైక్లింగో ప్రతిరోజూ చేస్తూఉండాలి. దానికి తోడుగా మంచి కలతలు లేని నిద్ర అవసరము .