Tuesday, June 3, 2014

నేను ఒక్కపొడి ఎక్కువగా తింటుంటాను . ఆరోగ్యరీత్యా నష్టమేమైనా ఉండా?


  •  
  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
 Q : నేను ఒక్కపొడి ఎక్కువగా తింటుంటాను . ఆరోగ్యరీత్యా నష్టమేమైనా ఉండా?
జవాబు : ఓ వక్కను నోట్లో వేసుకుని  మధ్యలో మధ్యలో చప్పరించడము వల్ల బరువు త్గ్గడములో పరోక్షము గా సహకరిస్తుందని చాలా మంది భావిస్తుంటారు. కాని అది అపోహ మాత్రమే . తమల పాకుల్లో వేసుకునే వక్కపొడి అయినా , పూర్తిష్థాయి వక్క అయినా బరువు తగ్గడము లో ఏమాత్రము ఉపయోగపడదు.  అదే పనిగా బీటల్ నట్  నమలడము వల్ల అనారోగ్యాలు ఎన్నో కలుగుతాయి.
వక్కలు చెడు గుణాలు   :-

  • వక్కలలో ఆల్కలాయిడ్స్ , టానిన్లు శాతము ఎక్కువగా ఉంటాయి.ఇవి ఆరోగ్యానికి హానికరము .
  • అంతేకాకుండా తరచుగా వక్కలు - ఆకులు కలిపి తీసుకుంటూ ఉంటే ఆరోగ్యానికి హానికరమని , కాన్సర్లు రావడానికి కారణం అవుతాయని నిపుణులు అంటారు. Due local irritation , 
  • అదేపనిగా నమలడము వలన 'మతిమరుపు' వచ్చే అవకాశము ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. 
  • వక్కలు , వక్కపొడి గర్భిణిలు,బాలింతలు  తీసుకోకూడదు . బిడ్డకు ,తల్లికి దుష్పరిణామాలు కలిగే ప్రమాదము ఉంది. 
  • 18 సం.లు లోపు వారు వీటిని ఎక్కువగా తీసుకోకూడదు . రక్తము విరిగిపోయే(blood dyscariasis)ప్రమాదము లేకపోలేదు. 
  • ఒక రకమైన మత్తును , హాయిని కలిస్తాయి కనుకనే వీటిని బానిసలయ్యే (adict) ప్రమాదము లేకపోలేదు. 

సుగుణాలు : అందరూ  భయపడినట్లు వక్కలు ఆరోగ్యానికి హానికరము కాదు వీటిలో సుగుణాలూ ఉన్నాయి.
  • పొట్టలో చేరిన లద్దెపురుగులు(round worms) , నులిపురుగులు(pin worms) నాశనము చేస్తాయి. 
  • నోటి దుర్వాశన ను పోగొడతాయి , 
  • దీనిలోని " ఎరికోలిన్‌ " అనే పదార్ధము మెదడును ప్రబావితం చేస్తుంది ... ఉత్సాహాన్ని కలిగిస్తుంది . హాలహాలు , కెఫిన్‌ ల తరువాత మానసిక ప్రేరేపిత పదార్ధము గా దీన్ని చెబుతారు. 
  • గుండె జబ్బులతో బాధపడేవారికి దీనిలోని " యాంటీ ఇన్‌ఫ్లమేటరీ " గుణాలు కొంతవరకు మేలు చేస్తాయి. 
  • మత్స్య కారులు ' ఆక్టోపస్ ' వలన కలిగే పుండ్ల కు మందుగా వాడుతారు.
  • సెల్యులార్ డీజనరేషన్‌ ను అడ్డుకునే శక్తి వక్కలలోని యాంటీఆక్షిడెంట్లకు ఉన్నది. 
  • స్కిజోఫ్రినియా (మానసిక వ్యాది )నుంచి విముక్తి పొందడానికి వక్కలు పనిచేస్తాయని కొన్ని పరిశోధనల వలన వెళ్ళడైనది. 

*===========================
visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.