Monday, September 28, 2009

బరువు తగ్గితే మొహం మీద పిగ్మెంటేసన్ తగ్గుతుందా? , Wieght reduction lessen face Pigmentaion?




ప్ర : బరువు తగ్గితే మొహం మీద నలుపు రంగు తగ్గుతుందా ?
: విపరీతమైన బరువు పెరిగినపుడు శరీరం లో ఇన్సులిన్ రెసిస్తేన్ట్ (insulinResistence) పెరుగుతుంది . అందువల్ల నుదుటి మీద పిగ్మెంతెసన్ మొదలవుతుంది . ఇది రాను రాను మరింత కార్ గా కావడం , ఆ తర్వాత ఈ పిగ్మేతెసన్ బుగ్గలపైకి ,అందర ఆరం , మెదచుట్టు ,వ్యాపించడం జరుగుతుంది . దీనినే "అకాన్తోసిస్ నిగ్రికంస్ (AcanthosisNigricans)అంటారు . ఈ రకమైన పిగ్మెంతేషన్ ఉన్నా స్త్రీ లలో "పాలిసిస్తిక్ ఒవరీ డిసీజ్ (PolysysticOverianDisease) ఉండడం దాని తో బాటు మొహం మీద అవాంచిత రోమాలు రావడం కుడా జరుగుతుంది . బరువు తగ్గితే ఇన్సులిన్ రెసిస్తేన్ట్ తగ్గిపోవడం ముఖముపైన , మెదపున నలుపు రంగు వాటంతట అదే పోతుంది .. మిగిలి పోయిన పిగ్మెంటేసన్ ను " C2k peel " లేదా "super peel" ట్రీట్మెంట్ తో తగ్గించవచ్చును . అవాంచిత రోమాలను " LS diod lesar" ట్రీట్మెంట్ తో నిర్ములించవచ్చును .

  • =================================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

Tuesday, September 8, 2009

గర్భిణి స్త్రీలు ఉపవాసం చేయవచ్చా?,Fasting During Pregnancy




ప్ర : నా కిపుడు ఏడో నెల పవిత్రమైన దేవుని పండుగ రోజులలో ఉపవాసము చేయవచ్చునా ? ఒక రోజు ఉపవాసము చేస్తే నీరసం అనిపించింది . ఉపవాసం చేస్యవచ్చంటారా?

: బిడ్డ తనకవసరమైన ఆహారాన్ని తల్లి నుంచి తెసుకుంటుంది . కటిన ఉపవాసము వల్ల ఆహారము బిడ్డకు అందదు .. అలాగే బిద్దచుట్టు ఉండే ఉమ్మనీరు తగ్గిపోతుంది . దాంతో నెలలు నిండా కుండా ప్రసవం కావచ్చును . ఒకవేళ ఇదే ఉపవాసము మీరు ౨ -౩ నెలల గర్భినిగా ఉన్నప్పుడు చేస్తే .. బిడ్డ మానసిక స్థితి తో పాటు ఎదుగుదల పైనా ప్రభావము ఉంటుంది . కాబట్టి ఉపవాసము చేయకపోవడమే మేలు . ఒకవేళ తల్లి లో జస్తేసనల్ దయబితీస్ ఉంటే ... శిశువు లో గ్లైసీమియా స్థాయి లో మార్పులు సంభవించి శిశువు చనిపోవచ్చు .

  • ===========================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

మొటిమల వల్ల నల్లమచ్చలు , BlakcSpots due to Pimples





ప్రశ్న : నాకు మొటిమలు ఎక్కువగా వస్తున్నాయి ... అవి తగ్గాక నల్ల మచ్చలు గా మారి ముఖం అందవిహీనం గా మారుతోంది . అవి తగ్గాలంటే మార్గము చెప్పండి ?
జవాబు : టీనేజ్ లో పింపుల్స్ రావడం చాలా సహజం . మన భారతీయుల మేని స్వభావాన్ని బట్టి చర్మము ఏమాత్రం దెబ్బతిన్నా తొందరగా నలుపు అలముకొంతుంది . అందులోను నలుపు శరీరం గలవరికైతే ఈ సమస్య మరి కాస్త ఎక్కువే . ఎండా , మొటిమలు , ఇతర సమస్యలతో చర్మం త్వరగా నలుపెక్కుతుంది . అస్తమానము చేతులతో మొటిమలను నలిపినా నల్లగా నల్లగా మారుతుంది . అందుకని బయటకు వెళ్ళినప్పుడు తప్పకుండా సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి . చర్మం పై ఎక్కువగా సూర్యకాంతి పడకుండా చూసుకోవాలి . మొతిమలను చేతులతో నలపడం , పిండడం చేయకూడదు .
  • pimpul scan cream .
  • erytop skin cream ,
  • femcinol -A ,
వీటి కి తోడుగా Antibiotic వాడాలి .
పైన పేర్కొన్న క్రీములు వాడి ... తగ్గక పొతే మంచి వైద్యుడి ని సంప్రదించి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది .

మరికొంత సమాచారము కోసం - > pimples -మొటిమలు

సూర్యకాంతి అలెర్జీ , Sunlight Allergy




ప్ర : నేను ఎండలోకి వెళ్ళినప్పుడల్లా మెడ , చేతులు , ముఖం మీద నల్లమచ్చలు , పొక్కులు వస్తున్నాయి ... వాటితో విపరీతమైన దురద ... తగ్గాలంటే ఏమిచెయ్యాలి ?

: దీనినే ఫోటో ఎలర్జీ , సన్ లైట్ ఎల్లేర్జీ అంటారు . ఇవి ఎక్కువగా ఎండా తగిలే ప్రాంతాల్లో ... అంటే నుదురు , చెంపలు , మెడ , చేతులు మీద ఎక్కువగా వస్తాయి. నల్లమచ్చలు , పొక్కుల వల్ల దురద పుడుతుంది . దీన్నుంచి ఉపశమనం పొందాలంటే ఏదైనా 'సన్ స్క్రీన్ లోషన్ ' ప్రతి ఇదు గంటల కొకసారి రాసుకోవాలి . బయటకు వెళ్తున్నప్పుడు టోపీ , గొడుగు వాడాలి . చర్మము పొడిగా ఉంటే మాయిశ్చరైజర్ రాసుకోవాలి . సమస్య తీవ్రం గా ఉంటే చర్మ వైద్యులను సంప్రదించి మందులు , క్రీములు వాడాలి .

  • =============================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

ముఖం పై నల్లమచ్చలు , Black spots on face




ప్ర : గత రెండు ముదేల్లుగా నా ముఖం మీద పుట్టుమచ్చాల్లాంటి నల్లటి మచ్చలు వస్తున్నాయి . ఇవి నిజం గా పుట్టుమచ్చలేనా? వాటితో నాముఖం సంవిహీనం గా తయారైనది . అవి పోవడానికి ఏదైనా చికిస్త ఉందా? సాలు రాకుండా ఉండాలంటే ఏమిచేయాలి ?

: పుట్టుమచ్చలు పుట్టుకతోనే రావాలని లేదు తరువాతైనా రావచ్చు . ఆ తరహా మచ్చలు కొందరికి ముఖం మీద ఎక్కువగా వస్తుంటాయి . ఇవి అనేక రకాలుగా ఉంటాయి .
కొంచెం ఎత్తుగా ఉంది అందులో వెంట్రుక ఉంటే వాటిని " compound moles " అంటారు .
ఎత్తుగా లేకుండా నలుపు రంగులో ఉండే వాటిని " junctional nevi "అంటారు .
సమతము గా ఉంది లేత గోధుమ రంగు లో ఉంటే వాటిని " common moles " అంటారు .
ట్రీట్మెంట్ :
లేజర్ ద్వారా చికిస్త చేయించుకోవచ్చును .
మందులు ద్వార నయం కావు .

Sunday, September 6, 2009

గర్భిణీ గా ఉన్నప్పుడు రక్తస్రావము , Bleeding during pregnancy


ప్ర : నాకిప్పుడు ఎనిమిదో నెల . అనుకోకుండా వివరీతం గా రక్తస్రావము అయింది .వెంటనే వైద్యుని సంప్రదిస్తే స్కానింగ్ తీసి బిడ్డ బాగానే ఉన్నది కాని బిడ్డకు గర్భసంచి కి మధ్యలో రక్తం గడ్డ ఉందన్నారు . ఏదైనా ప్రమాదమా ?
- సోదరి ..విమల .
జ : గర్బము ధరించి ఉన్నపుడు సదరణము గా రక్తస్రావము జరుగదు . కొంతమందికి ప్రతినెల కొంచం ఎరికిల బ్లీడింగ్ కనబడుతుంది ... ఇది హార్మోనుల అసమతుల్యము వలన జరుగు తుంది . . దీనివల ప్రమాదమేమీ లేదు కాని తల్లి మానసికం గా ఆందోళన చెందే అవకాసము ఉండవచ్చును . ప్రతి నెల ప్రోజేస్తిరాన్ ఇంజెక్షన్ తీసుకోవాలి . ఉదా : inj. Anin 500 mg , or "proluton depot 500 mg , or "Maintane 500 mg " డాక్టర్ సలహా తో వాడాలి.
ఇతర ప్రమాదకర కారణాలు :
Placenta previa > ఇది చాల ప్రదకరమైనది . మాయ బిడ్డ తల కింద సేర్విక్ష్ ను ముసి ఉంటుంది .. బిడ్డ కదలికలు వల్ల రక్తస్రావము జరుగుతుంది , కడుపు నొప్పి ఉండదు . ఎలాంటి పనులు చేయకుండా పూర్తీ విశ్రాంతి తీసుకోవాలి .
వైద్యులు సూచించిన ముందులు వాడాలి . తొమ్మిది నెలలు ముందు గానే రెండోసారి మళ్ళీ రక్తస్రావము అయితే తల్లి ప్రాణాలకే ముప్పు కావున ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయాల్సి ఉంటుంది .

placenta Ecreta > ఇక్కడ మాయ సేర్విక్షు ఒక ప్రక్క భాగాన ఉంటుంది . అంతగా ప్రమాదకరము కాకపోయినా వైద్యు సూచించిన మందులు వాడాలి . రక్తస్రావము మరీ ఎక్కువైతే సీజర్ ఆపరేషన్ 37 వారాల గర్భిణి నిండిన
తరువాత చేసి బిడ్డను బయటకు తీయడం మంచిది .



Accidental hemorrhage > గర్భిణీ గా ఉన్నప్పుడు రక్తస్రావము తో కడుపు నొప్పి కుడా వస్తే ..
పరిస్థితి ని " యాక్షి డెంటల్ " హేమరేజ్ అంటాము . భయపడకుండా ... పూర్తీ విశ్రాంతి తీసుకొని , మందులు వాడితే తొమ్మిది నెలదాకా కొనసాగించవచ్చును .

ఐ-పిల్ తో రక్తస్రావము , I-Pil and vaginal bleeding




ప్ర
: గర్బము రాకుండా ఉండాలనే ఉద్దేశం తో ఐ-పిల్ ను వాడాను ... దానివల్ల నేలసర్ తో నిమిత్తం లేకుండా వపరీటంగా రక్తస్రావము అయింది . ఇది కుడా గర్భనిరోధక సాధనాల్లో ఒకట కద్దు ... అయినా రక్తస్రావం ఎందుకవుతోంది?

జ : ఐ-పిల్ అత్యవాస పరిస్తితులలో వాడాల్సిన మాత్ర . అనుకోని పరిస్థితులలో ఆదా మగా సంసారపక్షము గా కలిసినపుడు గర్బము రాకుండా ఉండడానికి ఇది పని చేస్తుంది . ౨౪ నుండి ౭౨ గంటలలో తీసుకుంటే బాగా పనిచేస్తుంది . దీన్ని రోజువారి తీస్కోకూడదు . గర్భనిరోధక మాత్రలలో వాడే మందును నాలుగు రెట్లు ఎక్కువగా వేసి వీటిని తాయారు చేస్తారు . . . హార్మోనుల పనితీరులో మార్పులు జరుగుతాయి .
పర్యవసానమే .....
  • రక్తస్రావము ..
  • బహిష్ట కి బహిష్ట కి మద్యలో రక్తస్రావము అవడము ,
  • నెలసరి బహిస్తలో ఎక్కువ రక్తస్రావము జరగడము ,
  • .భవిష్యత్తులో గర్బము ధరించినపుడు సమస్యలు వస్తాయి.
  • రక్తం గడ్డకట్టి బ్రెయిన్ , హార్ట్ స్ట్రోక్ లు వచ్చిన రావచ్చును .