Sunday, March 31, 2013

Very less sex desires in girl-Why?,అమ్మాయిలో లైంగిక వాంఛలు బాగా తక్కువ-కారణం?

  •  
  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

Q :  మా అమ్మాయికి ముప్ఫై ఏళ్లు. ఐదేళ్ల క్రితం పెళ్లయ్యింది. ఇంకా పిల్లలు లేరు. ఆర్నెల్ల క్రితం మా అమ్మాయిని మా దగ్గర వదిలేసి వెళ్లిపోయాడు. ఎందుకని ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదు. చివరకు మా అమ్మాయిలో లైంగిక వాంఛలు బాగా తక్కువనే కారణం చెప్పాడు. అమ్మాయిని అడిగితే అన్నింటికీ మౌనంగా ఉంటోంది. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో మాకు తెలియడం లేదు. సలహా ఇవ్వండి.

A : మీ అల్లుడు చెప్పిన దాన్ని బట్టి తనలో లైంగిక వాంఛ లేకపోవడమే సమస్య అయితే దాన్ని పెంచే చికిత్స లేదనే చెప్పాలి. తన ప్రవర్తనకు దారితీసే కారణాలను ఆలోచిస్తే కొందరికి సెక్సంటే భయం ఉండొచ్చు. అది కూడా ఒక్కసారిగా కాకుండా చిన్నతనంలో ఎదురైన భయాలు పెద్దయ్యాకా కొనసాగి అలాంటి ప్రవర్తనకు దారితీయవచ్చు. అయితే కొందరు ఆ భయాలను నిర్భయంగా చర్చించలేక మనసులో దాచుకుని మరింత ఒత్తిడికి లోనవుతారు. అలాంటప్పుడే వైవాహిక జీవితంలో సమస్యల్ని ఎదుర్కొంటారు. అలాగే మీ అమ్మాయికీ, తన భర్తకీ మధ్య చక్కని అవగాహన ఉందా లేదా అన్నదీ తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కొందరు పురుషులు మిగిలిన సమయాల్లో భార్యల్ని పెద్దగా పట్టించుకోకుండా, కేవలం లైంగిక వాంఛలు తీర్చే వ్యక్తిగా పరిగణిస్తారు. దాంతో చాలామంది మహిళల్లో అంతర్లీనంగా కొంత అసంతృప్తి ఏర్పడుతుంది. దీనివల్ల ఇద్దరి మధ్యా సఖ్యత ఏర్పడదు. మీ అమ్మాయి ఇలాంటి సమస్యతో బాధపడుతోందేమో కూడా పరిశీలించండి. కొన్నిసార్లు చిన్నచిన్న అనుమానాల వల్ల కూడా భార్యాభర్తలు మనస్ఫూర్తిగా దగ్గర కాలేరు. కాబట్టి ముందు మీ అమ్మాయితో ఈ అంశాలన్నీ చర్చించండి. పై వాటిల్లో ఏ ఒక్క కారణమైనా ఉందని తను చెబితే వాళ్లిద్దరి మధ్యా సత్సంబంధాలు పెరిగేందుకు ఏం చేయాలనేది ఆలోచించండి. ఇవన్నీ కాకపోతే హార్మోన్ల మార్పులు కూడా లైంగిక వాంఛల్ని తగ్గిస్తాయి కాబట్టి గైనకాలజిస్టు సలహాతో దానికి సంబంధించిన పరీక్షలూ చేయించండి.

Answer / Dr.Kalpana G singar@eenadu vasundara
  • =========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Saturday, March 16, 2013

Menopause ? or Attention disorder?,మెనోపాజ్ ముందు దశ అనుకోవాలా? లేక ఎటెన్సన్‌ డెఫిసిట్ డిజార్డర్ అనుకోవాలా?

  •  

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : నావయస్సు 49 సం.లు . నా పనిమీద ఏకాత్రత చూపలేకపోతున్నాను . ఋతుక్రమము సరిగాలేదు . ఇది మెనోపాజ్  ముందు దశ అనుకోవాలా? లేక ఎటెన్సన్‌ డెఫిసిట్ డిజార్డర్ (ఎడిడి ) అనుకోవాలా?

జ : ఇది  ఎటెన్సన్‌ డిజార్డర్ కాదు . . మీ ఆహారము , నిద్ర , బహుళ పనుల వల్ల లేదా మూడ్ వల్ల కలిగే అలసట  వంటి కారణాలున్నాయేమో అన్వేధించండి. గైనకాలజిస్టును సంప్రదిస్తే హార్మొనుల పరీక్షలు , ఓవరీలు , యుటెరస్ సైజును పరిశీలించేందుకు ఆల్ట్రాసౌండ్ చేస్తారు. డయాబెటీస్ , హైపర్టెన్సన్‌ , థైరాయిడ్ వంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయేమో తెలుసుకునేందుకు పూర్తి బాడీ చెక్ -అప్  అవసరము . వీటిలో ఏదైనా కారణము కావచ్చును. మంచి ఆహారమూ , సరిపడినంత నిద్ర తీసుకోవాలి . అవసరమైతే సైకియాట్రిస్ట్ ను సంప్రదిస్తే తగిన చికిత్స చేస్తారు.
  • =========================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

Benifit of washing vegetable before use?,కూరగాయలను వండేముందు కడగడంవల్ల లాభం ఉంటుందా?

  •  

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 Q. కూరగాయలను వండేముందు కడగడంవల్ల నిజంగా లాభం ఉంటుందా?

A.  కొందరు ఈ సంగతి గురించి పట్టించుకోరు. మరికొందరు మాత్రం విపరీతంగా కడుగుతుంటారు. 2011లో జర్మనీలో కూర ముక్కల కారణంగా ఈకోలై అనే క్రిమి వ్యాపించి పెద్ద సమస్యగా మారింది. కానీ, కూరగాయలను నీటి లో ముంచినందుకూ, నీటి ధార కింద ఉంచినందుకూ అసలేమయినా లాభం ఉంటుందా? అన్నది ఇక్కడి అసలు సమస్య.
కడిగినందుకు పైనుండి అపరిశుభ్రత కొంతవరకు పోతుంది. దీనివల్ల కలరా వంటి నిజంగా భయంకరమయిన సమస్యల నుంచి రక్షణ దొరుకుతుంది. కలరా సోకాలంటే, ఒక వ్యక్తికి కనీసం ఐదు లక్షల సూక్ష్మక్రిములు సోకవలసి ఉంటుంది. కడిగితే, ఆ సంఖ్య తగ్గుతుంది కనుక వ్యాధి సోకే అవకాశం తగ్గుతుంది. కడిగిన తర్వాత కూడా కొన్ని క్రిములు మిగిలి ఉంటే, దాంతో కొంత నలత ఏర్పడవచ్చు. చిత్రంగా దీనివల్ల శరీరానికి మంచి జరుగుతుంది. ఆ ప్రత్యేక క్రిమిని ఎదుర్కోవడానికి శరీరంలో ప్రతి రక్షక కణాలు పుడతాయి. మరోమారు క్రిములు సోకితే, వాటిని బలంగా ఎదురుకుంటాయి. దీనే్న రోగ నిరోధకత అంటారు.
ఆహారం ఎంత శుభ్రంగా కనిపించినా అందులో ఎంతో కొంత ఇన్‌ఫెక్షన్ ఉండనే ఉంటుంది. హైపోక్లోరైట్ లేదా పెరాక్సయిడ్ లాంటి రసాయనాలు కలిగిన నీటితో కడిగితే, వాటి మీది మురికి మరింత తక్కువవుతుంది. కడిగినందుకు అంతా పరిశుభ్రమవుతుందన్న నమ్మకం కొంతవరకే. షైజెల్లాలాంటి క్రిములు ఒకటి నుంచి కొన్ని ఉన్నా సరే తీవ్రమయిన అనారోగ్యం కలుగుతుంది. ఒక క్రిమి కూడా లేకుండా కడగడం ఇంచుమించు అసాధ్యం.
సూక్ష్మజీవులను పరిశోధన కాలం లో కల్చర్ పద్ధతిలో పెంచుతారు. అక్కడ ఎంత పరిశుభ్రం చేసినా ఎంతోకొంత కంటామినేషన్ మిగిలి ఉంటుందన్న సంగతి బాగా అనుభవంలోకి వస్తుంది. కూరగాయల ద్వారా ప్రమాదకరమయిన ఆరోగ్య సమస్యలున్నాయన్న అనుమానం ఉంటే మాత్రం కడగడం అన్న సులభోపాయం పనికి రాదు. కనుక, చుట్టుప్రక్కల అలాంటి సమస్య ఉందని తెలిసినపుడు, కూరగాయల తొక్క తీయడం, బాగా ఉడికించడం, ఆ తర్వాత సంగతి గురించి మరిచిపోవడం మంచిది అంటారు నిపుణులు!
ఇక మనం వాడుతున్న నీరు నిజంగా క్లోరిన్ కలిపినదయితే కడగడంవల్ల కొంతయినా ప్రయోజనం ఉంటుందని మరికొందరు నిపుణులు అంటున్నారు. తాగడానికే మంచినీరు దొరినివారు, కడగడం పేరున నీరు పారబోస్తే అది దండగేనని వారి అభిప్రాయం. నిజంగా కడగాలనుకుంటే మాత్రం ‘ఫిరంగీ పానీ’ (పింకీ పానీ) వాడాలి. తెల్లదొరలు భారతదేశంలో గడిపిన రోజులలో పొటాషియం పర్మాంగనేట్ పలుకులను నీటిలో వేసి, కరిగించి, ఆ ఎరుపు ఛాయ నీటితో పళ్లు, కూరలను కడిగేవారట. అది నిజంగా క్రిములను తొలగించగల పద్ధతి. ఆ నీరు కడుపులోకి పోయినా మనుషులకు ఏ రకంగానూ అపకారం జరగదు. నిజానికి మాంగనీసు శరీరానికి అందితే, కండకరాలు, లిగమెంట్స్ మరింత బలపడతాయి. మనవారు ‘అడవిలో పులి ముఖం కడుగుతుందా?’ అని అడిగేవారు. కొన్ని దశాబ్దాల క్రితం పల్లెవారు అడవిలో తిరుగుతూ కాలువల్లో నీరు తాగారు. వారి ఆరోగ్యం లక్షణంగా ఉండేది. ఇప్పటికీ ఉంది. పాల సీసాలు, పీకలు మరిగించి, పాలు పట్టిన పిల్లలు, మామూలు మంచినీరు తాగినా ఏదో సమస్య వస్తుంది!

source : Andhraprabha news paper
  • =========================
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Saturday, March 2, 2013

Over-weight and backach ,అధిక బరువు నడుమునొప్పి

  •  
  •  Backach due to overweight.
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్రశ్న : నా వయసు 48 సం.లు . కిరాణా వ్యాపారము చేస్తూ ఉంటాను . అస్తమానము కూర్చొని ఉండడము వలనేమో గత 10 సంవత్సరాలుగా నా బరువు 28 కిలోలు పెరిగి 98 కి.గ్రా.లకు చేరింది. గత సంవత్సరము నుండి విపరీతమైన నడుమునొప్పి తో బాధపడుతున్నాను. డాక్టర్లని సంప్రదిస్తే బరువు తగ్గితే నడుమునొప్పి తగ్గుతుందన్నారు. నిజమేనా?.

జవాబు : నిజమే . మగవారిలో బరువు పెరిగినపుడు కొవ్వులో అధికశారము  పొట్ట ప్రాంతములో పేరుకొని పోవడము వల్ల పొట్ట ముందుకు పొడుచుకొస్తుంది. ఇలా మీ పొట్ట ముందుకు వచ్చినప్పుడు మిమ్మల్ని బేలన్స్ చేసేందుకు మీ నడుము కూడా ముందుకు సాగి  , మీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ స్టెబిలైజ్ చేసి మీరు ముందుకు పడకుండా ఆపుతుంది. ఇలా నడుము ముందుకు వంగడము వలన మీ నడుము కండరాలు , లిగమెంట్స్  సాగడము వల్ల వాటిపై అధనపు  భారము పడి మీకు నడుమునొప్పి మొదలవుతుంది. దీని మూలము గా డిస్క్ ప్రొలాప్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ గా ఉంటాయి.

బరువు తగ్గడానికి ప్రయత్నాలు చేయండి . Hints for weight reduction

===========================
visit my website - > Dr.Seshagirirao-MBBS -

మా అమ్మ నాన్నని ఇన్‌ఫోమానియా అని అంటుంది. ఇదేమైనాజబ్బా?,What is Infomania? Is it a disease?.

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

  ప్రశ్న : మా అమ్మ నాన్నని ఇన్‌ఫోమానియా అని అంటుంది. ఇదేమైనాజబ్బా?,What is Infomania? Is it a disease?.

జవాబు : ఉదయమనగా ఉద్యోగాలకు వెళ్ళి సాయంత్రం  ఇంటికి చేరగానే భార్యాభర్తలిద్దరూ కొంతసేపైనా సరదాగా కలిసి గడపాలనుకుంటారు. పేరుకుపోయిన కబుర్లు విప్పి చెప్పుకోవాలనుకుంటారు. ఇద్దరూ అలాగే అనుకుంటే ... ఓ.కే. కాని ఆ ఇద్దరిలోఎవరైనా ఇంటికి వచ్చీరాగానే ట్విట్టర్ లొనో , ఫేస్ బుక్ లోనో తల దూర్చుతుంటే , చూసేవారికి కోపం కట్టలు కట్టలు గా రావడం పక్కనబెడితే ... చేసేవారికి " ఇన్‌ఫోమానియా " ఉన్నట్లు లెక్క.

అంటే స్మార్ట్ ఫోన్‌ కు ఇది అనారోగ్యకరమైన ఎడిక్షన్‌ అన్నమాట . సెల్ ఫోన్‌ కో , కంప్యూటర్ కో నిరంతం సమాచారము ... జోక్స్ , ఎస్.ఎం.ఎస్ లు , ఈమెయిల్స్ , యానిమేషన్‌ వీడియోస్ తగవచ్చి సమాచారము ఓవర్లోడ్ అయిపోతుంది. కొత్త లో సమాచారము ఏమిటో? అని చూడ్డం మొదలు పెడతారు. అలా చూస్తూ దానికి అలవాటైపోతారు ... అది కాస్తా ఎడిక్షన్‌ గా మారిఫోతుంది. 1980 సం. తరువాత నుండి ఈ టెక్నాలజీ అభివృద్ధి అయి యూజర్ లలో ఇది ఒక  "సైకొలాజికల్  డెబిలిటీ(psychological debility)" గా మారినది.

పడకచేరే సమయమైనా ఫోన్‌ వదలక పోతే మరీ ఎక్కువ ముప్పు తప్పదు. ఇటువంటి ధోరణి  వైవాహిక బాంధవ్యం పై తీవ్రపరిణామాలు చూపగలదు . ఇది భారీ సమస్యలకు దారి తీస్తుంది. ఏ పార్టీకో , మరే ఇతర కార్యక్రమాలకో వెళ్ళినా లేదా ఇంటిలోనైనా తనేదో పనిలో ఉన్నట్లు ఈ టెక్నాలజీ ఇన్‌ఫర్మేషన్‌ లో మునిగిపోతారు. మనసు అటే లాగుతుంది. ఎవరేమనుకున్నా వారిపని వారిదే. దీనివలన సంబంధబాంధవ్యాలు, సమయము కూడా కోల్పోక తప్పదు . రాను రాను మానసిక సమస్యలు మొదలయ్యే అవకాశం ఉంది.

  • =========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Friday, March 1, 2013

Is b.p. hereditory?,బి.పి.వంశపారంపర్యమా?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్రశ్న : నా వయసు 42 సంవత్సరాలు. నాకు బిపి 140/90, 135/80 మధ్యలో మారుతోంది. మా నాన్నగారికి బిపి ఉంది. ఆయన మందులు వాడుతున్నారు. నేను కూడా బిపికి మందులు వాడాల్సిన అవసరం ఉందా?

జవాబు : మీకున్న బిపిని హై నార్మల్‌ బిపి అంటారు. అంటే 140/90 దాటలేదు కాబట్టి మీరు తీసుకునే ఆహారంపట్ల జాగ్రత్తగా ఉండాలి. ఉప్పు తగ్గించుకోవాలి.నూనెలు ఉన్న ఆహారము(oily foods) తగ్గించాలి.  బరువు నియంత్రణలో ఉంచుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం ముఖ్యంగా నడక కనీసం అరగంటైనా చేయాలి. ఆహారంలో కాయగూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. దీని వల్ల మీ బిపి నార్మల్‌ స్థితికి వచ్చే అవకాశముంది. మీకు ధూమపానం, మద్యపానం వంటి దురలవాట్లు ఉంటే వెంటనే మానాలి. అప్పటికీ బిపి పెరుగుతుంటే మందులు వాడాల్సి ఉంటుంది. హై నార్మల్‌ బిపి 140/90లోపు ఉంటే మందులు అవసరం ఉండకపోవచ్చు.
  • =========================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

Link between Hypothyroid and Cholestero,థైరాయిడ్‌కు కొలెస్ట్రాల్‌కు సంబంధం ఏమిటి?

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

Q : నా వయసు 50 సంవత్సరాలు. ఇద్దరు పిల్లలు. ఈ మధ్య థైరాయిడ్‌ పరీక్ష చేయించుకున్నాను. థైరాయిడ్‌ ఉందని నిర్ధారణ అయ్యింది. అంతేకాక రక్తంలో ఎక్కువ కొలెస్ట్రాల్‌ ఉందని చెప్పారు. నాకు గర్భసంచి ఆపరేషన్‌ అయ్యి ఐదేళ్లు అయ్యింది. థైరాయిడ్‌కు కొలెస్ట్రాల్‌కు సంబంధం ఏమిటి? నా సమస్యకు పరిష్కారం తెలపగలరు.

A : మహిళల్లో థైరాయిడ్‌ సమస్యలు అధికం. థైరాయిడ్‌ తక్కువగా (హైపోథైరాయిడిజం) ఉన్నవారిలో కొలెస్ట్రాల్‌ పెరిగే అవకాశముంది. అందువల్ల వెంటనే 'థైరాక్సిన్‌' బిళ్లలను డాక్టర్‌ సలహా మేరకు తక్కువ మోతాదులో మొదలుపెట్టండి. కొలెస్ట్రాల్‌ తగ్గించడానికి స్టాటిన్స్‌ మందులు వాడాల్సి ఉంటుంది. మీరు మెనోపాజల్‌ వయసులో ఉన్నారు కాబట్టి డాక్టర్‌ సలహా మేరకు మందులు వాడటం, బరువు తగ్గించుకోవటం చాలా ముఖ్యం.

  • ===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS - http://dr.seshagirirao.tripod.com/

precautions to teke after hystarectoy for Fibroids,ఫైబ్రాయిడ్స్ ఉన్నందున హిస్టరెక్టమీ అయిన తరువాత జాగ్రత్తలు

  •  

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్రశ్న : నావయసు 42 సం.లు . నాకు రెండు సంవత్సరాల క్రితం ఫైబ్రాయిడ్స్ ఉండడముతో హిస్టరెక్టమీ ఆపరేషన్‌ చేశారు . నా ఓవరీస్ ని తీయలేదు .., ఇతర సమస్యలు ఏమీ రాకుండా నేను ఎటువంటి పరీక్షలు చేయిందుకుంటూ ఉండాలి? .

జవాబు :మీ గర్భసంచిని సర్విక్స్ తో సహా పూర్తిగా తొలగిస్తే మీకు ఏధైనా డిశ్చార్జి  అయితే తప్ప ప్రతిసంవత్సరము " పాప్ స్మియర్ " అవసరము లేదు. స్వయము గా బ్రెస్ట్ పరీక్షలు చేసుకుంటూ ఉండాలి ... క్యాన్సర్ అనుమానము వస్తే గైనకాలజిస్ట్ ని కలవాలి. వయసు రీత్యా వచ్చే బి.పి, సుగరు, కీళ్ళ   వ్యాధులకు డాక్టర్ ని సంప్రదించాలి. హిస్టరెక్టమీ తరువాత ఓవరీస్ లో సిస్ట్ లు పెరిగె అవకాశము ఉంటుంది . వీటిని గుర్తించడానికి ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవాలి.
  • ===========================

visit my website - > Dr.Seshagirirao-MBBS -