Monday, July 28, 2014

ప్రతిదానికీ వాదించే ధోరణిలో వుండేవారితో ఏవిధముగా వ్యవహరించాలి?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర :  ప్రతిదానికీ వాదించే ధోరణిలో వుండేవారితో ఏవిధముగా వ్యవహరించాలి?

జ : ఎదుటివారు ఎవరేం చెప్పినా చటుక్కున వాదించే , ఖందించే నైజం అనేకమందిలో కనబడుతుంటుంది .ఇటువంటి వ్యక్తులతో సమాజిక సంహధాలు కొంచెం కస్టమే. వారి వాదనలకు , ఖండనలకు , చర్చలకు ప్రతిస్పందించకపోవడమే మంచిది. 

ఇతరులతో సంహంధ బాంధవ్యాల సంగతి పక్కన పెడితే ఇలా ప్రతిదానికీ , అయినదానికీ కానిదానికీ గొడవలుపడే , వాదించే తత్వము వారి ఆరోగ్యానికే మంచిది కాదు . స్నేహితులతో , ఇంట్లోనివారితో ప్రతిసారీ గొడవకు దిగేవారిలో రక్తపోటు అవకాశాలు ఎక్కువ . స్ట్రెస్ హార్మోన్లు వీరిలోఎక్కువ విడుదలవుతుంటాయి. డిప్రెషన్‌ లక్షణాలూ ఉంటాయి. వారిచుట్టూ చేరడానికి భయపడేవారెక్కువ కాబట్టి వీరిలో ప్రేమరాహిత్యమూ తప్పదు .

భావాలను , తనలోని లోపాలనూ , గొడవపడే తత్వాన్ని వారు తమకు తాము గుర్తుందులొని వాటిని తగ్గిందుకునే దిశగా ప్రయత్నాలు సాగించాలి. 
  •  *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

ముందే కాన్పు చేయించుకోవడం వల్ల నష్టముందా?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

Q : నాకిప్పుడు నెలలు నిండుతున్నాయి. ప్రారంభంనుంచీ జస్టేషినల్‌ డయాబెటీస్‌ ఉంది. సరైన జాగ్రత్తలూ, ఇన్సులిన్‌ తీసుకుంటూ మధుమేహం పెరగకుండా చూస్తున్నా. ఈ మధ్య స్కానింగ్‌ చేయించుకున్నప్పుడూ అంతా సవ్యంగా ఉందని తేలింది. వైద్యులేమో ముందే ప్రసవం చేయించుకోవడం మంచిదని సూచిస్తున్నారు. అలా ముందే కాన్పు చేయించుకోవడం వల్ల వాడే మందులతో బిడ్డకు సమస్యలుంటాయనీ, కొన్నిసార్లు దక్కకపోయే ప్రమాదం కూడా ఉందని విన్నా. అందుకే చివరిక్షణం వరకూ ఆగడం మంచిదని నేను అనుకుంటున్నా. నా నిర్ణయం సరైందేనంటారా..?

Ans : సాధారణంగా గర్భం దాల్చినప్పుడు మధుమేహం(జస్టేషినల్‌ డయాబెటీస్‌) ఉంటే గనుక బిడ్డ పెద్దగా పెరుగుతుంది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే గనుక రక్తంలో చక్కెరస్థాయులు అదుపు తప్పుతాయి. ఉమ్మనీటి శాతం కూడా పెరుగుతుంది. అలాంటప్పుడు బిడ్డ అడ్డంగా ఉండటం, దక్కకపోవడం.. లాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఆ పరిస్థితులుంటే వైద్యులు సిజేరియన్‌కి ప్రాధాన్యం ఇస్తారు. కానీ మీ విషయం అలా కాదు. మీరు ముందునుంచీ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. అంతా సవ్యంగానే ఉందని స్కానింగ్‌ రిపోర్టులూ చెబుతున్నాయి. అయినా.. మీరు వైద్యులు చెబుతున్నట్టు ముందే ప్రసవం చేయించుకోవడం మంచిది. ఎందుకంటే గర్భందాల్చినప్పుడు మధుమేహం ఉన్నవారు ముప్ఫైఎనిమిది వారాలు కాగానే ప్రసవం చేయించుకోవడం మంచిదని ప్రపంచవ్యాప్తంగా వైద్యుల అభిప్రాయం. నెలలు నిండేకొద్దీ బిడ్డ మరీ బరువెక్కడం, గర్భస్థశిశువుకు గ్లూకోజ్‌ తగ్గడం లాంటి సమస్యలు పెరిగి దక్కకపోయే ప్రమాదం ఉంది. దాన్ని నివారించడానికే వైద్యులు ముందే కాన్పు చేయించుకోమంటారు. ఆ పద్ధతినే ఇండక్షన్‌ ఆఫ్‌ టెర్మ్‌ ప్రెగ్నెన్సీ అంటారు. అంటే.. మీకు సహజ కాన్పు అయ్యేలా నొప్పులు రావడానికి ముందులు వాడతారు. అది ప్రమాదకరం కాదు. పైగా తల్లీబిడ్డలిద్దరికీ మంచిది. కాబట్టి భయపడకుండా వైద్యుల సలహా పాటించండి.

courtesy with Dr.Avagani Manjula (Gynaecologist)@dear vasundara)
  •  *===========================

 visit my website - > Dr.Seshagirirao-MBBS -

Wednesday, July 23, 2014

Menopausal calcium intake -kidney stones

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర : నా వయసు 50 సం.లు.నాకు మెనోపాజ్ దశ వచ్చింది . గైనకాలజిస్ట్ రోజూ రెండుసార్లు కాల్సియం మాత్రలు వేసుకోమన్నారు . కాని మా ఫామిలీ డాక్టర్ జెనరల్ ఫిజీషిన్‌ ఇలా కాల్సియం ఎక్కువ తీసుకుంటే కిడ్నీలో రాల్ళు ఏర్పడతాయి అని అంటున్నారు .నేనేం చేయాలి ?.

జ : వాస్తవానికి రెండూ కరెక్టే . మెనోపాజ్ లో ఈస్ట్రోజెన్‌ లోపము వల్ల ఎముకల దృఢత్వము తగ్గుతుంది. ఆస్టియో పొరోసిస్ కు కారణమవుతుంది. కావున కాల్సియం సప్లమెంట్ అవసము .

ఎక్కువగా కాల్సియం తీసుకోవడము మూలంగా కిడ్నీ లో రాళ్ళు ఏర్పడే అవకాశముంది. కాని తగు మోతాదు లో కాల్సియం తీసుకుంటూ ... తగినంత నీరు తాగుతూ , వ్యాయామము చేస్తూ ఉండాలి . దాంతో కిడ్నీలో రాళ్ళు ఏర్పడవు . 
  • *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Tuesday, July 15, 2014

నా శరీరము ఎక్కువగా దుర్వాసనగా ఉంటుంది . దానిని ఏవిధముగా పోగొట్టుకోవాలి?

  •  
  •  

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర : నా శరీరము ఎక్కువగా దుర్వాసనగా ఉంటుంది . దానిని ఏవిధముగా పోగొట్టుకోవాలి?

జ : స్వేదము , బ్యాక్టీరియా కలగలసి పోవడం వల్ల శారీరక దుర్వాసన ఎక్కువగా ఉంటుంది. మామూలుగా అయితే చెమటవాసన చెడువాసన వెయ్యదు. చెమట + బ్యాక్టీరియా చర్యవలన చర్మము ముడతలు దగ్గర దుర్వాసన గా ఉంటుంది. ఇలా ఉండడము శరీర తత్వము , శరీర పరిమాణము , బయట వాతావరరము మున్నగు అంశాలపైన ఆధారపడి ఉంటుంది.

సరైన వస్త్ర ధారణ , వ్యక్తిగత పరిశుభ్రత  పాటించడము వలన ఈ సమస్యను ఇట్టే తొలగించుకోవచ్చును . . . కాని కొంతమం ది విషయము లో ఈ సింపుల్ సూత్రము పనిచెయ్యదు . శారీరకమయిన దుర్వాసనకు ఇతరత్రా కారణాలు కూడా ఉంటుంటాయి. మెటబాలిక్ సమస్యలు( మధుమేహము) , ఒత్తిడి శారీరక దుర్వాసనను పెంచుతాయి. అత్యధిక ఒత్తిడి స్థాయిలు  శరీరము లో " ఎపో్క్రెయిన్‌ " గ్రంధులు స్వేదాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. కొన్నిరకాల ఆహారపదార్ధాలు దుర్వాసనకు దోహదపడతాయని అంటారు కాని ఇది శాస్త్రీయము గా ఋజువు కాలేదు.

నివారణ :
  • పెప్పర్మెంట్ ఆయిల్ శరీరక దుర్వాసనను పోగొట్టును . ఈ నూనెను చర్మము సులువు గా గ్రహిస్తుంది. 
  • యాంటిపెరిస్పిరెంట్  లోషన్లు , స్ప్రేలు బజారులో దొరుకును ... వాడితే రోజంతా దుర్వాసస ఉండదు. 
  • డియోడరెంట్స్ దుర్వాసనను అడ్డుకొని రోజంతా తాజా ఉంచుతాయి. 
  • ప్రతిరోజూ రెండుసార్లు మంచి సబ్బుతో స్నానము చేయాలి.స్నానము చేసే నీళ్ళలో నిమ్మ రసము , పుదీనా వేసి స్నానము చేస్తే ఈ దుర్వాసన బారి నుండి బయటపడవచ్చును .
  • ప్రతిరోజూ లోదుస్తులు మారుస్తూ ఉండాలి , గాలి ఫ్రీ గా తగిలే దుస్తులే వాడాలి.

 *===========================

visit my website - > Dr.Seshagirirao-MBBS - 

Tuesday, July 8, 2014

Advise to reduce over-weight ?,అధిక బరువుతో ఉన్నాను.తగ్గడానికి సలహా ఇవ్వండి ?

  •  

  •  

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : నేను అధిక బరువుతో ఉన్నాను . దీనివల్ల అందరితో సరిగ్గా కలవలేకపోతున్నాను . చదువుపై కూడా అంతగా ఏకాగ్రత చూపలేక పోతున్నాను . ఒక్కోసారి చలా డిప్రెస్ అవుతుంటాను. ఏదైనా సలహా ఇవ్వండి .

జ : చాలా సార్లు ఆయా వ్యక్తుల బాడీ ఇమేజ్ వారి ఆత్మ స్థైర్యాన్ని ప్రభావితం చేస్తూవుంటూంది.  మిగతా అన్ని సమయాల్లో బాగానే ఉంటారు . . కాని బరువు ఎక్కువగా ఉన్నామని గుర్తుకు వచ్చేసరికి అన్ని వ్యతిరేక భావాలూ చుట్టుముట్టేస్తాయి. మిగతావాళ్ళు మీగురించి ఏమనుకుంటున్నారో అన్న విషయాన్ని వదిలేసి ... ముందుగా మీకోసము మీరు బరువు తగ్గడానికి చిత్తశ్రుద్దితో చర్యలు ఆరంభించండి . అసలు మీరెందుకు అధికబరువుతో ఉన్నారో విశ్లేషిందుకోండి .  సరైన ఆహారము తినడము లేదా? , ఎక్కువగా తింటున్నారా? , చాలినంత వ్యాయామాలు చేయడము లేదా? ఇవన్నీ పరిశీలించుకోండి . డైటీషియన్‌ సలహా తీసుకోండి.

బరువు సమస్యకు  ఏదైనా లోపము కారణము అవుతుందేమో తెలుసుకోవడానికి రక్తపరీక్షలు చేయిందుకోవాలి . తదుపరి నిపుణుల సలహా పాటించి  జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. అధిక బరువుకు ఆహారలోపాలు , జీవన విధానము సరిగా లేకపోవడము , వ్యాయామము లేకపోవడము కారణాలవుతాయి. ఎక్కువ సమయాన్ని కంప్యూటర్ లేదా టి.వి స్క్రీన్‌ ముందు గడుపుతున్నట్లయితే శారీరక చురుకుదనానికి చాలా తక్కువ సమయము ఉంటుంది. . అది అధిక బరువుకు దారితీస్తుంది. తల్లిదండ్రు లిద్దరూ అధిక బరువుతో ఉంటే అదే శారీరక తీరు మీకు వచ్చే అవకాశము ఉంటుంది. వంశములో స్థూలకాయులు ఉన్నచో వారి వారసత్వము మీకు రావచ్చును . ఏది ఏమైనా ఎన్నో సౌలభ్యాలు  అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో మీకు నిజంగా బరువు తగ్గాలన్న కోరిక బలం గా ఉంటే అది తప్పకుండా సాధ్యపడుతుంది.
  • *=========================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

In summer hair became brittle.what to do?,వేసవిలో నా జుట్టు ఊరికూరికే చిట్లిపోతుంటుంది . ఏం చేయాలి ?.

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 Q : వేసవిలో నా జుట్టు ఊరికూరికే చిట్లిపోతుంటుంది . ఏం చేయాలి ?.

జ : తీక్షణమైన సూర్యకిరణాలు జుట్టు కుదుళ్ళకు హాని చేస్తాయి. కుదుళ్ళు కు హాని జరగడము వల్ల వేసవిలో జుట్టు త్వరగా సులువుగా చ్ట్లిపోతుంటుంది. దీనికి సులువైన , ఏకైక పరిస్కారము వీలయినంతవరకు ఎండలోకి వెళ్ళకుండా ఉండడమే . ఒకవేళ  వెళ్ళినా శిరోజాల పై సరిన పరిరక్షణ చర్యలు తీసుకోవాలి.

జుట్టు బుజాలవరకు ఉన్నా లేదా పొడవుగా ఉన్నా " వైడ్-బ్రిమ్‌డు  హ్యాట్ సరిపోతుంది. లేదా గొడుగు వాడండి . మృదువైన , డీప్ మాయిశ్చరింగ్ షాంపూ వాడుతుండాలి .చిట్లిన  శిరోజాలకు  లీప్ - ఇన్‌ సెరమ్స్  కండిషనర్లు కూడా బాగాపనిచేస్తాయి.సన్‌స్క్రీన్‌  ఉంటుందని చెప్పే షాంపూలను విశ్వసించాల్సినపనిలేదు. ఎందుకంటే ఒకసారి జుట్టు కడిగేశాక యు.వి  ప్రొటెక్షన్‌ కూడా తొలగి పోతుంది.
  • *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Sunday, July 6, 2014

How much time do we do exercise daily?,రోజులో వ్యాయామము ఎంతసేపు చేయాలి?

 *

 *
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర : రోజులో వ్యాయామము ఎంతసేపు చేయాలి?

జ : వ్యాయమాలకు  ఓ రెగ్యులర్ సమయము అంటూ ఉండడం లేదని చాలా మందిఫీలవుతుంటారు .ఓ సమయపాలనలో చేయలేకపోతున్నామన్న భావం కలుక్కు మనిపిస్తుంటుంది .. .. .. అయితే పరిశోధకులు ఈ భావం , భయము అక్కర్లేదంటున్నారు. వారం లో 150 నిముషాలు సమయము వ్యాయామము చేస్తే చాలని , సెషన్లు , షెడ్యూల్స్ తో నిమిత్తము లేదని వారు గుర్తించారు . వీకెండ్ లలో కుదినప్పుడు ఎప్పుడైనా 150 నిమిషాల వ్యాయామము వారం లో చేస్తే చాలు .

వారమంతా  రోజుకో 20 నిమిషాలు చొప్పున్న చేసినా , 3 - 4 రోజూలపాటు 150 నిమిషాల టార్గెట్ ముగించేసినా ఫలితం ఇంచుమించు ఒక్కటే . ఎక్షర్ సైజులు ఫ్రీకెన్సీ కి , వ్యాయామాలు లేకపోవడం వల్ల వచ్చే రుగ్మతలకు గుర్తించతగ్గ అనుసంధానము లేదు . ముఖ్యమైన సంగతేమంటే .. వారం లో కనీషము 150 నిమిషాల శారీరక చురుకుతనము ఉండాలి. ఎప్పుడు చేసినా , ఏ షెడ్యూల్ అయినా ఒక్కటే.
  • *===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

Friday, July 4, 2014

చిన్నపిల్లలకు తేనె ఇవ్వవచ్చా?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర : చిన్నపిల్లలకు తేనె ఇవ్వవచ్చా?
జ : Honey should never be given to a child under the age of 12 months old. 2 సంవత్సరముల లోపు పిల్లలకు తేవె ఇవ్వకూడదు . వీరికి జీర్ణ వ్యవస్థ సరిగా పరిణతి చెందదు ... కాబట్టి తేనె ఇవ్వకూడదు . అందునా తేనె లో అనే రకాలైన మంచి ,చెడు బాక్టీరియా , వైరస్ లు ఉంటాయి అవి 2 సం. లోపు పిల్లలకు హాని చేసే ప్రమాధము ఉంది. పిల్లలకు 2 సం. లు వచ్చాక ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీ స్పూన్‌ తేనె కలిపి ఇవ్వవచును. ఖాళీ కడుపు గా ఉన్నప్పుడు ... ఉదయాన్నే తాగించితే మంచిది. అంతకు మించి తేనె పిల్లకు సిఫార్సు చేయదగినది కాదు. తేనె లో botulism spores ఉంటాయి . ఇది బొటొలిజం పాయిజనింగ్ కి దారితీస్తుంది. బొటిలిజం స్పోర్స్ సాదారణ నీరు మరిగే ఉష్ణోగ్రత వద్ద చనిపోవు.

*===========================

visit my website - > Dr.Seshagirirao-MBBS -