Friday, June 6, 2014

మన చర్మానికి టమాటా రక్షణ ఎలా కలుగజేస్తుంది? .


  •  
  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .



సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాల కారణంగా మన చర్మం నల్లబారకుండా కాపాడుకోవటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం.. మన చర్మాన్ని కాపాడే రక్షక పదార్థం టమోటాల్లో ఉందని శాస్త్ర ప్రపంచం ఇప్పుడిప్పుడే నమ్ముతోంది. ఈ దిశగా పరిశోధనలు సాగుతున్నాయి. ఈ విషయంలో టమోటాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్‌- లైకోపేన్‌ చాలా ప్రభావశాలి. పాశ్చాత్య ఆహారంలో 85 శాతం లైకోపేన్‌.. టమోటాల నుంచి వచ్చేదే. టమోటా గుజ్జులో ఇది అత్యధికంగా లభ్యమవుతుంది. దీనివల్ల చర్మం నల్లబారే లక్షణం బాగా తగ్గుతోందని పరిశోధకులు భావిస్తున్నారు. కాబట్టి మామూలుగా ఆహార పదార్థాల్లో టమోటాల వినియోగం పెంచుకోవాలి. దీనివల్ల ప్రత్యేకమైన శ్రమ లేకుండానే మన చర్మాన్ని అతినీలలోహిత కిరణాల బారి నుంచి కాపాడుకోవచ్చు.
  • *=========================== 

visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.