Sunday, June 22, 2014

Any bad by frequent nail polishing?,తరచూ వేస్తే గోళ్ళ రంగు వలన నస్తముందా ?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర : నాకు నెయిల్ ఆర్ట్ అంటే ఇస్టము .తరచూ వేస్తుంటే రష్టమా?
జ :నెయిల్ ఆర్ట్ లో వాడే నెయిల్ పాలిష్ లో  ఎసెటోన్‌ , ఎథైల్ లాక్టేట్ , టెరప్తాలిక్ యాసిడ్ వంటి అనేక రసాయనాలుంటాయి. గోళ్ళు.. నెయిల్ పాలిష్ లోని పిగ్మెంట్స్ ను గ్రహిస్త్రాయి. . . కాబట్టి నెయిల్ ఆర్ట్ చేస్తున్నప్పుడు డార్క్ కలర్ నెయిల్ పాలిష్ వాడకండి . దీనివల్ల గోళ్ళపై ఎక్కువగా మరకలు పడతాయి. ట్రాన్‌స్పరెంట్  నెయిల్ పాలిష్ ఒక కోట్ అప్లైయ్ చేసి  ఆ తర్వాత మాత్రమే గోళ్ళపై డార్క్ కలర్ నెయిల్ పాలిష్ వేయండి . ఆహారములో కాల్సియం , ఎ -విటమిన్‌ , జింక్ ఉండేటట్లు చూసుకోండి .

కఠినమైన గోళ్ళ పాలిష రిమూవర్లు వాడకూడదు. . . ఇవి చేతి వేళ్ళ గోళ్ళను పొడిబారేటట్లు  చేస్తాయి.  కెరోటిన్‌ కోట్స్ కు హానిచేస్తాయి.

  • *===========================
visit my website - > Dr.Seshagirirao-MBBS -

మార్జువానా(గంజాయి)ఉపయోగిస్తే మెమరీ తగ్గిపోతుందా?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : మార్జువానా(గంజాయి)ఉపయోగిస్తే మెమరీ తగ్గిపోతుందా?  

జ : మార్జువానా ...(గంజాయిని  అలాగే పిలుస్తారు) --గంజాయి Cannabaceae కుటుంబానికి చెందిన వార్షిక ఔషధ మొక్క. ప్రజలు అనేక అవసరముల కోసం చరిత్రలో అన్ని చోట్ల గంజాయిని సాగు చేసారనడానికి ఆధారాలున్నాయి.

పారిశ్రామిక అవసరముల కొరకు నారను, విత్తనముల నుండి నూనెను, ఆహారంను, మందుల తయారి కొరకు ఈ గంజాయి మొక్కను ఉపయోగించారు.

మానసిక, శారీరక ఒత్తిడుల నుండి ఉపసమనాన్ని పొందడానికి ఈ మొక్క యొక్క వివిధ భాగాలను వివిధ ప్రదేశాలలో వివిధ రకాలుగా ఉపయోగిస్తున్నారు.

ఈ గంజాయి మొక్క 5 నుంచి 8 అడుగుల ఎత్తు పెరుగుతుంది. దీని శాస్త్రీయ నామం Cannabis sativa. ఇది పుష్పించినపుడు విపరీతమైన వాసన చాలా దూరం (అర కిలోమీటరు) వరకు వస్తుంది.

గంజాయి మొక్క మనదేశానికి సుపరిచితం.పూర్వకాలంలో recreational గా హక్కలో వాడేవారు. ధనవంతులు,రాజులు,సామంతులు-స్త్రీలు,పురుషులు కూడా హక్కపీచ్చేవారు.గంజాయిని మెక్సికో దేశంలో మార్జువానా అంటారు. గంజాయిలో 84 cannabinoid drugs ఉన్నాయట. కెనాబిడయాల్,కెనాబినాల్,టెట్రా హైడ్రో కెనాబినాల్ వంటి psycho active పదార్ధాలున్నాయి.అందుకనే గంజాయి పేల్చేవారికి Tension తగ్గటం, మనస్సు తేలిక పడటం,ఆ హ్లదకరంగా feel అవ్వటం ఇత్యాది భావనలు వస్తాయి.మోతాదు ఎక్కువైతే నోరుతడారి పోవటం,కళ్ళు ఎర్రబారటం,హుస్వకాలపు మతిమరుపు ,భయం ఇత్యాది సమస్యలు వస్తాయి.గంజాయి అలవాటైతే వదలనే వదలదని అభిప్రాయం,అనుభవంతో చెప్పిన మాట ఇంతకుముందు జోగులు,సన్యాసులు,బైరాగులు గంజాయి పీల్చేవారు.గంజాయి పీల్చి సంగీతం వింటుంటే ఆ ఆనందమే వేరనేవారు కవులు కూడా. మొత్తం మీద దీన దుష్ర్టభావాలను గ్రహించి 20వ శతాబ్డంలో గంజాయి వాడకాన్ని నిషేధించారు.

ఇటీవల కొంతమంది వైద్యులు ఏమంటున్నారంటే,గంజాయి దుర్గుణాలు గంజాయికి ఉన్న మాట నిజమే కాని ఔషధలక్షణాలు కూడా ఉన్నాయి .గంజయి మొక్కలో మొత్తం 483 కాంపౌండ్స్ ఉన్నాయి.వాటిల్లో 84 కెవాబినాయిడ్స్ ఉన్నాయి.కొన్ని వైద్యంలో పనికి వస్తాయి అంటున్నారు.ఉదాహరణకు cancer treatment తీసుకుంటే chemotherapy వలన ఆకలి చచ్చిపొతుంది; వికారంగా,వాంతి చేసుకుందా మన్నట్లుగా ఉంటుంది.దీనికి గంజాలు మంచి వైద్యం.ఆస్మా(ఉబ్బసం)లో, depression లో కూడా బాగా పనిచేస్తుందని అంటున్నారు. Dronabinol వంటి మందుల్ని గంజాయి నుంచే తీస్తారు.కాని,దుర్లక్షణాలు తక్కువేమీ కావు కాబట్టి నిషేధాన్ని అట్లాగే ఉండనివ్వాలని నిపుణులు అంటున్నారు.


మాదకద్రవ్యాల్లో ఒకటైన మార్జువానాను ఉపయోగిస్తే అనేక ఆరోగ్య సమస్యలు పరిష్కరించబడతాయని ప్రాచీన కాలం నుంచి జనం నమ్మకం. అయితే మార్జువానాను ఔషధంగా మోతాదుకు మించి ఉపయోగిస్తే మనుషుల్లో జ్ఞాపక శక్తి నశిస్తుందని, మెదడు పనిచేసే తీరులో అసాధారణ మార్పులు వస్తాయని తాజా పరిశోధనల చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా స్కిజోప్రెనిక్ మానసిక వ్యాధిగ్రస్తులైన వ్యక్తులలో కనిపించే లక్షణాలు మార్జువానాను సేవించే వారిలో కనిపిస్తాయని చెప్పారు.

స్కిజోప్రేనియా బులెటిన్ అనే జర్నల్‌లో ప్రచురించిన ఒక వ్యాసం ఈ దిగ్బ్రాంతికరమైన విషయాన్ని బయటపెట్టింది. మానసిక వ్యాధిగ్రస్తులలో కనిపించే తీవ్ర లక్షణాలకు మార్జువానా కారణమవుతోందని అధ్యయనంలో తేలడం ఇదే మొదటిసారి. అమెరికా లో కొన్ని రాస్ట్రాలలో స్వేచ్ఛావిప ణిలో గంజాయి అమ్మకాలు జరగడం కారణంగా నేరాలు పెరిగే వీలుందని భయాందో ళనలు చెందుతున్నవాళ్లూ లేకపోలేదు

గంజాయి శరీర ఆరోగ్యానికి మంచిదేనని కొందరూ, కాదని మరికొందరూ సిగపట్టు పడుతున్న అమెరికాలో పరిశోధన చేస్తున్నారు. మన సాధువులు గంజాయి దమ్ము పట్టిస్తూ, సామూహికంగా అనుభవిస్తూ, అది ముక్తి మార్గానికి సన్నిహితమని నమ్మారు. రానురాను గంజాయి పండించడం, తాగడం, అమ్మడం ప్రపంచవ్యాప్తంగా నేరం కింద ప్రకటించారు. అయినా దొంగచాటుగా పండిస్తూ, వ్యాపారం సాగిస్తున్నారు.

  • *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Tuesday, June 10, 2014

అందమైన చర్మానికి ఏ ఆహారం తీసుకోవాలి ?

  •  



ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము

   Q : అందమైన చర్మానికి ఏ ఆహారం తీసుకోవాలి ?.

జవాబు : ఆరోగ్యం కోసమే కాదు.. అందం కోసమూ చక్కని ఆహారం తీసుకోక తప్పదంటున్నారు నిపుణులు. అందంగా కనిపించాలంటే చర్మం ఆరోగ్యంగా ఉండాలి. మన ఆరోగ్యానికి తొలి సూచిక చర్మమే. చర్మం మంచి నిగారింపుతో ఆరోగ్యంగా ఉండటానికి లోషన్లు, క్రీములు, పౌడర్ల వంటవేమీ పనిచేయవు. అవి పైపై మెరుగులే. సరైన పోషకాహారం తీసుకోకపోతే.. మన శరీరంలో మొదటగా ప్రభావితమయ్యేది చర్మమే.

మొటిమలు
కొవ్వు పదార్థాలు, ఫాస్ట్‌ఫుడ్‌, వేపుళ్లు ఎక్కువగా తింటే మొటిమలు ఎక్కువవుతాయి. తాజాపండ్లు, కూరగాయలు, నీరు బాగా తాగటం ద్వారా మొటిమల్ని తగ్గించుకోవచ్చు. ఒత్తిడి కూడా చర్మంపై ప్రభావం చూపించి మొటిమలు రావటానికి కారణమవుతుంది. అందుకని, శుభ్రత పాటించటంతో పాటు యాంటీఆక్సిడెంట్లు దండిగా ఉండే ఆహార పదార్థాల్ని ఎక్కువగా తీసుకోవాలి. గ్రీన్‌టీ, పొద్దుతిరుగుడు గింజలు, స్ట్రాబెర్రీ, దానిమ్మ వంటివాటిలో యాంటీఆక్సిడెంట్లు బాగా లభిస్తాయి.

వృద్ధాప్యం లో : 
వయసు మీదపడిన కొద్దీ చర్మం మృదుత్వాన్నీ, నిగారింపును కోల్పోతూ సాగిపోతుంటుంది. సన్నని గీతలూ, మడతలూ వచ్చి చేరుతుంటాయి. మానసిక ఒత్తిడులు, ఎండలో ఎక్కువగా తిరగటం వంటివన్నీ ఇలాంటి వృద్ధాప్య ఛాయల్ని పెంచుతాయి. విటమిన్‌సీని సరిపడినంతగా తీసుకోవటం ద్వారా మడతల్ని తగ్గించుకోవచ్చు. ఒమెగా-3, 6 కొవ్వు ఆమ్లాలు తీసుకోవటం ద్వారా కోల్పోయిన చర్మ నిగారింపును పొందవచ్చు. చేపల్లో ఇలాంటి కొవ్వు ఆమ్లాలు లభిస్తాయి. సాఫ్లవర్‌ నూనె, ముడి ధాన్యాలు, అవిసె గింజల్లో ఒమెగా ఆమ్లాలు లభ్యమవుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్‌-సి, ఇ ల్లో లభ్యమయ్యే యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్యాన్ని నివారిస్తాయి. నిమ్మ జాతి పండ్లను తినటం ద్వారా విటమిన్‌సీని సమృద్ధిగా పొందవచ్చు. ఆలివ్‌ నూనె, నూనె గింజలు, పాల కూర వంటివాటిలో విటమిన్‌-ఇ లభ్యమవుతుంది.

పొడిబారి, పొట్టులేచే చర్మం :
మీకు పొడి చర్మం ఉన్నట్లయితే క్యారట్లు బాగా తినాలి. విటమిన్‌-ఎ, బిలు పొడిబారి పొట్టులేచే చర్మానికి బాగా పనిచేస్తాయి. క్యారెట్లు, చేప నూనె, పాల ఉత్పత్తుల్లో విటమిన్‌-ఎ లభిస్తుంది.ఇక సూర్యరశ్మి సోకినప్పుడు మన చర్మమే విటమిన్‌-బిని ఉత్పత్తి చేసుకుంటుంది.

కళ్ల కింద చారలు :
కళ్ల చుట్టూ ఉండే చర్మం బాగా సున్నితంగా ఉంటుంది. ఈ భాగంలో కొవ్వు తక్కువగా ఉంటుంది. రక్తనాళాలు సమృద్ధిగా ఉండి, డ్రైనేజీ వ్యవస్థ తక్కువగా ఉంటుంది. దీనివల్ల దెబ్బతినే ముప్పు ఎక్కువ. కళ్ల చుట్టూ చర్మంపై నల్లని వలయాలు లేకుండా, మెరిసే చర్మం కోసం విటమిన్‌-కె సమృద్ధిగా తీసుకోవాలి. ఇది మాంసాహార పదార్థాలు, ఆకుకూరల్లో బాగా దొరుకుతుంది.

 తప్పనిసరి తినవలసినవి ..
చర్మ ఆరోగ్యానికి మాంసకృత్తులు, ఇనుము, జింకు, దండిగా నీరు అవసరం. ప్రొటీన్లు చర్మం ఆరోగ్యకరంగా కనిపించేందుకు తోడ్పడతాయి. పాల ఉత్పత్తులు, కొవ్వు తక్కువుండే మాంసాహారం, పప్పులు వంటి వాటి నుంచి అవసరమైన ప్రొటీన్లు పొందాలి. ఇనుము కోసం పాలకూర తినాలి. ఖనిజాల కోసం బెల్లం తినొచ్చు. చేపల్లో జింకు బాగా లభ్యమవుతుంది. రోజూ కాసింత అల్లం తిన్నా జింకు లభిస్తుంది. చర్మం ఎప్పటికప్పుడు పోషక నష్టాన్ని పూడ్చుకోవటానికి జింకు అవసరం. తృణ ధాన్యాలు, గుడ్లు, వెల్లుల్లి వంటివాటిలో లభించే సెలీనియం కూడా బాగా ఉపకరిస్తుంది.

తినకూడనివి :
సమతుల పోషకాహారం చర్మ నిగారింపుకు తోడ్పడుతుంది. కానీ.. పొగతాగినా, మద్యం తాగినా ఈ ప్రయోజనాలేవీ అందవు. ధూమపానం చర్మంలోని కొల్లాజెన్‌ను దెబ్బతీస్తూ, వృద్ధాప్య ఛాయలు ముంచుకొచ్చేలా చేస్తుంది. పొగతాగే వారిలో నోటిచుట్టూ సన్నని గీతల్లాంటివి ఏర్పడతాయి. వీటిని 'స్మోకర్స్‌ లైన్స్‌' అంటారు. ఆల్కహాలు తాగే వారు సాధారణంగా ఆహారం గురించి పట్టించుకోరు. ఇది చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదముంది. 

. *===========================
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Friday, June 6, 2014

జ్ఞాపకశక్తికి నేరేడు పండ్లు మంచి చేస్తాయా?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర ;  జ్ఞాపకశక్తికి నేరేడు పండ్లు మంచి చేస్తాయా?
జ : జ్ఞాపకశక్తిని మెరుగు పరచుకోవాలనుకుంటే నేరేడు పండ్లు తినమని సూచిస్తున్నారు పరిశోధకులు. సీజన్‌ను బట్టి ప్రతిరోజూ కొన్నైనా నేరేడు పండ్లు తింటే జ్ఞాపకశక్తిలో గణనీయమైన మెరుగుదల ఉంటున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. నేరేడులో ఉండే ''ఫ్లేవనాయిడ్స్‌'' అనే రసాయనాలు నాడీకణాలతో అనుసంధానమై మెదడు కణాల్ని ప్రేరేపిస్తాయి. దీనివల్ల స్వల్ప, దీర్ఘకాల జ్ఞాపకాలన్నీ మెరుగుపడే అవకాశం ఉంటుందని పరిశోధకులు వివరించారు. ఈ అధ్యయనంలో వెల్లడైన అంశాల ఆధారంగా భవిష్యత్తులో ఆల్జీమర్స్‌కు చికిత్స అందించే అవకాశం ఉందని రీడింగ్‌ యూనివర్సిటీ పరిశోధకులు జెరేమీ స్పెన్సెర్‌ పేర్కొన్నారు.
  • *===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

మన చర్మానికి టమాటా రక్షణ ఎలా కలుగజేస్తుంది? .


  •  
  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .



సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాల కారణంగా మన చర్మం నల్లబారకుండా కాపాడుకోవటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం.. మన చర్మాన్ని కాపాడే రక్షక పదార్థం టమోటాల్లో ఉందని శాస్త్ర ప్రపంచం ఇప్పుడిప్పుడే నమ్ముతోంది. ఈ దిశగా పరిశోధనలు సాగుతున్నాయి. ఈ విషయంలో టమోటాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్‌- లైకోపేన్‌ చాలా ప్రభావశాలి. పాశ్చాత్య ఆహారంలో 85 శాతం లైకోపేన్‌.. టమోటాల నుంచి వచ్చేదే. టమోటా గుజ్జులో ఇది అత్యధికంగా లభ్యమవుతుంది. దీనివల్ల చర్మం నల్లబారే లక్షణం బాగా తగ్గుతోందని పరిశోధకులు భావిస్తున్నారు. కాబట్టి మామూలుగా ఆహార పదార్థాల్లో టమోటాల వినియోగం పెంచుకోవాలి. దీనివల్ల ప్రత్యేకమైన శ్రమ లేకుండానే మన చర్మాన్ని అతినీలలోహిత కిరణాల బారి నుంచి కాపాడుకోవచ్చు.
  • *=========================== 

visit my website - > Dr.Seshagirirao-MBBS -

Tuesday, June 3, 2014

నేను ఒక్కపొడి ఎక్కువగా తింటుంటాను . ఆరోగ్యరీత్యా నష్టమేమైనా ఉండా?


  •  
  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
 Q : నేను ఒక్కపొడి ఎక్కువగా తింటుంటాను . ఆరోగ్యరీత్యా నష్టమేమైనా ఉండా?
జవాబు : ఓ వక్కను నోట్లో వేసుకుని  మధ్యలో మధ్యలో చప్పరించడము వల్ల బరువు త్గ్గడములో పరోక్షము గా సహకరిస్తుందని చాలా మంది భావిస్తుంటారు. కాని అది అపోహ మాత్రమే . తమల పాకుల్లో వేసుకునే వక్కపొడి అయినా , పూర్తిష్థాయి వక్క అయినా బరువు తగ్గడము లో ఏమాత్రము ఉపయోగపడదు.  అదే పనిగా బీటల్ నట్  నమలడము వల్ల అనారోగ్యాలు ఎన్నో కలుగుతాయి.
వక్కలు చెడు గుణాలు   :-

  • వక్కలలో ఆల్కలాయిడ్స్ , టానిన్లు శాతము ఎక్కువగా ఉంటాయి.ఇవి ఆరోగ్యానికి హానికరము .
  • అంతేకాకుండా తరచుగా వక్కలు - ఆకులు కలిపి తీసుకుంటూ ఉంటే ఆరోగ్యానికి హానికరమని , కాన్సర్లు రావడానికి కారణం అవుతాయని నిపుణులు అంటారు. Due local irritation , 
  • అదేపనిగా నమలడము వలన 'మతిమరుపు' వచ్చే అవకాశము ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. 
  • వక్కలు , వక్కపొడి గర్భిణిలు,బాలింతలు  తీసుకోకూడదు . బిడ్డకు ,తల్లికి దుష్పరిణామాలు కలిగే ప్రమాదము ఉంది. 
  • 18 సం.లు లోపు వారు వీటిని ఎక్కువగా తీసుకోకూడదు . రక్తము విరిగిపోయే(blood dyscariasis)ప్రమాదము లేకపోలేదు. 
  • ఒక రకమైన మత్తును , హాయిని కలిస్తాయి కనుకనే వీటిని బానిసలయ్యే (adict) ప్రమాదము లేకపోలేదు. 

సుగుణాలు : అందరూ  భయపడినట్లు వక్కలు ఆరోగ్యానికి హానికరము కాదు వీటిలో సుగుణాలూ ఉన్నాయి.
  • పొట్టలో చేరిన లద్దెపురుగులు(round worms) , నులిపురుగులు(pin worms) నాశనము చేస్తాయి. 
  • నోటి దుర్వాశన ను పోగొడతాయి , 
  • దీనిలోని " ఎరికోలిన్‌ " అనే పదార్ధము మెదడును ప్రబావితం చేస్తుంది ... ఉత్సాహాన్ని కలిగిస్తుంది . హాలహాలు , కెఫిన్‌ ల తరువాత మానసిక ప్రేరేపిత పదార్ధము గా దీన్ని చెబుతారు. 
  • గుండె జబ్బులతో బాధపడేవారికి దీనిలోని " యాంటీ ఇన్‌ఫ్లమేటరీ " గుణాలు కొంతవరకు మేలు చేస్తాయి. 
  • మత్స్య కారులు ' ఆక్టోపస్ ' వలన కలిగే పుండ్ల కు మందుగా వాడుతారు.
  • సెల్యులార్ డీజనరేషన్‌ ను అడ్డుకునే శక్తి వక్కలలోని యాంటీఆక్షిడెంట్లకు ఉన్నది. 
  • స్కిజోఫ్రినియా (మానసిక వ్యాది )నుంచి విముక్తి పొందడానికి వక్కలు పనిచేస్తాయని కొన్ని పరిశోధనల వలన వెళ్ళడైనది. 

*===========================
visit my website - > Dr.Seshagirirao-MBBS -